Indrani Mukherjee
-
This Week In OTT: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తోంది. దీంతో అటు థియేటర్లలో గానీ ఇటు ఓటీటీలో గానీ అద్భుతమైన చిత్రాలేం రావట్లేదు. ఈ వారమైతే థియేటర్లలో 'ఆపరేషన్ వాలంటైన్', 'వ్యూహం', 'చారీ 111', 'భూతద్దం భాస్కర్' తదితర చిత్రాలొస్తున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. మరి థియేటర్లలో ఏది క్లిక్ అవుతుందనేది చూడాలి. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) మరోవైపు ఈ వారం ఓటీటీల్లో మాత్రం దాదాపు 30కి సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే వీటిలో 'బ్లూ స్టార్', 'ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ' చిత్రాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటిలో పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలున్నాయి. రిలీజ్ తర్వాత గానీ వీటిలో ఏది బాగుందనేది తెలియదు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో తెలుసా? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 26 - మార్చి 3) నెట్‌ఫ్లిక్స్ ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) - ఫిబ్రవరి 27 అమెరికన్ కాన్స్పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28 కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28 ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 28 ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29 మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29 ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29 ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29 మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01 మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) - మార్చి 01 షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01 సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01 స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01 ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01 ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03 అమెజాన్ ప్రైమ్ వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 26 ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26 పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27 బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29 పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29 రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29 నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 హాట్‌స్టార్ ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28 షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28 ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28 వండర్ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01 జీ5 సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మార్చి 01 జియో సినిమా ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 27 బుక్ మై షో ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27 ఆపిల్ ప్లస్ టీవీ నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01 ముబీ ప్రిసిల్లా (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01 (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అలా జరగడంతో బ్రేకప్: బిగ్ బాస్ దివి) -
ఇంద్రాణి ముఖర్జీయాకు చుక్కెదురు
న్యూఢిల్లీ: షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీకి చుక్కెదురు అయింది. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. అయితే పోలీస్ భద్రత మధ్య ముంబయిలో తండ్రి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. అలాగే ఇంద్రాణి ముఖర్జీ మీడియాతో మాట్లాడరాదని ఆదేశాలు ఇచ్చింది. కాగా 2012 ఏప్రిల్ నెలలో కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే. -
షీనాబోరా హత్య కేసులో కీలక మలుపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధాణయింది. ముంబై సరిహద్దులోని రాయ్‌గఢ్ అడవిలో లభ్యమైన మృతదేహం షీనాబోరా(24)దే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదికను సీబీఐ అధికారులకు సమర్పించింది. ఈ రిపోర్టు ఆధారంగా షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ సింగ్ లపై ఛార్జీ షీట్ నమోదు చేయనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ దక్షిణ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు పరిధిలో వీరిపై ఛార్జీ షీట్ దాఖలు చేస్తామని, ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను ఇందులో పేర్కొంటామని సీబీఐకి చెందిన ఓ అధికారి వివరించారు. ఈ ముగ్గురికి కోర్టు నవంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, 2012 ఏప్రిల్ లో షీనాబోరా హత్యకు గురైంది. షీనాబోరాను తానే హత్య చేయించినట్టు ఇంద్రాణి పోలీసుల ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నారు. -
ఇంద్రాణి పాత్రలో రాఖీ!
తాజాగా మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ జీవితం తెరపైకి రానుంది. కన్నకూతురినే హత్య చేసిన మీడియా అధినేత్రి ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ కనిపించనున్నారు. సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఇంద్రాణి జీవిత క్రమాన్ని ‘ఏక్ కహానీ జూలి కి’ అనే చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని రాఖీసావంత్ స్వయంగా వెల్లడించారు. ‘‘నాకు వ్యక్తిగతంగా ఇంద్రాణి ఎప్పటినుంచో పరిచయం. ఆమె జీవితాన్ని ఎంతో దగ్గర్నుంచి చూశాను. ఇంద్రాణి ప్రతి క్షణం ఒత్తిడితోనే జీవితాన్ని గడిపేది. ఆమె భర్త పీటర్ ముఖర్జీ, కూతురు షీనాలు కూడా నాకు బాగా తెలుసు. అందుకే ఇంద్రాణి పాత్రకు నేనే కరెక్ట్’’అని చెప్పుకొచ్చారామె. -
అరెస్టింగ్ సినిమా...
