Increase in electricity charges
-
నేడు కరెంట్ చార్జీల పెంపుపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ మేరకు వేర్వేరు టారిఫ్ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా, ఒకరోజు ముందు ఈ పిటిషన్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) దాఖలు చేసిన ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్లపై ఈఆర్సీ ప్రకటించనున్న నిర్ణయం కీలకం కానుంది. దీంతో నవంబర్ 1 నుంచి వినియోగదారులపై ప్రత్యక్షంగా చార్జీల పెంపు భారం పడబోతోంది. హెచ్‌టీ కేటగిరీలో ఎనర్జీ (విద్యుత్) చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారి ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి ఎనర్జీ చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం వేసేందుకు అనుమతి కోరాయి. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. అలాగే జెన్కో 2022–23కి సంబంధించి దాఖలు చేసిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన ఎంవైటీ పిటిషన్‌పై సైతం ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటితో భవిష్యత్తులో వినియోగదారులపై పరోక్షంగా చార్జీల పెంపు భారం పడనుంది. రూ.16,346 కోట్ల ట్రాన్స్‌కో ఏఆర్ఆర్పై రేపుట్రాన్స్కో దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి ట్రాన్స్మిషన్ బిజినెస్, ఎస్ఎల్డీసీ యాక్టివిటీకి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు అంచనా వేస్తూ ఆ మేరకు ట్రాన్స్మిషన్ చార్జీలను కొంతవరకు పెంచి వసూలు చేసుకోవడానికి ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. -
20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ డిమాండ్‌పై అశాస్త్రీయ, అవాస్తవిక అంచనాల ఆధారంగా గతంలో అడ్డగోలుగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు తప్పుబట్టారు. ఈ పీపీఏల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండబోతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఐదేళ్లలో కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాద విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. 2024–25లో 24వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండనున్న మిగులు విద్యుత్.. 2028–29 నాటికి 43 వేల ఎంయూలకు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నివేదించాయని గుర్తు చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తయితే మిగులు విద్యుత్ ఇంకా పెరిగిపోతుందన్నారు. కొత్తగా 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే మిగులు విద్యుత్ మరింతగా పెరిగి రాష్ట్ర ప్రజలపై అనవసర భారం పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పీపీఏలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) అనుమతిచ్చిందని, ఇకపై కొత్త పీపీఏలకు అనుమతి విషయంలో పునరాలోచించాలని సూచించారు. 2024–25లో రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీజీఎన్పీడీసీఎల్/టీజీఎస్పీడీసీఎల్) సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పై బుధవారం విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో పెద్ద సంఖ్యలో వక్తలు పాల్గొని మాట్లాడారు. పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలతో ప్రయోజనాలతోపాటే దుష్పరిణామాలూ ఉంటాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇచ్చిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్‌రావు తెలిపారు. అవసరానికి మించి ఈ ఒప్పందాలు చేసుకుంటే జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసి ఉత్పత్తిని తగ్గించడం/పూర్తిగా నిలుపుదల చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఒప్పందాలతో ఇప్పటికే రాష్ట్రానికి ఏటా రూ.500 కోట్ల నష్టం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం 2022–23లో ఏకంగా రూ.5596 కోట్ల చార్జీలను పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించిందన్నారు. వాస్తవానికి ఏటా రూ.3వేల కోట్లకు పైనే చార్జీలు పెరుగుతాయన్నారు. జెన్కో థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలకు మరమ్మతు లేక ఉత్పత్తి తగ్గిందన్నారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య ముందు తొలుత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తమ ప్రతిపాదనలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 28న ఈఆర్సీ కొత్త టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించనుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇలా అయితే పరిశ్రమలు తరలిపోతాయి హెచ్‌టీ కేటగిరీలోని 33 కేవీ, 133 కేవీ వినియోగదారుల విద్యుత్ చార్జీలను 11 కేవీ వినియోగదారులతో సమానంగా పెంపుతోపాటు కొత్తగా స్టాండ్‌బై చార్జీలు, గ్రిడ్ సపోర్ట్ చార్జీలు, అన్‌బ్లాకింగ్ చార్జీల ప్రతిపాదనలను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆప్ కామర్స్(ఫ్యాప్సీ), తెలంగాణ ఐరన్, స్టీల్ మ్యానుఫాక్టర్స్ అసోసియేషన్, ఏపీ, టీజీ ప్లాస్టింగ్ మాన్యుఫాక్టరింగ్ అసోసియేషన్లు వ్యతిరేకించాయి. ఇలా అయితే రాష్ట్రంలోని పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్‌కు సమానంగా తమ విద్యుత్ చార్జీలను తగ్గించాలని దక్షిణమధ్య రైల్వే సీఈ కె.