increase in rate
-
బైక్ లవర్స్‌కు షాకిచ్చిన టీవీఎస్ మోటార్..!
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరోసారి బైక్ లవర్స్‌కు షాకిచ్చింది. టీవీఎస్ అపాచీ బైక్ ధరలను గణనీయంగా పెంచింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి, అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను టీవీఎస్ భారీగా పెంచింది. ఈ ఏడాదిలో అపాచీ బైక్‌ల ధరలను టీవీఎస్ పెంచడం ఇది మూడోసారి. అపాచీ ఆర్టీఆర్ 160 4వి వేరియంట్ ధరను సుమారు రూ. 3000 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 160 4వి డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,14,615 కాగా, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,11,565 గా ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి వేరియంట్ ధరను రూ. 3,750 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 200 4వి సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,33,065 కాగా, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ట్రిమ్ వేరియంట్ ధర రూ. 1,38,115 గా ఉంది. పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రాంతంలోనే వర్తిస్తాయి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది. -
దిగుబడులు కిందకు.. ధరలు పైపైకి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వినియోగదారులకు కూరగాయలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినా వాటి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ సడలింపులతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెరగడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడం..ఇదే సమయంలో డిమాండ్‌కు తగ్గట్లు దిగుమతి లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నా యి. వారం పదిరోజుల కిందటి ధరలతో పోల్చినా ఏకంగా రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల కనిపిస్తోంది. అనూహ్యంగా పెరుగుదల... టమాటా ధరల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. పది రోజుల కిందటి వరకు సైతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.10 పలుకగా, ప్రస్తుతం రూ.30కి చేరింది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, సిద్దిపేట రంగారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు టమాటా రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో బోర్ల కింద వేసిన సాగు పూర్తవ్వడం, ఇప్పుడు కొత్తగా సాగు జరుగుతున్న నేపథ్యంలో డి మాండ్ మేరకు పంట రావడం లేదని అంటున్నారు. ఇక రాష్ట్రానికి అధికంగా ఏపీలోని మదనపల్లి, కర్ణాటకలోని చిక్మగళూర్ నుంచి రోజుకు 2వేల నుంచి 3వేల క్వింటా ళ్లు దిగుమతి అవుతుండగా ..ఇప్పుడది 1,500 క్వింటాళ్లకు తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లోనే కిలో టమాటా రూ.20 వరకు పలుకుతోంది. రవాణా ఖర్చులు కలుపుకొని అమ్మే సరికి దాని ధర రూ.30–35కి చేరుతోంది. గడిచిన 4 రోజులుగా బోయిన్పల్లి మార్కెట్‌కు వచ్చిన పంటను గమనిస్తే దిగుమతుల తగ్గుదల తెలుస్తోంది. ఈ నెల 15న మార్కెట్‌కు 3,074 క్వింటాళ్లు రాగా, 16న 2,870, 17న 251 క్వింటాళ్లు రాగా 18న గురువారం కేవలం 1,313 క్వింటాళ్లు›మాత్రమే వచ్చింది. దీంతో హోల్‌సేల్ మా ర్కెట్లోనూ కిలో టమాటా 4 రోజుల కిందట రూ.15 ఉండగా, ఆ ధర ప్రస్తుతం రూ.24కు చేరింది.అది రైతుబజార్లలో రూ.25–28 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి దాని ధర రూ.30–35కి చేరింది. ఇతర కూరగాయల ధరలు పైపైకి.