impotent
-
విడాకుల కేసులో కేరళ హైకోర్టు ‘క్రూరత్వం’ వ్యాఖ్యలు
కొచ్చి: కేరళ హైకోర్టు ఓ విడాకుల కేసు తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్తగానీ, భార్యగానీ విడాకుల కోసం ఒకరిపై మరొకరు సంసార జీవితంపై తప్పుడు ఆరోపలు చేయడం హింసించడం కిందకే వస్తుందని పేర్కొంది. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ముహమ్మద్ ముస్తక్, జస్టిస్ కసర్ ఎడపగ్గత్ ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. సంసారానికి పనికి రారని, అంగస్తంభన లాంటి దిగజారుడు ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకోవడం క్రూరత్వం మాత్రమే కాదు.. నేరం కూడా. ఇది వైవాహిక వ్యవస్థను చులకన చేయడమే కాదు.. భార్యాభర్తల బంధాన్ని అవహేళన చేసినట్లే అని ద్విసభ్య న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్న విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని బెంచ్ అభిప్రాయపడింది. కాగా, కేరళ ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఇద్దరు మెడికల్ గ్రాడ్యుయేట్స్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం బాగోలేదని తనకు విడాకులిప్పించాలని అబ్బాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో తన భర్తకి అంగస్తంభన సమస్య ఉందని అమ్మాయి ఆరోపించింది. ఇది ముదిరి పరస్పర ఆరోపణలతో మరీ పచ్చిగా కోర్టుకు స్టేట్మెంట్ సమర్పించింది ఆ జంట. దీంతో బెంచ్ అవాక్కయ్యింది. అయితే అమ్మాయి ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో బెంచ్ పైవ్యాఖ్యలు చేసింది. ఇక ఆ ఆరోపణల ఫలితంగా జంట కలిసి ఉండే అవకాశం లేదన్న ఉద్దేశంతో విడాకుల మంజూరీకే మొగ్గుచూపింది. -
‘కోవిడ్ టీకాతో నపుంసకులవుతారు’
లక్నో: మరో 24 గంటల్లో కేంద్రం కరోనా వైరస్ను తుదముట్టించే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అయితే దీనిపై ఇప్పటికే ప్రజల్లో పలు సందేహాలు నెలకొనగా.. రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి.. తాను దాన్నితీసుకోనని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి అదే పార్టీ ఎమ్మెల్సీ మరొకరు చేరారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకులు అవుతారంటూ సదరు ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మా డౌట్లు తొలగించండి ) ఆ వివరాలు.. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సే అశుతోష్ సిన్హా మాట్లాడుతూ.. ‘మేం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని నమ్మం. మా నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకోనంటున్నారంటే.. వ్యాక్సిన్ విషయంలో ఆయనకు ఏవైనా వాస్తవాలు తెలిసి ఉంటాయని నా నమ్మకం. ఈ వ్యాక్సిన్ ప్రజలకు హానీ చేస్తుంది. కోవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులవుతారు. మా నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ వద్దు అన్నాడంటే.. కేవలం మా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాక రాష్ట్ర ప్రజలందరు టీకాకు దూరంగా ఉండాలి’ అంటూ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో టీకా పట్ల భయాలు నెలకొనడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా రంగంలోకి దిగి, అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. (చదవండి: ‘అపోహలు ఉంటే పాకిస్తాన్లో వ్యాక్సిన్ వేయించుకోండి’ ) కరోనా టీకా వలన నపుంసకులు అవుతారంటూ వినిపిస్తున్న ఊహాగానాలను హర్షవర్ధన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘కరోనా టీకా కారణంగా మహిళలు గానీ, పురుషులు గానీ నపుసంకులు అవుతారని శాస్త్రవేత్తలెవరూ చెప్పలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. నిరాధానమైన ఇటువంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అన్నారు హర్షవర్ధన్. అయితే కోవిడ్ టీకా వేయించుకున్న తరువాత కొద్దిమందిలో స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో నొప్పి ఉంటుందని అన్నారు. ఇతర టీకాలు వేయించుకున్నప్పుడు కూడా ఇదేవిధంగా జరుగుతుందన్నారు. కొద్ది సేపటిలోనే ఇటువంటి సమస్యలు మాయయవుతాయని స్పష్టం చేశారు. ఇక రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. After being administered #COVID19Vaccine, some individuals may have side effects like mild fever, pain at injection site & bodyache. This is similar to the side effects that occur post some other vaccines. These are expected to go away on their own after some time. #StaySafe pic.twitter.com/VCnJzXu70S — Dr Harsh Vardhan (@drharshvardhan) January 14, 2021 -
సాఫ్ట్వేర్ మొగుడు కాదు.. శాడిస్ట్ మొగుడు..