తెర పై కట్టిపడేసే.. రియల్ లైఫ్ క్రైమ్ రియల్ రీల్ ఆట, మాట, పాట, కట్టుబొట్టు విషయంలో జీవితం సినిమాను అనుకరించే సందర్భాలు తరచూ చూస్తుం టాం. కానీ, సినిమాయే జీవితాన్ని అనుకరించడం ఇప్పుడెక్కువవుతోంది. కావాలంటే, వెండితెరపైకి వస్తున్న తాజా హిందీ సినిమాల జాబితా చూడండి. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన, నోయిడాలో తల్లితండ్రులే కన్న కూతురిని హత్యచేసిన ఆరుషీ తల్వార్ కేసు మొదలు తాజాగా కూతుర్ని కడతేర్చిన తల్లి ఇంద్రాణీ ముఖర్జీ వ్యవ హారం దాకా ఇప్పుడు కాదేదీ సినిమా స్క్రిప్ట్‌కు అనర్హం. ‘మాంఛి’ బాక్సాఫీస్ క్రైవ్‌ు సినిమా అంటే... ఇప్పుడు రియల్ లైఫ్ స్టోరీలే. అలా తెర కెక్కిన, ఎక్కుతున్న నిజ జీవిత కథల్లో కొన్ని... అచ్చం... అలాంటి స్టోరీయే స్టార్ టీవీతో ఒకప్పుడు అనుబంధమున్న ఇంద్రాణీ ముఖర్జీ చెల్లెలని చెబుతూ కన్నకూతురినే కనబడకుండా చేసిన ఘటన కొద్ది రోజులుగా నేషనల్ మీడియాలో ఫస్ట్పేజ్ స్టోరీ. చిత్రం ఏమిటంటే, దర్శకుడు మహేశ్‌భట్ కొన్నాళ్ళ క్రితం రాసిన ‘అబ్ రాత్ గుజర్నే వాలీ హై’ స్క్రిప్ట్ కూడా దాదాపు ఇలానే ఉంటుందట. ఒకటికి నాలుగు పెళ్ళిళ్ళు, ప్రేమ, నేరస్వభావం లాంటివన్నీ నిండిన ఈ స్క్రిప్ట్‌ను మహేశ్ శిష్యుడు గురుదేవ్ భల్లా ఈ డిసెంబర్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. పొట్టనపెట్టుకున్న పేగుపాశం పధ్నాలుగేళ్ళ ఆరుషీ తల్వార్ ఇంట్లో పనివాడితో చనువుగా ఉండడం చూసి, వారిద్దరినీ ఇంట్లోనే కడతేర్చారు. డాక్టర్ తల్లితండ్రులే ఆ పని చేశారని ఆరోపణ. 2008లో నోయిడాలో జరిగిన ఈ సెన్సేషనల్ ఇన్సిడెంట్ ఇప్పుడు ‘తల్వార్’గా తెరకెక్కుతోంది. విశాల్ భరద్వాజ్ రచన చేశారు. ఇర్ఫాన్ ఖాన్, తబు, కొంకణా సేన్ శర్మ తారాగణం. నిజానికి, ఇదే ఘటనపై ఇప్పటికే మనీశ్ గుప్తా ‘రహస్య’ పేరిట ఒక సినిమా తీశారు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఆ సినిమాలో కేకే మీనన్, టిస్కా చోప్రా నటించారు. వర్మ తీసిన కథ కాని కథ ముంబయ్‌కి చెందిన వర్ధమాన నటి మరియా సుసై రాజ్ పైకి రావడానికి టీవీ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ సాయపడ్డాడు. తీరా మరొకరితో అనుబంధం పెంచు కున్న ఆ అమ్మాయి నీరజ్‌ను అడ్డుతొలగించుకుంది. 2008 మేలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ‘నీరజ్ గ్రోవర్ హత్య కేసు’ను రావ్‌ుగోపాల్‌వర్మ ‘నాట్ ఎ లవ్‌స్టోరీ’ పేరిట 2011లో తీశారు. మాహీ గిల్ నటించిన ఈ సినిమా ‘నిజజీవిత కథ’ కాదని వర్మ అన్నప్పటికీ, సినిమా నిండా ఆ పోలికలే కనిపించాయి. తెరపైకి వచ్చిన మోడల్ హత్య... మోడల్ జెస్సికాలాల్ పేరు గుర్తుందా? టైవ్‌ు అయిపో యిందని డ్రింక్స్ ఇవ్వనందుకు 1999లో ఢిల్లీలోని ఒక బార్లో డబ్బున్న కుర్రాడు మనూశర్మ తూటాలకు బలైన యువతి. పలుకుబడి పని చేయక, చివరకు జైలు పాలయ్యాడు మనూశర్మ. ఈ రియల్‌లైఫ్ స్టోరీని రాణీ ముఖర్జీ, విద్యా బాలన్లతో ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాగా తీశారు రాజ్‌కుమార్ గుప్తా. సెక్స్... పాలిటిక్స్... అండ్ మర్డర్ 2011లో రాజస్థాన్‌లో సెన్సేషన్... 