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్ మార్కెట్లకు లాక్డౌన్ సమయంలో రోజుకు 30–35 వేల క్వింటాళ్ల మేర అన్ని రకాల కూరగాయలు వచ్చేవి. బోయిన్పల్లి మార్కెట్‌కే 20 వేల క్వింటాళ్లకు పైగా వచ్చిన రోజులున్నాయి. ఈ నెల 15న బోయిన్పల్లి మార్కెట్‌కు అన్ని రకాల కూరగాయలు కలిపి 18,468 క్వింటాళ్ల మేర రాగా, 16న 16,471 క్వింటా ళ్లు, 17న 15,741 క్వింటాళ్లు రాగా, 18న గురువారం 10,937 క్వింటాళ్లే వచ్చింది. పది రోజుల కిందటి ధరలతో పోలిస్తే ప్రతీదానిపై రూ.20–30 వరకు పెరిగాయి. కాకర కిలో రూ.35, వంకాయ రూ.35, క్యాప్సికం రూ.70, బీన్స్ రూ.50, క్యారెట్ (బెంగళూరు) రూ.50, దొండ రూ.32–35, పచ్చిమిర్చి రూ.45, బెండ రూ.30 వరకు ఉండగా, బీరకాయ రూ.60 పలుకుతోంది. ఆలు ధర వారం కింద రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.40కి చేరింది. ఉల్లి ధరలు మాత్రం వినియోగదారులకు అందుబాటు లో ఉన్నాయి. రూ.100కు 6 నుంచి 7 కిలోల వంతున విక్రయిస్తున్నారు. పంటలసాగు మొదలవడంతో మరో 3 నెలల పా టు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. -
ఎర్ర బంగారం @ రూ.13 వేలు
ఖమ్మంవ్యవసాయం: మిర్చిని ప్రస్తుత ధరతో చూస్తే ఎర్ర బంగారం అని చెప్పక తప్పదు. మిరప ధర రోజురోజుకూ పెరుగుతోంది. విదేశాల్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇక్కడ పంట ధరకు రెక్కలొస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చి ధర మంగళవారం క్వింటా రూ. 13,100 పలికింది. జిల్లాలో ప్రధాన పంటల్లో మిర్చి ఒకటి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ‘తేజా’ రకం మిర్చిని ప్రధానంగా సాగు చేస్తుంటారు. ఉభయ జిల్లాల్లో దాదాపు 70 వేల ఎకరాల్లో ఈ పంటను సాగవుతుంది. దీనికి చైనా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు మిర్చి ఎగుమతులకు అనుమతి లభించటంతో దేశంలో నిల్వ ఉంచిన సరుకును వ్యాపారులు అక్కడికి తరలిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దాదాపు 36 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉన్నట్లు అంచనా. ఉమ్మడి జిల్లాల్లో పండించిన పంటతో పాటు ఖమ్మానికి పరిసర జిల్లాలైన మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ రూరల్, ఏపీలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పండించే తేజా రకం మిర్చిని అధికంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు విక్రయిస్తుంటారు. పంట సీజన్లో రైతుల నుంచి క్వింటా రూ. 7,000 నుంచి రూ. 8,500 చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ఆ నిల్వలకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. జూన్ నెల చివరి వారంలో రూ. 12 వేలు పలికిన ధర రోజుకో రకంగా పెరుగుతూ వచ్చింది. జూన్ 30న క్వింటా మిర్చి ధర రూ. 12,100 ఉంది. జూలై 9 నాటికి ఆ ధర ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ. 13,100కు చేరింది. కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసే పంట చాలా తక్కువ. వ్యాపారుల పంట మూడు వంతులకు పైగా నిల్వ ఉంటుందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. స్థానిక వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు పంటను రైతుల నుంచి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయా వ్యాపారులు ఎగుమతిదారులు(ఖరీదు దారులు)కు నిల్వ పంటను విక్రయిస్తున్నారు. నిల్వ చేసిన వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. క్వింటాకు ఏకంగా రూ. 5 నుంచి 6 వేల వరకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర మరికొంత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం కూడా మిర్చి ధర రూ.13 వేలు పలికింది. ఈ ఏడాది అంతకు మించడం విశేషం. -
వృద్ధి పరుగే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు. రైతులందరికీ ఆదాయం... కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు. నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. బ్యాంకు మోసాలు తగ్గాయి బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు. -
సమీపకాలం ‘బంగారమే’!
