Interview board
-
వైద్యశాఖలో ఇంటర్వ్యూలు.. రెండో రోజు 462 మంది హాజరు
సాక్షి, అమరావతి: వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ విభాగాల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకానికి నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు గురువారం రెండో రోజు 462 మంది వైద్యులు హాజరయ్యారు. డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏపీవీవీపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల నియామకానికి బుధవారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండోరోజు డీఎంఈలో 61 పోస్టులు నోటిఫై చేయగా 304 మంది, ఏపీవీవీపీలో 137 పోస్టులు నోటిఫై చేయగా 158 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తులను పరిశీలించి మెరిట్ జాబితాలు ప్రదర్శించి, వీటిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలి రోజు 161 పోస్టులు భర్తీ తొలి రోజైన బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. పలువురు అభ్యర్థులకు గురువారం పోస్టింగ్‌లు ఇచ్చారు. తొలి రోజు 161 పోస్టులు భర్తీ అయినట్టు ఏపీవీవీపీ కమిషనర్, ఇన్చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. తొలి రోజు డీఎంఈలో 96 పోస్టులు నోటిఫై చేయగా 45, ఏపీవీవీపీలో 173 పోస్టులు నోటిఫై చేయగా 116 భర్తీ చేశామన్నారు. శుక్రవారం కూడా ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. -
గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్ కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. చదవండి: (ప్రతీ దానికి పిల్ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు) -
నాకు జాబ్ కావాలి.. మీ జాలి కాదు..
సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటితో పోరాడుతున్న వారికి కావాల్సింది మద్దతు. అంతేకాని జాలి కాదు. బాధల్లో ఉన్నవాళ్లు చెడ్డవాళ్లు కాదు. వాళ్లను చూడగానే మీ ముఖ కవళికలు మార్చాల్సిన అవసరం లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరు క్షణమే అతన్ని మెచ్చకుంటూ తమ కంపెనీలో ఉద్యోగం చేయాలంటూ అనేక మంది సీఈవోలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటీ అతను ఎందుకలా స్పందించాడు? ఝార్ఖండ్కి చెందిన ఆర్ష్ నందన్ ప్రసాద్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా భయంకరమైన నిజం బయటపడింది. అతని ఒంట్లోకి ప్రవేశించిన క్యాన్సర్ వ్యాధి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మొదలెట్టింది. దీంతో ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జూమ్‌లో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఇంటర్వ్యూలో అవతలి వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలకు ఆర్ష్ నందన్ సరైన సమాధానలు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులకు అతనిచ్చే సమాధానాల కంటే అతని ఆరోగ్య పరిస్థితిపైనే ఎక్కువ కన్సర్న్ చూపిండం ఆర్ష్ నందన్ ప్రసాద్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. జాబ్ ఇవ్వడం మాట అటుంచి... ఆస్పత్రి బెడ్‌పై ఉన్న అతన్ని చూడగానే ముఖకవళికలు మార్చడం, జాలిగా మాట్లాడటం. అతని నైపుణ్యాలు, సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేయడం ఎక్కువైంది. ఓవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్‌కి ఇంటర్వ్యూయర్ల ప్రవర్తన మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది. కీమో థెరపీతో క్యాన్సర్‌తో పోరాడే సమయంలో వీళ్ల ప్రవర్తన తనకు ఇబ్బందిగా ఉంటోందని పేర్కొటూ లింక్డ్ ఇన్‌లో మేసేజ్ పెట్టాడు. అందులో నా స్కిల్స్, సామర్థ్యం చూడండి అంతే కానీ నాకున్న వ్యాధిని చూసి జాలి పడొద్దు. నాకు కావాల్సింది అది కాదంటూ పేర్కొన్నాడు. ఆర్ష్ నందన్ ప్రసాద్ లింక్డ్ఇన్ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ కంప్యూటింగ్ సంస్థ సీఈవో నీలేశ్ సప్తూర్ స్పందించాడు. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న నువ్వు ఒక యోధుడివి. ఇకపై ఇంటరర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్. నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టు. ట్రీట్మెంట్ తీసుకో. నీ క్రెడెన్షియల్స్ నేను చూశాను. అన్నింటా సూపర్‌గా ఉన్నావ్. నీలాంటి యోధుడికి మా కంపెనీలో ఎప్పుడూ ఉద్యోగం రెడీగా ఉంటుంది. నువ్వు కావాలనుకున్నప్పు వచ్చి జాయిన్ అవమంటూ ఆఫర్ ఇచ్చాడు. విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలకు చెందిన సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. నందన్ ప్రసాద్ మద్దతుగా అనేక మంది గళం విప్పారు. మొత్తానికి కార్పోరేట్ వరల్డ్ చేపట్టే ఇంటర్వ్యూలపై ప్రసాద్ సరికొత్త చర్చకు తెర తీశాడు. చదవండి: మస్క్ చేతికి ట్విటర్.. సీఈవో పరాగ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు -
గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత పరీక్షతోనే అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్వ్యూ(మౌఖిక పరీక్ష)లకు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితే, ఉద్యోగ నియామకాల క్రతువు వేగంగా పూర్తి అవుతుందని, పొరపాట్లకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమేనా.... ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్–1 నియామకాల ప్రక్రియ 3 అం చెల్లో సాగింది. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అనంత రం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. ఇప్పటివరకు గ్రూప్–2లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రూప్–1, గ్రూప్– 2ల సిల బస్, పరీక్షల విధానంపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే సిలబస్‌లో ఏమైనా మార్పులుంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమ వుతున్నాయి. సిలబస్‌లో మార్పు చేస్తే నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశముం దని, నూతన సిలబస్ ఎంపిక, మెటీరియల్ ఫైనలైజేషన్ కొలిక్కి రావడానికి సమ యం పట్టవచ్చని పలువురు భావి స్తున్నారు. అయితే సిల బస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఇంటర్వ్యూలకు సంబం ధించిన అంశాలను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షల్లో కవరయ్యే విధంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సర్వీసు నిబంధనలపై పట్టున్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో రద్దు గ్రూప్–1, గ్రూప్–2 ఇంటర్వ్యూలను రద్దు చేయాలని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అక్కడ గత ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను ఆసరాగా చేసు కుని ఇష్టానుసారంగా మార్కులు కేటాయించిన అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పారదర్శకత పాటించే విధంగా అక్కడి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దుచేయాలని భావించింది. ఉత్తరాదిలో మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నియామకాలను వేగంగా చేపట్టే లక్ష్యంతో సంస్కరణలు తీసుకురావడం శుభ పరిణామమని నిరుద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఎంచుకోవచ్చు
సాక్షి, అమరావతి: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు జరిగే గ్రూప్–1 పోస్టుల ఇంటర్వ్యూలను అత్యంత పారదర్శకంగా.. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పటిష్ట చర్యలు చేపట్టింది. గతంలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేకుండా కొన్ని కొత్త విధానాలను అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంటర్వ్యూ బోర్డు ఎంపిక అభ్యర్థులదే.. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. అభ్యర్థులు ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు. గతంలో ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో ఏపీపీఎస్సీ ముందుగా నిర్ణయించి.. ఆ మేరకు అభ్యర్థులకు తెలిపేది. దీనివల్ల అనేక లొసుగులకు ఆస్కారం ఉండేది. అనేక ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తేవి. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెడుతూ అభ్యర్థులే ఇంటర్వ్యూ బోర్డును ఎంచుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అభ్యర్థులు కమిషన్ కార్యాలయంలోని డబ్బాలో 1, 2, 3 ఇంటర్వ్యూ బోర్డుల నంబర్లతో కూడిన చిట్టీల్లో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బోర్డు నంబర్ వస్తే.. ఆ బోర్డు వద్దకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. బోర్డుల ఏర్పాటులో పలు జాగ్రత్తలు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు రెండు లేదా మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ బోర్డులకు చైర్మన్, సభ్యుల ఎంపికలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఏ బోర్డులో ఉంటారో అనే విషయం ఆ సభ్యుడికి ఇంటర్వ్యూ సమయానికి కొద్ది నిముషాల ముందు మాత్రమే తెలియనుంది. గతంలో అయితే బోర్డులో ఎవరెవరు సభ్యులో ముందుగానే అందరికీ తెలిసిపోయేది. ఈ విధానంలో అవకతవకలకు, ఆరోపణలకు ఆస్కారమేర్పడుతోందన్న ఉద్దేశంతో ఇప్పుడీ కొత్త పద్ధతిని కమిషన్ ప్రవేశపెడుతోంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా ఐదుగురు ఏరోజుకారోజు ఇంటర్వ్యూ బోర్డుల కూర్పు ఉంటుంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిలో ముగ్గురు ఏపీపీఎస్సీ సభ్యులు కాగా.. ఒకరు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి, మరొకరు ఐటీ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుడు ఉండేలా కమిషన్ చర్యలు చేపడుతోంది. ఒక్కో బోర్డు ఉదయం ఐదుగురికి, సాయంత్రం ఐదుగురికి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది. మార్కుల పద్ధతిలోనూ మార్పులు గ్రూప్–1 ఇంటర్వ్యూలను 75 మార్కులకు నిర్వహిస్తారు. గతంలో.. మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, కావాల్సినవారికి అత్యధిక మార్కులు వేస్తున్నారని, మిగతా వారికి అతి తక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. మొత్తం 75 మార్కుల్లో తమ వారికి 70కి పైగా వేస్తూ.. మిగతావారికి 10, 20 మార్కులతోనే సరిపెడుతున్నారని, దీనివల్ల రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మెరిట్ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని విమర్శలు చెలరేగేవి. రాతపరీక్షల్లో 500 మార్కులతో అగ్రస్థానంలో ఉన్న అభ్యర్థికి ఇంటర్వ్యూలో 20 మార్కులతో సరిపెట్టి.. తమకు సంబంధించిన అభ్యర్థికి 450 మాత్రమే వచ్చినా ఇంటర్వ్యూలో 70కి పైగా మార్కులు వేయడంతో మెరిట్ అభ్యర్థులు నష్టపోయేవారు. ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కమిషన్ మార్కుల కేటాయింపులోనూ నిర్దిష్ట ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. గ్రేడుల ప్రకారం మార్కులు.. 45 నుంచి 68 మార్కుల వరకు ప్రతి నాలుగు మార్కులను ఒక గ్రేడుగా పరిగణిస్తారు. ఆ గ్రేడ్ల ప్రకారం.. అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఉంటుంది. ఎవరికీ 45 మార్కుల కంటే తక్కువ.. 68 మార్కుల కంటే ఎక్కువ ఉండకుండా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అనంతరం బోర్డు సభ్యులు ఆయా అభ్యర్థికి వచ్చిన గ్రేడ్ల మార్కులను అనుసరించి.. చివరిగా ఏకాభిప్రాయంతో ఒక గ్రేడ్‌ను నిర్ణయించి.. బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో తుది మార్కులను ఖరారు చేస్తారు. తర్వాత వాటిని రికార్డులోకి ఎక్కించి బోర్డు చైర్మన్, సభ్యులంతా సంతకం చేస్తారు. ‘మాకు తక్కువ వేశారు.. వారికి ఎక్కువ వేశారు’ అనే వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్, వారు ఏం చదువుకున్నారన్న వివరాలను తప్ప మరే అంశాలను తెలియనివ్వరు. -
నేటి నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: గ్రూపు–2 పోస్టుల భర్తీలో భాగంగా సోమవారం(నేటి) నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,032 పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ జారీచేయగా, పలు న్యాయవివాదాల కారణంగా ఆలస్యమైంది. ఇటీవలే కోర్టు టీఎస్పీఎస్సీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పోస్టులభర్తీకి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా(హాల్‌టికెట్ నంబర్లు)ను ప్రకటించింది. కోర్టు ఆదేశాలతో వచ్చిన అభ్యర్థులుసహా మొత్తం 2,190 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. దాదాపు రెండు