intelligence alert
-
రైల్వే ట్రాక్‌లను పేల్చేసేందుకు ఐఎస్ఐ కుట్ర
న్యూఢిల్లీ: మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఐఎస్ఐ పెద్ద కుట్ర పన్నిందని తెలిపాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి. గూడ్స్ రైళ్లే టార్గెట్ సరకు రవాణా రైళ్లను ధ్వంసం చేయడానికి పంజాబ్‌తోపాటు పరిసర రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్ఐ ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారతదేశంలోని తన కార్యకర్తలకు ఐఎస్ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని వెల్లడించాయి. భారత్‌లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందని వివరించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఎగదోత ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్‌లో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది. పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. భద్రత కట్టుదిట్టం నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. (క్లిక్: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది) పంజాబ్‌పై గురి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘జమ్మూకశ్మీర్‌లో ఐఎస్ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్‌లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెల్లడైందన్నారు. (క్లిక్: దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం) -
భారత సైన్యం కదలికలపై కన్నేసిన డ్రాగన్
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో డ్రాగన్ దొంగదెబ్బ తీసినా దీటుగా బదులిచ్చిన భారత్ పాటవాన్ని తక్కువగా అంచనా వేయరాదని చైనా భావిస్తోంది. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సెంట్రల్ సెక్టార్ కదలికలపై డ్రాగన్ కన్సేసిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది. గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన అనంతరం భారత్-చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెచ్చుమీరిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని భారత్ సరిహద్దుల్లో బారహోటి ప్రాంతం వరకూ తన నిఘా వ్యవస్ధను చైనా విస్తరించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. భారత్-చైనాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా డ్రాగన్ నియంత్రణ రేఖ పొడవునా నిఘా పరికరాలను ఆధునీకరించిందని తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి 180 డిగ్రీల్లో తిరుగాడేలా చైనా రెండు కెమెరాలను అమర్చిందని ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలో పలు స్తంభాలను చైనా ఏర్పాటు చేసిందని, ఇక్కడే భారీ సోలార్ ప్యానెల్‌ను, విండ్ మిల్‌ను నిర్మించిందని నిఘా వర్గాల నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో చిన్న పక్కా ఇంటిని నిర్మించి అందులో నిర్మాణ సామాగ్రిని, నిఘా పరికరాలను చైనా ఉంచిందని పేర్కొంది. బారహోతి ప్రాంతంలో భారత సేనల కదలికలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పసిగట్టేలా కెమెరాలను అమర్చిందని వెల్లడించారు. చదవండి : పాక్ కుయుక్తులు : కశ్మీర్‌పై డ్రాగన్‌తో మంతనాలు -
సముద్ర మార్గాన ఉగ్ర ముప్పు!
సాక్షి, విశాఖపట్నం : సముద్ర మార్గాన ఉగ్రవాదులు చొరబడే ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందనీ.. ఈ నేపథ్యంలో తీరంలో భద్రత కట్టుదిట్టం చేశామని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ తెలిపారు. దీంతో కోస్ట్‌గార్డ్ సహా ఇతర మ్యారీటైం రక్షణ బృందాలతో పహారాను ముమ్మరం చేశామన్నారు. డిసెంబర్ 4న నేవీ డేను పురస్కరించుకుని ఐఎన్ఎస్ జలశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ మహా సముద్రంలో ఇండోృపసిఫిక్ ప్రాంతం కీలకంగా మారిందని.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకోవాలంటే జలరవాణా ముఖ్య భూమిక పోషిస్తుందని జైన్ తెలిపారు. అందుకే.. నౌకాయాన వాణిజ్య వ్యవస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే కాకుండా.. వివిధ దేశాలతో సత్సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు నౌకాదళం నిరంతరం శ్రమిస్తోందన్నారు. అలాగే, చొరబాట్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు స్థానిక తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులకూ అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాక, త్వరలో మిగ్-29 యుద్ధ విమానాలు, ఎంఆర్‌ృ60 హెలీకాప్టర్లతో తూర్పు నావికాదళాన్ని పటిష్టం చేస్తున్నామని చెప్పారు. గల్ఫ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. అరేబియా సముద్ర తీరంలో వివిధ నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సంకల్ప్ నిర్వహించాయనీ.. దీని ద్వారా మన దేశం దిగుమతి చేసుకున్న 68 చమురు ట్యాంకులకు నేవీ రక్షణ కల్పించిందన్నారు. వచ్చే ఏడాది ‘విక్రాంత్’ ఇదిలా ఉంటే.. తూర్పు నౌకాదళాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగంగా కొత్తగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఏడు నౌకలు రానున్నాయని.. ఇందులో మూడు యుద్ధ నౌకలని జైన్ వెల్లడించారు. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చే ఏడాది నుంచి సేవలు అందించనుందన్నారు. అలాగే, ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధనౌక, పీృ28 సబ్‌మెరైన్‌తో పాటు మరో సబ్‌మెరైన్, రెండు యుద్ధ నౌకలు చేరనున్నాయని తెలిపారు. కాగా, వచ్చే ఏడాది ఐఎన్ఎస్ రాజ్‌పుత్ యుద్ధ నౌక తన సేవల నుంచి నిష్క్రమిస్తోందన్నారు. సమావేశంలో తూర్పు నౌకాదళ వివిధ విభాగాల ప్రధానాధికారులు రియర్ అడ్మిరల్ కిరణ్‌దేశ్ ముఖ్, రియర్ అడ్మిరల్ సూరజ్‌భేరీ, రియర్ అడ్మిరల్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లోకి 10మంది జైషే ఉగ్రవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్‌లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. అమెరికా మాదిరే భారత్‌లో కూడా 26/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్ కోట్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్‌లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడమే కాక.. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. -
7 రాష్ట్రాలకు ఉగ్రముప్పు; ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనకు ప్రతీకారంగా పాకిస్తాన్ విషం చిమ్మేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇంటలెజిన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల సహాయంతో కశ్మీర్ లోయతో పాటు పలు రాష్ట్రాల్లో బాంబు దాడులకు పాల్పడేందుకు దాయాది దేశ ఇంటలెజిన్స్ విభాగం ఐఎస్ఐ వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మహ్మద్ సభ్యులు సూత్రధారులుగా వ్యవహరించనున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్తాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఇంటలెజిన్స్ వర్గాలు సూచించాయి. మరోవైపు స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం నుంచి ఆగష్టు 20 వరకు హై అలర్ట్ విధించారు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టులోకి సందర్శకులకు అనుమతి నిరాకరించి.. అన్ని రకాల పాసులు రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులోకి వచ్చే వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. -
అయోధ్యలో టెర్రర్ అలర్ట్
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో హై అలర్ట్ జారీ అయింది. నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులు అయోధ్యలో అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద రామజన్మభూమి పరిసర ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరించారు. ఆలయ పరిసరాలతో పాటు ఇంటిలిజెన్స్ అధికారులు రైల్వే స్టేషన్, బస్టాండ్, హోటళ్లలో ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సివిల్ దుస్తులోఉన్న నిఘా వర్గాలు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఎస్పీ అనిల్ కుమార్ సిసోడియా తెలిపారు. కాగా శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే జూన్ 16 న తన పార్టీ ఎంపీలతో కలిసి అయోధ్య పర్యటనకు రానున్నారు. అలాగే 2005 రామజన్మభూమి దాడి అంశం జూన్ 18న విచారణకు రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా భద్రతను మరింత పెంచినట్టు తెలుస్తోంది. -
నిఘా వర్గాల హెచ్చరికతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
-
దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లుతోంది. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు సంబంధించి పది రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులుకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ‘నేషనల్ తోహీత్ జమాత్(ఎన్టీజే)’ సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిననట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు చీఫ్ పుజత్ జయసుందర ఏప్రిల్ 11వ తేదీన ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. కాగా, గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే రాడికల్ ముస్లిం వర్గానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో ఈస్టర్ పర్వదినాన చర్చిలకు వచ్చే విదేశీ యాత్రికులే లక్ష్యంగా దాడులు జరిగనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
భారత్ మళ్లీ దాడి చేయాలని చూస్తోంది
ఇస్లామాబాద్: ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీల మధ్య పాక్‌పై దాడి చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందంటూ నిఘా వర్గాల సమాచారం అందిందని పాక్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన పాక్ భూభాగంలోని బాలాకోట్‌పై భారత్ జరిపిన బాంబు దాడిపై అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. పాక్ మంత్రి ప్రకటనను భారత్ ఖండించింది. ఈ ప్రాంతంలో యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘పాక్ మంత్రి చేసిన బాధ్యతారహిత, అవమానకర ప్రకటన. యుద్ధభయాన్ని పెంచడమే పాక్ ఉద్దేశం. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలంటూ అక్కడి ఉగ్ర సంస్థలకు పిలుపునిచ్చేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తోంది’ అని భారత్ ప్రకటించింది. -
రాష్ట్రంపై మావోయిస్టుల గురి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ గుర్తింపు చాటుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్–గ్రేహౌండ్స్ కూంబింగ్‌లో రెండు రోజులక్రితం బయటపడ్డ ల్యాండ్‌మైన్లే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చి గుర్తింపు చాటుకున్న మావోయిస్టు పార్టీ, ఎన్నికలు జరగబోతున్న తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు పథకం రూపొందించినట్టు తెలిసింది. అయితే ముందస్తు భద్రతా చర్యలను చేపట్టిన తెలంగాణ పోలీస్, సీఆర్పీఎఫ్ మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేస్తోంది. మూడు నెలల క్రితమే.. ఈ ఏడాది మార్చిలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, వాజేడు ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పాతిపెట్టిన ల్యాండ్మైన్లను బలగాలు కూంబింగ్‌లో భాగంగా నిర్వీర్యం చేశాయి. అయితే భారీ స్థాయిలో ఒక వైపు సీఆర్పీఎఫ్, మరోవైపు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నప్పటికీ మావోయిస్టు పార్టీ మళ్లీ ల్యాండ్మైన్లను అమర్చడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సరిగ్గా రెండురోజుల క్రితం చర్ల ప్రాంతంలోని తాలిపేరు ప్రాజెక్టు దగ్గర్లో మావోయిస్టులు అమర్చిన రెండు ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేశారు. వీటిని ఈ ఏడాది ఆగస్టులో అమర్చినట్టు బలగాలు గుర్తించాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి తెలంగాణ ప్రాంతంలోకి మావోయిస్టులు అడుగుపెట్టడం, ల్యాండ్మైన్లు అమర్చడం ఎన్నికల సందర్భంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో చర్ల మండలం ఉంజుపల్లిలో 2009 ఎన్నికల సందర్భంగా ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను టార్గెట్‌గా చేసుకొని ల్యాండ్మైన్లను పేల్చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. అయితే అది కుదరకపోవడంతో ఈవీఎం కంట్రోల్ యూనిట్లను తీసుకొని సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును తగులబెట్టారు. గెరిల్లా దాడులకు వ్యూహం ఎన్నికల సందర్భంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని నేతలను టార్గెట్ చేస్తూ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిసారీ హెచ్చరికలు చేస్తాయి. అయితే ఈసారి గెరిల్లా దాడులకు మావోయిస్టు పార్టీవ్యూహం పన్నేలా కనిపిస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలే టార్గెట్ అనుకొని కేవలం ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకే భద్రత కట్టుదిట్టం చేస్తే, మిగిలిన పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు గెరిల్లా దాడులకు పాల్పడే అవకాశం లేకపోలేదని కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకొని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యకలాపాలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వి«ధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అటవీ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టేందుకు ఇప్పటికే బలగాలను రంగంలోకి దించారు. ఒకవైపు సీఆర్పీఎఫ్, మరోవైపు రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను విస్తృతం చేసినట్టు తెలిసింది. ఎన్నికల సమయానికి ముందే మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు రాష్ట్రపోలీస్ శాఖ పనిచేస్తోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అందులో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టి, ఎక్కడెక్కడ సున్నితమైన పోలింగ్ కేంద్రాలున్నాయో ఆప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొనిసోదాలు, కూంబింగ్, రోడ్ పార్టీ తనిఖీలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. -
ఉగ్ర కోరల్లో పశ్చిమ తీరం
పనాజి, గోవా : దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో గోవా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లోని పోర్టులను కూడా ఈ మేరకు అప్రమత్తం చేసినట్లు ఓడరేవుల శాఖ మంత్రి జయేష్ సల్గాంకర్ తెలిపారు. గతంలో స్వాధీనం చేసుకున్న ఓ భారతీయ బోటును పాకిస్తాన్ విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా ఉగ్రదాడి జరగొచ్చని ఇంటిలిజెన్స్ ప్రభుత్వాలను హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు తీర ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. గోవాతో పాటు, గుజరాత్, ముంబై తీరాలకు కూడా దేశ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు అందాయి. తీరప్రాంతంలోని స్పోర్ట్స్ ఆపరేటర్స్, కాసినో నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఓడరేవుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరాచీ నుంచి బయల్దేరిన ఓ ఫిషింగ్ బోటులో ఉగ్రవాదులు భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నేవీ అధికారి జేమ్స్ బ్రగాంజా ధ్రువీకరించారు. -
భద్రత కట్టుదిట్టం
‘ఉగ్రవాదుల చొరబాటు’తో అప్రమత్తమైన కేంద్రం ♦ శివరాత్రి సందర్భంగా ప్రధాన శివాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ♦ జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకూ సమాచారం న్యూఢిల్లీ/అహ్మదాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ముఖ్య నగరాల్లోని ముఖ్యమైన శివాలయాలు, వ్యూహాత్మక నిర్మాణాలు, కీలక ప్రాంతాల వద్ద ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో సోమవారం కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగింది. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలన్న లక్ష్యంతో పాక్ సరిహద్దులు దాటి గుజరాత్ గుండా లష్కరే, జైషే ఉగ్రసంస్థలకు చెందిన 10 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారన్న వార్తల నేపథ్యంలో.. ఐబీ డెరైక్టర్ దినేశ్వర్ శర్మ, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సహా భద్రతావిభాగాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమై, అంతర్గత భద్రతపై సమీక్ష జరిపారు. అన్ని ప్రధాన నగరాల్లో అత్యంత అప్రమత్తతతో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన నగరాలు, కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, చండీగఢ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపించింది. శివరాత్రి సందర్భంగా ఢిల్లీలోని శివాలయాలు, కీలక భవన సముదాయాలు, మెట్రో స్టేషన్లు, ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో భద్రతాబలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. గుజరాత్ నుంచే ఉగ్రవాదులు దేశంలోకి అడుగుపెట్టారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఆనందిబెన్ పటేల్ అహ్మదాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమై భద్రతను సమీక్షించారు. సోమనాథ్ గుడి ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నందున అక్కడ 250 మంది పోలీసులు, ఎన్ఎస్జీ కమెండోలతో భద్రతాఏర్పాట్లు చేశారు. గుజరాత్ సహా ఉగ్రదాడులకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలు, ఆలయాలు, పారిశ్రామిక కేంద్రాలు సహా అన్ని ప్రముఖ ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచాలని ఆదేశించామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి సంబంధించిన అన్ని భద్రతాపరమైన కార్యకలాపాల విషయమై ఇకపై బీసీఏఎస్(బ్యూరొ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ)ను సంప్రదించాలని సీఐఎస్ఎఫ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది. ఇప్పటివరకు అలాంటి అంశాల్లో తొలుత ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌ను సీఐఎస్ఎఫ్ సంప్రదించేంది. -
దేశమంతటా ‘ఉగ్ర’ అలర్ట్
10 మంది ఉగ్రవాదులు చొరబడ్డట్లు హెచ్చరిక * గుజరాత్‌కు బలగాలు * భారత తీరంలో పాక్ బోటు న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి 10మంది లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న సమాచారంతో దేశంలోని ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్‌లలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ దేవాలయాలపై దాడులు జరగొచ్చనే అనుమానంతో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, కాశీతోపాటు వివిధ శైవక్షేత్రాల వద్ద భద్రత పెంచారు. అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో.. గుజరాత్‌కు నాలుగు ఎన్ఎస్జీ టీమ్‌లను పంపగా.. అందులో ఒక టీమ్ పూర్తిగా సోమనాథ్ ఆలయ భద్రత చూసుకుంటుంది. భారత్ తీరంలో పాక్ బోటు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ జంజువా.. ఉగ్రవాదుల చొరబాటుపై భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌కు సమాచారం అందించటంతో గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దీనిపై గుజరాత్ ఐబీ చీఫ్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘కేంద్రీయ ఇంటలిజెన్స్నుంచి దీనిపై స్పష్టమైన హెచ్చరికలు అందాయి. భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలోని కోటేశ్వర్ ప్రాంతంలో.. ఓ పాకిస్తానీ బోటును బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించి దగ్గరకు వెళ్లేలోపే వారంతా పారిపోయారు. ఆ బోటులో అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు’ అని ప్రమోద్ కుమార్ తెలిపారు. కోల్‌కతాలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును పేల్చేస్తామంటూ హెచ్చరిక రావటంతో ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేశారు.పాకిస్తాన్‌కు పంజాబ్ సరిహద్దులోని గుజరాత్ అనే గ్రామం నుంచి ఫోన్‌కాల్ వెళ్లినట్లు ఇంటిజెన్స్ అధికారులు చేసిన హెచ్చరికలతో.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ అప్రమత్తమైంది. -