థౌర్య విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులపై వక్తల ఆగ్రహంవ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతుల కోసం రవాణా చేసేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులపై భారతీయ కిసాన్ సంఘ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది రాకపోవడంతో రైతులే మరమ్మ తులకు ప్రయత్నించి విద్యుదాఘాతంతో మరణిస్తున్నా రన్నారు. విద్యుత్ సిబ్బంది అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. పాడి పరిశ్రమను వ్యవసాయ కేటగిరీ కింద చేర్చి ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్‌యాదవ్ విజ్ఞప్తి చేశారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తాం: మధుసూదనాచారితెలంగాణలో 2015–23 మధ్య కాలం కరెంట్ విషయంలో స్వర్ణ యుగమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. గత ప్రభుత్వం చార్జీలు పెంచలేదన్నారు. చార్జీల పెంపుతో పరిశ్రమలు తరలిపోతాయని, మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1220 కోట్ల చార్జీలను పెంచకుండా ప్రభుత్వమే అదనపు సబ్సిడీ ఇవ్వాలన్నారు.అక్కడికక్కడే ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జైన్ తిరుమలాపూర్లో పొలం వద్ద విద్యుదాఘాతంతో 2022 మార్చి 28న పరగోల యాదయ్య చనిపోయాడు. బహిరంగ విచారణలో ఫిర్యాదు రాగా, అక్కడిక్కడే సీఎండీ రూ.5 లక్షల చెక్‌ను యాదయ్య భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.రంగారావు, సభ్యులు మనోహర్, కృష్ణయ్య, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ చార్జీల పెంపు ఉపసంహరించాలి
కేసీఆర్, చంద్రబాబులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ప్రజలపై భారం మోపడంలో ఇద్దరు చంద్రులు పోటీపడుతున్నారంటూ విమర్శ హైదరాబాద్: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో కాకుండా ప్రజలపై భారం మోపడంలో ఇద్దరు చంద్రులు పోటీపడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి పండుగనాడు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చిందని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరునాడే చార్జీల పెంపు దారుణమని, దీనిని వైఎస్సార్సీపీ ఖండిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో చార్జీలను తగ్గించాల్సింది పోయి పెంచడం సరికాదన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీపరంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని.. రెండు రోజుల్లో పార్టీ రాష్ర్ట కమిటీ భేటీ అయి ఈ కార్యక్రమాల తేదీలను ప్రకటిస్తుందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం కారణంగా వెయ్యిమంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఆరు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాటల్లో దిట్ట అని, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని శివకుమార్ విమర్శించారు. విద్యుత్ చార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్‌లపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ తన పాలనా కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ సహా ఏ చార్జీలు కూడా పెంచలేదని గుర్తుచేశారు. -
అవసరాన్ని మించి ఒప్పందాలెందుకు?
వైఎస్సార్సీపీ సభ్యుడు మేకపాటి గౌతంరెడ్డి హైదరాబాద్: డిమాండ్‌కు మించి విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వైఎస్సార్ సీపీ సభ్యుడు మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన వల్ల రాష్ట్రం ఇబ్బందుల్లో ఉం దని చెబుతూ మరోవైపు అవసరాన్ని మించి విద్యుత్ కొనడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించారు. విద్యుత్తు చార్జీల పెంపుపై మంగళవారం అసెంబ్లీలో సీఎం ప్రకటన అనంతరం జరిగిన చర్చలో గౌతంరెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ర్టంలో విద్యుత్ సరఫరాకు, డిమాండ్‌కు మధ్య ఉన్న తేడా 5,000 ఎం.యూ. మాత్రమే. అయితే ప్రభుత్వం 16,000 ఎం.యూ. విద్యుత్‌ను కొంటోంది. వాస్తవ కొరత 5,000 ఎం.యూ. అయితే 16 వేల ఎం.యూ. కొనుగోలుకు ఒప్పందాలు చేసుకోవడం నిజం కాదా! ఎందుకిలా 11,000 ఎం.యూ. విద్యుత్‌ను అధికంగా కొనుగోలు చేస్తున్నారు? దీని వెనకున్న మతలబు ఏమిటీ? విభజనవల్ల రాష్ట్రం కష్టాల్లో ఉండి, సంక్షేమ కార్యక్రమాల అమలు కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో ఇలా అనవసరపు వ్యయం చేయడంలో అర్థమేమిటీ? అనవసరంగా కొని పడే భారాన్ని ఇలా ప్రజలపై రుద్దుతారా..?’’ అని సీఎంపై గౌతంరెడ్డి ప్రశ్నలవర్షం కురిపించారు. ‘‘ప్రపంచబ్యాంక్ ఆదేశాలను అమలు చేయడమే బాబు చేసిన సంస్కరణలు. 1994 నుంచి 2004 వరకూ బాబు పాలనలో ప్రభుత్వ రంగంలో వచ్చిన అదనపు విద్యుదుత్పత్తి 710 మెగావాట్లు మాత్రమే. అదే 2004-2014 మధ్య 4,500 మెగావాట్ల విద్యుదుత్పత్తిని అదనంగా అందుబాటులోకి తెచ్చారు’’ అని గౌతంరెడ్డి గణాంకాలతో సహా వివరించారు. -
విద్యుత్ చార్జీల పెంపుపై నిలదీయడానికే..