ముంబై: బంగారం డిమాండ్ సమీప కాలంలో పటిష్టంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక సూచిస్తోంది. ఈ ఏడాది (2019) డిమాండ్ పెరుగుదలకు పలు కారణాలు ఉంటాయని డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఫైనాన్స్ మార్కెట్ల పనితీరు, భారత్‌సహా పలు దేశాల ద్రవ్య పరపతి విధానాలు, డాలర్ కదలికల వంటి అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఒడిదుడుకుల ఫైనాన్షియల్ మార్కెట్ల సమయంలో సహజంగా పసిడి పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రపంచం మొత్తంగా పసిడి డిమాండ్ చూస్తే, చైనా, భారత్‌సహా పలు వర్థమాన దేశాల వాటా 70 శాతంగా ఉంది. ► గత రెండేళ్లలో ప్రపంచంలో నెలకొన్న పలు అనిశ్చితి ఆర్థిక అంశాల ప్రభావం 2018 చివర్లో స్పష్టంగా కనిపించింది. ఇదే పరిస్థితితో 2019 సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఆయా అంశాలు పసిడి డిమాండ్‌ను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా సమీప భవిష్యత్‌లో పసిడి డిమాండ్ పెరుగుదలకే కొంత మొగ్గు ఉంది. ► మార్కెట్ అనిశ్చితి కొనసాగే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇది పసిడికి సానుకూల అంశమే. ► ఈ సందర్భంగా పసిడికి ప్రతికూలమైన వడ్డీరేట్ల పెరుగుదల, డాలర్ పటిష్టతను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అయితే ఫెడ్ వడ్డీరేటు (ప్రస్తుతం 2.25–2.50 శాతం శ్రేణి) పెంపు స్పీడ్ తగ్గే అవకాశాలే కనిపిస్తుండటం పసిడికి సానుకూల అంశమే. ► వృద్ధి పెరిగినా, ఆ ఫలాలు అందరికీ అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇది పసిడి సెంటిమెంట్‌ను బలపరిచే అంశమే. ► ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇదేరీతిన కొనసాగితే, 2019లో పసిడి ఆభరణాలకూ డిమాండ్ పటిష్టమవుతుందని కౌన్సిల్ భావిస్తోంది. ► పశ్చిమ దేశాల్లో వృద్ధి ధోరణి... వినియోగ సెంటిమెంట్‌ను బలపరిచే అంశం. -
ఇంధనం.. భారం
సాక్షి, తాడూరు: పెట్రోల్, డిజిల్‌ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులను కలవర పెడుతున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో అవి ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాహనాలను కొంటున్న వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. డీజిల్ ధర పెట్రోల్‌తో సమానంగా పరుగులు తీస్తుంది. డీజిల్ వాహనాలతో జీవనం సాగించే వారికి ప్రస్తుతం ధరలు మరింత భారంగా మారాయి. భారంగా పెరిగింది ప్రభుత్వం ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో అయిల్ కంపెనీలు డిజిల్, పెట్రోల్ ధరలను ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో అంతటా విమర్శలు వెల్లువెతుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు మారుతుండటంతో ఈ ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై పడుతుంది. దీంతో సామాన్య ప్రజలపై భారం భాగా పెరిగింది. డీజిల్‌కే ఖర్చు ఆటో వంటి చిన్న వాహనాలు నడుపుకుంటూ జీవనం సాగే వారి పరిస్థితి భారంగా మారింది. దీంతో ఆయా వాహనదారులు ఈ ఆందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం వారి కుటుంబ పోషణపై పడుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. డిజిల్‌ధర రూ.80లకు పైగా చేరడంతో వచ్చిన సంపాదన డిజిల్‌కే సరిపోతుందని వారు అంటున్నారు. ఫైనాన్స్‌లో తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టలేకపోతున్నామని అన్నారు. యువతపైనే భారం పెట్రోల్ దరలు పెరుగుతుండటంతో యువతకు భారం అధికమవుతుంది. పెరిగిన ధరలతో యు వత ద్విచక్ర వాహనాలు నడిపేందుకు సంకోచిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు పరుగెడుతు న్న యువత కళాశాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు. అది పెట్రోల్ తాగే పల్సర్, సీపీజెడ్, బుల్లెట్, యూనిఖాన్ వంటి వాహనాలకు యువత ఆకర్షితులై వాటిని కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు వారికి కంటిపై కునుకు లేకుండా çచేస్తున్నాయి. పలువురు