'రిపబ్లిక్ డే వేడుకల్లో మోదీని టార్గెట్ చేశారు'
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నాడు ఐసిస్ సహా పలు ఉగ్ర సంస్థలు ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన రిపోర్ట్ కలకలం రేపుతోంది. టీనేజ్ పిల్లలను సాయుధులుగా మోదీ దగ్గరకు పంపేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయంటూ ఇంటలిజెన్స్ వర్గాలు భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. దీంతో భద్రతా దళాల నిఘా మరింత ఎక్కువైంది. గత ఏడాది గణతంత్ర వేడుకల అనంతరం మోదీ ఎర్ర కోట వెలుపలకు వెళ్తున్న సమయంలో బయట వేచియున్న విద్యార్థులను గమనించి వారిని కలిసేందుకు తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని నిలువరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితినే కల్పించి.. 12-15 ఏళ్ల వయసున్న బాలురకు ఆయుధాలను, పేలుడు సామాగ్రిని ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇచ్చి మోదీ వద్దకు పంపేందుకు ఉగ్రవాదులు వ్యూహ రచన చేస్తున్నారని నిఘా వర్గాల నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు అలర్ట్ అందింది. దీంతో మోదీకి మరింత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పలు ఉగ్ర సంస్థలు మెషీన్ గన్ల వాడకంలో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాయి. పసి పిల్లలను తమ ఆపరేన్లలో ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఇండియాలో ఐసిస్ బలపడేందుకు 'అన్సార్-ఉద్-తాహిద్-తాహిద్' అనే ఉగ్ర సంస్థ సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రత బలగాలు ఢిల్లీలో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా జనవరి 25న ప్రధాని మోదీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తో కలిసి గుర్గావ్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో నేరాల పరిస్థితిపై తమకు నివేదిక ఇవ్వాల్సిందిగా అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) శుక్రవారం హర్యానా పోలీసులను కోరింది. సోమవారం నేతలిద్దరు గుర్గావ్లో జాతీయ సౌర ఇంధన సంస్థలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అమెరికా మిత్ర దేశమైనందున హోలాండ్ పర్యటనకు భద్రతా చర్యలను సిఐఎ చేపడుతోంది. -
ఇంటిలిజెన్స్ హెచ్చరికతో హైదరాబాద్‌లో అప్రమత్తం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ఏమూల ఏ ఉగ్రవాద చర్య జరిగినా దానికి ఏదో ఓ రంకంగా నగరంతో సంబంధం ఉంటూనే ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలోని బాపూజి నగర్లో నార్త్‌జోన్ పోలీసులు గురువారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ సుధీర్ బాబు ఆధ్వార్యంలో 200 మంది పోలీసులతో ఈ కార్డెన్ అండ్ సెర్చ్ చేపడుతున్నారు. ముఖ్యంగా అద్దెకు ఉంటున్న వ్యక్తుల పూర్తి వివరాలు తీసుకోవాలని డీసీపీ అధికారులకు సూచించారు. -
ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు!
స్వాతంత్ర్య దిన వేడుకల సందర్భంగా నిఘా వర్గాల నుంచి హెచ్చరిక రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై ఎలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, భారీ భద్రతా చర్యలు చేపట్టారు. వ్యక్తిగత, వాణిజ్య వాహనాలతో సహా అన్ని వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దుల ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించే ఏ ఒక్క వాహనాన్నీ వదలొద్దని ఢిల్లీ అదనపు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు. ఢిల్లీ పోలీసులతో పాటు కమాండోలు, మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బంది, షార్ప్ షూటర్లను కూడా ఎర్రకోట చుట్టూ మోహరించారు. దాదాపు ఆరువేల మంది భద్రతా దళాల సిబ్బందిని ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించినట్లు శుక్లా చెప్పారు. షార్ప్ షూటర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులతో కూడిన బృందం భద్రతను పటిష్ఠంగా చూస్తుందని ఆయన తెలిపారు. నగరంలోకి ప్రవేశించే, నగరం నుంచి బయటకు వెళ్లే మార్గాలన్నింటిలోనూ ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఉండి, డేగకళ్లతో మొత్తం వాహనాలన్నింటినీ పరిశీలిస్తారు. పత్తర్ గంజ్, జామా మసీదు, ఎర్రకోట చుట్టుపక్కల ఉండే అన్ని ఎత్తయిన భవనాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, మార్కెట్లు, రెస్టారెంట్ల వద్ద నిఘా మరింత పటిష్ఠంగా ఉంటుంది. ఎక్కడైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే చెప్పాల్సిందిగా రిక్షా కార్మికులను కూడా అప్రమత్తం చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్టాపులు, మార్కెట్లు, మాళ్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో కూడా భద్రతను పటిష్ఠం చేశారు. ఆగస్టు 15 నేపథ్యంలో దేశ రాజధానికి ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉందని తమకు నిఘా వర్గాల నుంచి లేఖ అందినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చుట్టుపక్కల ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు.