Involvement
-
Justin Trudeau: నిఘా సమాచారమే.. గట్టి ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు. నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు. ‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.లేవంటూనే.. మళ్లీ పాతపాటనిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది. -
Kargil War: ఎట్టకేలకు అంగీకరించిన పాక్
కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు ఎట్టకేలకు దాయాది దేశం పాక్ అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.శుక్రవారం రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.Pakistan Acknowledges Role in 1999 Kargil War for the First Time#DY365 #Pakistan #KargilWar pic.twitter.com/pW6JcCNqQO— DY365 (@DY365) September 7, 20241999 మే-జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్.. తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం.అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ చెబుతూ స్న్నేతోంది. ముజాహిదీన్ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్‌లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్‌ను ‘ఫోర్ మ్యాన్ షో’ అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అయితే పాక్ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజా ప్రకటనతో.. పాక్ ఓటమి గుట్టు బట్టబయలైంది.సంబంధిత వార్త: గెలవలేని యుద్ధం చేసిన పాక్ -
క్యాసినో వ్యవహారంలో కీలక పరిణామం
-
లంబాడాలను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్
-
టీడీపీ నేతల అండతోనే చెరువుల అక్రమ తవ్వకాలు
భీమవరం : జిల్లాలో సారవంతమైన భూములను విచ్చలవిడిగా రొయ్యల చెరువులుగా తవ్వటానికి టీడీపీ నాయకుల అండదండలే కారణమని వివిధ రాజకీయపార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. అక్రమ చెరువుల వల్ల జిల్లా అంతా కాలుష్యకారకంగా మారుతున్నా మత్స్యశాఖాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని దుయ్యబట్టారు. స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో అక్రమ చెరువుల తవ్వకాలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు జుత్తిగ నర్సింహమూర్తి మాట్లాడుతూ మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి వేలాది ఎకరాల భూములు రొయ్యల చెరువుగా మార్చివేయడంతో జల, వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. లక్షల మందికి మంచినీటిని అందించే భీమవరం పైపుల చెరువుకు అతి సమీపంలో చెరువులు తవ్వుతున్నా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు ఏం చేస్తున్నారంటూ నర్సింహమూర్తి ప్రశ్నించారు. అక్రమంగా తవ్వుతున్న చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణ, కాంగ్రెస్ భీమవరం మండలాధ్యక్షుడు బోకూరి విజయరాజు, సీపీఐ పట్టణ కార్యదర్శి మల్లుల సీతారాం ప్రసాద్, మల్లుల శ్రీను, సీపీఎం నాయకుడు, ఎం.వైకుంఠరావు, చేబోలు సత్యనారాయణ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
కబ్జాకోరుల చేతుల్లో వృద్ధ దంపతుల ఇళ్లు
-
ఎంసెట్ లీక్ పై ఆధారాలున్నాయి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు ముద్దాయని.. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వంలోని పెద్దలతో పాటు సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందినవారి హస్తం ఉందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్ద కుంభకోణాన్ని చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం జరుగుతోంద న్నారు. సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తులు, మిత్రుల పాత్ర కూడా ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. మంత్రుల మీద, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ నిర్వాకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఫిర్యాదులు అందినా మంత్రి కడియం, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పందించకపోవడమే లీకేజీ వెనుక సీఎం కుటుంబ సభ్యుల హస్తం ఉందనడానికి నిదర్శనమన్నారు. విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తేనే దోషులు తేలుతార న్నారు. లీకేజీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి లక్ష్మారెడ్డిపైన విచారణ జరపాలన్నారు. -
ఇక వాళ్లు జోక్యం చేసుకోరట!