వాహనదారులు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. నియంత్రణ ఉండాలి ప్రభుత్వ నియంత్రణ ఉంటేనే ఇంధనం ధరలు అదుపులో ఉంటాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ధరలను అదుపు చేయాలని కోరుతున్నారు. ఆటోలు ఫ్యాసింజర్లను దూర ప్రాంతాలకు తీసుకెళ్లే కారు డ్రైవర్లు తాము సంపాదించిన మొత్తం డిజిల్, పెట్రోల్ కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై çకేంద్ర ప్రభుత్వం స్పందించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని పలు గ్రామాల వాహనదారులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం పెట్రోల్‌తో పాటు సమానంగా డిజిల్ ధరలు పెరగడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిల్‌తో పనులు నడవడం ట్రాక్టర్లతో సాగు పనులు పెరగడం వల్ల డీజిల్ పెరిగే కొద్ది ట్రాక్టర్ల యజమానులు విపరీతంగా వ్యవసాయ పనులకు ధరలు పెంచుతున్నారు. రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డిజిల్ ధరలను అదుపు చేయాలి. – లక్ష్మయ్య, మేడిపూర్ ప్రయాణం కష్టంగా ఉంది పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. రోజుకు రూ.100ల పెట్రోల్ పోయిస్తున్నాం. సరిపోవడం లేదు. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను అదుపులోకి తీసుకురావాలి. – సుధాకర్, తాడూరు -
ఘాటెక్కిన ఉల్లి
నల్లగొండ టౌన్: ఉల్లి ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది. ఒక్కసారిగా ధర పెరగడంతో ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. పదిహేను రోజుల క్రితం కిలో రూ. 15 నుంచి రూ. 18 వరకు ధర పలికిన ఉల్లి ప్రస్తుతం రిటేల్‌లో రూ. 22 నుంచి రూ.24 వరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో రూ.12 మాత్రమే ధర ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏర్పడిన కరువు పరిస్థితులలో జిల్లాలో ఎక్కడా కూడా ఉల్లిసాగు లేకపోవడంతో పాటు జిల్లాకు ఉల్లిగడ్డలను సరఫరా చేసే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దాంతో ఉల్లి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాకు మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్, గుజరాత్ నుంచి ఉల్లి దిగుమతులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. దాంతో పాటు ఉన్న సరుకులను హోల్‌సేల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్ల కూడా ధరలు పెరిగా యి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో దళారులు ధరలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి గతంలో ప్రతి రోజూ మూడు లారీల ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండేది. కానీ ప్రస్తుతం రెండు లారీలు మాత్రమే వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగనున్నాయి.మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు ఉల్లిగడ్డలను బ్లాక్ చేసే వ్యాపారులపై దృష్టిసా రించని కారణంగా వ్యా పారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ధరలను పెంచుతున్నారనే విమర్శలు విని పిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాయంత్రాం గం స్పందించి బ్లాక్ చేసే వ్యాపారులపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని, ఉల్లిగడ్డ ధరలను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉల్లి లేకుండానే కూరలు పెరిగిన ధరల కారణంగా ఉల్లిగడ్డ లేకుండానే కూరలు వండుకోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ధరలు పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ధరలను తగ్గించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. - కె.సరోజ తక్కువ ధరకు ప్రభుత్వమే అమ్మాలి ఉల్లిధరలు సా మాన్యులకు అం దుబాటులో లేకుండా పో యాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లిగడ్డలను తక్కువ ధర కు అమ్మడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ధరలను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలి. - కాంతయ్య