సభకు హాజరవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెల్లడి హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలపై రూ.వెయ్యి కోట్ల మేరకు విద్యుత్ చార్జీల భారం మోపడానికి నిరసన తెలిపి.. పెంచిన ఆ చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే శాసనసభకు హాజరయ్యామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడారు. సభకు హాజరుకారాదని ముందు భావించినప్పటికీ ప్రజలపై చార్జీల భారాన్ని మోపడంతో ప్రభుత్వాన్ని సభద్వారా గట్టిగా నిలదీయడానికి, చార్జీల పెంపులోని డొల్లతనాన్ని ఎండగట్టడానికి వచ్చామని చెప్పారు. తగిన రీతిలో చెప్పడం ద్వారా చంద్రబాబు మనసు మార్చగలమేమోనని అసెంబ్లీలో ఎదురుచూశామని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రావడంతో ప్రజలకు కష్టాలు పెరిగిపోయాయని బాధపడ్డామన్నారు. బీజేపీ సభ్యుడు తమ వద్దకొచ్చి చెప్పిన మీదట ఒక అవగాహనతో సభలో విద్యుత్ చార్జీలపై చర్చలో పాల్గొన్నామని తెలిపారు. తమ తరఫు నుంచి ఇద్దరికి.. అది కూడా ఒకరికి 20 నిమిషాలు, మరొకరికి 25 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తే, ఆ మేరకు వారి షరతులకు లోబడే మాట్లాడామని జగన్ చెప్పారు. కానీ అధికారపక్షం నుంచి ఎక్కువమంది మాట్లాడి కథలు వినిపించారని, విద్యుత్ చార్జీలు పెంచడం అద్భుతం అన్నట్లుగా సిగ్గులేనివిధంగా చెప్పడం చూస్తే ఇక వారి వైఖరిలో మార్పు రాదని గ్రహించి సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన వివరించారు. ప్రజాసమస్యలపై నిలదీస్తాం బుధవారం నుంచి అసెంబ్లీకి హాజరై తమకు ఎంత సమయమిస్తే అందులోనే ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. మరింత సమయం తీసుకునైనా కోట్లాదిమంది ప్రజలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతామన్నారు. ఇప్పటికే విద్యుత్, రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అంశాలు అయిపోయాయని, వాటిపై జరిగిన చర్చ కూడా అంతంత మాత్రమేనని ఆయన అన్నారు. తమను సభలో పూర్తిగా మాట్లాడనీయలేదన్నారు. ఇవన్నీ ప్రజలకు అవసరమైన విషయాలే కనుక సమావేశాలు పూర్తయ్యేలోపు మళ్లీ ఈ అంశాలపై నిలదీస్తామని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు సందర్శనకు కూడా వెళతామని, కాకుంటే ఒక రోజు ఆలస్యం కావచ్చని ఆయన మరో ప్రశ్నకు జవాబుగా తెలిపారు. చంద్రబాబువి అబద్ధాలు.. థర్మల్ విద్యుత్ కేంద్రాల ‘ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్’(పీఎల్ఎఫ్) విషయంలో చంద్రబాబు శాసనసభలో అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన వాస్తవాలను దాచిపెట్టి మసిపూసి మారేడుకాయ చేశారని జగన్ విమర్శించారు. తాను అసెంబ్లీలో ఏం మాట్లాడినా తగిన రుజువులు, అధీకృతపత్రాలు(డాక్యుమెంట్లు) దగ్గర ఉంచుకునే ప్రసంగిస్తానని జగన్ చెబుతూ.. తాను తొలి బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడేటపుడు ‘పవర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్-స్టాటిస్టిక్స్ 2011-12’ పుస్తకంలోని అంశాల్నే ఉటంకించానని తెలిపారు. ఆ పుస్తకంలోని పేజీ నంబర్ 68లో పీఎల్‌ఎఫ్‌కు సంబంధించి ఉన్న అంశాలను ఆయన వివరిస్తూ.. ‘‘2003-04 సంవత్సరంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటి పీఎల్ఎఫ్ 86 శాతం ఉంటే 2004-05 సంవత్సరంలో అది 89.7 శాతానికి పెరిగింది. 2006-07లో 84.95 శాతం, 2007-08లో 85 శాతం, 2009-10లో 86.66 శాతం, 2010-11లో 79.46 శాతం, 2011-12లో 83.81 శాతం మేరకు పీఎల్ఎఫ్ ఉండింది. ఈ వాస్తవాలన్నింటినీ చంద్రబాబు దాచిపెట్టారు’’ అని జగన్ విమర్శించారు. ఎక్కడో ఓ చిన్న ఉదంతాన్ని తీసుకుని అన్ని స్టేషన్లలోనూ అదే పరిస్థితి ఉండేదని చంద్రబాబు మసిపూసి మారేడుకాయ చేస్తారని, దీన్నే వందసార్లు గోబెల్స్ ప్రచారం చేసి నిజమని నమ్మించే యత్నం చేస్తారని ఆయన విమర్శించారు. -
పెద్ద పెంపేమీ కాదు!
కొత్త విద్యుత్ చార్జీలపై చంద్రబాబు ప్రకటన హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపును ప్రభుత్వం సమర్థించుకుంది. ఐదు శాతం పెంపు సర్వసాధారణమేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొట్టిపారేశారు. ద్రవ్యోల్బణంతో సరిచూస్తే ప్రజలపై వేసిన భారం ఎక్కువేమీ కాదంటూ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఇది తక్కువేనన్నారు. 86 శాతం వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని, కేవలం 14 శాతం వినియోగదారులపై నామమాత్రపు భారం వేశామని అన్నారు. తన హయాంలోనే విద్యుత్ రంగం పరిస్థితి బాగుందని కితాబు ఇచ్చుకున్నారు. తనకన్నా గతంలో పాలించిన కిరణ్ సర్కారే ఎక్కువ చార్జీలు మోపిందని చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మంగళవారం శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంది. చార్జీల పెంపుపై చర్చించాల్సిందేనని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చార్జీల పెంపుదలపై సభలో ప్రకటన చేశారు. ‘విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చింది నేనే. నేను తొలిసారి 1993లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ర్టంలో విద్యుత్ రంగం పరిస్థితి దయనీయంగా ఉంది. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తొమ్మిదేళ్ళ పాలనలో దీన్ని సంస్కరించా.. తీవ్రమైన విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం. పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడం సాధారణ విషయం కాదు. క్రిసిల్ రేటింగ్‌లో ఏపీ జెన్కో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ రంగం మళ్ళీ తిరోగమనంలోకి వెళ్ళింది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పీఎల్ఎఫ్ 78 శాతానికి పడిపోయింది. బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటాయి..’ అని చెప్పుకొచ్చారు. పెద్దయెత్తున విద్యుత్ కొనుగోళ్లు ‘నేను తిరిగి అధికారంలోకి వచ్చే నాటికి (2014లో) రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. ఈ నేపథ్యంలో అనేక చర్యలు చేపట్టి మిగులు విద్యుత్ దిశగా వ్యూహాలు రూపొందించాం. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు ఉండకూడదన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున దీర్ఘ, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాం. ఫలితంగానే నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం.’ అని బాబు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 23 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచారని, గత ఏడాది చార్జీల పెంపును తాను అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. అందరికీ విద్యుత్ అందించే లక్ష్యంతో వచ్చే ఐదేళ్ళలో రూ. 54,332 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. డిమాండ్‌కు మించి కొన్నాం: డిమాండ్‌కు మించి విద్యుత్ ఎందుకు కొన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ.. ‘ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంత విద్యుత్ కొన్నాం. జూన్ నుంచి అవసరమవుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేశాం. వద్దనుకుంటే మేలోగా రద్దు చేసుకోవచ్చు. మా ప్రభుత్వం పారదర్శకంగా ఎక్కడ తక్కువ రేటుకు వస్తే అక్కడే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది..’ అని అన్నారు. తెలంగాణతో సమస్యల పరిష్కారానికి సిద్ధం తెలంగాణతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాబు చెప్పారు. వినియోగం ప్రాతిపదికన ఏపీకి 46 శాతం, తెలంగాణ 54 శాతం విద్యుత్ తీసుకోవాలని విభజన చట్టంలో పెట్టినప్పటికీ.. రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన ప్రకారం నడుచుకుంటామని ప్రకటించామని గుర్తు చేశారు. అంతకుముందు మంత్రులు కామినేని, రావెల, అచ్చెన్నాయుడు, యనమల తదితరులు ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. -
చెప్పిందేమిటి.. చేసిందేమిటి?
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్ష నేత వైఎస్ జగన్ హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. పరిశ్రమలకు సైతం చార్జీలు క్రమంగా తగ్గించారన్నారు. రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీల పెంపుపై శాసనసభలో మంగళవారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అనంతరం దానిపై విపక్ష నేత మాట్లాడారు. చార్జీల పెంపునకు కారణాలేంటో తెలపాలని సర్కారును నిలదీశారు. చంద్రబాబు చక్కటి అబద్ధాలు, కథలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను మరుగున పర్చడం ఎవరి వల్లా కాదని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ‘కరెంటు రేట్లు పెంచితే సర్కారుపై తిరగబడండి’ అంటూ పిలుపునిచ్చి, అధికారంలోకి రావడంతోనే చార్జీలు పెంచడం న్యాయమేనా అని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దండిగా చార్జీలు పెంచారని, తాను ముఖ్యమంత్రి కావడంతోనే చార్జీలు తగ్గిస్తానని మీరిచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అధికారంలోకి రాగానే ప్రజలతో పనైపోయిందా? అంటూ నిగ్గదీశారు. ► బొగ్గు రేటు తగ్గినా.. భారం ఎందుకు? విద్యుత్ చార్జీలు పెంచడానికి సహేతుక కారణాన్ని ప్రభుత్వం చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు టన్ను ధర 102 నుంచి 60 డాలర్లకు తగ్గిందని, కోల్ ఇండియా సరఫరా చేసే బొగ్గు ధరలూ తగ్గాయని తెలిపారు. ఈ పరిస్థితిల్లోనూ విద్యుత్ చార్జీల భారం ఎందుకు వే యాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి దిగిపోయే ముందే 23 వేల కోట్ల భారం వేశారని చెప్పే మీరే, ప్రజలపై భారం పడేలా చార్జీలు ఎం దుకు పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం అదనంగా 304 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నట్టు చె ప్పారని, డిమాండ్ ఎక్కువగా ఉండే వేసవి కాలంలో అతి తక్కువ రేటుకే విద్యుత్ వస్తున్నా... ఇంకా చార్జీలు పెంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ► పీపీఏల కోసం చార్జీలు పెంచుతారా? చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, పెంపు ఎంతమాత్రం న్యాయ సమ్మతం కాదని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ డిమాండ్‌ను ఎక్కువ చేసి చూపారన్నారు. యూనిట్ విద్యుత్నుఏకంగా రూ. 