‘హాట్‌లైన్ కొనసాగుతుంది’
వాషింగ్టన్: భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు నేరుగా సంభాషించుకునేందుకు 2015లో బరాక్ ఒబామా పాలనలో ఏర్పాటు చేసిన హాట్‌లైన్, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక కూడా కొనసాగుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొత్తగా ఏర్పాటైన హాట్‌లైన్ ఇదొక్కటే కావడం గమనార్హం.
2015లో భారత గణతంత్ర వేడుకలకు ఒబామా అతిథిగా వచ్చారు. ఆ సమయంలో భారత ప్రధానితో హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించారు. రష్యా, చైనా, బ్రిటన్, భారత్‌లకు మాత్రమే ఇప్పటివరకు శ్వేతసౌధంలో హాట్‌లైన్ ఉంది. హాట్‌లైన్ ఏర్పాటయ్యాక ఒబామా, మోదీ ఓసారి గంటకు పైగా మాట్లాడుకున్నట్టు భారత్‌లో అమెరికా రాయబారి వెల్లడించారు.