36 ఏళ్ళ నర్సు భన్వారీదేవి హత్య. జీవితంలో పైపైకి రావా లన్న ఆమె బలహీనత ఆసరాగా, ఆ రాష్ర్ట మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే ఆమెను అపహరించి, వాడుకొని, హతమార్చినట్లు ఆరోపణ. ఈ కథనే కె.సి. బొకాడియా తాజాగా ‘డర్టీ పాలిటిక్స్’గా తీశారు. మల్లికా షెరావత్ నటించిన ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల నుంచి ఇటీవలే బయటపడింది. ఒక నిర్భయ... అనేక వెండితెర కన్నీళ్ళు ఢిల్లీలోని ఒక పారా మెడికల్ విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి సినిమా చూసి, ఇంటికి వెళుతుంటే... బస్సులో గ్యాంగ్‌రేప్‌కు గురైన ‘నిర్భయ’ ఘటన ఇప్పటికీ ఒక కన్నీటి జ్ఞాపకం. 2012 డిసెంబర్లో జరిగిన ఈ ఘటన ఆధారంగా ‘ది జర్నీ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్’, ‘దామిని... ది విక్టివ్ు’, ‘ఆజ్ కీ ఫ్రీడవ్‌ు’ లాంటి సినిమాలు వచ్చాయి. లెస్లీ ఉడ్విన్ తీసిన ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీ అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షిం చింది. నేరం చేసిన ముఖేశ్ సింగ్‌తో ఇంటర్వ్యూ ఉన్న ఆ డాక్యుమెంటరీ మన దేశంలో నిషేధానికి గురైంది. గోవా బీచ్‌లో జరిగిన హత్యపై ‘అన్ జునా బీచ్’, కోల్‌కతాలో పార్కస్ట్రీట్లో నడుస్తున్న కారులో జరిగిన గ్యాంగ్‌రేప్‌పై ‘3 కన్య’, ‘పార్క స్ట్రీట్’ లాంటి సినిమాలు వచ్చాయి. వరుస చూస్తుంటే, ఈ నిజజీవిత ఘటనలు తెరకెక్కడం ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. -
ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !
ముంబయి: విచారణ సమయంలో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని తీవ్రంగా కొడుతున్నారని ఆమె తరుపు న్యాయవాదులు సోమవారం ముంబయి కోర్టుకు ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె హత్య కేసుకు సంబంధించి పలు వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందని పోలీసులు విచారణ పేరిట ఆమెను భౌతికంగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించనున్నట్లు సమాచారం. తాము ఆమెను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె ముఖంపై చెంపదెబ్బల గాయాలు వారికి కనిపించినట్లు తెలుస్తోంది. సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమె కుమారుడిని కూడా హత్య చేసేందుకు ఆమె అదే రోజు పలురకాల కుట్రలకు పాల్పడిందని కూడా తెలిసింది. గతంలో పోలీసులు కోరిన కస్టడీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ గడువు మరింత కోరేందుకు మరోసారి ఆమెను సోమవారం కోర్టుకు పోలీసులు హాజరుపరచనున్నారు.