5 నుంచి రూ.10 వరకు వెచ్చించి కొనేందుకు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నారని, ఇప్పుడు కొనకపోతే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. కేవలం పీపీఏల కోసమే ప్రజలపై చార్జీల భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని, దీన్ని వైఎస్సార్సీపీ గట్టిగా వ్యతిరేకిస్తోందన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ► ఇదేనా సామాన్యుడిపై మీ కనికరం! బడుగు, బలహీనవర్గాలపై ఎలాంటి విద్యుత్ భారం వేయలేదన్న ప్రభుత్వ వాదన సత్యదూరమని విపక్ష నేత స్పష్టం చేశారు. 200 యూనిట్లు దాటితే యూనిట్‌కు రూ. 6.70 మేర చార్జీ పెంచారని గుర్తుచేశారు. పేద, మధ్య తరగతి వర్గాల కనీస అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటే, విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటే అవకాశమే ఉందని, అందువల్ల వాళ్ళంతా చార్జీల భారం మోయాల్సిందేనని జగన్ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ చార్జీలు మరే పొరుగు రాష్ట్రాల్లోనూ లేవని స్పష్టం చేశారు. చంద్రబాబు గత 9 ఏళ్ళ పాలనలో ఏయేటికాయేడు విద్యుత్ చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 1995-96లో 19 శాతం, 96-97లో 32 శాతం, 98-99లో 10 శాతం, 2000-01లో 14.8 శాతం విద్యుత్ చార్జీలు పెంచారని తెలిపారు. ► విప్ జారీ చేసి మరీ కాపాడారే! కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచారని, రూ.23,456 కోట్ల భారం వేశారని ఇప్పుడు చెబుతున్న చంద్రబాబు.. ఆ రోజు ఎందుకు నిద్రపోయారని ప్రశ్నించారు. దారుణంగా చార్జీలు పెంచుతున్నారని ఒక్క టీడీపీ మినహా ప్రతిపక్షాలన్నీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే, చంద్రబాబునాయుడు తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ రోజు ఆ పనిచేయకుండా ఉంటే, ప్రజలపై ఇంత భారం పడేదా? ఈ రాష్ట్ర విభజన జరిగేదేనా? అని ప్రశ్నించారు. ఆ రోజున ఉన్నది తెలుగు కాంగ్రెస్సే కదా అంటూ టీడీపీని ఎద్దేవా చేశారు. ► సైకో ఎవరో? మీ మనస్సాక్షినే అడగండి జగన్మోహన్రెడ్డి ప్రసంగించే సమయంలో టీడీపీ సభ్యులు ఎప్పటిలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ వైపు నుంచి దొర్లిన ఓ మాటకు ప్రతిపక్ష నేత బదులిస్తూ.. ‘చంద్రబాబును సైకో అంటారో... నన్ను అంటారో... మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది. ఎవరు కళ్ళు పెద్ద పెద్దవి చేసి మరీ భయపెడతారో అందరికీ తెలుసు. ప్రజలంతా చూస్తున్నారు’ అని అన్నారు. -
స్విచ్చేస్తే షాక్
విద్యుత్ వినియోగదారులకు చార్జీల మోత జిల్లాపై నెలకు సగటున రూ.20 కోట్ల భారం యూనిట్‌కు సగటున 5 నుంచి 7 శాతం చార్జీల పెంపు చార్జీల పెంపుపై మండిపడుతున్న రాజకీయ పార్టీలు విజయవాడ : వేసవికి విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న జిల్లా ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం మోపేందుకు నిర్ణయించింది. విద్యుత్ శాఖ అధికారులు చార్జీలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించారు. యూనిట్‌కు సగటున 25 నుంచి 40 పైసల చొప్పున చార్జీలు పెంచారు. దీంతో జిల్లా వాసులపై సగటున రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. వ్యవసాయ కనెక్షన్లు, కుటీర , చక్కెర, పౌల్ట్రీ పరిశ్రమలకు మాత్రం చార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. గృహ వినియోగదారులపై చార్జీల మోత సాధారణ గృహ కనెక్షన్లకు, హైటెన్షన్ కనెక్షన్లకు చార్జీలు పెరిగాయి. జిల్లాలో గృహ వినియోగదారులపై సగటున రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు అదనపు భారం పడగా, హెచ్ లైన్ వినియోగదారులకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే విద్యుత్ చార్జీలు పెంచటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా... జిల్లాలో విద్యుత్ శాఖ డివిజన్లు ఏడు ఉండగా, వాటి పరిధిలో 13 లక్షల 67 వేల 121 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో కేటగిరి-1 (గృహ వినియోగం)లో సుమారు 13.30 లక్షలు, కేటగిరి-2 (వాణిజ్య కనెక్షన్లు) 26 వేలు, కేటగిరి-3 (పరిశ్రమలు) 6 వేల కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని విద్యుత్ శాఖ హెచ్‌టీ (హైటెన్షన్ లైన్), ఎల్ కనెక్షన్ (లోటెన్షన్ లైన్)గా విభజించి నెలవారీ విద్యుత్ వాడకానికి అనుగుణంగా ఆయా కేటగిరీలను బట్టి బిల్లులను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో గత నెలలో జిల్లాలో మొత్తం విద్యుత్ బిల్లు డిమాండ్ రూ.360 కోట్లుగా ఉంది. ఏడాది మొత్తం సగటున రూ.330 కోట్ల నుంచి రూ.380 కోట్ల మధ్యలో విద్యుత్ బిల్లు డిమాండ్ వస్తోంది. దీనిలో గృహ వినియోగ కనెక్షన్లకు సంబంధించి రూ.170 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య బిల్లు డిమాండ్ రాగా, వాణిజ్య