impatient
-
చంద్రబాబుపై కేశినేని నాని అసహనం
-
ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్.. నిర్ఘాంతపోయిన బాబు..
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో సొంత పార్టీ ఎంపీ నుంచే తిరస్కారం ఎదురైంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయనతో అంటీముట్టనట్లు వ్యవహరించారు. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ తన సహచర ఎంపీ గల్లా జయదేవ్ బొకే ఇచ్చేందుకు పిలిచినా, ఆయన దానిని తోసేస్తూ నిరాకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొంత కాలంగా కేశినేని నాని.. చంద్రబాబు వైఖరిపై తరచూ అసంతృప్తి వెలిబుచ్చుతూనే ఉన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలవలేరని కొద్దిరోజుల క్రితం కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. చదవండి: ‘ఏపీలో బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారు’ చంద్రబాబు భజన పరులనే నమ్ముతారని, వాస్తవాలు చెప్పేవాళ్లు ఆయనకు నచ్చరని విమర్శించారు. తరచూ ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారు. శనివారం ఉదయం ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎంపీలు గల్లా జయ్‌దేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కేశినేని నాని విమానాశ్రయానికి వచ్చారు. అక్కడ చంద్రబాబుకు బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ కోరినప్పటికీ నాని తిరస్కరించడం చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. నాని ప్రవర్తనతో ఎంపీలతో సహా బాబు సైతం నిర్ఘాంతపోయారు. అనంతరం బాబు వెనకాలే అయిష్టంగా నడిచి వెళ్లిన నాని, తోటి ఎంపీలు పిలిచినా రాకుండా ఒంటరిగా సొంత కార్లో వెళ్లారు. బాబు గల్లా జయ్‌దేవ్ ఇంట్లో గడిపిన కొద్ది సమయంలోనూ నాని అక్కడే ఉన్నా, ముభావంగా ఉన్నారు. బాబుతో రఘురామ భేటీ అశోకా రోడ్లో ఉన్న గల్లా జయదేవ్ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అక్కడికి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు వచి్చన రఘురామ సాయంత్రం 4 గంటల వరకు.. దాదాపు 2 గంటల పాటు బాబుతో కలిసే ఉన్నారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న కేశినేని నానిని వేరే గదిలోకి పంపి, వివిధ అంశాలపై బాబు, రఘురామ రహస్యంగా సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జాతీయ కమిటీ సమావేశానికి వెళ్లారు. అంతకు ముందు చంద్రబాబు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపి.. 10 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు.. ప్రధానితో ఒకటి రెండు నిమిషాల పాటు ముచ్చటించారు. అయితే ఏ విషయం గురించి మాట్లాడారన్నది తెలియరాలేదు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా క్రీడాకారులు పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, సినీ నటుడు రజినీకాంత్‌తో సైతం ముచ్చటించారు. -
ఎవరా జడ్జి.. శిక్షణ సరిగా లేదా?.. సుప్రీంకోర్టు అసహనం
సాక్షి, న్యూఢిల్లీ: బెయిలు మంజూరు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు సరిగా అర్థం చేసుకోలేకపోయిన జడ్జి ఎవరు? జ్యుడీషియల్ అకాడమీ శిక్షణ సరిగా లేదా? అని నెల్లూరు అదనపు సెషన్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నెల్లూరు కేంద్ర కారాగారంలో గృహహింస, హత్య కేసులో దోషిగా తొమ్మిదేళ్లు శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తిని మూడు రోజుల్లో ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాలని, బెయిలు మంజూరు చేయాలని సెప్టెంబర్ 28, 2020న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. చదవండి: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ 3 రోజుల్లో జైలు అధికారులు హరికృష్ణను ప్రవేశపెట్టని కారణంగా ట్రయల్ కోర్టు బెయిలు నిరాకరించింది. దీనిపై ఓ న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాయడంతో ఏప్రిల్ 2022లో హరికృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో జైలు అధికారులు, ట్రయల్ కోర్టు జడ్జి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసును సోమవారం జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో కోర్టు ఉత్తర్వులు తదనంతరం పరిణామాలను ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయినా హరికృష్ణ కస్టడీలో కొనసాగారు. ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపగా అక్టోబర్ 6న జైలు అధికారులకు అందాయని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెబుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల్ని ట్రయల్ కోర్టు సరిగా అర్థం చేసుకున్నట్టు కనిపించడం లేదు. మూడు రోజుల్లో ప్రవేశపెట్టాలంటే త్వరగా ప్రవేశపెట్టాలని అంతేకానీ తర్వాత ప్రవేశపెడితే బెయిల్ ఇవ్వకూడదని అర్థం కాదు. ఒక న్యాయాధికారి ఈ విధంగా అర్థం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారమంతా హైకోర్టుకు వదిలేస్తున్నామంది. 6 వారాల్లో హైకోర్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కింది కోర్టులు నెలవారీ నివేదికలను హైకోర్టుకు ఇస్తుంటే ఇలాంటివి జరగవని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఆ జడ్జికి పదేళ్ల సర్వీసు పూర్తయిందా.. ఇలాంటి న్యాయాధికారులు ఉండటంపై క్షమించండి.. అంటూ వ్యాఖ్యానించింది. -
గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చి క్వారంటైన్లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్ వాపోయాడు. శనివారం మెల్బోర్న్కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఒకరైన కజకిస్తాన్ మహిళా ప్లేయర్ యులియా పుతిన్సెవా తన గదిలో ఎలుక తిరుగుతోన్న వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ప్రాక్టీస్‌కు అనుమతించకపోవడంతో ఆమె తన గదిలోని బీరువాను ప్రాక్టీస్ వాల్‌గా మార్చుకుంది. బీరువాకు బంతి కొడుతూ షాట్లు ప్రాక్టీస్ చేసింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారంతా క్వారంటైన్లో ఉండాలని తనకు ముందే చెబితే అసలు ఈ ప్రయాణం గురించి పునరాలోచించుకునేదాన్నని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ 15వ ర్యాంక్ ప్లేయర్ పాబ్లో కరెనో బుస్టా... క్వారంటైన్లో తనకు అందించిన నాణ్యతలేని భోజనంపై అసంతృప్తి వెలిబుచ్చగా, ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పెయిర్ హోటల్ భోజనాన్ని తిరస్కరించి బయట నుంచి తెప్పించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ చీఫ్ క్రెగ్ టిలీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 8 నుంచి పోటీలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. కష్టమైనప్పటికీ ఆటగాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
కారు దిగలేదని కొట్టి చంపారు
ముంబై : రోజురోజుకు మనుషుల్లో కోపం, అసహనం ఎంతలా పెరుగుతున్నాయో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. కనీసం 18 ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్లు కారు త్వరగా దిగలేదన్న కోపంతో కారులోని వారిపై దాడి చేయడమే కాక ఒకరి మృతికి కారకులయ్యారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర సింగ్(30) అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాబ్లో చెంబూరు వెళ్దామని కాబ్ మాట్లాడుకుని, అందులో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో మరో నలుగురు యువకులు అక్కడకు వచ్చి కారులో ఉన్న సురేంద్ర, అతడి స్నేహితులను వెంటనే కాబ్లోంచి దిగమన్నారు. అందుకు సురేంద్ర, అతని స్నేహితులు నిరాకరించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో ఆ నలుగురు యువకులు సురేంద్ర, అతని స్నేహితులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ గొడవలో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే సమీప రాజవాడి ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే సురేంద్ర మరణించాడు. విషయం తేలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ‘నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరు మాత్రమే మేజర్. వీరి నలుగురి మీద హత్యానేరం మోపబడింది. ముగ్గురు మైనర్లను డొంగ్రిలోని జూవైనల్ హోమ్‌కు తరలించాము. మరో వ్యక్తి క్రిష్ణ పొమన్న బొయన్న(18)ను చెంబూరు కాంప్ ఏరియాకు తరలించామ’ని పోలీసు డిప్యూటీ కమిషనర్(6 జోన్) షహాజీ ఉంపా తెలిపారు. -
స్మార్ట్ ఫోన్‌తో చిత్తవుతారు జాగ్రత్త!
వాషింగ్టన్: మీకు సెల్ ఫోన్ ఉందా అనే మాట మరీ పాతదై పోయి.. మీకు స్మార్ట్ ఫోన్ ఇంకా లేదా అనేంత కొత్త రోజులొచ్చాయి. ఇవి ఏ ఒక్క పట్టణానికో అంటే పొరపడ్డట్లే ఎందుకంటే.. గ్రామాల్లో కూడా వీధివీధిన స్మార్ట్ ఫోన్ల వీర విహారం చూస్తున్నాం. అయితే, వీటి వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు తీరుతున్నాయోకానీ, మానసికంగా మాత్రం బలహీనమైపోతారని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేపనిగా రోజంతా స్మార్ట్ ఫోన్లలో తలలు దూర్చి తెగ చూస్తుండిపోయేవారిలో సహజంగానే అసహనం, తొందరపాటు అనే అవలక్షణాలు అలవోకగా వచ్చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు దాదాపు 91మంది యువకులను తమ పరిశీలనకు తీసుకున్నారు. వారిలో ఎక్కువసేపు వీటిని ఉపయోగించేవారిని, తక్కువ సేపు ఉపయోగించేవారిని పలు రకాలుగా పరీక్షించారు. ఇందులో అతిగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు చిరాకుగా ఉండటమేకాకుండా, చిందరంవందరగా ఉంటూ స్థిమితంగా లేకుండా ప్రవర్తించారట. ఇక తక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వాడేవారు మాత్రం అలా చేయలేదని స్పష్టం చేశారు.