Inferior drugs
-
మాయదారి మందుల్లో మనమే నెం.1
సాక్షి, అమరావతి: ప్రాణాలు నిలబెట్టాల్సిన మందుల వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. నాలుగున్నరేళ్లుగా నకిలీ మందులు, నాసిరకం మందులు విచ్చలవిడిగా వినియోగంలోకి వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఎక్కడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చర్యలు లేవు. మందుల షాపుల్లో అటుంచితే ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అయ్యే మందులు మరీ దారుణంగా ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ పరిశీలనలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో సగటున 4 శాతం నాసిరకం మందులు వినియోగంలో ఉండగా, ఏపీలో 5.1 శాతం నకిలీ, నాసిరకం మందులు వినియోగంలో ఉన్నాయి. దీనివల్ల పేద, సామాన్య ప్రజలకు జబ్బులు నయం కాకపోగా, కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నాసిరకం మందులు, నకిలీ మందుల విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2700కు పైగా నమూనాలు సేకరించి ల్యాబ్‌లో పరిశీలిస్తే అందులో 133 నాసిరకమైనవిగా తేలాయి. ఇది 5 శాతం కంటే ఎక్కువ. జాతీయ సగటు 4 శాతంగా ఉంది. కేరళలో 3, కర్ణాటక 4, తమిళనాడు 4.1 నాసిరకం మందులు వినియోగంలో ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మరీ నాసిరకం.. ఆరు నెలల క్రితం గోవా యాంటీబయోటిక్స్ కంపెనీ సరఫరా చేసిన యాంటీబయోటిక్ ఇంజక్షన్లు వాడగానే శ్రీకాకుళం రిమ్స్‌లో ముగ్గురు మృతి చెందారు. దీనిపై విచారణకు ఆదేశించినప్పటికీ తరువాత ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ఈ నెల 9న తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పోతనపల్లిలో మడకం గంగయ్య అనే వ్యక్తి నులిపురుగుల నివారణ మాత్రలు మింగి మృతి చెందాడు. అదే జిల్లా వీఆర్ పురం మండలం వడ్డిగూడెం పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదాహరణలు మచ్చుకు కొన్ని మాత్రమే. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో ఏ మందులు పనిచేస్తున్నాయో, ఏవి పనిచేయడంలేదో అర్థం కాని పరిస్థితి. మందులు ఉత్పత్తి కాగానే వాటిని ముందుగా ల్యాబొరేటరీకి పంపించి నాణ్యతను నిర్ధారించాక ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయాలి. కానీ ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసి, రోగులు వినియోగించిన తరువాత ల్యాబొరేటరీకి పంపిస్తున్న దుస్థితి నెలకొంది. రాజకీయ నాయకులవైతే శాంపిళ్లు కూడా తీసుకోరు మన రాష్ట్రంలో మందుల నాణ్యతా నిర్ధారణకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డొస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతల మందులను కనీసం నమూనాలు సేకరించేందుకు కూడా ఔషధ నియంత్రణ అధికారులు భయపడుతున్నారు. ఉదాహరణకు గతేడాది స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న ‘సేఫ్’ ఫార్ములేషన్స్ సంస్థ కొన్ని పశువులకు సంబంధించిన మందులు తయారు చేసింది. ఈ మందులు నాసిరకం అని వెటర్నరీ డాక్టర్లు నివేదికలు ఇచ్చినా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించలేదు. మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తయారు చేసిన మందుల పరిస్థితీ ఇంతే. ఇలాంటి మందులు చాలానే ఉన్నాయి. -
మందుల్లో మాయాజాలం
నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు నాసిరకం ఇంజక్షన్ ఘటనతో బహిర్గతం బినామీ పేర్లతో ఎంజీఎం సిబ్బంది టెండర్లు రెండో రోజూ ఔషధ నియంత్రణాధికారుల తనిఖీలు ఎంజీఎం : మందుల కొనుగోలులో మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం) సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. బినామీ పేర్లతో కాంట్రాక్టర్లుగా మారి నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేస్తూ భారీగా దండుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సరఫరా కోసం స్థానికంగా కొనుగోలు చేసిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్ (క్రిమిసంహారక నియంత్రణ ఔషధం) నాసిరకమైందని తెలియడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఔషధ నియంత్రణాధికారులు మంగళవారం కూడా ఎంజీఎం ఆస్పత్రిలోని ఔషధాల విభాగంలో తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా కొనుగోలు చేసిన మరికొన్ని శాంపిల్స్‌ను సేకరించారు. ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందులను సరఫరా చేస్తుంటారు. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో మందుల లభ్యత లేనప్పుడు అత్యవసర బడ్జెట్ నిధులతో టెండర్ ప్రక్రియ ద్వారా స్థానికంగా కొనుగోలు చేసి రోగులకు మందులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌లో మందులు అందుబాటులో లేనప్పుడు 804 రకాల ఔషధ కంపెనీల డ్రగ్స్‌ను మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ, స్టోర్స్ విభాగంలో తిష్ట వేసిన అధికారులు తమ అనుభవాన్ని ప్రదర్శిస్తూ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. క్రిమిసంహారక రసాయనాలు సేవించి వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి కోసం ప్రాలీ డాక్సైమ్ క్లోరైడ్ యాంపిల్స్‌ను వినియోగించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఎంజీఎం ఔషధ విభాగంలోని సిబ్బంది మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా స్థానికంగా లభ్యమయ్యే ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్స్‌ను కొనుగోలు చేశారు. సిబ్బంది ఇష్టప్రకారం కొనుగోలు చేసిన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ యాంపిల్ నాసిరకమైనదని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ మందుల కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయం బయటికిరాకుండా ఔషధ విభాగం సిబ్బంది అన్ని రకాలుగా ప్రయత్నించారు. సెంట్రల్ డ్రగ్స్ నుంచే వీటిని కొనుగోలు చేసినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. సోమవారం ఉదయం అసలు విషయంలోకి వెలుగులోకి వచ్చింది. ఇదే రకంగా ఆస్పత్రి స్టోర్స్ విభాగం సిబ్బంది, కొందరు వైద్య సిబ్బంది తీరుతోనే ఇలా నాసిరకం మందులను ఎంజీఎంలో కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బినామీ పేర్లతో టెండర్లు ఎంజీఎం ఆస్పత్రికిSమందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలలో ఎక్కువగా ఆస్పత్రి సిబ్బందిలోని కొందరు బినామీ పేర్లతోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. ఎంజీఎం సిబ్బందిలో కొందరు.. టెండరు నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఏజెన్సీలను నమోదు చేసి మందుల సరఫరా కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు. లాభం ఎక్కువగా వచ్చే మందులను సరఫరా చేస్తున్నారు. ఇవి నాసిరకమైనవిగా నిర్ధారణ జరుగుతున్నాయి. దీంతో ఎంజీఎంకు వచ్చే పేద రోగుల ప్రాణాలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జనం నెత్తిన నాసిరకం మందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులు రాజ్యమేలుతున్నాయి. రోగం నయమవాలని మందులు కొంటే కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు జరిపిన దాడుల్లో 21 సంస్థలు తయారు చేస్తున్న మందులు నాసిరకం అని తేలింది. వారు తయారు చేస్తున్న మందులు జనం అధికంగా వినియోగించేవే కావడం