కనెక్షన్లు, పరిశ్రమలకు ఇచ్చే కనెక్షన్లు, హైటెన్షన్ కనెక్షన్లకు సంబంధించి రూ.160 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఉంటుంది. గృహ కనెక్షన్లకు చార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గత నెలలో విద్యుత్ చార్జీల పెంపు యోచనలో భాగంగా విద్యుత్ శాఖ కొన్ని జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సగటు వినియోగం 200 యూనిట్ల పైనే 200 యూనిట్ల లోపు వారికి పెంచిన చార్జీలు వర్తించకపోయినా.. జిల్లాలో సాధారణ గృహాల్లో సగటు విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పైనే ఉంటుంది. జిల్లాలో 13.30 లక్షల కనెక్షన్లలో 40 శాతం వినియోగదారులు 200 యూనిట్లు పైనే విద్యుత్ వినియోగించేవారే కావడం గమనార్హం. దీంతో చార్జీల పెంపు మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారాలు ఇలా... విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే ఇప్పటివరకు యూనిట్‌కు రూ.6.38 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు రూ.6.70కి పెరగనున్నాయి. 250 యూనిట్లు దాటితే రూ.6.88 గా ఉన్న యూనిట్ ధర 7.22కు పెంచుతూ నిర్ణయించారు. 300 యూనిట్లు దాటితే ఇప్పటివరకు రూ.7.38గా ఉన్న ధర రూ.7.75కు పెరగనుంది. 400 యూనిట్లు దాటితే ఇప్పటివరకు రూ.7.88గా ఉన్న ధర ఇప్పుడు రూ.8.27కి చేరుతుంది. 500 యూనిట్లు దాటితే రూ.8.38గా ఉన్న ధర రూ.8.80కి పెరుగుతుంది. విద్యుత్ శాఖ నష్టాలను భర్తీ చేసుకోవటానికి, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్వల్పంగానే చార్జీలను పెంచిందని విద్యుత్‌శాఖ ఎస్ఈ మోహన్‌కృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
విన్నారు.. వెళ్లారు..
విద్యుత్ చార్జీల పెంపుపై వైఖరి వెల్లడించని ఈఆర్సీ పలు సమస్యలపై గళమెత్తిన వినియోగదారులు, సంఘాల నేతలు హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, సభ్యులు విద్యుత్ వినియోగదారుల వాదనలు విన్నారు.. వారి వైఖరి, తీసుకోబోయే చర్యల గురించి మాట మాత్రమైన చెప్పకుండానే వెళ్లారు. విద్యుత్ చార్జీల పెంపు, టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ అవసరాలు, ఆదాయం, వ్యయం, వినియోగదారుల సమస్యలపై హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ హాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ ఇస్తామయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాస్, మనోహర్‌రెడ్డితో కూడిన బెంచ్ గురువారం బహిరంగ విచారణ జరిపింది. అరుుతే... ఈఆర్సీ చార్జీల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ ప్రతిపాదించిన ట్లు విద్యుత్ వినియోగదారులపై భారం మోప డం ఖాయంగా కనపడుతోంది. ముందుగా ఎన్పీడీసీఎల్ పరిధిలోఎంత విద్యుత్ వినియో గం అవసరం, నిర్వహణ, ఆదాయ, వ్యయా లు, విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ వివరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది... విద్యుత్ ఎవరి సొత్తు కాదని, అందరికి సమానంగా అందాలని భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాము అన్నారు. వ్యాపార ప్రకటనలకు పీక్ సమయంలో విద్యుత్‌ను నిలిపివేయాలన్నారు.. వ్యాపార సంస్థలకు తక్కువ మొత్తలో చార్జీలు పెంచి గృహ వినియోగదారులకు ఎక్కువ శాతం పెంచడం తగదు. వ్యవసాయదారుల నుంచి సర్వీస్ చార్జి వసూలు చేస్తూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామంటూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్పీడీసీఎల్ ఉద్యోగులు భారీ గా జీతాలు తీసుకుంటూనే రైతులను పీడిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని మండిప డ్డారు. సర్వీస్ చార్జీలు సంవత్సరానికి రూ. 360వసూలు చేయాలి.. కానీ, రూ.600 వసూ లు చేసి రశీదు ఇచ్చారని చెప్పారు. ఇది అసలుదా.. నకిలీదా అని ప్రశ్నించారు. కెపాసిటర్ల ఏర్పాటులో స్కాం జరిగింది.. సీజీఎఫ్ చైర్మన్ గా కంపెనీ అధికారిని కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని డిమాండ్ చేశారు. లంచం ఇచ్చినా.. విద్యుత్ అధికారులు, ఉద్యోగుల్లో అవినీతి పెచ్చరిల్లిందని భారతీయ కిసాన్ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకుడు ఇంజిరెడ్డి అన్నారు. ఓ రైతు రూ.10 వేలు లంచమిచ్చినా ట్రాన్స్ఫార్మర్ బిగించలేదని వివరించారు. నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే సరిపోతుంది నిర్వహణ ఖర్చులు తగ్గిస్తే బిల్లులు పెంచే అవసరముండదని వినియోగదారుల మండలి జిల్లా ప్రతినిధి చక్రపాణి సూచించారు. అధికారులు, ఈఆర్సీ ఈ దిశగా ఆలోచించాలన్నా రు. రాత్రి కరెంట్‌తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా వ్యవసాయానికి పగలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యా యం జరిగిందని ఫోరానికి వెళితే 3 నెలలు పడుతోందని, ఫోరం నిర్ణయం వెలువడకముందే కనెక్షన్ తొలగిస్తున్నారని వివరించారు. వర్కర్‌ను కేటారుుంచాలి వినియోగదారులకు అవగాహన కల్పించేం దుకు కనీసం కరపత్రాలు కూడా ముద్రించడం లేదని విద్యుత్వినియోగదారుల పరిష్కార వేదిక సభ్యుడు సాయిరెడ్డి అన్నారు. రూ. లక్షల్లో బకాయిల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు పైసా అపరాధ రుసుం విధించని ఎన్పీడీసీఎల్ మామూలు వినియోగదారులు ఒక్క రూపాయి బకాయి ఉన్న రూ.75 అపరాధ రుసుం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్‌కు వర్కర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. చార్జీల పెంపును విరమించుకోవాలి.. ఖమ్మం జిల్లాలో 500 గ్రానైట్ పరిశ్రమలుం డగా 300 మూతపడ్డారుు... మరో వంద పరిశ్రమలు మూతపడే పరిస్థితులో