inspiraton
-
కేజీఎఫ్ రాకీభాయ్ స్ఫూర్తితో.. శివప్రసాద్ వరుస హత్యలు
కలకలం రేపిన సెక్యూరిటీ గార్డుల వరుస హత్యల ఉదంతాన్ని.. త్వరగతినే చేధించారు మధ్యప్రదేశ్ పోలీసులు. కన్నడ సెన్సేషనల్ చిత్రం కేజీయఫ్ స్ఫూర్తితోనే తాను హత్యలు చేశానని, రాకీ భాయ్లా పేరు సంపాదించుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిందితుడు శివ ప్రసాద్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ వరుస హత్యల ఉదంతంలో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇప్పుడు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పరిధిలో వరుసగా సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురికావడం.. సంచలనం సృష్టించింది. నిద్రిస్తున్న వాళ్లను అతికిరాతకంగా హత్య చేశాడు 19 ఏళ్ల శివ ప్రసాద్. కేజీఎఫ్ చిత్రంలో లీడ్ రోల్ రాకీ భాయ్ తరహాలో ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ హత్యలు చేసినట్లు శివ ప్రసాద్ పోలీసుల ముందు వెల్లడించాడు. ఎలా దొరికాడంటే.. నిక్కరు, షర్టులో ఉన్న హంతకుడు.. ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. మార్పుల్ రాడ్‌తో ముందుగా బాధితుడిపై వేటు వేసి.. చనిపోయాడా? లేదా? నిర్ధారించుకుని.. బతికే ఉండంతో బండ రాయితో బాది మరీ చంపడం ఆ వీడియోలో ఉంది. అయితే అంతకు ముందు చంపిన వాళ్లలో ఒకరి సెల్‌ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు నిందితుడు శివ ప్రసాద్. ఈ తరుణంలో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు శివను ట్రేస్ చేసి.. శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. రాకీభాయ్‌లా ఎదగాలనే.. కేజీఎఫ్ సినిమా స్ఫూర్తితోనే తాను ఈ హత్యలు చేశాడని, అందులో ప్రధాన పాత్ర రాకీ భాయ్లా తాను ఎదిగి.. పేరు తెచ్చుకోవాలనే హత్యలు చేశాడని, ఈ క్రమంలో పోలీసులను తర్వాతి లక్ష్యంగా చేసుకున్నట్లు శివ ప్రసాద్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తరుణ్ నాయక్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాతే పోలీసులను లక్ష్యంగా చేసుకుని తన సత్తా చూపించాలని అనుకున్నాడట. ఇదిలా ఉంటే.. భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ఏరియాలో శివ ప్రసాద్ వరుసగా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను హత్య చేసుకుంటూ పోయాడు. ఆగస్టు 28వ తేదీన సుత్తితో కళ్యాణ్ లోధీ అనే సెక్యూరిటీ గార్డును చంపాడు. ఆ మరుసటి రాత్రి శంభు నారాయణ దూబే అనే కాలేజీ సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి చంపేశాడు. ఆ మరుసటి రాత్రి ఓ ఇంటి వాచ్మెన్ అయిన మంగల్ అహిర్వర్ను చంపేశాడు. ఆపై ఒక్కరోజు గ్యాప్‌తో గురువారం రాత్రి సోను వర్మ అనే సెక్యూరిటీ గార్డును అతను కాపాలా ఉండే మార్బుల్ కంపెనీలోనే దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడం.. బాధితుల సెల్‌ఫోన్ వాడడంతో సిగ్నల్ ఆధారంగా మరుసటి రోజు ఉదయమే భోపాల్‌లో దొరికిపోయాడు శివ ప్రసాద్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk — Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022 గతంలోనూ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను శివ ప్రసాద్ హత్య చేసినట్లు తేలింది. ఈ మే నెలలో ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డును దారుణంగా చంపేసి.. అతని ముఖంపై ఓ బూట్‌ను ఉంచేసి వెళ్లిపోయాడు. అనంతరం జూన్ చివరి వారంలోనూ ఓ హత్య చేశాడు. అప్పటి నుంచి ‘స్టోన్ మ్యాన్’ భయం మొదలైంది. తాజాగా వరుస హత్యల నేపథ్యంలో హోం మంత్రి నరోత్తం మిశ్రా స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసును త్వరగతిన చేధించగలిగారు పోలీసులు. అతని దగ్గర దొరికిన ఆధార్‌కార్డ్ వివరాల ప్రకారం..శివ ప్రసాద్ స్వస్థలం సాగర్ జిల్లా కేస్లీ. తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదు. కాకపోతే ఎనిమిదో తరగతి దాకా చదువుకుని.. గోవాలో కొంతకాలం పని చేశాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. కేజీఎఫ్-2 చిత్రం చూశాక.. ఆ చిత్రంలో రాఖీలా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశాడట. అంతకు ముందు హంతకుడి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.. 30వేల రూపాయల రివార్డు ప్రకటించారు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై మాత్రం నిందితుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: నాన్నా.. వాడు అమ్మను రైలు నుంచి తోసేశాడు -
వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్!
