షీనాబోరా హత్య కేసులో కీలక మలుపు | AIIMS report confirms remains found in Raigad forest are Sheena Bora's | Sakshi
Sakshi News home page

షీనాబోరా హత్య కేసులో కీలక మలుపు

Published Thu, Nov 19 2015 12:38 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

షీనాబోరా హత్య కేసులో కీలక మలుపు - Sakshi

షీనాబోరా హత్య కేసులో కీలక మలుపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధాణయింది. ముంబై సరిహద్దులోని రాయ్గఢ్ అడవిలో లభ్యమైన మృతదేహం షీనాబోరా(24)దే అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదికను సీబీఐ అధికారులకు సమర్పించింది.

ఈ రిపోర్టు ఆధారంగా షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ సింగ్ లపై ఛార్జీ షీట్ నమోదు చేయనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ దక్షిణ ముంబై మెట్రోపాలిటన్ కోర్టు పరిధిలో వీరిపై ఛార్జీ షీట్ దాఖలు చేస్తామని, ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను ఇందులో పేర్కొంటామని సీబీఐకి చెందిన ఓ అధికారి వివరించారు.

ఈ ముగ్గురికి కోర్టు నవంబర్ 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ  విధించింది. కాగా, 2012 ఏప్రిల్ లో షీనాబోరా హత్యకు గురైంది. షీనాబోరాను తానే హత్య చేయించినట్టు ఇంద్రాణి పోలీసుల ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement