internal war
-
PM Narendra Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధ్వంసమే
సోనిపట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హరియాణాలో పొరపాటున అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని అన్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, అస్థిరత రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించవద్దని ప్రజలకు సూచించారు. బుధవారం హరియాణాలోని సోనిపట్ జిల్లా గొహానాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అస్థిరత, అవినీతి, బంధుప్రీతి తదితర అవలక్షణాలన్నీ ఉంటాయని ఆరోపించారు. కర్ణాటకలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని గుర్తుచేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత యుద్ధం సాగుతోందన్నారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే కథ అని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల హరియాణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో బడుగులకు అన్యాయం రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి మండిపడ్డారు రిజర్వేషన్ల పట్ల ద్వేషం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ రాజ కుటుంబంలోని నాలుగో తరం రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు లభించాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయా వర్గాల హక్కులను లాక్కుందని, తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులకు లబ్ధి ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అమెరికాలో పలువురు ముఖ్య నాయకులను, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులను కలిశానని చెప్పారు. భారతీయ యువత నైపుణ్యాల గురించి వారికి వివరించానని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు నేడు భారత్‌లో ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరిగితే పేదలు, రైతులు, దళితులు అధికంగా లబ్ధి పొందుతారని స్పష్టంచేశారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో బీజేపీ ప్రభుత్వం హరియాణాను అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దిందని ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బీజేపీకి ఆదరణ నానాటికీ పెరుగుతోందని, కాంగ్రెస్ దిగజారిపోతోందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. -
కత్తులు దూస్తున్నారు...ఇదేం ఖర్మ సారూ..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. తాడోపేడో తేల్చుకోవడానికి ఇరువర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. అంతు చూస్తాం.. హతమారుస్తాం అనే వరకు వెళ్లిపోయారు. ఆ మధ్య ‘ఇదేం ఖర్మ’ నిర్వహించే విషయంలో విభేదాలొచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఫ్లెక్సీల విషయంలో పోలీసులను ఆశ్రయించారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లడంతో ఇదేం కర్మ అని అటు నియోజకవర్గ ప్రజలు, ఇటు పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. సాధారణంగా పార్టీలో అసమ్మతి చెలరేగితే పార్టీ అధిష్టానం సర్ధి చెప్పాలి. కానీ, శ్రీకాకుళం టీడీపీ నేతల పోరును పోలీసుస్టేషన్లో పంచాయితీ చేయాల్సి రావడం గమనార్హం. ఎన్నాళ్లీ ఊడిగం.. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీ దంపతులు, గొండు శంకర్ వర్గీయుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. కాలం చెల్లిన నేతలు ఇంకెంత కాలం నాయకత్వం వహిస్తారని, ఎన్నాళ్లు వారికి ఊడిగం చేయాలని గొండు శంకర్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు లక్ష్మీదేవికి ఇవ్వొద్దని, తమకే కేటాయించాలని గొండు శంకర్ వర్గీయులు డిమాండ్ చేయడమే కాకుండా అధిష్టానం దూతలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతు చూస్తామంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చుకుంటున్నారు. తాజాగా ఫ్లెక్సీల గొడవ.. గొండు శంకర్ పుట్టిన రోజు సందర్భంగా గారలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని గుండ లక్ష్మీదేవి వర్గీయులు పట్టపగలే చించేసి తొలగించారు. తోటి కార్యకర్తలు చూస్తుండగానే లక్ష్మీదేవి అనుచరులైన మండల పార్టీ కార్యదర్శి జల్లు రాజీవ్, శ్రీకూర్మం మాజీ ఎంపీటీసీ కైబాడీ రాజులు కలిసి గొండు శంకర్ ఫ్లెక్సీలు చించేయడమే కాకుండా లక్ష్మీదేవికి వ్యతిరేకంగా పనిచేసే వారికి బుద్ధి చెబుతామని, ఏమాత్రం మర్యాద లేకుండా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దీంతో గొండు శంకర్ వర్గీయులు ఘాటుగా స్పందించారు. మేమేంటో తేల్చుతామని అంటూనే గార పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొండు శంకర్ వర్గీయులైన గార మాజీ సర్పంచ్ బడకల వెంకట అప్పారావు, పీహెచ్సీ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ రమణమూర్తి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. తమాషా చూస్తున్న అధిష్టానం.. నేతల మధ్య తారస్థాయికి