పాట్నా: నిరుద్యోగంపై ఎదురు తిరిగి.. చివరకు సొంతంగా చాయ్ దుకాణం పెట్టిన ప్రియాంక కథ.. ఇంటర్నెట్లో ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. రెండేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆమె టీ స్టాల్ పెట్టుకుని.. గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడామె ఆ స్టాల్‌ను మూసేసింది. ఆగండి.. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్ చాయ్వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్‌ను అందించారు. దీంతో టీ స్టాల్‌ను ఎత్తేసిన ప్రియాంక.. ఫుడ్ ట్రక్‌ను కొందరు స్టాఫ్‌తో కలిసి నడిపిస్తోంది. తక్కువ టైంలో ఎదిగిన ఆమె కథతో సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది. Bihar: Priyanka Gupta, an economics graduate sets up a tea stall near Women's College in Patna I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK — ANI (@ANI) April 19, 2022 -
ఎంత పని చేశావ్ ‘పుష్ప’.. సినిమా చూసి చంపేశారు
ఢిల్లీ: జనాల మీద సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. సందేశాత్మక చిత్రాల్లోనూ సరదాను వెతుక్కనే స్వభావం మన సగటు ఆడియొన్స్ది. పైగా ‘సినిమాలోని సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలే. అనుకరించకండి’ అంటూ సినిమా ముందు వచ్చే విజ్ఞప్తులను పట్టించుకునేవాళ్లు కనిపించరు!. ప్రత్యేకించి అందులోని ఘట్టాల అనుకరణ.. సరదా వరకైతే పర్వాలేదు. అదే సీరియస్ మలుపు తీసుకుంటే.. దేశ రాజధాని పరిధిలో జరిగిన ఓ నేరం ఇప్పుడు ‘సినిమా ఇచ్చే సందేశం’ గురించి చర్చనీయాంశంగా మారింది. న్యూఢిల్లీ జహంగీర్‌పురిలో జరిగిన ఓ హత్య కేసు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ సినిమాతో పాటు ఓ హిందీ వెబ్ సిరీస్ స్ఫూర్తితో నేర ప్రవృత్తిలోకి దిగామంటూ ముగ్గురు టీనేజర్లు స్టేట్మెంట్ ఇవ్వడం కలకలం రేపింది. నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ బస్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్లలో ఒకడు ‘బద్నాం’ పేరుతో ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ఏరియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో తరచూ ఇతరులకు దమ్కీ ఇస్తూ.. ఆ ఘటనలను షార్ట్ వీడియోలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప’ సినిమా చూసిన ఆ గ్యాంగ్.. అందులో పుష్పరాజ్‌లా ఎదగాలనే ప్లాన్‌వేసింది. ఇందుకోసం అటుగా వెళ్తున్న ఓ అమాయకుడిని ఎంచుకుంది. ఆ యువకుడిని చావబాదుతూ.. ఆ వీడియోను రికార్డు చేశారు. వాళ్లను చెదరగొట్టి.. కొనఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో ఆ వ్యక్తి మృతి చెందగా.. బాధితుడిని 24 ఏళ్ల శిబుగా గుర్తించారు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమను తాము ప్రమోట్ చేసుకునే ఉద్దేశంతో, గ్యాంగ్స్టర్లుగా ఎదగాలన్న ఉద్దేశంతో పుష్ప సినిమాను, బౌకాల్ సిరీస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని, వాటిల్లో హీరోల మాదిరిగా ఎదిగే ప్రయత్నం చేశామని చెప్పడంతో కంగుతినడం పోలీసులు వంతూ అయ్యింది. ఈ నేరంలో ముగ్గురు మైనర్లు కావడం విశేషం. -
వెంటిలేటర్ నుంచి.. కూతురి కౌగిలికి చేరిన స్వప్న
కరోనాతో చనిపోయిన కథనాలు, చనిపోయినవాళ్లను అంత్యక్రియలు చేసే వార్తలు జనాలకు భయాన్ని పుట్టిస్తున్నాయి. కానీ, ధైర్యంగా పోరాడి చావును జయించిన స్వప్న తరహా కథనాలు అందరికీ తెలియాలని ఆమె భర్త అశిష్ కోరుకుంటున్నాడు. ముంబై: నెలన్నరపాటు ఆస్పత్రిలో బెడ్‌పై.. పూర్తిగా చెడిపోయిన ఊపిరితిత్తులు.. ఇరవై ఐదు రోజులపాటు వెంటిలేటర్ పై.. అది కూడా 100 శాతం కెపాసిటీతో ట్రీట్మెంట్ తీసుకుంది నాగ్‌పూర్ కు చెందిన 35 ఏళ్ల స్వప్న. ఆమె బతకడం కష్టమని డాక్టర్లు తేల్చడంతో ఆశలు వదులుకున్నారు అంతా. కానీ, ఆమె మాత్రం పోరాడింది. కరోనాను ఓడించి నవ్వుతూ కూతురి కౌగిలికి చేరుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన గృహిణి స్వప్న ఏప్రిల్ 19న కరోనాతో క్రిమ్స్ హాస్పిటల్లో చేరింది. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా తయారైంది. ఇరవై ఐదు రోజులపాటు వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్ తీసుకుంది. బతకడం ఇక కష్టమనుకున్న టైంలో అనుహ్యాంగా ఆమె కోలుకుంది. ‘ ఐదేళ్ల నా కూతురు లోరినానే నా ప్రేరణ. ఆమే నాకు బలానిచ్చింది. చావును జయించాలని పదే పదే గుర్తు చేస్తూ ఆమె నాకు ధైర్యాన్ని పంచింది’ అని చెప్తోంది స్వప్న రసిక్. కచ్చితంగా ఇదొక అరుదైన కేసు. అన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి బతకడం నిజంగా అద్భుతం. కూతురి మీద ప్రేమే ఆమెను బతికించింది అని స్వప్నకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ పరిమల్ దేశ్‌పాండే చెప్తున్నారు. -
పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి నిలిచిపోతుంది
సూరత్ : కొందరు చావు పేరు చెబితేనే ఆమడ దూరం వెళ్లిపోతారు. మరికొందరు చావు పేరు వింటేనే మా గుండెల్లో దడ మొదలవుతుంది అంటారు. మరీ అలాంటిది ఒక మహిళ మాత్రం కొద్దిరోజుల్లో తాను మరణిస్తానన్న విషయం తెలిసినా ఏ మాత్రం అధైర్యపడకుండా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ఎంచుకున్నారు. ఆమె గుజరాత్‌కు చెందిన 27ఏళ్ల శ్రుచి వదాలియా.. గుజరాత్‌లోని సూరత్ సిటీకి వెళ్లి అడిగితే ఎవరైనా ఈమె గురించి వివరిస్తారు. మరి ఆమె కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 'చనిపోయేలోగా నేను నాటిన మొక్కల ద్వారా కొంతమేరకైనా వాయు కాలుష్యాన్ని తగ్గించాలనుకుంటున్నట్లు' శ్రుచి వదాలియా పేర్కొంటున్నారు. శ్రుచి వదాలియాకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రెయిన్ ట్యూమర్ సోకింది. ఇప్పుడామే తన జీవితంలో చివరి దశకు వచ్చేసింది.. అంటే కొన్ని రోజుల్లో ఈ లోకం విడిచివెళ్లనుంది. అయినా ఆమె ఏమాత్రం బెదరకుండా తాను చనిపోయేలోగా సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించింది. తనకు బ్రెయిన్ ట్యూమర్ రావడానికి వాయు కాలుష్యం కూడా ఒక కారణమని భావించిన శ్రుచి వదాలియా తాను చనిపోయేలోగా వీలైనన్ని మొక్కలు నాటి ప్రమాదకర కాన్సర్‌తో పాటు, కొంతమేరైనా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చని నిర్ణయించుకొంది. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మంచి చేయడంతో పాటు ప్రమాదకర కాన్సర్‌ను నివారించే అవకాశం ఉందని శ్రుచి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు సంవత్సరాలలో 30వేలకు పైగా మొక్కలు నాటడమే గాక మిగతవారిని కూడా ఆ పని చేయమని ప్రోత్సహిస్తున్నారు. 'నేను చనిపోతానని నాకు తెలుసు. కానీ నేను పెంచే మొక్కల ద్వారా వచ్చే గాలిని పీల్చే శ్వాసలో నా పేరు ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు. నాలాగా ఎవరు ఈ వ్యాధికి గురవకూడదనేదే నా ప్రయత్నం. అందుకే వీలైనన్ని మొక్కలను పెంచి నా వంతుగా పర్యావరణానికి మేలు చేస్తున్నానని' శ్రుచి వదాలియా భావోద్వేగంతో తెలిపారు. శ్రుచి వదాలియా సూరత్‌లోని ప్రతీ పాఠశాలలకు తిరిగి ఒక్కో పిల్లాడి చేత మొక్కను నాటించి పర్యావరణాన్ని కాపాడే భాద్యతను ఎత్తుకున్నారు. -
కూలీ టు ప్రొఫెసర్
సాక్షి, కరీంనగర్ : ఆర్థిక స్థోమత లేక చిన్నతనం నుంచి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ సర్కారు విద్యనభ్యసించాడు. స్థానికంగా రెసిడెన్షియల్ కళాశాలలు లేవని డబ్బులు కట్టే స్థోమత లేక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ వెళ్లి డిగ్రీ చదివాడు. మొదట ఫెయిలయినా పట్టుపట్టి పాసయ్యాడు. ఇక జీవితంలో విఫలమవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అతను సాధించిన విజయాలకు బ్రేక్ లేకుండా పోయింది.వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట ఎన్ఎస్ఎస్ అధికారిగా పనిచేసి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందాడు సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన రాజు. ఆర్థిక ఇబ్బందుల మధ్యే చదువులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన రాజు అమ్మనాన్నలు దేవయ్య, వెంకటమ్మ. నలుగురు అన్నదమ్ముల్లో రాజు చిన్నవాడు. చిన్నతనంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కొంచెం పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి భవననిర్మాన కూలీ పనికి వెళ్లేవాడు. పదోతరగతి పెంబట్లలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 1996లో పూర్తిచేశాడు. ఇంటర్ మేడిపల్లిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 1998లో, కర్నూల్లోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ (బయోకెమిస్ట్రీ–జువాలజీ–కెమిస్ట్రీ)గ్రూపులో చేరాడు. మొదట ఫేయిలయ్యాడు. తర్వాత కష్టపడి చదివి 2001లో ఉత్తీర్ణుడయ్యాడు. 2003–04లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశాడు. 2005–07లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేశాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీలో ఫెయిల్ అయిన రాజుకు చిన్నతనం నుంచి తను అనుభవిస్తున్న అర్థిక పరిస్థితులు పాఠాలు నేర్పాయి. జీవితంలో ఫెయిల్‌కావద్దని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2007లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా, 2009లో నెట్‌లోఅర్హత సాధించాడు. 2011లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో చేరాడు. ఆ తర్వాత 2012 జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది కానీ వెళ్లలేదు. సేవల్లోనూ రా‘రాజు’ రాజు 2013లో ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా «ఎంపికయ్యాడు. 2015లో మానవవిలువల పరిరక్షణ సమితి ద్వారా విశిష్టసేవా పురస్కారం సాధించాడు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్, రక్తదానాల కార్యాక్రమాలు నిర్వహించి 2016లో జిల్లా ఉత్తమ ఎన్ఎస్ఎస్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అధికారి అవార్డును మంత్రి ఈటల రాజేందర్‌చేతుల మీదుగా అందుకున్నాడు. కళాశాల విద్యాశాఖ యువతరంగం ద్వారా 2017–18 సంవత్సరానికి ఉన్నత విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్’ అవార్డు పొందాడు. ప్రస్తుతం ఎస్సారార్ కళాశాలలో ఎన్సీసీ అధికారిగా సేవలందిస్తున్నాడు. కష్టపడితేనే విజయం జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. డబ్బులు లేక అమ్మనాన్నలతో కలిసి కూలీకి వెళ్లా. చిన్ననాటి నుంచి రెసిడెన్షియల్‌లోనే చవివా. డిగ్రీ ఫెయిల్ కావడంతో బాధపడ్డాను. అప్పటి నుండి ఇక ఎప్పుడూ ఫేయిల్ కాలేదు. మూడు ఉద్యోగాలు వచ్చాయి. డిగ్రీ లెక్చరర్‌గా ఎస్సారార్‌లో జాయిన్ అయ్యాను. విద్యార్థులు కోర్సుల్లో ఫెయిలై చాలా మంది ఆత్యహత్యలు చేసుకోకూడదు. ఓపికతో కష్టపడి ముందుకు సాగితే విజయం వరిస్తుంది. – పర్లపల్లి రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