ఉన్నాయని, ఖ మ్మం గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు రాజేష్ వివరించారు. పరిశ్రమలపై భారం మోపద్దని కోరారు. చార్జీల భారం మోపద్దు.. హెచ్‌టీ వినియోగదారులపై అధిక చార్జీల భారం మోపుతున్నారని తెలంగాణ కాటన్ ట్రే డర్స్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. పరిశ్రమలు న ష్టా ల్లో ఉన్నారయని, చార్జీల భారం వేయొద్దని సూచిం చారు. చిరు వ్యాపారులకు గృహ కనెక్షన్లు ఇవ్వాలని కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంజయ్య కోరారు. చివరకు సీఎండీ మాట్లాడుతూ తమదృష్టికి తీసుకొచ్చి న లోపాలు సవరించుకుంటామని, అవినీతికి ఆస్కారం లేకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పి సమావే శాన్ని ముగించారు. విచారణలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఘంటా నరేందర్‌రెడ్డి, పలు సంఘాల నేతలు, ఎన్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. -
మీడియాతో నారా లోకేష్
విద్యుత్ చార్జీల పెంపుతో ఇబ్బంది లేదు తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రం లో విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవా రం తిరుపతికి చేరుకున్నారు. ఓ హోటల్లో నిర్వహించిన బూత్ లెవల్ స్థాయి కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉపఎన్నిక ఓ వ్యక్తి స్వార్థం తో వచ్చిందన్న విషయం తిరుపతి ప్రజలు గుర్తించారని తెలిపా రు. వారికి బుద్ధి వచ్చేలా తీర్పును ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయం ప్రభుత్వం సాధించిన మొదటి మెట్టు అన్నారు. మరింత సాయం తీసుకురావడంలో నిరంతరం పోరాటం చేస్తామన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు సామాన్యుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్‌ను అందించిన ఘనత తమకే దక్కిందన్నారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న విద్యుత్, నీరు, ఎంసెట్ పరీక్షలు వంటి సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నారా లోకేష్ వివరించారు. -
ఇల్లు గుల్లే!
గగ్గోలు పెడుతున్న గృహ వినియోగదారులు మధ్య తరగతి ప్రజలపైనే 80 శాతం భారం పడే ప్రమాదం ఉద్యమబాటలో విపక్షాలు.. జిల్లా అంతటా వెల్లువెత్తుతున్న నిరసనలు విజయవాడ : విద్యుత్ చార్జీల పెంపు రూపంలో జిల్లా వాసులకు త్వరలోనే గట్టి షాక్ తగలనుంది. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై నెలకు రూ.18 కోట్ల మేర భారం పడనుంది. వేసవిలో ఈ మొత్తం రూ.22 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ భారంలో ఎక్కువ శాతం గృహ వినియోగదారులపైనే పడనుంది. నష్టాలను భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిందేనని సదరన్ డిస్కం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ నెలాఖరు వరకు వివిధ జిల్లాల్లో విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ విచారణ పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వచ్చే నెల నుంచి భారీ వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఒక వైపు ప్రజలపై భారం పడకుండా చూస్తామంటూనే.. ప్రభుత్వం మరోవైపు ఇందుకు పూర్తి భిన్నంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవడంతో జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు అంశం ప్రతిపాదనల దశలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లాలోని రాజకీయ పార్టీలు ఉద్యమబాట పట్టాయి. వేసవిలో మరింత పెరిగే అవకాశం.. జిల్లాలో విద్యుత్ శాఖ డివిజన్లు ఏడు ఉన్నాయి. వీటి పరిధిలో 13,67,121 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కేటగిరీ-1(గృహ వినియోగం)లో సుమారు 13.30 లక్షలు ఉన్నాయి. కేటగిరీ-2 (వాణిజ్య కనెక్షన్లు) 26 వేలు, కేటగిరీ-3(పరిశ్రమలు)లో సుమారు 6వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటిని విద్యుత్ శాఖ హైటెన్షన్(హెచ్‌టీ), లో టెన్షన్ లైన్( ఎల్-సెక్షన్)గా విభజించి నెలవారీగా విద్యుత్ వినియోగాన్ని బట్టి బిల్లులు నిర్ణయిస్తారు. గత నెలలో జిల్లాలో విద్యుత్ బిల్లులు రూ.135.69 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తంలో ఎల్టీ కేటగిరీ నుంచి రూ.73.36 కోట్లు, హెచ్‌టీ కేటగిరీ నుంచి రూ.62.33 కోట్లు వచ్చింది. సాధారణంగా వేసవి మూడు నెలలు మినహా మిగిలిన సమయంలో సగటున నెలకు రూ.140 కోట్ల విద్యుత్ బిల్లు డిమాండ్ ఉంటుంది. వేసవిలో అయితే నెలకు రూ.180 కోట్ల నుంచి రూ.190 కోట్ల వరకు వస్తుంది. మార్చి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిస్కంల ప్రతిపాదనలకు అనుగుణంగా శ్లాబ్‌ల వారీగా చార్జీలు పెంచితే వేసవిలో నెలకు రూ.210 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు చేరుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై అధిక భారం... ప్రభుత్వ కార్యాలయాలపై కూడా విద్యుత్ చార్జీల భారం పడనుంది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.93 కోట్ల మేర విద్యుత్ బకాయిలు వసూలు కావాల్సి ఉంది. మేజర్ పంచాయతీలు రూ.24.46 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.53.23 కోట్ల బకాయిలు ఉన్నాయి. చార్జీల పెంపు కారణంగా ఈ బకాయిలు రెండు నెలల్లోనే రూ.100 కోట్లకు చేరే అకాశం ఉంది. నగరంలో 80శాతం భారం ప్రజలపైనే... ప్రస్తుతం ప్రతిపాదించిన మేరకు విద్యుత్ చార్జీలు పెంచితే నగరంపై నెలకు సగటున రూ.2.45 కోట్ల భారం పడనుంది. వేసవిలో ఈ మొత్తం రూ.4కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ మొత్తంలో 80 శాతం గృహ వినియోగదారులపైనే పడనుంది. -
విద్యుత్ వాత తప్పదు!
-
విద్యుత్ వాత తప్పదు!
చార్జీల పెంపుపై ఏపీ సర్కారు సంకేతాలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులపై కొత్త చార్జీల భారం తప్పేలా లేదు. డిస్కమ్‌ల ఆర్థిక లోటును పూడ్చేందుకు సిద్ధంగా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం విద్యుత్ చార్జీల పెంపుపై తర్జనభర్జన పడింది. చార్జీలు పెంచకుండా లోటును పూడ్చడం సాధ్యం కాదని సమావేశం అభిప్రాయపడింది. వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)కు ఆమోదం తెలపాల్సి ఉండగా, దీనిపై ప్రస్తుతానికి ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఈ నెల 9వ తేదీలోగా ఏఆర్ఆర్ సమర్పించాలని ఏపీఈఆర్సీ గడువు విధించింది. అందుకు అనుగుణంగా పంపిణీ సంస్థలు ఏఆర్ఆర్లను సిద్ధం చేశాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, సరఫరా నష్టాలు, వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా వల్ల ఆర్థిక భారం పెరిగినట్టు పంపిణీ సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు రూ.6 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు తేల్చాయి. దీనిపై ఇంధన శాఖ సమగ్రమైన నివేదిక రూపొందించి మంత్రిమండలికి సమర్పించింది. పంపిణీ సంస్థలకు రూ.6 వేల కోట్లు సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. లోటు పూడ్చని పక్షంలో చార్జీల పెంపునకు అవకాశం ఇవ్వాలని డిస్కమ్‌లు కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ ప్రతిపాదన మేరకు రూ.6 వేల కోట్లు సబ్సిడీగా ఇవ్వడంపై మంత్రిమండలి చర్చించినట్లు తెలిసింది. ఏఆర్ఆర్ సమర్పణకు ఈఆర్సీని మరింత గడువు కోరాలని పలువురు మంత్రులు సూచించినట్టు తెలిసింది. అయితే దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగలేదని మంత్రులు పేర్కొన్నారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, డిస్కమ్‌లు ప్రతిపాదించిన విధంగా రూ.6 వేల కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తే చార్జీల పెంపు ఉండదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలు పెంచక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయని ఒక మంత్రి చెప్పారు. దీంతో లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. డిస్కమ్‌ల తాజా ప్రతిపాదనల మేరకు 50 నుంచి 100 యూనిట్లు వాడే వినియోగదారుడిపైనా భారం పడే అవకాశాలున్నాయని ఆ మంత్రి తెలిపారు. కేబినెట్ భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారని, అందువల్ల నిర్ణయం తీసుకోలేకపోయామని మంత్రులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీల పెంపు ప్రతిపాదన వద్దని అచ్చెన్నాయుడుతో పాటు కొందరు మంత్రులు సూచించారు. దాంతో విద్యుత్ చార్జీల పెంపుదలను తాత్కాలికంగా వాయిదా వేయాలని, సంక్రాంతి పండుగకు ముందు చార్జీల పెంపుదలపై నిర్ణయం తీసుకోవటం కంటే ఆ తరువాత చర్చించటం మంచిదని నిర్ణయించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒకవైపు గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలని నిర్ణయించి, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచితే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారని తెలిసింది. ఈ అంశం చర్చ కొచ్చే సమయంలో సీఎం బైటకు వెళ్లారని సమావేశం అనంతరం మంత్రి అచ్చన్నాయుడు కూడా మీడియాకు చెప్పారు. గడువులోగా ఏఆర్ఆర్ డౌటే! సుదీర్ఘంగా సాగిన మంత్రిమండలి సమావేశం ఏఆర్‌ఆర్‌ను ఆమోదించకపోవడంతో గడువులోగా దాన్ని సమర్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తొలి అంశంగా విద్యుత్ చార్జీల పెంపు, ఏఆర్ఆర్ ఆమోదిదం ఉన్నప్పటికీ.. సీఎం సూచన మేరకు చివరి అంశాలుగా మార్చినట్టు తెలిసింది.