నెలలపాటు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ప్రతివారం తేదీలవారీగా ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాను వారం మొదటే ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే సోమవారం నుంచి 6వ తేదీ వరకు హాజరుకావాల్సిన 288 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో ఏయే హాల్‌టికెట్ నంబర్లవారు ఏయే రోజున ఇంటర్వ్యూలకు హాజరుకావాలనే వివరాలను ప్రకటించింది. రోజూ ఉదయం 24 మందికి, మధ్యాహ్నం 24 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు నెలలపాటు (8 వారాలు) ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. రోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి. సమగ్ర సంస్కరణల దిశగా.. ఇంటర్వ్యూల విధానంలో సమగ్ర సంస్కరణలకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. ఇంటర్వ్యూల్లో కనీస, గరిష్ట మార్కుల విధానం మొదలుకొని ఒక్కొక్కటిగా అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. ఇంటర్వ్యూల్లో నిష్పాక్షికతకు పెద్దపీట వేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న గ్రూపు–2 ఇంటర్వ్యూల్లోనూ వాటిని అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ఒకప్పుడు ఇంటర్వ్యూలంటే అభ్యర్థి సామాజికవర్గం, ప్రాంతం, కుటుంబనేపథ్యంలో అనేక అంశాలను కూడా ఇంటర్వ్యూల్లో దాదాపుగా అడిగేవారు. కానీ, అప్పుడు అవేవీ అడగవద్దన్న నిబంధనను టీఎస్పీఎస్సీ విధించుకుంది. అభ్యర్థి పేరును బట్టి ఏ సామాజికవర్గానికి చెందినవారో గుర్తుపట్టే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అవేవీ ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవారికి తెలియకుండా చర్యలు చేపట్టింది. కుటుంబ నేపథ్యం తెలుసుకొని ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అవి కూడా ఇంటర్వ్యూబోర్డులోని వారు అడక్కుండా నిబంధన విధించింది. గతంలో అభ్యర్థి పేరు, ప్రాం తం, ఇతర వివరాలను అడిగే విధానం ఉండగా, టీఎస్పీఎస్సీ రెడ్డి, రావు, యాదవ్ వంటి వివరాల తొలగింపుతో సంస్కరణలను వేగవంతం చేసింది. క్రమంగా ఇంటర్వ్యూ బోర్డులో ఉండే వారికి అభ్యర్థి వ్యక్తిగత వివరాలు అడక్కుండా చర్యలు చేపట్టింది. ఇంటర్వ్యూ బోర్డుల్లో ఉండే కమిషన్ సభ్యులు, సబ్జెక్టు నిఫుణులు కూడా ఏ బోర్డుకు ఎవరు వెళతారో ముందుగా తెలిసే అవకాశం లేకుండా చేసింది. కేవలం 10 నిమిషాల ముందే కమిషన్ సభ్యుడు గానీ, సబ్జెక్టు నిఫుణులుగానీ వెళ్లే బోర్డు వివరాలను ఆన్లైన్ అలాట్మెంట్ ద్వారా తెలియజేస్తారు. ఇంటర్వ్యూ బోర్డుకు ర్యాండమ్‌గా అభ్యర్థుల ఎంపిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సంస్కరణలు అమలు చేస్తోంది. ఆన్లైన్లో ర్యాండమ్‌గా అభ్యర్థులను ఎంపిక చేసి బోర్డుకు కేటాయిస్తారు. అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవారికి తెలియకుండా సంస్కరణలు తీసుకువచ్చింది. ఇందుకోసం యూనిక్ టోకేన్ నంబర్ విధానం తెచ్చింది. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్ స్థానంలో యూనిక్ టోకెన్ నంబరు కేటాయిస్తుంది. ఆ టోకెన్ నంబర్లను ఇంటర్వ్యూ ప్రారం¿¶భం కావడానికి కొన్ని క్షణాల ముందు ఇంటర్వ్యూ బోర్డుకు పంపించేలా చర్యలు చేపట్టింది. దీంతో ఇంటర్వ్యూకు ఎవరు వస్తున్నారో.. ఏ బోర్డుకు ఎవరు వెళతారో తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నిష్పాక్షికతకు పెద్దపీట వేసింది. ఒకసారి వేసిన ఇంటర్వ్యూ మార్కులను, గ్రేడ్లను మార్పుచేసే వీలు లేకుండా ఆన్లైన్ గ్రేడింగ్, మార్క్స్ విధానం తెచ్చింది. ఒక అభ్యర్థికి గ్రేడ్, మార్కులను బోర్డులో ఉండేవారికి ఇచ్చే ట్యాబ్‌లోనే ఆన్లైన్లో వెంటనే పొందుపరిచేలా చర్యలు చేపట్టింది. అవి సర్వర్‌కు కనెక్ట్ అయి ఉండేలా చర్యలు చేపట్టింది. దాంతో ఒకసారి వేసిన మార్కులు, గ్రేడ్లను మార్పు చేసే వీలులేకుండా, పైగా గ్రేడ్లు, మార్కులేకాదు ఆ వివరాలు మొత్తం స్క్రీన్ పైనుంచి మాయం(డిజప్పియర్) అయ్యేలా చర్యలు చేపట్టింది. కాన్ఫిడెన్షియల్ వర్క్ చూసే అధికారి మాత్రమే సర్వర్‌లోని ఆ వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేలా సంస్కరణలు తీసుకువచ్చింది. -
ఉద్యోగ సాధనకు.. వినే లక్షణం!