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ - లలిత్ మోదీ వ్యవహారంలో తలమునకలైన కేంద్రంలోని బీజేపీ సర్కారు - ఓటుకు కోట్లు వ్యవహారంలో తలదూర్చరాదనే ఆలోచనకు వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే కేసు కోర్టు ముందుకు వెళ్లడం, కీలక పాత్రధారిని ప్రశ్నించడం, అతను జైల్లో ఉండటం, మరో వైపు కేసులో అనుమానితుల్ని ప్రశ్నించేందుకు ACB వేగం పెంచడంతో ఇక ఇందులో జోక్యం చేసుకోరాదనే భావనలో ఢిల్లీ పెద్దలున్నట్టు సమాచారం. అసలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఓటుకు కోట్లు వ్యవహారాన్ని పట్టించుకోరాదనే ధోరణి ఢిల్లీ నాయకుల్లో కనిపిస్తోంది. దీనికి తోడు సుష్మా, లలిత్ మోదీ వ్యవహారంలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ పేరు వినిపిస్తుండటంతో ఎటు పాలుపోని పరిస్థితి బీజేపీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో చట్టబద్ధంగా అన్ని సవ్యంగా ఉంటే నోటీసుల విషయంలో 'గో - ఎహెడ్' అని గవర్నర్‌కు ఢిల్లీ స్థాయి నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం పరిణామాల్ని గవర్నర్ నరసింహన్ ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నట్లు సమాచారం. గత వారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు కూడా ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని సూచించినట్టు తెలుస్తోంది. గవర్నర్ స్థాయిలోనే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని బాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం. -
అదరగొట్టారు
స్కూలు ఫంక్షన్స్‌లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వటం మాములే. అలా ఓ స్కూల్లో వేసిన నాటకంలో వాళ్ల ఇన్వాల్వ్మెంట్, టాలెంట్ చూసి ముచ్చట పడిన యాజమాన్యం.. మరోసారి పెద్దల కోసమంటూ లామకాన్‌లో వీళ్లతో ఓ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా పిల్లలు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు, చక్కటి హావభావాలతో మురిపించారు. కామెడీ, సెటైర్, చక్కటి భాష కలిసిన ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. షేక్స్పియర్ రాసిన నాటకాలు అర్థం చేసుకోవటమే కష్టం. అలాంటిది ఆ నాటకాన్ని అలవోకగా ప్రదర్శించడం మహామహా నటులకే సాధ్యమయ్యే పని. అంతటి క్లిష్టమైన నాటకాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు... అనుభవమున్న నటుల్లా ఆయా పాత్రల్లో జీవించారు చిన్నారులు. నగరంలోని శ్లోక పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్స్పియర్ ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకాన్ని నవరస రంజితంగా ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఒరిజినల్లో వున్న క్యారెక్టర్లు, కథనం అలాగే ఉన్నాయి. సంభాషణలు మోడరన్ డేస్‌కి అనువుగా మార్చి, కాంటెపరరీగా మలిచిన ఈ నాటకం అబ్బురపరిచింది. ఊహించని మలుపులు.. షేక్స్పియర్ నాటకం విషయానికి వస్తే.. ‘ఫ్రెడరిక్ తన అన్న డ్యూక్ ఆస్తిని ఆక్రమించుకుని అతన్ని తరిమేస్తాడు. కానీ అతని కూతురు రోజాలిండ్ని మాత్రం తన కూతురు సిలియా కోసం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చూసీ చూడగానే రోజాలిండ్ ప్రేమలో పడతాడు పరదేశ యువరాజు ఆర్నాల్డో. అతని అన్న ఆలివర్. రోజాలిండ్ ప్రేమ విషయం తెలిసి ఫ్రెడరిక్ కోపగించుకొని దండించబోతాడు. తట్టుకోలేక రోజాలిండ్ అబ్బాయిగా, సిలియా ఎలీనాగా వేషం వేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. మారువేషాల్లో వున్న ఎలీనాతో అలివర్ ప్రేమలో పడతాడు. మగవేషంలో ఉన్న రోజాలిండ్ ఆర్నాల్డోని కలుస్తుంది. ప్రేమకోసం తపిస్తూ అతను రాస్తున్న కవితలు చదివి, ఆ ప్రేమను మరిచిపొమ్మని చెబుతుంది. మరోవైపు రోజాలిండ్ని అబ్బాయి అనుకుని ఫేబ్ అనే అమ్మాయి ఆమెను ప్రేమిస్తుంది. ఇలా ఒక ప్రేమ జంటతో మొదలైన కథలోకి నాలుగు జంటలు వస్తాయి. చివరికి సుఖాంతమవుతుంది. అయితే మధ్యలో వచ్చే అనేక పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రపంచం నేటికి చెప్పుకునే ‘జీవితం ఒక రంగస్థలం లాంటిది, అందులో మనమందరం పాత్రధారులం’ డైలాగ్స్ ఈ నాటకంలోనివే.