intention
-
వినూత్నంగా జనగణన..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిహార్ సీఎం
బిహార్‌లో సరికొత్త విధానంలో జనగణన చేపట్టారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ మేరకు ఆయన బిహార్‌లో కుల ఆధారిత జనగణన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కసరత్తు ఉద్దేశం అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన కోసం అని స్పష్టం చేశారు. ఈ విధానం అభివృద్ధి పనులు చేయడానికి ఉపకరిస్తుందని చెప్పారు. తాను మొదటి నుంచి దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభ గణనను నిర్వహించాలని డిమాండ్ చేశానని అన్నారు. ఇలా చేస్తే కులాల వారిగా వారి అభ్యున్నతికి కృషి చేయడానికే, గాక వారి స్థితిగతులు తెలియజేస్తాయని చెప్పారు. వాస్తవానికి 2011లో కులగణనన జరిగిందని, కానీ సరిగా నిర్వహించలేదని చెప్పారు. బిహార్‌లోని అన్ని పార్టీలు కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధానిని కలవడానికి వెళ్లాం, కానీ కేంద్రం కుల ప్రాతిపదికన జనాభ గణన చేయదని తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రం చేయాలనకుంటే ఓకే గానీ అన్ని రాష్ట్రాలు అలా చేయలేవని కరాఖండీగా కేంద్రం చెప్పిందని అన్నారు. ఈ మేరకు నితీష్ జాతి ఆధార గణన(కులాల ఆధిరిత గణన) కసరత్తులల్లో అధికారులందరూ పూర్తి శిక్షణ పొందారని, సరిగా చేయగలరని ధీమాగా చెప్పారు. ప్రతి వ్యక్తిని సరిగా లెక్కించాలని తాము అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. చాలా వరకు నగరాల్లోనూ, రాష్టాల వెలుపల జీవిస్తున్నారని అందువల్ల బహు జాగ్రత్తగా మొత్తం సమాచారాన్ని నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు నితీష్. కులం లేదా వర్గాల వారిగా ఆయా కుటుంబాల స్థితి గతులను నమోదు చేస్తామని నొక్కి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉందన్నారు. ఈ విధానంతో ప్రతి కుటుంబం ఆర్థికస్థితి అంచనా వేయగలగడమే కాకుండా సమర్థవంతంగా అభివృద్ధి పనులు చేపట్టి, పేదరికాన్ని నిర్మూలిస్తాం అని చెప్పారు. ఈ నివేదికను కేంద్రానికి పంపిస్తాం, ఒకవేళ బాగుంది అనిపిస్తే వారు ఈ కార్యక్రమానికి పూనకుంటారని లేదంటే తాము కనీసం వారికి ఈ రిపోర్టుని నివేదిస్తాం అని నితీష్ చెప్పుకొచ్చారు. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
కావాలనే ‘కరోనా’ అంటించుకున్న ప్రముఖ సింగర్.. అందుకోసమేనటా..!
బీజింగ్: కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ, చైనాకు చెందిన ప్రముఖ సింగర్, పాటల రచయిత జేన్ జాంగ్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే కోవిడ్ తనకు సోకేలా చేసుకుంది. తాను కావాలనే కరోనా బారినపడినట్లు బయటకు చెప్పడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఓ వైపు చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే కోవిడ్ బారినపడటం విమర్శలపాలు చేసింది. అయితే, తాను కరోనా బారినపడేందుకు గల కారణాలను సోషల్ మీడియా వేదికగా వివరించింది సింగర్ జేన్ జాంగ్. కరోనా సోకిన తన స్నేహితులను చూసేందుకు వెళ్లినట్లు పేర్కొంది. కొత్త ఏడాది ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే ప్రక్రియలో భాగంగానే కరోనా తనకు అంటుకునేలా చేసుకున్నానని పేర్కొంది. ఇప్పడే వైరస్ సోకి కోలుకోవడం ద్వారా న్యూఇయర్ ఈవెంట్లో మళ్లీ వైరస్ సోకదని భావించినట్లు పేర్కొంది. ‘న్యూఇయర్ కన్సర్ట్‌లో నా ఆరోగ్యం దెబ్బతింటే అది నా ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందాను. అందుకే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో కలిశాను. ఇప్పుడు నాకు కోలుకునేందుకు తగిన సమయం ఉంది.’ అని రాసుకొచ్చింది జేన్ జాంగ్. కోవిడ్ సోకిన వారిలాగే తనకు లక్షణాలు కనిపించాయని, కానీ, ఒక్కరోజు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. పగలు, రాత్రి నిద్రపోవటం వల్ల లక్షణాలు మాయమైనట్లు పేర్కొంది. విటమిన్ సీ తీసుకోవటం, నీళ్లు ఎక్కువ తాగడం వంటివి చేసినట్లు వెల్లడించింది. విమర్శల వెల్లువ..క్షమాపణలు సింగర్ పోస్ట్ వైరల్‌గా మారిన క్రమంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. చైనాలో కోవిడ్ విజృంభణ వేళ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా నుంచి తన వివాదాస్పద పోస్ట్‌ను తొలగించింది సింగర్ జేన్ జాంగ్. ప్రజలకు క్షమాపణలు తెలిపింది. న్యూఇయర్ ఈవెంట్లో కరోనా సోకితే తనతో పాటు సిబ్బందికి సోకుతుందని అంతా ఇబ్బందులు పడతారనే కారణంతోనే ఇలా చేశానని, ప్రస్తుతం ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేనందున వైరస్ నుంచి కోలుకుంటే ఇబ్బందులు ఉండవని భావించినట్లు రాసుకొచ్చింది. ఇదీ చదవండి: Covid BF7 Variant: కొత్త వేరియంట్ భారత్‌లోనూ గుర్తింపు.. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ -
తప్పనిసరి పలుకుబడి
‘మన ఉద్దేశం ఎదుటివారికి స్పష్టంగా తెలుపడం ముఖ్యమైనప్పుడు, భాష, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి గదా!’ అంటారు డాక్టర్ తిరుమల రామచంద్ర. ‘తాను ప్రయోగించే పదం తన అభిమతాన్ని వ్యక్త పరుస్తుందా లేదా అనే విషయం రచయితకు తెలియాలి’ అని కూడా మరోచోట అంటారాయనే. రామచంద్ర బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన పత్రికా రచయిత. ఆయన స్వీయానుభవంతో చేసిన ఈ సూచనలను కాదనవలసిన అవసరం లేదు. ‘పలుకుబడి’ పేరుతో రామచంద్ర ఒక పత్రిక కోసం రాసిన వ్యాసాలను వయోధిక పాత్రికేయ సంఘం (హైదరాబాద్) ఇటీవల వెలువరించింది. ‘సమష్టి’- ‘సమిష్టి’, ‘నిరసన’-నిరశన’, ‘నిర్దిష్టం’-‘నిర్దుష్టం’, ‘చారిత్రక’-‘చారిత్రిక’.... వీటిలో రచయిత వ్యక్తం చేయదలుచుకున్న విషయానికి సందర్భోచితంగా ఏది ఉంటుంది? అదే సమయంలో ఏది ఒప్పయినది? ఇలాంటి ప్రశ్నలు రాసేవాళ్లంతా ఏదో దశలో ఎదుర్కొంటారు. ఇలాంటి వాటిని వివరించే పుస్తకమే ‘పలుకుబడి’. సరైన శబ్దాలు ఏమిటో చెప్పడం పండిత ప్రకర్షకైతే కాదు. ‘నిరసన’ అంటే నిరాకరించడం. ‘నిరశన’ అంటే అభోజనంగా ఉండడం. కానీ ఈ అర్థాలు తెలియక చాలామంది ఈ పదాలను తారుమారు చేసి అభాసుపాలవుతూ ఉంటారు. కానీ రామచంద్రగారే అన్నట్టు ఒకసారి పాతుకుపోయిన అభిప్రాయాలను వదల్చుకోవడానికి చాలా సంస్కారం కావాలి. భాష మీద ప్రేమ ఉన్నవాళ్లు ఈ మాత్రం సంస్కారం అలవరుచుకోవడానికి వెనుకాడకూడదు. అవసరమైతే సంధి సూత్రాలు ఇస్తూ, సందర్భం, సున్నిత హాస్యాలను మేళవించి ఇలాంటి పలుకుబడి పదాలను రామచంద్ర అందించారు. రాస్తున్న వారూ, రాయాలని కోరిక ఉన్నవాళ్లే కాదు, చదివే అలవాటు ఉన్నవాళ్లు కూడా ఆనందంగా చదువుకోదగ్గ పుస్తకం. ఎంతో ఉపయోగకరమైనది కూడా. ఇన్నాళ్లూ మనం చేసిన తప్పులను ఈ విధంగానైనా తెలుసుకోవచ్చు. సహృదయత ఉంటే నవ్వుకోవచ్చు కూడా. కానీ ఇలాంటి పుస్తకంలో కూడా ఉపోద్ఘాతాలలో లెక్కకు మిక్కిలి అచ్చుతప్పులు కనిపించడం బాధాకరం. పలుకుబడి, డాక్టర్ తిరుమల రామచంద్ర, ప్రతులకు: విశాలాంధ్ర; వెల రూ. 100/- కొండగాలీ కొత్త జీవితం ఇవన్నీ పాతరోజులు. సోవియెట్ యూనియన్ వల్ల ఆ ఛత్రం కింద దేశాలన్నీ ఏ మేరకు లాభపడ్డాయో లేదో కాని పుస్తక ప్రపంచం మాత్రం విపరీతంగా లాభపడింది. ప్రపంచమంతా సోవియెట్ సాహిత్యం శుభ్రమైన అట్టలతో నాణ్యమైన ఫాంట్‌తో పరిమళాలీనే కాగితంతో సాహితీ ప్రేమికుల ఒళ్లోకొచ్చి పడింది. రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలు రాళ్లెత్తకపోయినా పుస్తకాలెత్తి ప్రపంచమంతా కొత్త సాంస్కృతిక సౌధాలను నిర్మించాడానికి కష్టపడ్డాయి. ‘కొండగాలీ కొత్తజీవితం’ 1979 నాటిది. ఇందులోని తొమ్మిది ఆర్మేనియన్ కథలు- ఆ ప్రశాంతమైన పర్వత ప్రాంత జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ఒక దేశం గురించి, ఒక జాతి గురించి తెలియాలంటే ఆ జాతిని సరిగ్గా ప్రతిబింబించే సాహిత్యాన్ని చదవడమే మార్గం. కథ అంటే ఏమిటో జాతి కలిగిన కథ అంటే ఏమిటో ఈ పుస్తకం చదవి తెలుసుకున్నారు చాలామంది. ఆర్మేనియా- సోవియెట్ యూనియన్ కింద అంత సుఖంగా లేదన్నది వేరే విషయం. ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఫ్యాక్టరీల వల్ల తమ అందమైన దేశం కాలుష్యం బారిన పడుతోందని గగ్గోలు పెట్టింది. సోవియెట్ యూనియన్ పతనానికి ఒక సంవత్సరం ముందు- అంటే 1990లో అది స్వతంత్రం ప్రకటించుకుంది. ఇప్పుడు అక్కడి సాహిత్యం ఎలా ఉందో తెలియదు. మన దాకా చేరే మార్గం కూడా లేదు. కాని మిగిలిన ఇలాంటి అరాకొరా పుస్తకాలే దాచుకున్న గులాబీ రెమ్మలు. ఊహల్లో మిగిలిన ఆకుపచ్చ లోయలు. -
ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశ్యం లేదు:దిగ్విజయ్