గమనార్హం. జూలైలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 650 శాంపిల్స్ సేకరించి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ల్యాబొరేటరీలో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 21 మందులు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. వీటిని వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని ఆయా కంపెనీలకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కంపెనీల నాసిరకం మందులను ఎవరూ కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. నాసిరకం మందులివే... ఓంప్రజోల్ (పెంటా ఫార్మస్యూటికల్స్), పాంటాప్రజోల్ (హరి సుజన్), టోల్పెరిసోన్ హెసీఎల్ (జీఎంకే న్యూ ఫార్మా) రైబోఫ్లెవిన్ (రిడ్లీ లైఫ్ సైన్స్) పారాసిటమాల్, డైక్లోఫెనక్ సోడియం (ఎఫిల్ ఫార్మా) డైక్లోఫెనక్, పారసిటమాల్ (మవెన్ లైఫ్ సైన్స్), మెట్‌ఫొర్మిన్ హెచ్‌సీఎల్ (స్కైమ్యాప్ ఫార్మాస్యూటికల్స్) డైక్లోఫెనక్ సోడియం (వాల్టన్, అన్రోస్ ఫార్మా) క్లెపి డోజెల్, ఆస్ప్రిన్ (మార్క్సన్ ఫార్మా), సెట్రిజిన్ డీహైడ్రో క్లోరైడ్ (కొర్టెక్స్ ల్యాబ్), డెక్సామెథాజోన్ (నికెమ్ డ్రగ్స్),సెఫిక్జైమ్ (మైనోఫార్మా), ర్యాన్టిడిన్ (గోపిస్ ఫార్మా), ఓమెప్రజోల్ (జానస్ రెమిడీస్), పారాసిటమాల్ (లాకెమ్), ఓప్లాగ్జిన్ (హిపో ల్యాబ్స్, అన్రోజ్ ఫార్మా) పైరాసెటమ్ (మెడిపోల్ ఫార్మా). -
నాసిరకం మందులపై సీరియస్
* విచారణకు ఆదేశించిన సీఎస్ రాజీవ్ శర్మ * త్వరలో టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీనియామకం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్న తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎంఎస్ఐడీసీ) అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ విచారణకు ఆదేశించారు. ఈ నెల 15న ‘నాసిరకం మందులకు రాజముద్ర’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎస్.. తక్షణమే మందుల కొనుగోలుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన మందులపై పరీక్షలు నిర్వహించారా..? లేదా..? నిర్వహిస్తే వాటి నివేదికలు కూడా సమర్పించాలని సూచించారు. కాగా, తమ బండారం బయటపడకుండా నివేదికలు తారుమారు చేసేందుకు టీఎస్ ఎంఎస్ఐడీసీ అనాలసిస్ విభాగంలోని కొందరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇదిలావుంటే ప్రస్తుతం టీఎస్ ఎంఎస్‌ఐడీసీకి ఎండీగా.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ బాధ్యతలు అదనంగా ఉండటంతో రోజువారీ పర్యవేక్షణ కొరవడుతోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో తక్షణమే పూర్తిస్థాయి ఎండీని నియమించాలని సర్కారు యోచిస్తోంది. యాంటీబయాటిక్స్‌లో వసూళ్ల పర్వం.. తెలంగాణలో యాంటీబయాటిక్స్ మందులు సరఫరా చేసే వారి నుంచి సంబంధిత విభాగాల అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. యాంటీబయాటిక్స్ సేకరణ (ప్రొక్యూర్మెంట్) చూసే ఓ ఫార్మసిస్ట్ 2 శాతం కమీషన్ ఇస్తేనే ఆర్డరు ఇస్తామని నిక్కచ్చిగా చెబుతున్నారు. అలాగే, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లుగా విధులు నిర్వహించాల్సిన కొందరు టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో పనిచేస్తున్నారు. వాస్తవానికి ఈ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ఉన్నతాధికారుల అండతో సదరు ఫార్మసిస్టులు లాభసాటిగా ఉంటోందని టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. వీళ్లపై వైద్యవిధానపరిషత్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీనిపైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. -
మందులోడా.. ఓరి మాయలోడా!
