indian ralway
-
రైళ్లో దుప్పట్లు ఎన్ని రోజులకు ఉతుకుతారో తెలుసా?
రైల్వే ప్రయాణం చేస్తున్నారా? ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారా? అందులో వాడే ఉన్ని దుప్పట్లు ఎప్పుడు ఉతుకుతారో తెలిస్తే షాకవుతారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు స్వయంగా రైల్వే విభాగం ఆసక్తికర సమాధానం ఇచ్చింది.ఏసీ కోచ్‌ల్లోని ఉన్ని దుప్పట్లు, బెడ్షీట్లు, కవర్లను ఎన్ని రోజులకు శుభ్రం చేస్తారని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం స్పందించింది. బెడ్షీట్లు, పిళ్లో కవర్లు ప్రతి జర్నీ పూర్తయిన వెంటనే శుభ్రం చేస్తామని చెప్పింది. అయితే ఉన్ని దుప్పట్లను మాత్రం నెలలో ఒకటి లేదు రెండుసార్లు ఉతుకుతామని స్పష్టం చేసింది.‘ఏసీ కోచ్‌ల్లో రైలు ప్రయాణం పూర్తయిన వెంటనే పిళ్లో కవర్లు, బెడ్షీట్లు నిత్యం శుభ్రం చేస్తాం. అయితే చాలా సందర్భాల్లో దుప్పట్లు దుర్వాసన, తడిగా ఉండడం..వంటివి గమనిస్తే వెంటనే వాటిని ఉతకడానికి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు దుప్పట్ల శుభ్రతకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. వారికి వెంటనే మరో దుప్పటి అందిస్తాం’ అని రైల్వేలో పదేళ్లు అనుభవం ఉన్న హౌజ్‌కీపింగ్ సిబ్బంది తెలిపారు.రైల్వే ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎం) సెక్షన్ ఆఫీసర్ రిషు గుప్తా మాట్లాడుతూ..‘టిక్కెట్ ధరలో బెడ్ నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించేవారికి బెడ్షీట్లు, దిండ్లు, దుప్పట్లు ఇస్తారు. ప్రతి ట్రిప్ తర్వాత బెడ్ షీట్లు, దిండు కవర్లు శుభ్రం చేస్తారు. ఉన్ని దుప్పట్లు ఉతకడంలో మాత్రం కొంత ఆలస్యం అవుతుంది’ అన్నారు. రైల్వేశాఖ ఆర్టీఐలో భాగంగా ఇచ్చిన రిప్లైలో..‘రైల్వే విభాగంలో అందుబాటులో ఉన్న లాండ్రీ సదుపాయాలకు అనుగుణంగా ఉన్ని దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఉతకాల్సి ఉంది’ అని పేర్కొంది. కాగా, రైల్వేలో బ్లాంకెట్లను పరిశుభ్రంగా ఉంచడం లేదని 2017లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..రైల్వే విభాగానికి దేశవ్యాప్తంగా 46 డిపార్ట్మెంటల్ లాండ్రీ, 25 బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్-ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహించేవి) లాండ్రీ సదుపాయాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ లాండ్రీల్లోని సిబ్బంది తరచు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతున్నారు. దాంతో కొంత ఇబ్బందులున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బూట్ లాండ్రీలను ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. -
ప్రియాంక వీడియో: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా షేర్ చేసిన రైల్వే వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇండియన్ రైల్వేకు చెందిన ఓ రైలుపై అదానీ గ్రూపుకు చెందిన స్టాంప్ ఉండటంపై వివరణ ఇచ్చింది. ‘‘ భారత ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్టాంపును ఇండియన్ రైల్వేకు చెందిన ఓ రైలుపై అంటించిందన్న వాదన తప్పుదారి పట్టించేదిలా ఉంది. ఆ స్టాంప్ రైల్వే శాఖ ఆదాయం పెంచడానికి వేసిన వ్యాపార ప్రకటన మాత్రమే’’ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబి) పేర్కొంది. కాగా, ప్రియాంక గాంధీ ఈ నెల 14న ఈ వీడియోను తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘భారత ప్రజల కష్టంతో నిర్మించబడ్డ ఇండియన్ రైల్వేలపై ప్రధాని మోదీ తన డబ్బున్న మిత్రుడు అదానీ స్టాంపులు వేస్తున్నారు. రేపటి రోజు ఇండియన్ రైల్వేలోని అధిక భాగం మోదీ డబ్బున్న స్నేహితులకు వెళ్లిపోతుంది. తాము మోదీ మిత్రుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు దేశ రైతులు వ్యవసాయాన్ని మానుకుని మరీ పోరాడుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో పది వేల లైకులతో, దాదాపు 7 వేల షేర్లతో వైరల్‌గా మారింది. दावा: #फेसबुक पर एक वीडियो के साथ यह दावा किया जा रहा है कि सरकार ने भारतीय रेल पर एक निजी कंपनी का ठप्पा लगवा दिया है। #PIBFactCheck: यह दावा भ्रामक है। यह केवल एक वाणिज्यिक विज्ञापन है जिसका उद्देश्य केवल 'गैर किराया राजस्व' को बेहतर बनाना है। pic.twitter.com/vSmK8Xgdis — PIB Fact Check (@PIBFactCheck) December 16, 2020 -
ఒక్క కిలోమీటరు.. వందకోట్లు
న్యూఢిల్లీ: ఒక్క కిలోమీటర్ మార్గానికి వంద కోట్లు ఖర్చవుతాయట. ఇది దేనికని అనుకుంటున్నారా.. అదే నండి మన దేశంలో త్వరలో రూపకల్పన చేయాలనుకుంటున్న హైస్పీడ్ రైలు మార్గానికి. ఈ లెక్కన దేశంలోని అన్ని రైలు మార్గాలను హైస్పీడ్ రైలు పరుగులకు అనుగుణంగా మార్చాలంటే మొత్తం రూ.80 వేల కోట్లు ఖర్చుకానున్నాయి. సోమవారం నాటి ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సాధరణ రైల్వే మార్గానికన్నా పది నుంచి 14 రెట్లు సమర్ధమంతంగా హైస్పీడ్ రైల్వే లైన్లను వేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.