Intermediate syllabus
-
ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గుదల..
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్(ప్రథమ), సెకండ్ ఈయర్(ద్వితీయ సంవత్సరం)లో 30 శాతం సెలబస్ తగ్గించింది. సీబీఎస్ఈ సూచనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు సబ్జెక్ట్‌లో 30 శాతం సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. మరోవైపు ఇంటర్ సెకండ్ ఈయర్‌లో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీలో సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన సెలబస్‌ను ఇంటర్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. కాగా కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. అయితే ఆలస్యం కావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం (సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్(సంవత్సరం పాటు క్లాసులు నిర్వహించకపోవడం) నుంచి కాపాడటానికి కొన్ని సూచనలు చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. -
ఇంటర్మీడియెట్ సిలబస్‌లో మార్పులు
సాక్షి, అమరావతి : ఇంటర్మీడియెట్ సైన్స్, లాంగ్వేజెస్, ఒకేషనల్ సిలబస్ మారుతోంది. కొత్త పాఠ్యపుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తేనున్నారు. ఇంటర్ సిలబస్ మార్చి ఐదేళ్లు దాటడంతో సిలబస్‌ను మార్చినట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు. నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షలను విద్యార్థులు ఎదుర్కొనేలా పలు చాప్టర్లలో మార్పులు చేశారు. నీట్‌ను ప్రవేశపెట్టిన తొలిరోజుల్లోనే బోర్డు నీట్ సిలబస్‌పై అధ్యయనం చేసింది. నీట్‌కు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించిన ఫిజిక్స్ సిలబస్ కంటే బోర్డు సిలబస్ ఎక్కువగా ఉందని, దానిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని భావించింది. జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీల్లో కొన్ని తేడాలుండడంతో అదనపు సమాచారాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తోంది. మార్పులివే.. జువాలజీ–1లో బయోడైవర్సిటీలో ‘లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ’కి సంబంధించిన కొన్ని చిత్రపటాలను, ‘థ్రెట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ’లో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ పేరాను ఎన్సీఈఆర్టీ నుంచి అదనంగా చేరుస్తున్నారు. బయోమాస్‌కు సంబంధించి ఎన్సీఈఆర్టీలో అదనంగా ఉన్న కొన్ని చిత్రపటాలను పాఠ్యపుస్తకాల్లో జతచేస్తున్నారు. జువాలజీ–2లో పేజీ నెంబర్ 2లో హార్మోన్ చిత్రపటాన్ని మార్చారు. 136, 153 పేజీల్లో గ్రేవ్స్ డిసీజెస్ చిత్రపటాలను చేరుస్తున్నారు. పేజీ నెంబర్ 244లో మొదటి బాక్సు, రెండో బాక్సుల్లో కొన్ని చిత్రపటాలను ఎన్సీఈఆర్టీ నుంచి అదనంగా జతచేస్తున్నారు. పేజీ నెంబర్లు 249, 250, 252, 258ల్లో ఆయా అంశాల్లో అదనంగా కొన్ని పేరాలను కలుపుతున్నారు. ఇలాగే మరికొన్ని పేజీల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. బోటనీలో పేజీ నెంబర్ 2లో వైరస్, వైరాయిడ్స్కు సంబంధించి అదనపు పేరాలను చేరుస్తున్నారు. పేజీ నెంబర్ 4లో 4.1లో ఆల్గేలో 29, 30 పేజీల్లో అదనపు పేరాలను ఎన్సీఈఆర్టీ నుంచి జతచేస్తున్నారు. కెమిస్ట్రీలో కూడా 13 అంశాలకు సంబంధించి మార్పులు చేస్తున్నారు. ఫిజిక్స్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఉదయలక్ష్మి వివరించారు. ఇంగ్లిష్‌లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇఫ్లూ యూనివర్సిటీ ద్వారా మార్పులు చేయించినట్లు తెలిపారు. ఆర్ట్స్ సబ్జెక్టుల్లో 2015లోనే మార్పులు చేసినందున రెండేళ్ల తర్వాత సిలబస్‌ను మారుస్తామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్‌లోనే ఈ ఏడాదీ నిర్వహించనున్నామని ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో కాకుండా పాత విధానంలో నిర్వహించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బుధవారం ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా చేపట్టాయి. అయితే జంబ్లింగ్‌లోనే ప్రాక్టికల్ పరీక్షలుంటాయని ఆమె తేల్చిచెప్పారు. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలు నిబంధనలు పాటించని కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. దీంతో ఆయా కళాశాలలకు రూ.50 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. -