ప్రజలకు నాసిరకం మందులు అందిస్తున్న ఏపీఎంఎస్ఐడీసీ ఏడాదిలో నాసిరకం అని తేల్చిన మందులు 23 రకాలు ఆర్టీఐ దరఖాస్తుతో అవినీతి బట్టబయలు హైదరాబాద్: రోగులకు నాణ్యమైన మందులను సరఫరా చేయాల్సిన సర్కారే నాసిరకం మందులు మింగిస్తూ వారి ప్రాణాలతో ఆడుకుంటోంది. మందుల సరఫరాదార్లతో కుమ్మక్కైన అధికారులు నాసిరకం మందులను ఇష్టారాజ్యంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. అవి నాసిరకమని పరీక్షల్లో తేలినా వెనక్కు తెప్పించలేదు, ఒక్క కంపెనీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు. పైగా ఆ మందులు మంచివని డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సర్టిఫికెట్లు ఇప్పించి మరీ ప్రజలతో మింగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీ) సీలో జరిగిన ఈ భారీ అవినీతి ‘సాక్షి ప్రతినిధి’ సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ)ద్వారా సేకరించిన సమాచారంతో బట్టబయలైంది. ఏపీఎంఎస్ఐడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2014లో సరఫరా చేసిన మందుల్లో 23 రకాల మందులు నాసిరకం అని తేలాయి. ఇందులో రోజూ లక్షలాది మంది బీపీకి వాడే అటెన్‌లాల్ ఐపీ 50 ఎంజీ, కడుపునొప్పి నియంత్రణకు వాడే డైసైక్లోమైన్ 10 ఎంజీ తదితర మందులను ఎలాంటి పరీక్షలు లేకుండానే జనంలోకి పంపుతున్నారు. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, తూర్పు గోదావరి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ వినియోగమైనట్టు తేలింది. అవినీతి బట్టబయలు సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని వివరాలు సేకరించగా, అధికారులు, కాంట్రాక్టర్ల బండారం బయటపడింది. ఇలాంటివి కొన్ని పరిశీలిస్తే.... ►రక్తపోటు నియంత్రణకు ఉపయోగించే అటెన్‌లాల్ 50 ఎంజీ ట్యాబ్లెట్ (గ్రీన్‌ల్యాండ్ ఆర్గానిక్స్) బీటీహెచ్ అనే లేబరేటరీకి పరీక్షలకు పంపిస్తే 2013 ఫిబ్రవరి 4న నాసిరకం అని తేలింది. అయితే అదేనెల 18వ తేదీన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్తో నాణ్యమైనవని చెప్పించుకుని మందుల సరఫరా కొనసాగించారు. ► కడుపునొప్పి నియంత్రణకు ఉపయోగించే డైసైక్లోమైన్ 10 ఎంజీ మాత్రలు డీసీఎల్ లేబరేటరీకి పంపించగా 2013 జులై 15న నాసిరకం అని తేలింది. ఆ తర్వాత దీన్ని కోల్‌కతాలోని సీడీఎల్‌కు లేబరేటరీకి పంపించి మంచివని తేల్చారు. ►మానసిక రోగులకు ఇచ్చే కార్బమొజెపైన్100 ఎంజీ మాత్రలు డీసీఎల్ లేబరేటరీకి పరిశీలనకు పంపిస్తే 2013 జులై 25న నాసికరం అని తేల్చా రు. కానీ ఈ కంపెనీని ఎందుకు బ్లాక్‌లిస్టులో పెట్టలేదని ఆర్టీఐ కింద అడిగితే.. 14 నెలలుగా ఫైలు సర్క్యులేషన్లో ఉందని సమాధానమిచ్చారు. ► పెయిన్ కిల్లర్‌గా వాడే డైక్లొఫినాక్ సోడియం 50 ఎంజీ మాత్రలు నాసిరకమని 2013జులై 25న డీసీఎల్ లేబరేటరీ తేల్చింది. ఈ కంపెనీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే విషయంలో 14 నెలలుగా ఫైలు ప్రాసెస్‌లో ఉందని చెబుతున్నారు. ►పైన పేర్కొన్న అన్ని మాత్రలు నాసిరకం అని తేలాక కూడా ఆ బ్యాచ్‌లకు సంబంధించిన ఒక్క మాత్రను వెనక్కు తెప్పించకపోగా, అన్నిటినీ రోగులకు ఇచ్చారు.