improper layout
-
అక్రమ లేఅవుట్
ఎట్టకేలకు దృష్టిసారించిన వుడా ఖాళీ ప్లాట్లను పొక్లయిన్లతో దున్నిస్తున్న అధికారులు జిల్లాలో 6 బృందాల ఏర్పాటు నర్సీపట్నం డివిజన్లో 218 ఎకరాలు గుర్తింపు అక్రమ లేఅవుట్లపై ఎట్టకేలకు వుడా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్లలో వేసిన ప్లాట్లు, రోడ్లు, రాళ్లను పొక్లయిన్లతో తొలగిస్తోంది. దీనికోసం జిల్లాలో 6 బృందాలను నియమించింది. పాయకరావుపేట నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా, వారి వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
అక్రమ లేఅవుట్లపై విజి‘లెన్స్’
కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం సిద్ధం పంచాయతీలవారీగా ప్లాట్ల వివరాల సేకరణ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్ల గుండెల్లో రైళ్లు నక్కపల్లి : అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు నిబంధనల మేరకు ఏర్పాటు చేశారా లేదా అన్నది నిర్థారించేందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. డీపీవో ఆదేశాల మేరకు అక్రమ లేఅవుట్ల విషయంపై నివేదిక సిద్ధం చేస్తున్నామని ఈవోఆర్డీ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పలుచోట్ల ఏర్పాటు చేసిన లేఅవుట్లకు వుడా, డీటీసీపీ అప్రూవల్‌లు లేవు. స్థానిక పంచాయతీలు డెవలపర్స్ నుంచి మామ్మూళ్లు తీసుకుని తీర్మానాలు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము వేసిన లేఅవుట్లకు అనుమతులున్నాయంటూ కొనుగోలుదార్లను మోసం చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లను విక్రయించారు. లేఅవుట్లకు అనుమతి మంజూరు చేసే అధికారం పంచాయతీలకు లేదు. కేవలం వుడా అధికారులకు సిఫార్సు మాత్రమే చేయాలి. ఈ సిఫార్సు లేఖలనే అప్రూవల్స్‌గా చూపించి డెవలపర్స్ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పాయకరావుపేట పట్టణంలో అత్యధికంగా 119 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఇలా అనుమతి లేని లేఅవుట్లు కొనుగోలు చేసి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టినవారికి కరెంటు, తాగునీరు సరఫరా నిలిపివేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్లాట్లుకొని ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ మీటర్లుకోసం దరఖాస్తు చేస్తే అటువంటివి పెండింగ్‌లో పెట్టేందుకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు భోగట్టా. చాలాచోట్ల ఏర్పాటు చేసిన లేఅవుట్లలో సామాజిక అవసరాల నిమిత్తం పంచాయతీలకు, మున్సిపాలిటీలకు 10 శాతం స్థలాన్ని కేటాయించాలి. ఈ విధంగా స్థలం కేటాయించకపోవడం, కొన్ని చోట్ల ఇలా కేటాయించిన స్థలాలను కూడా విక్రయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల వారీగా లే అవుట్ల వివరాలు సమర్పించాలని డీపీవో ఆదేశించారు. ఆ వివరాల మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. లే అవుట్లు ఇలా వేయాలి.. 2002లో ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం 67 ప్రకారం లేఅవుట్లు వేయాలి. అప్రోచ్ రోడ్డు 40 అడుగులు, ఇంటర్నల్ రోడ్లు 30 అడుగులు ఉండాలి. తాగునీరు, విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ అవసరాలకు స్థలం కేటాయించి పంచాయతీకి రాతపూర్వకంగా అందజేయాలి. గుర్తించిన అక్రమలే అవుట్లు నర్సీపట్నం డివిజనల్లో సుమారు 218.11 ఎకరాల్లో అక్రమలే అవుట్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. నక్కపల్లి మండలంలో 51.96 ఎకరాలు, పాయకరావుపేటలో 119.74 ఎకరాలు, రావికమతం మండలంలో 7.46 ఎకరాలు, ఎస్.రాయవరం మండలంలో 13 ఎకరాలు, కోటవురట్ల మండలంలో 2.93 ఎకరాలు, మాకవరపాలెం మండలంలో 20.16 ఎకరాల్లో అక్రమలేఅవుట్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. వందమంది డెవలపర్స్‌ను దీనికి బాధ్యులను చేశారు. ఆయా పంచాయతీల వారీగా లేఅవుట్లు వేసిన సర్వే నెంబర్లు, డవలపర్స్ పేర్లు, విస్తీర్ణం, ఎన్నిప్లాట్లుగా విభజించారనే వివరాలు సేకరించి విజిలెన్స్ అధికారులకు అందజేసేప్రక్రియ చురుగ్గాసాగుతోంది. అనధికార లేఅవుట్లలో నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే, ఈ లేఅవుట్లను నాలాకింద మార్చి రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించారా లేదా అన్న కోణంలో కూడా విజిలెన్స్ ద్వారా విచారణ చేయించనున్నారు. ప్రభుత్వ చర్యలతో రియల్ ఎస్టేట్వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. -
రియల్ ఊపు
రెవెన్యూ సైట్లకు మోక్షం ఊపందుకోనున్న నిర్మాణ రంగం ఆశల పల్లకిలో రియల్టర్లు పెరగనున్న అపార్ట్మెంట్ల అమ్మకాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రెవెన్యూ సైట్లు, లేఔట్లను క్రమబద్ధీకరించాలని బీబీఎంపీ సర్వ సభ్య సమావేశం నిర్ణయించడంతో నగరంలో నిర్మాణ రంగం ఊపందుకోనుంది. గతంలో వ్యవసాయ భూములను సైట్లు లేదా లేఔట్లుగా మార్చి విక్రయించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. ఇలాంటి సైట్లను బీ ఖాతాగా పరిగణిస్తారు. అంటే...ఏటా వీటికి నామమాత్రంగా బీబీఎంపీకి ఆస్తి పన్ను చెల్లించే వారు. అయితే ఇలాంటి సైట్లు లేదా లేఔట్లలో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కావు. వీటిని అక్రమ లేఔట్లు లేదా సైట్లుగా పరిగణించే వారు. ‘ఏ’ ఖాతా ఉంటేనే సక్రమమైనవి. ఎన్నో ఏళ్లుగా ఈ బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చాలని విజ్ఞప్తులు అందినా, అనేక అవరోధాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు బీబీఎంపీ వీటిని ఏ ఖాతాలుగా మార్చాలని నిర్ణయించడంతో బీ ఖాతాదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బీ ఖాతాలను ఏ ఖాతాలుగా మార్చడానికి బెటర్మెంట్ చార్జీల కింద చదరపు మీటరుకు రూ.350 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వెయ్యి చదరపు మీటర్లు దాటితే రూ.300 వంతున చెల్లించాలి. నాలుగు వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే నూటికి ఒకటిన్నర రూపాయి వంతున వడ్డీ చెల్లించాలి. ఆర్థికంగా దివాళా తీసిన బీబీఎంపీ ఈ బెటర్మెంట్ చార్జీల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తోంది. కాగా రెవెన్యూ సైట్లలోని కట్టడాలను మాత్రం అక్రమ-సక్రమ కింద క్రమబద్ధీకరించుకోవాలని బీబీఎంపీ కమిషనర్ ఎం. లక్ష్మీ నారాయణ బుధవారం సర్వ సభ్య సమావేశంలో స్పష్టం చేశారు. రియల్టర్ల ఆశలు వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేనందున, మే నెల వరకు అపార్ట్మెంట్ల అమ్మకాలు ఊపందుకోవచ్చని రియల్ ఎస్టేట్ రంగం ఆశిస్తోంది. నగరంలో సుమారు 50 వేల వరకు అపార్ట్మెంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడక పోతే దేశ ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతుందని, దాని వల్ల వడ్డీ రేట్లు స్థిరంగా ఉండబోవనే భావన నెలకొంది. కనుక ఎన్నికలలోగానే సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనేక మంది ఉబలాటపడుతున్నారు. ఒక వేళ ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడినా, అది కూడా తమ మంచికేనని రియల్టర్లు భావిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడుతుందని, తద్వారా వ్యాపార లావాదేవీలు నిలకడగా సాగుతాయని వారు అంచనా వేస్తున్నారు. హొస్పేట నుంచి తిరుపతికి ‘సుహాస్’ హొస్పేట, న్యూస్‌లైన్ : హొస్పేట నుంచి తిరుపతికి నూతన సుహాస్ బస్సు సౌకర్యాన్ని బుధవారం ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. హొస్పేటలో ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు బయల్దేరి తోరణగల్లు, కుడితిని, బళ్లారి, ఉరవకొండ, అనంతపురం, కదిరి, మదనపల్లి, వాయల్పాడు, పీలేరు మీదుగా తిరుపతికి ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి 8.30 గంటలకు తిరుపతి నుంచి ఇదే మార్గంలో హొస్పేటకు చేరుకుంటుందని ఆర్టీసీ విభాగం నియంత్రణ అధికారి తెలిపారు.