సివిల్స్‌లో మెరిసిన గిరిజన వజ్రం
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ప్రవీణ్ నాయక్. సివిల్ సర్వీసెస్–2018 ఫలితాల్లో వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్ ప్రవీణ్‌నాయక్ 610 ర్యాంక్‌ను సాధించాడు. నునావత్ భీమా నాయక్–రాజమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు ప్రవీణ్ నాయక్ ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో చదువుకున్నాడు. పదో తరగతి పూర్తికాగానే 2008 సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(ఎంపీసీ), అనంతరం వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్ని నెలల పాటు కోచింగ్ తీసుకున్న ప్రవీణ్ నాయక్ 2016 సివిల్స్ మెయిన్స్‌లో తప్పాడు. రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించాడు. 2018 సంవత్సరానికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ కమిషన్) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వూలు నిర్వహించగా అందులో ప్రవీణ్నాయక్కు 610 ర్యాంక్ సాధించాడు. సంతోషంగా ఉంది.. నా కుమారుడు సివిల్స్ సాధించడం చాల సంతోషంగా ఉంది. మాది చాలా పేద కుటుంబం. మా తండాల్లో ఎర్రమట్టి విక్రయాలే జీవనాధారం. మా తండ్రి నునావత్ బిక్యా–బూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాన్న ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు. ప్రస్తుతం మా ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు ఆటో డ్రైవర్‌గా, మరో తమ్ముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను పదో తరగతి వరకు ముల్కనూర్‌లో చదువుకున్నాను. 1996 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ కామర్లో ఫ్యూన్‌గా ఉద్యోగం లభించింది. నాకు కుమారుడు ప్రవీణ్‌తో పాటుగా కూతురు నవ్య సంతానం. నవ్య ఇప్పుడు డిగ్రీ చదువుతోంది. – భీమా నాయక్, ప్రవీణ్ నాయక్ తండ్రి పేపర్ చదవడం వల్లే సివిల్స్ సాధించాను.. మాది పేద కుటుంబం.. సివిల్స్ చదవాలనే తపన ఇంటర్మీడియట్లోనే కలిగింది. అప్పటి నుంచి అందే సంకల్పంతో బీటెక్ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. అయిప్పటికీ స్వతహాగా నోట్స్ తయారు చేసుకున్నాను. ఇతర పుస్తకాలతోపాటు నిత్యం పేపర్ చదివాను. సివిల్స్ సాధించడానికి ఇవి తోడ్పడ్డాయి. పేపర్ చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిత్యం 8 నుంచి 10 గంటలు ప్రిపేరయ్యాను. ఆశయం ఉంటే లక్ష్యం సాధించడం కష్టమేమి కాదు. – నునావత్ ప్రవీణ్ నాయక్ -
దారి నడుమ హరిత పతాకాలు
జాతీయ రహదారికి పచ్చదనాన్ని అద్దుతున్న యువ నర్సరీరైతు డివైడర్‌పై స్వచ్ఛందంగా మెుక్కలు నాటుతున్న శ్రీనివాసరావు కడియపులంక–బుర్రిలంకల మధ్య 500 ఫాక్స్‌టైల్ మెుక్కలు ఆయన స్ఫూర్తితో ముందుకొస్తున్న ఇతర రైతులు కడియపులంక (కడియం) : కడియపులంక–బుర్రిలంకల మధ్య 16వ నంబరు జాతీయ రహదారిపై రెండురోజుల క్రితం ప్రయాణించిన వారు.. తిరిగి ఇప్పుడు ఆ దారిన వస్తే కళ్లింతలు చేసుకుని ఆశ్చర్యపోవలసిందే. కారణం.. రెండురోజుల వ్యవధిలోనే రహదారి సెంట్రల్ డివైడర్‌పై హరితకేతనాల్లా అంతెత్తున వెలసిన ‘వృక్షాలే’! అవును..