సైన్స్ గ్రూపుల్లో సగం సిలబస్‌లో ప్రాక్టికల్స్
-ఇంటర్మీడియట్లో దేశ వ్యాప్త అమలుకు ప్రతిపాదన - ఇతర గ్రూపుల్లో 70 శాతం కామన్ కోర్ సిలబస్ అమలుకు సిలబస్ కమిటీ చర్యలు - వచ్చే నెల 6న ఢిల్లీలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం హైదరాబాద్: ఇంటర్మీడియట్లోని సైన్స్ గ్రూపుల్లో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా చర్యలు చేపట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్మీడియట్ సిలబస్ సమీక్ష కమిటీ అభిప్రాయ పడింది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ విద్యలో, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో 10+2 విధానంలోనూ కామన్ కోర్ సిలబస్ ఉండేలా చర్యలు చేపట్టాలని గురువారం తీర్మానించింది. అయితే సైన్స్ గ్రూపులకు చెందిన సబ్జెక్టుల్లో (మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మాత్రం 100 శాతం కామన్ కోర్ సిలబస్ (అన్ని రాష్ట్రాల్లో ఒకేలా) ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో 50 శాతం పాఠ్యాంశాలు రాత పరీక్షల మేరకు ఉండాలని, మరో 50 శాతం సిలబస్ ప్రాక్టికల్స్ చేసేలా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్ థియరీకి అనుగుణంగానే ఉందని, దానిని మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రతినిధులతో కూడిన కమిటీ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైంది. సిలబస్ సమీక్ష కమిటీ కన్వీనర్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులైన జమ్మూ కాశ్మీర్ ఇంటర్మీడియట్ బోర్డు ఛైర్మన్ జహూర్ అహ్మద్, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణకుమార్ పాటిల్, నాగాలాండ్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అసానో సెఖోస్, ఐసీఎస్సీ ప్రతినిధులు కల్నల్ శ్రీజిత్, శిల్పిగుప్తా, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆర్‌ఎంఎస్‌ఏ విభాగం హెడ్ ప్రొఫెసర్ రంజనా అరోరా, సీబీఎస్ఈ అదన పు డెరైక్టర్ సుగంధ్ శర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సైన్స్ గ్రూపులతోపాటు ఇతర గ్రూపులు, ఆయా సబ్జెక్టుల్లోనూ 70 శాతం సిలబస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. మిగితా 30 శాతం సిలబస్‌ను ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా వీలు కల్పించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు పంపించింది. ఇతర గ్రూపుల్లోనూ 90 శాతం కామన్ కోర్ సిలబస్ ఉండాలని, 5 నుంచి 10 శాతం వరకే ఆయా రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆప్షనల్ సిలబస్‌ను రూపొందించుకునే అవకాశం కల్పించాలని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తంగా కామన్ కోర్ సిలబస్ ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెంచేలా ఉండేలా ఈ చర్యలు చేపట్టింది. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల 6న ఢిలీలో జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. -
ఎంసెట్ కొనసాగించాలా?
ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకుని ఇంజనీరింగ్ చదువును కొనసాగిస్తే మరింతగా మాల్ ప్రాక్టీస్‌లు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ విద్య ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడి, ప్రజలు తమ స్థితిగతులు మారుతాయని ఆశిస్తున్న తరు ణంలో ప్రతి చిన్న విషయానికి వివాదాలలోకి వెళ్లటం రాజ కీయ నాయకులకు సరైన పద్ధతి కాదు. ఇద్దరు చంద్రు లైన నాయకులు రెండు ప్రాం తాల ప్రజల హృదయాలపై అన్నివిధాలుగా ముద్ర వేసినవారు. వీరిద్దరూ రెండు ప్రాంతాల ప్రగతిని కోరు కునేవారనే భావన కూడా ఉంది. పాలనా యంత్రాం గంలో చిన్న చిన్న సమస్యలు రావటం సహజం. వాటిని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పత్రికలకు ఎక్కకుండా పరిష్కరించుకుంటే తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా హర్షిస్తారు. దేశాలకు దేశాలు విడిపోయిన ఘటన లున్నాయి. ఆ దేశాల మధ్య తిరిగి వచ్చే సమస్యలను రచ్చకెక్కకుండా పరిష్కరించుకున్న ఉదంతాలు లేవా? తెలుగు ప్రజలు ఉద్రిక్త వాతావరణాలను కోరుకోవటం లేదు. ఉభయులు కూడా కలిసి ఇరు రాష్ట్రాలను ప్రగతిపథం పైకి నడిపిస్తే వారికి స్టేట్స్‌మెన్ లన్న పేరు వస్తుంది. విడిపోకముందు ధీరులుగా పోరాడటం, విడిపోయిన తర్వాత అంకిత స్వభావంతో ప్రజలను అభివృద్ధి పథంపైన నడిపించడం రాజనీ తిజ్ఞుల లక్షణం. ప్రతి చిన్న విషయానికి పత్రికలకెక్కటం శ్రేయస్కరం కాదు. చిన్న పిల్లలకు సంబంధించిన ఎంసెట్ పరీక్షపై కూడా ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉన్నదా? రాష్ట్రాలు విడిపోయాయి. తమ ప్రాంత నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్‌ను ఎలా నిర్వహించుకోవాల్నో ఈ రెండు ప్రభుత్వాలు నిర్ణయిం చుకోలేవా? ఈ చిన్న విషయానికి కూడా కేంద్రంతో, గవర్నర్‌తో అక్షింతలు వేయించుకోవాలా? ముఖ్యంగా 21వ శతాబ్దాన్ని కేవలం యువకులకు ఉపాధి కలిగించేదే కాక సంపదను సృష్టించేదిగా కూడా పరిగణిస్తున్నారు.యువకుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను, మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా ఆ నైపుణ్యాలను నిత్యం పదును పెట్టుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రవేశానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి. ఎంసెట్ పరీక్ష ఇంటర్మీడియెట్ పూర్తి అయిన విద్యార్థులకే నిర్వహించాలా? ఈ రెండేళ్ల విద్యార్థులు 12వ తరగతికి రాకముందే వారికి ఎంసెట్-శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కదా! అదే మాదిరిగా ఎంసెట్ పరీక్షను ఇంటర్మీడియెట్ పరీక్షతో ముడిపెట్టవలసిన పని లేదు. ఇంటర్ పరీక్ష లక్ష్యం వేరు. ఇంటర్మీడియెట్ పరీక్షలో పాఠ్యాంశాలను పరీక్షిస్తారు. ఎంసెట్ పరీక్షలో ఇంజనీరింగ్‌కు కావల్సిన నైపుణ్యాలను పరీక్షించాలి. అంటే విద్యార్థులకు తార్కికమైన నైపుణ్యం ఏ మేరకు వచ్చింది? లేదా గణితశాస్త్రపరమైన విశ్లేషణ వచ్చిందా? లేదా సామాజిక దృక్పథం వచ్చిందా? ఇలాంటి ఎన్నో నైపుణ్యాలను విద్యార్థుల 11ఏళ్ల నేపథ్యాన్ని గమనంలోకి తీసుకుని ఎంసెట్ పరీక్షలను నిర్వహించుకోలేమా? ఎంసెట్ పరీక్ష అంటే సీట్లు నింపుకోవడానికి కాదు. విద్యార్థికి ఇంజనీరింగ్ విద్యపై ఏ మేరకు ఆసక్తి ఉన్నదో, కనీస నైపుణ్యం ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు ఈ ఎంసెట్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో 20 ఇంజనీరింగ్ కాలే జీలు మాత్రమే యోగ్యత కలవని ఉన్నత విద్యామండలి చెప్పడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ముందుకు వస్తున్నారు. క్లర్క్ ఉద్యోగం నుంచి కండక్టర్ ఉద్యోగం వరకు ఎంతో మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసెట్ పరీక్షను రద్దు చేస్తే ఇంటర్మీడియెట్ వ్యవస్థపైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రతి తల్లీతండ్రీ ఈ 20 కాలేజీల అడ్మిషన్ల కోసమే తమ పిల్లలకు మంచి ర్యాంకు కావాలని కోరుకుంటారు. ఇంటర్ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటర్ పరీక్ష కూడా కొన్ని వందల కేంద్రాల్లో మారు మూల ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షా విధానం గత కొన్ని దశాబ్దాల నుంచి కార్పొరేట్ రంగం చేతుల్లోకి పోవటం వలన ఎన్నో అవకతవకలకు దారితీసింది. ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకుని ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తే మరింత మాల్ ప్రాక్టీస్‌లు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. మద్రాసులో ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదట విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ కాదు. ఈ మధ్యకాలంలో ఎంసెట్ పరీక్షను కొనసాగిస్తేనే అటు ఇంటర్ విద్యను ఇటు ఇంజనీరింగ్ విద్యను బాగు చేసు కునే అవకాశం దొరుకుతుంది. అన్ని రంగాల మాదిరి గానే విద్యారంగాన్ని కూడా గత ప్రభుత్వాలు అతలా కుతలం చేశాయి. ఫీజురీయింబర్స్‌మెంట్ పేదలకు ఉపయోగపడుతుందనుకుంటే అది కార్పొరేట్ రంగాల కు సంజీవనిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వానికి ఇంటర్ విద్యను, ఇంజనీరింగ్ విద్యను బాగుపరుచుకోవాలంటే ఎంసెట్‌ను కొంతకాలం సమర్థ వంతంగా కొనసాగించవలసే ఉంటుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ విద్య ప్రవేశ పరీక్షపైన నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. సందర్భం: చుక్కా రామయ్య, (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసన మండలి మాజీ సభ్యులు)