విభేదాలు చేరడంతో అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. వీరి మధ్య గొడవతో ఎవరికి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా అధినేతల డైరెక్షన్లో జరుగుతోంది. గొండు శంకర్ వర్గీయులకు అండగా కింజరాపు అచ్చెన్నాయుడు, గుండ లక్ష్మీదేవికి అండగా కళా వెంకటరావు ద్వారా నారా లోకేష్ అండదండలుండటంతో ఎవరికి వారే బరి తెగించి ‘ఫైటింగ్’ చేసుకోవడానికి సిద్ధమవుతున్నా రు. ఎక్కడైనా పార్టీలో విభేదాలుంటే అధిష్టానం చొరవచూపి పరిష్కరించాలి. ఇక్కడ మాత్రం అధిష్టానం పెద్దలే వెనకుండి తమాషా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి వారికున్న భయాలకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నారు. దీన్నిబట్టి శ్రీకాకుళం టీడీపీ గొడవలు ఏ స్థాయికి వెళ్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏదో ఒక రోజు కేడర్ ప్రాణాలకు ముప్పు వచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. వీరి వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. అసాంఘిక శక్తుల మాదిరి వ్యవహరిస్తుండటంతో ప్రజలకు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. గతంలోనూ ఇదే పరిస్థితి.. గార మండలం అంపోలు పంచాయతీలో ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సన్నద్ధమవ్వగా, ఇక్కడ చేయడానికి వీల్లేదని గొండు శంకర్ వర్గీయులు అడ్డు తగిలారు. లక్ష్మీదేవి అనుచరుడు వెలమల శ్రీనివాసరావు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా, గొండు శంకర్ అనుచరులైన మూర్తి, అచ్యుతరావులు అడ్డుకునేందుకు యత్నించారు. ఫోన్, వాట్సాప్ ద్వారా ఎవరు అడ్డుకుంటారో చూస్తామని లక్ష్మీదేవి వర్గం, ఎవరొచ్చి నిర్వహిస్తారో చూస్తామని గొండు శంకర్ వర్గీయులు వాదించుకున్నారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వారిని మరో వర్గానికి చెందిన నాయకులు ఇటీవల జరిగిన రామశేషు హత్య మాదిరిగా హతమార్చేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో అంపోలులో పార్టీ కార్యక్రమానికి బందోబస్తు కావాలని, తమను అడ్డుకోవడానికి గొండు శంకర్ వర్గీయులు ప్రయత్నిస్తున్నారని లక్ష్మీదేవి వర్గం శ్రీకాకుళం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా గొండు శంకర్ వర్గీయులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీదేవి తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాస్త సీరియస్‌గానే స్పందించారు. పార్టీ కార్యక్ర మం నిర్వహించుకుంటే ఫర్వాలేదని, గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సస్పెన్షన్
కడప కల్చరల్ : నగరంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేవీ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ నుంచి సోమవారం ఆయనకు ఉత్తర్వులు అందాయి. ఆయన స్థానంలో కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి ఇన్ఛార్జిగా పాలనా బాధ్యతలు చేపట్టనున్నారు. పాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా ప్రొద్దుటూరులోని గ్రేడ్1 లైబ్రేరియన్ అమీరుద్దీన్‌ను డిప్యూటీ లైబ్రేరియన్‌గా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రధాన కార్యాలయంలో నియమించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కేవీ కృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు జిల్లా గ్రంథాలయ సంస్థలోని ఉద్యోగుల అంతర్గత పోరే కారణమని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. స్థానికంగా పనిచేస్తున్న ఓ గ్రంథ పాలకుడిని విధి నిర్వహణలో భాగంగా కార్యదర్శి మందలించారని, దాంతో ఆ ఇద్దరి మధ్య పంతాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఈ విషయంలో స్థానిక అధికార పార్టీ చోటా నాయకుడు కల్పించుకోవడం, స్థానిక లైబ్రేరియన్‌కు మద్దతు పలకడం, కర్నూలుకు చెందిన కార్యదర్శి కృష్ణారెడ్డిపై రాష్ట్ర అ«ధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. చైర్మన్ జంబారపు వెంకట రమణారెడ్డికి ఈ వివరాలు తెలిసినా కూడా విషయం ఇంతవరకు రాకుండా చూసుకోలేక పోయారని ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. మరీ సీరియస్ విషయం కాకపోయినా కేవలం పంతాలు, పట్టింపులతోనే కార్యదర్శి విషయాన్ని సస్పెన్షన్ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం కార్యదర్శి సస్పెన్షన్ వ్యవహారంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఒంటెత్తుపోకడపై రగిలిన మంట
ఎమ్మెల్యేలు నల్లమిల్లి, వరుపుల తీరుపై టీడీపీ శ్రేణుల అసంతృప్తి అనపర్తి నియోజకవర్గంలో కదులుతున్న ‘దేశం’ కంచుకోటలు పార్టీకి స్వస్తి చెపుతున్న సీనియర్లు రచ్చకెక్కుతున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విభేదాలు ప్రత్తిపాడులోనూ వరుపుల తీరుకు నిరసన రాచపల్లి జనచైతన్యయాత్రలో ఎమ్మెల్యేకి ప్రతిఘటన సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తమ్ముళ్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ఒంటెత్తు పోకడలతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్లయితే పార్టీకి స్వస్తి చెప్పడానికీ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అనపర్తి, ప్రత్తిపాడు ఎమ్మెల్యేల తీరుపై నాయకులు, కార్యకర్తలే రచ్చ చేయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగంపేట మండలం మర్రిపూడి ఆవిర్భావం నుంచీ టీడీపీకి కంచుకోట. అలాంటి పలువురు సీనియర్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (రాము) తీరును, ఏకపక్ష విధానాలను తప్పుపడుతూ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిక్కవోలు, పందలపాక, గొల్లలమామిడాడ, పెదపూడి, దొడ్డిగుంట, సుభద్రంపేట, రంగంపేట తదితర గ్రామాల్లోనూ తమను పక్కనపెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యేపై సీనియర్లు రగిలిపోతున్నారు. కారాలుమిరియాలు నూరుతున్న దొరబాబు వర్గం మరో సీనియర్ నేత, అనపర్తి జెడ్పీటీసీ కర్రి దొరబాబు వర్గం ఇటీవల పార్టీ కారక్రమాలకు దాదాపు దూరమైంది. ఎమ్మెల్యే తీరు నచ్చకున్నా దొరబాబు సీనియర్ల మాటను తోసిపుచ్చలేక మహేంద్రవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొని వెనుతిరిగారు. గత జూలై 3న దొరబాబు జన్మదినం. ఆ రోజు బిక్కవోలు పందలపాకలో అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే తొలగించారని దొరబాబు వర్గం కారాలుమిరియాలు నూరుతోంది. ఇందుకు ప్రతిగా బిక్కవోలు మండలంలో పౌల్ట్రీ అసోసియేష¯ŒS సన్మాన కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు కట్టకుండా అవమానించారని దొరబాబు సోదరులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాన్ని మరింత రాజేసింది. కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చాలని బలభద్రపురం సమావేశంలో దొరబాబు సూచనను ఎమ్మెల్యే పెడచెవిన పెట్టారంటున్నారు. భవిష్యత్‌లో టిక్కెట్టుకు పోటీ వస్తారనే అనుమానంతోనే ఎమ్మెల్యే, ఆయన వర్గం దొరబాబును అవమానాలకు గురిచేస్తూ పొగపెడుతున్నట్టు కనిపిస్తోందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. కామినేని సమక్షంలోనే బొడ్డు కన్నెర్ర సొంత సామాజికవర్గానికి చెందిన జెడ్పీటీసీని దూరం పెడుతున్న రామకృష్ణారెడ్డి చివరకు ఎమ్మెల్సీ భాస్కరరామారావుతో కూడా ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తగవు అధినేత చంద్రబాబు వద్ద ఉంది. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో కత్తులు దూశారు. మంత్రి గురువారం పెద్దాడలో పీహెచ్సీ భవన శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య గత కొంతకాలంగా నడుస్తోన్న వైరం మరోసారి రచ్చకెక్కింది. కామినేని ఎమ్మెల్యే వర్గానికి చెందిన బొడ్డు సత్తిరాజు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లబోగా ఎమ్మెల్సీ ససేమిరా అంటే అడ్డుకోవడంతో విభేదాలు మరోసారి బాహాటమయ్యాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి భాస్కరరామారావుకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డితో వైరమే ఉంది. మూలారెడ్డి అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయానా తండ్రి. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన మూలారెడ్డికి టిక్కెట్టు రాకుండా భాస్కరరామారావు అడ్డుకోని ఎన్నికే లేదంటారు. ఇలా వీరిద్దరి విభేదాలు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాము గెలిచాక కూడా కొనసాగుతున్నాయి. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన భాస్కరరామారావు హవాకు గండిపడి పెద్దాడలో పార్టీపరంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాన్ని ఆయన ఒక పట్టాన జీర్ణించుకోలేక ఎమ్మెల్యేపై బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగరేశారంటున్నారు. ఎమ్మెల్యే జన్మభూమి కమిటీకి అన్ని పనులపైనా పెత్తనం అప్పగించడంతో తన మాట చెల్లుబాటు కావడం లేదని ఎమ్మెల్సీ = కత్తులు దూస్తున్నారు. దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు పెద్దాడ వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్టుబోర్డు చైర్మ¯ŒSగా తన భార్య జగన్మోహినిని నియమించినట్టు ఎమ్మెల్సీ లేఖ తేగా ఎమ్మెల్యే రద్దు చేయించడం వీరి మధ్య విభేదాన్ని మరింత రాజేసింది. వరుపుల తీరుతో విభేదాలకు ఆజ్యం ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా దాదాపు రామకృష్ణారెడ్డి పంథాలో వెళుతున్నారని కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ విషయం శనివారం రాచపల్లిలో జరిగిన టీడీపీ జనచైతన్యయాత్రల్లో బయటపడింది. పార్టీకే చెందిన స్థానిక మహిళా సర్పంచ్‌ను అవమానించే రీతిలో ఎమ్మెల్యే వ్యవహరించడంపై సర్పంచ్ వర్గం తీవ్రంగా ప్రతిఘటించింది. పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలను పరిగణనలోకి తీసుకోకుండా విస్మరిస్తున్న వరుపుల వైఖరి ఆ నియోజకవర్గంలో విభేదాలను మరింత పెంచి పోషిస్తోందని పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే ఈ పరిణామాలు నాయకత్వానికి మింగుడు పడటం లేదు.