Infrastructure Industry Group
-
మౌలిక రంగం భేష్
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించింది. మౌలిక రంగం సమీక్షా నెల్లో 12.1 శాతం వృద్ధిని (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 14 నెలల్లో (2022 జూన్‌లో వృద్ధి రేటు 13.2 శాతం) ఈ స్థాయి భారీ వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. సిమెంట్ (18.9 శాతం), బొగ్గు (17.9 శాతం), విద్యుత్ (14.9 శాతం), స్టీల్ (10.9 శాతం), సహజ వాయువు (10 శాతం) రంగాలు రెండంకెల్లో వృద్ధి సాధించగా, రిఫైనరీ ప్రొడక్టులు 9.5 (శాతం), క్రూడ్ ఆయిల్ (2.1 శాతం), ఎరువుల (1.8 శాతం) రంగాల్లో వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎనిమిది రంగాల వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. మ్తొతం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. -
మౌలిక రంగం స్వల్ప ఊరట...
♦ ఆగస్టులో 3.2% వృద్ధి నమోదు ♦ జూన్‌తో పోల్చితే 20 బేసిస్ పాయింట్లు అధికం ♦ 2015 ఇదే నెలతో చూస్తే... అక్కడక్కడే న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్- ఆగస్టులో స్వల్ప ఊరట నిచ్చింది. వృద్ధి 3.2 శాతంగా నమోదయ్యింది. జూలై నెలతో పోలిస్తే ఇది కేవలం 20 శాతం అధికం. అంటే జూలైలో ఈ వృద్ధి రేటు 3 శాతం మాత్రమే. ఇక 2015 ఆగస్టుతో పోల్చితే ఈ వృద్ధి రేటులో ఎటువంటి మార్పూ లేదు. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా 38 శాతం. ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం... క్రూడ్ ఆయిల్: వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. 2015 ఇదే నెలలో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -3.9 శాతం క్షీణత నమోదయ్యింది. సహజ వాయువు: ఈ రంగం కూడా -5.7 శాతం క్షీణత నుంచి 3.7 శాతం వృద్ధిబాట పట్టింది. రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధిరేటు 3.5 శాతం నుంచి 5.8 శాతానికి ఎగసింది. సిమెంట్: ఈ రంగంలో వృద్ధి 3.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది. విద్యుత్: 0.1% స్వల్ప వృద్ధి నుంచి 5.6 శాతం లాభాల బాటకు చేరింది. ఎరువులు: వృద్ధి రేటు భారీగా 5.7% నుంచి 13.8 శాతానికి చేరింది. బొగ్గు: -9.2% క్షీణత, స్వల్పంగా 0.5% వృద్ధికి మళ్లింది. మైనస్‌లో ఒకటి... స్టీల్: ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా -3.3 క్షీణత నమోదయ్యింది. 2015 ఇదే నెలలో ఈ రంగం 17% వృద్ధిలో ఉంది. -
జూన్‌లో మౌలిక వృద్ధి 3 శాతమే..
న్యూఢిల్లీ : ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జూన్‌లో నిరాశను మిగిల్చింది. 2014 జూన్‌లో జరిగిన ఉత్పత్తితో పోల్చి చూస్తే... కేవలం 3 శాతమే వృద్ధి నమోదయింది. అదే 2013తో పోల్చినపుడు 2014 జూన్‌లో ఈ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండటం గమనార్హం. గత నెల అంటే 2015 మేలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో 4.4 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా... జూన్‌లో 3 శాతానికే పరిమితమయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4న పాలసీ సమీక్ష సందర్భంగా మరో దఫా రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఎనిమిది రంగాల పరిస్థితినీ వేర్వేరుగా చూస్తే... ఒక్క రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు మినహా మిగిలినవన్నీ నిరాశను కలిగించాయి. ఈ కీలక రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల(ఏప్రిల్-జూన్) వృద్ధి రేటును 2014 నాటి ఇదే కాలంతో పోలిస్తే 6% నుంచి 2.4 శాతానికి పడిపోయింది. -
మౌలిక రంగం హై జంప్...
- మేలో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.4 శాతం - ఆరు నెలల గరిష్ట స్థాయి - బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టుల దన్ను న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ మే నెలలో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుంది. గ్రూప్ వృద్ధి రేటు 4.4 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 మే నెలతో పోల్చితే 2015 మే నెలలో ఈ పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి విలువ 4.4 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరు నెలల్లో ఎన్నడూ సాధించనంత వృద్ధి రేటు మేలో నమోదుకావడం విశేషం. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తుల్లో చక్కటి పనితీరు మొత్తం ఫలితంపై సానుకూల ప్రభావాన్ని చూపింది. కాగా సహజ వాయువు విభాగంలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత కొనసాగుతోంది. పైగా ఈ క్షీణ రేటు మరింత పెరిగింది. 2014 మే నెలలో గ్రూప్ వృద్ధి రేటు అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3.8 శాతం. వార్షికంగా ఎనిమిది విభాగాల్లో వృద్ధి రేటు తీరును చూస్తే... బొగ్గు: ఉత్పత్తి రేటు 5.5 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది. ముడి చమురు: 0.3 శాతం క్షీణ బాట నుంచి 0.8 శాతం వృద్ధికి మారింది. సహజ వాయువు: 2.2 శాతం క్షీణత (మైనస్) మరింతగా 3.1 శాతం క్షీణతలోకి జారింది. రిఫైనరీ ప్రొడక్టులు: 1.8 క్షీణ బాట నుంచి భారీగా 7.9 శాతం వృద్ధి బాటన పట్టింది. ఎరువులు: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 17.6 శాతం నుంచి 1.3 శాతానికి పడింది. స్టీల్: వృద్ధి రేటు 3.3% నుంచి 2.6 శాతానికి తగ్గింది. సిమెంట్: వృద్ధి 8.4% నుంచి 2.6 శాతానికి దిగింది. విద్యుత్: వృద్ధి రేటు 6.7% నుంచి 5.5%కి పడింది. ఏప్రిల్, మార్చి నెలల్లో క్షీణతే... మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 38 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది రంగాల గ్రూప్ గడచిన మార్చి, ఏప్రిల్ నెలల్లో అసలు వృద్ధి సాధించలేదు. ఈ రెండు నెలల్లో 0.1 శాతం, 0.4 శాతం చొప్పున క్షీణించాయి. మే మంచి ఫలితం వల్ల ఏప్రిల్, మే నెలల్లో ఎనిమిది రంగాల వృద్ధి 2.1%గా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలల్లో ఈ వృద్ధి 4.7 శాతం. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ రంగాల వృద్ధి రేటు 3.5 శాతం. కాగా మే నెలలో వృద్ధిరేటు పారిశ్రామిక క్రియాశీతను సూచిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది.