ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే ఉద్దేశ్యం తమకు లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. విభజనపై హైకమాండ్ నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. సీఎం కిరణ్ కూడా హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తారని చెప్పారు. కిరణ్కు కొన్ని అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమే అని అయితే హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించని దిగ్విజయ్ అన్నారు. దాంతో సీఎం మార్పు వార్తలకు తెరపడినట్లు అయ్యింది. రాష్ట్ర విభజనపై మొండికేసిన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం సీఎం పీఠం నుంచి తొలగిస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఆయన భవిష్యత్ ఏమిటో ఒకట్రెండు రోజుల్లో తేలిపోతుందంటు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు అధిష్టానం పిలుపుతో సీఎం శుక్రవారం హస్తిన చేరుకున్నారు.