ఇష్టమైన ఉద్యోగంలో చేరాలంటే.. అంతకంటే ముందు ఇంటర్వ్యూలో ప్రతిభ చూపాలి. రిక్రూటర్‌ను మెప్పించే సమాధానాలివ్వాలి. సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నప్పటికీ మౌఖిక పరీక్షలో పొరపాట్లు చేస్తే కొలువు దూరమవుతుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన, మాటతీరును పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రశ్నలను సంధిస్తారు. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని సరైన సమాధానాలు చెప్పాలి. ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే అభ్యర్థికి దాన్ని పూర్తిగా వినే లక్షణం ఉండాలి. కొందరు ప్రశ్న పూర్తి కాకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల తమ చురుకుదనం ఇంటర్వ్యూ బోర్డుకు తెలుస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇది నిజం కాదు. ప్రశ్న ఏమిటో తెలియకుండానే తోచిన సమాధానం ఇచ్చేయడం మంచి లక్షణం కాదు. జాబ్ ఇంటర్య్యూలో నెగ్గాలంటే లిజనింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశ్నను అర్థం చేసుకోవాలి రిక్రూటర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అంతరాయం కలిగించడం సభ్యత కాదు. వారు చెప్పే విషయం పూర్తిగా వినాలి. దాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకోవాలి. రిక్రూటర్ తమ నుంచి ఏం కోరుకున్నారో గ్రహించాలి. ఆ తర్వాతే ఆన్సర్ చెప్పాలి. రిక్రూటర్ చెప్పేది వినడానికి కేవలం చెవులు తెరిచి ఉంచితే సరిపోదు, బాడీ లాంగ్వేజ్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. కుర్చీలో స్థిరంగా కూర్చొని కొద్దిగా ముందుకు వంగాలి. దీనివల్ల మీరు అప్రమత్తంగా ఉన్నట్లు, ఇంటర్వ్యూపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అలాకాకుండా నిర్లక్ష్యంగా కనిపిస్తే.. విజయావకాశాలు కచ్చితంగా తగ్గుతాయి. సందేహాలను తీర్చుకోవాలి మౌఖిక పరీక్ష అంటే అభ్యర్థి గురించి రిక్రూటర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, కంపెనీ, ఉద్యోగం గురించి అభ్యర్థి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడే వేదిక. కాబట్టి అభ్యర్థులు తమ సందేహాలను రిక్రూటర్ ఎదుట ఉంచాలి. ఉద్యోగం, అందులో లాభనష్టాలు, వర్క్ కల్చర్ గురించి అడిగి తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ బోర్డు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోతే మరోసారి చెప్పాలని మర్యాదగా విజ్ఞప్తి చేయాలి. మీరు చెప్పే సమాధానాన్ని ఒకసారి మనసులో మననం చేసుకున్న తర్వాత వ్యక్తపర్చడం మంచిది. జాబ్ ఇంటర్వ్యూల్లో సాధారణంగా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటికి సమాధానాలను ముందే ప్రిపేర్ చేసుకోవాలి. వినడం.. విలువైన లక్షణం రిక్రూటర్ అభ్యంతరకరమైన ప్రశ్న ఏదైనా అడిగితే.. ఆ ప్రశ్న అడగడానికి గల కారణాన్ని అభ్యర్థి తెలుసుకోవచ్చు. ఈ అవకాశం ఉంటుంది. అవసరమైతే రిక్రూటర్ నుంచి అదనపు సమాచారం కోరొచ్చు. ప్రశ్నపై స్పష్టత వచ్చిన తర్వాత సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇంటర్వ్యూలో ఒకరు చెప్పేది మరొకరు పూర్తిగా వింటే కమ్యూనికేషన్ సక్రమంగా జరుగుతుంది. సహనంతో వినడం అనేది విలువైన లక్షణం. ఇది మీరు కోరుకున్న ఉద్యోగం సాధించిపెట్టడంతోపాటు తర్వాత కెరీర్లో ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.