మెులకలూ, మెుక్కలూ కాక.. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆరడుగుల నుంచి 15 అడుగుల ఎత్తు వరకూ ఉండే భారీ మెుక్కలు బారులు తీరాయి. సువిశాలమైన బాటకు సరికొత్త సోయగాలు అద్దాయి. ఆ పచ్చనికేతనాల్ని దారి నడుమ పొదిగిన వాడు ఓ యువకుడు. ఉద్యానవనసీమగా విఖ్యాతి గాంచిన కడియం ప్రాంతంలో ఆ పసిమీ, మిసిమీ నర్సరీల్లో తప్ప మిగిలిన చోట్ల కానరావేమన్న ఇతర ప్రాంతాల వారి ప్రశ్నే అతడిలో ఈ సంకల్పానికి బీజం వేసింది. కడియపులంకకు చెందిన శ్రీలక్ష్మీ నారాయణ నర్సరీ గార్డెన్స్ అధినేత తిరుమలశెట్టి గంగరాజు కుమారుడు శ్రీనివాసరావు.. కడియపులంక–బుర్రిలంకల నడుమ జాతీయ రహదారి డివైడర్‌పై శుక్రవారం నుంచి ఫాక్స్‌టైల్ మెుక్కలను నాటుతున్నారు. రెండూళ్ల నడుమా ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఇలా 500 మెుక్కలను నాటాలన్నది తన లక్ష్యమని శ్రీనివాసరావు చెప్పారు. ప్రశ్నతో మెులకెత్తిన ఆలోచన ఎక్కడెక్కడి నుంచో కడియపులంక ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ ప్రాంతంలో నర్సరీల్లో తప్పితే ఇతర చోట్ల మొక్కలు లేకపోవడాన్ని గురించి ప్రశ్నించేవారు. వారి ప్రశ్న సబబేనని భావించిన శ్రీనివాసరావులో ఆ లోటు తీర్చడానికి తన వంతు కృషి చేయాలన్న పట్టుదల పెరిగింది. కడియపులంక–బుర్రిలంకల మధ్య హైవే డివైడర్ వెంబడి మొక్కలను నాటి సుందరీకరించాలనుకున్నారు. ఆయన ఆలోచనను తండ్రి గంగరాజు, స్నేహితులు మెచ్చి వెన్నుతట్టారు. వెంటనే కార్యరంగంలో దిగిన శ్రీనివాసరావు శుక్రవారం మెుక్కలు నాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నాటుతున్న ఫాక్స్‌టైల్ మెుక్కలు ఒక్కోటీ రూ.600 ఖరీదైనవి. తమ నర్సరీల్లో ఉన్న ఆ రకం మెుక్కలు చాలకపోవడంతో ఇతర నర్సరీల నుంచీ కొనుగోలు చేసి తెచ్చి మరీ కూలీలతో నాటిస్తున్నారు. శ్రీనివాసరావు పూనుకుని చేస్తున్న బృహత్కార్యక్రమం తోటి నర్సరీ రైతులను ఆకర్షించింది. ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, స్థానిక నర్సరీ రైతులు మల్లు పోలరాజు, నాగిరెడ్డి రామకృష్ణ, పెనుమాక కొండయ్య, కర్రి ఎస్సయ్య తదితరులు శ్రీనివాసరావును కలిసి అభినందించారు. రహదారి రమణీయ బృందావనమవుతుంది.. దేశం నలుమూలలకు మొక్కలను ఎగుమతి చేసి, పచ్చదనం నింపడంలో కడియం ప్రాంత ప్రజల కృషి ఎనలేదనిది. అయితే మన ప్రాంతంలో నర్సరీల్లో కనిపించే పచ్చదనం, వన్నెల్లో కొంత శాతమైనా.. బయట కనిపించకపోవడం నిజమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఇదే విషయంపై ప్రశ్నించేవారు. దాంతోనే నాకీ సంకల్పం కలిగింది. తొలి విడతగా కడియపులంక – బుర్రిలంక గ్రామాల మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. ఒక్కోటీ రూ.600 విలువైన 500 మొక్కలు అవసరమవుతాయని అంచనా వేసాం. ఇందుకోసం సుమారు రూ.మూడు లక్షల వరకు ఖర్చవుతుంది. ఇలా మొక్కలు నాటుదామన్న ఆలోచన పలువురు నర్సరీ రైతులకు ఉన్నా వివిధ కారణాలతో ముందుకు రాలేకపోయారు. అయితే ఇప్పుడు నన్ను చూసి వాళ్ళు కూడా ఉత్సాహపడుతున్నారు. కడియం మండలం వేమగిరి నుంచి ఆలమూరు మండలం మడికి గ్రామం వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర హైవే డివైడర్‌ను సుందరీకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాము కూడా మొక్కలు నాటేందుకు తోడ్పాటునందిస్తామని చెబుతున్నారు. వారందరూ చెÄæ్యూ వేస్తే హైవే అందమైన బృందావనంగా మారిపోతుంది. – తిరుమలశెట్టి శ్రీనివాసరావు