-
సాఫ్ట్వేర్ భర్త శాడిజం
సాక్షి, కర్నూలు : తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్వేర్ భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యకు టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాద్లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాచాని రాజేంద్రప్రసాద్తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేంద్రప్రసాద్ తేడాగా వ్యవహరించాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. తాను నపుంసకుడినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అతడి అమ్మమ్మకు తెలుపగా ఆమె కూడా తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించింది. దీంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కుంగిపోయానంటూ బాధితురాలు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. టీబీ రోగం ఉందని ప్రచారం అత్తింటి వారి ఆగడాలు భరించలేక బయటకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలికి టీబీ రోగం ఉందని రాజేంద్రప్రసాద్ ప్రచారం చేశాడు. ‘ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడికి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారు. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయారు’అని ఆమె అవేదన వ్యక్తం చేశారు. మరో పెళ్లికి రెడీ ఇదిలా ఉండగా మాచాని రాజేంద్రప్రసాద్ మరో పెళ్లికి రెడీ అయ్యారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వద్దలొద్దు అంటూ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి శిక్ష పడిన తర్వాతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అని పెళ్లి చేశాం : బాధితురాలి తండ్రి మంచి సంబంధం, సాఫ్ట్వేర్ ఉద్యోగమని తమ కూతురుకి డిగ్రీ సెకండియర్లోనే వివాహం చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు. 45 లక్షలు కట్నంగా, మరో 10లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటివాడు అనుకోలేదని మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తన తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీంతో విధిలేక పోలీసులను ఆశ్రయించామన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్రప్రసాద్కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నేను మగాడినే.. వాట్సాప్లో వీడియో!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన అబ్బాయికి, చెన్నై అమ్మాయితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 15 రోజులకే ఇద్దరూ వేరయ్యారు. తన భర్త నపుంసకుడంటూ విడాకులు కోరుతూ ఆమె కోర్టుకు ఎక్కింది. విడాకులు మంజూరు కాకుండా ఉండటానికి తాను మగాడినేనని నిరూపించుకోవాలని అతడు భావించాడు. అందుకు నేర మార్గాన్ని అనుస రించడంతో కటకటాల్లోకి చేరాడు. చెన్నైలోని మహిళా ఠాణా నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్లో నిందితుడిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. సమ్మతి లేకుండానే వివాహం... ఎల్బీనగర్కు చెందిన వాసు కుటుంబానికి, చెన్నైలోని ముథామిజ్నగర్కు చెందిన ఓ యువతి కుటుంబాని కి మధ్య పరిచయం ఉంది. దీంతో వీరిద్దరికీ వివా హం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. వాసు, యువతి మధ్య సరైన అవగాహన, పరస్పరం అర్థం చేసుకునే తత్వాలు లేవు. ఇదేమీ పట్టించుకోని పెద్దలు వారి సమ్మతి లేకుండానే 2016లో పెళ్లి చేశారు. ఎల్బీనగర్కు కాపురానికి వచ్చిన వాసు భార్య 15 రోజులకే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాలు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. తన భర్త నపుంసకుడని ఆరోపించిన ఆ యువతి విడాకులు కోరుతూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. అయితే ఆ ఆరోపణలు తప్పని, వేరే కారణాల నేపథ్యంలోనే తన భార్య విడాకులు కోరుతోందంటూ వాసు తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలకు స్పష్టం చేస్తూ వస్తున్నాడు. విసిగిపోయి‘వీడియో’ పంపించాడు... తాను చెప్తున్న విషయాన్ని తన తల్లిదండ్రు లు నమ్ముతున్నా... అత్తమామలు నమ్మట్లేదని వా సు భావించాడు. ఓ పక్క చెన్నై కోర్టులో విడాకుల కేసు విచారణ తుది దశకు చేరడంతో పాటు విడాకులు మంజూరైతే తన భార్య చెప్పిందే నిజమని నమ్ముతారని అనుకున్నాడు. దీంతో అత్తమామలకు తాను నపుంసకుడిని కాదని స్పష్టం చేయా లని నిశ్చయించుకున్నాడు. ఇది ఎలా చేయాలా అని ఆలోచించిన వాసుకు ఓ చిల్లర ఆలోచన వచ్చింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా ఓ వ్యభిచారిణిని సంప్రదించాడు. ఆమెతో కలసి శృంగారంలో పాల్గొంటూ 5 నిమిషాల నిడివితో వీడియో తీయించాడు. దీన్ని వాట్సాప్ ద్వారా చెన్నైలోని అత్తమామలకు షేర్ చేశాడు. వీడియో చూసి షాక్కు గురై.. వారు విషయాన్ని అక్కడి ఎంకేబీ నగర్ మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఆరోపణలపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ డి.చిత్ర ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపారు. ఈ టీమ్ వాసును అరెస్టు చేసి తీసుకువెళ్లి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. వీడియోను పరిశీలించగా, మరో వ్యక్తి చిత్రీకరించినట్లు ఉందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అది ఎవరో గుర్తించడం కోసం వాసును కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. -
'నేను నపుంసకుడిని'
న్యూఢిల్లీ: డానిష్ పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఓ నిందితుడు తాను నపుంసకుడినని కోర్టుకు తెలిపాడు. గతేడాది జనవరి 14న ఢిల్లీలో డానిష్ పర్యాటకురాలు(51)ను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను ప్రధాన సాక్షి, రైల్వే ఉద్యోగి శివాజి సింగ్ గుర్తించారు. ఈ కేసుని ఈ రోజు ఢిల్లీలో ఒక కోర్టు విచారించింది. ఎనిమిది మంది నిందితులపై సామూహిక అత్యాచారం, దోపిడి, హత్యాయత్నం తదితర కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఇద్దరు బాల నేరస్తుల పాత్రపై జువైనల్ బోర్డు విచారణ చేపట్టింది. జులాయిగా తిరిగే మహేంద్ర సింగ్ అలియాస్ గంజా(24), మహ్ద్ రాజా(22), రాజు(23), అర్జున్(21), రాజు చక్కా(22), శ్యామ్ లాల్(55)లు ఆ రోజు పార్కులో ఒంటరిగా ఉన్న మహిళను చట్టుముట్టారని, వారిలో అర్జున్ ఆమెను కత్తితో బెదిరించగా, మహేంద్ర అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. తనను కూడా కత్తితో బెదిరించటంతో నిస్సహాయ స్థితిలో వెనుదిరిగినట్లు శివాజీ కోర్టుకు వివరించాడు. నిందితుల్లో ఒకరైన శ్యామ్లాల్ తాను నపుంసకుడినని, అత్యాచారానికి పాల్పడలేదని కోర్టుకు తెలిపారు. మరో నిందితుడు అర్జున్ బాలుడినైన తనను గత జనవరి నుంచి పోలీసులు అన్యాయంగా నిర్బందించారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. -
మోడీపై 'నపుంసక' వ్యాఖ్యలు.. బీజేపీ మండిపాటు
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మోడీ 'నపుంసకుడు' అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్లోని ఫరూకాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, ''మీరు జనాలను చంపించారని మేం ఆరోపించడం లేదు... మీరు నపుంసకుడని అంటున్నాం'' అని విమర్శించారు. మోడీ చాలా శక్తిమంతుడైన నాయకుడని, అయినా 2002 అల్లర్ల నుంచి ప్రజలను రక్షించలేకపోయారని అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ ప్రతినిధి, రాజ్యసభలో ప్రతిపక్ష ఉపనేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. ''భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా, సిగ్గులేకుండా మాట్లాడటం దారుణం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సల్మాన్ ఖుర్షీద్ అసహాయతకు, నపుంసకత్వానికి మధ్య తేడా అర్థం చేసుకోలేకపోతే ఇంకేం చెప్పాలి? ఖుర్షీద్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే'' అని ఆయన అన్నారు.