
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్(ప్రథమ), సెకండ్ ఈయర్(ద్వితీయ సంవత్సరం)లో 30 శాతం సెలబస్ తగ్గించింది. సీబీఎస్‌ఈ సూచనల ప్రకారం ఇంటర్ ప్రథమ సంవత్సరం తెలుగు సబ్జెక్ట్‌లో 30 శాతం సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. మరోవైపు ఇంటర్ సెకండ్ ఈయర్‌లో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీలో సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన సెలబస్‌ను ఇంటర్ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.
కాగా కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. అయితే ఆలస్యం కావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం (సీబీఎస్ఈ) ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్(సంవత్సరం పాటు క్లాసులు నిర్వహించకపోవడం) నుంచి కాపాడటానికి కొన్ని సూచనలు చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్‌బీఐఈ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.