Irumbu Kuthirai
-
అయోగ్యుడవుతున్న విశాల్
తమిళసినిమా: నటుడు విశాల్ వ్యక్తిగతంగా చాలా మందికి సహాయం చేస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థికసాయం చేసి ఆదుకుంటుంటారు. అలాంటిది సడన్‌గా అయోగ్యుడిగా మారిపోతున్నారు. ఏమిటీ నమ్మడం లేదా? మీరు నమ్మినా, నమ్మకపోయినా విశాల్ అయోగ్యుడిగా మారుతుండడం నిజం. కంగారు పడకండి విషయం ఏమిటంటే ఇరుంబుతిరై చిత్ర విజయంతో మంచి జోష్‌లో ఉన్న విశాల్ తదుపరి అయోగ్య అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం తమిళంలో రీమేక్ కానుందనే ప్రచారం చాలా కాలం నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని మైఖెల్ రాయప్పన్ శింబు హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నిర్యించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆ చిత్రానికి విశాల్ హీరోగా మారుతున్నారు. అదే విధంగా ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే నిర్మాత మాత్రం మైఖెల్ రాయప్పనే. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం కోసం విశాల్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా నటి రాశీఖన్నా నాయకిగా నటించనున్నట్లు సమాచారం. -
డిజిటల్ ఇండియా మరోకోణం
తమిళసినిమా: డిజిటల్ ఇండియా మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇరుంబుతిరై చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పీఎస్. మిత్రన్ పేర్కొన్నారు. విశాల్ కథానాయకుడిగా నటించి తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇరుంబుతిరై. నటి సమంత నాయకిగా నటించిన ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సుమన్, రోబోశంకర్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్ర నిర్మాణంలో లైకా సంస్థ భాగస్వామ్యం పంచుకుంది. ఇందులో విశాల్ ఆర్మీ అధికారిగా నటించగా, నటి సమంత ఆర్మీ సైకియాలజిస్ట్గా నటించారు. ఇరుంబుతిరై శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర సగ భాగాన్ని బుధవారం పత్రికల వారికి చిత్ర యూనిట్ స్థానిక సత్యం థియేటర్లో ప్రదర్శించారు. ఇలా చిత్ర సగ భాగాన్ని ప్రదర్శించడం అన్నది కొత్త విధానం అవుతుంది. అనంతరం చిత్ర దర్శకుడు పీఎస్. మిత్రన్ మాట్లాడుతూ ఎప్పుడు కొత్తగా ఆలోచించే నటుడు విశాల్ తన ఏదో ఒక చిత్ర సగభాగాన్ని విడుదలకు ముందు పత్రికల వారికి ప్రదర్శించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని భావించారన్నారు. ఇప్పుడు ఇరుంబుతిరై చిత్ర సగభాగా న్ని ప్రదర్శించడానికి అదే కారణం అని పేర్కొన్నారు. చిత్ర రెండవ భాగం జనరంజకంగానే ఉంటుందన్నారు. ఆధార్ కార్డు వల్ల కలిగే ముప్పు గురించి ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతోందని, నిజా నికి డిజిటల్ ఇండియా మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇరుంబుతిరై చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్ర సగభాగాన్ని ముందుగా పత్రికల వారికి ప్రదర్శించడంలో తమ కెలాంటి భయం లేదని, ఒక కొత్త ప్రక్రియకు నాంది పలకాలన్నదే దీని ముఖ్యోద్దేశం అని అన్నారు. ఈ సమావేశంలో లైకా సంస్థకు చెందిన కరుణ, ఆయుబ్ఖాన్, ఎడిటర్ రూపన్ పాల్గొన్నారు. -
విభేదాల్లేవు
ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మీల మధ్య విభేదాలు వున్నట్లు పలువురు భావిస్తున్నారని అయితే అటువంటిదేమీ లేదని దర్శకుడు యువరాజ్ బోస్ తెలిపారు. అధర్వ, ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మి నటిస్తున్న చిత్రం ‘ఇరుంబు గుదిరై’. దీనిపై దర్శకుడు యువరాజ్ బోస్ మాట్లాడుతూ అధర్వ వద్ద ఈ చిత్ర కథ వినిపించినపుడు ఎగిరి గంతేశారని అన్నారు. సాధారణ బైక్ అరుులే శిక్షణ అవసరం లేదని, రేస్ బైక్ అయిన దీనికి 8 గేర్లుతో ఎంతో ప్రత్యేకత కలిగివుంటుందని చెప్పానన్నారు. అందుకు ఈ బైక్ రైడింగ్‌కు తప్పకుండా శిక్షణ తీసుకోవాలని తెలిపానన్నారు. దీంతో ఆయన శిక్షణ తీసుకున్నారని, ఈ బైక్ నడపడం ఎంతో థ్రిల్లింగ్ కలిగించినట్లు చెప్పారన్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆస్ట్రేలియాలో చిత్రీకరించామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఒక నిమిషంలో చేసే పొరపాటు హీరో జీవితంలో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఈ చిత్రం తెలియజేస్తుందన్నారు. అధర్వ బైక్ నడిపే అన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా హెల్మెట్ ధరించారని, ఇది యువతను దారి తప్పించే చిత్రంగా ఉండబోదన్నారు. రేస్ సన్నివేశాలు పూర్తిగా దానికి సంబంధించిన ట్రాక్‌లో జరిగినట్లు చిత్రీకరించామన్నారు. అగోరం సోదరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మి ఇద్దరూ నటిస్తున్నారని, వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలున్నాయని అయితే అటువంటిదేమీ లేదన్నారు. వీరిరువురూ స్నేహంగా మెలగడమే గాకుండా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. భారత మొదటి మహిళా బైక్ రేసర్ అలిషా అబ్దుల్లా ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. -
అప్పుడు నో... ఇప్పుడు ఓకే
ఆడ వారి మాటలకు అర్థాలే అనడానికి నిదర్శనం నటి లక్ష్మీరాయ్. హీరోయిన్ల కోపానికి కారణాలే వేరులే అనిపిస్తుంది. చిత్రంలో ఉన్నానా? లేదా? అంటూ దర్శక నిర్మాతలపై ఆగ్రహంతో చిత్రం నుంచి వైదొలగిన ఈ అమ్మడు తాజాగా మళ్లీ అదే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అసలు విషయంలో కెళితే అధర్వ, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటి లక్ష్మీరాయ్‌ను ఎంపిక చేశారు. అయితే చిత్ర షూటింగ్ 60 శాతం పూర్తి అయినా ఈ బ్యూటీని షూటింగ్‌కు పిలవలేదు. దీంతో చిరైత్తడంతో ఈమె ఇరుంబుకుదిరై చిత్రంలో తానున్నానా, లేదా అంటూ ఆవేశంతో దర్శక నిర్మాతపై చిర్రుబుర్రులాడి చిత్రం నుంచి వైదొలగినట్లు వార్తలకెక్కేశారు. ఇరుంబు కుదిరై చిత్రంలో తానున్నానో లేదో తెలియదు. దీంతో ఇతర చిత్రాలకు కాల్షీట్స్ కేటాయించాలో లేదో తెలియదు. అందుకే చిత్రం నుంచి తప్పుకున్నానని ప్రకటించేశారు. ఇది ఇంతకు ముందు కథ. ఇప్పుడు మళ్లీ ఆ చిత్రంలో నటించడానికి లక్ష్మీరాయ్ సిద్ధం అవడం విశేషం. ఇటీవల ఆమెతో మాట్లాడిన దర్శక నిర్మాతలు లక్ష్మీరాయ్ తమ చిత్రంలో నటిస్తున్నారని ప్రకటించారు. ఇరుంబుకుదిరై చిత్రంలో లక్ష్మీరాయ్ ఇక నటించే అవకాశం లేదని భావించిన వారికి ఇది షాక్‌కు గురి చేసే అంశమే. అంతేకాదు. ఇరుంబుకుదిరై చిత్రంలో తాను నటించనున్నట్లు, ఇంతకు ముందెప్పుడూ పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నట్లు లక్ష్మీరాయ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి చిత్ర దర్శకుడు యువరాజ్‌ను అడగ్గా నిజమే లక్ష్మీరాయ్ తమ చిత్రంలో పరుగుల రాణిగా నటించనున్నారని వెల్లడించారు. అప్పుడు వైదొలగడానికి, మళ్లీ ఇప్పుడు నటించమనడానికి కారణం ఏమిటన్న ప్రశ్న కు మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు.