jagadishreddy
-
సూర్యాపేటలో ఆ సెంటిమెంట్! బీఆర్ఎస్కు హ్యాట్రిక్ సాధ్యమేనా?
ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ. నాలుగుసార్లు టీడీపీ, చెరో రెండు సార్లు సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి. తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐఎం అభ్యర్థి ఉప్పల మల్సూర్ ఎన్నికయ్యారు. 2004 వరకు ఎస్సీ రిజర్వుడుగా ఉన్న సూర్యాపేట 2009లో జనరల్‌గా మారింది. 2009లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నేత కూడా మూడోసారి విజయం సాధించిన దాఖలాలు లేవు. 1962, 67లో ఉప్పల మల్సూర్ రెండు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఆకారపు సుదర్శన్ కూడా రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఉన్న జగదీష్ రెడ్డి కూడా 2018 గెలుపుతో రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి గత చరిత్రను ఆయన తిరగరాసి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతారా లేక గతమే రిపీట్ అవుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : ఇక్కడ ప్రధానంగా అభివృద్ధే ఎన్నికలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజ్ ఏర్పాటు, జిల్లాకు నూతన కలెక్టరేట్, రోడ్ల విస్తరణ పనులు, సమీకృత మార్కెట్ నిర్మాణంతో పాటు సద్దల చెరువును ట్యాంక్ బండ్‌గా మార్చడంతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కొందరు కింది స్థాయి బీఆర్ఎస్ నేతల తీరు కూడా రాజకీయంగా ఆ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూసీ కాలువల ఆధునికీకరణ చేయాల్సి ఉంది. దీనికి తోడు సద్దల చెరువు పొంగితే దిగువన ఉన్న కాలనీ వాసులు ముంపుకు గురవుతున్నారు. ఈ సమస్యకు శాశ్యత పరిష్కారం చూపించాల్సి ఉంది. ఉండ్రుగొండను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు : ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ కేబినేట్లో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి మరో నేత కనిపించడం లేదు. అయితే కొందరు నేతల్లో మాత్రం అంతర్గతంగా అసంతృప్తిని వెలుబుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అని చెప్పుకునే ఓ నేత మంత్రికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైరి పార్టీకి చెందిన కీలక నేతతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూరా నర్సయ్య, వెంకటేశ్వరరావు కుమారుడు వరుణ్ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కులాల పరంగా ఓటర్లు: ► నియోవజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, రెడ్డి, వైశ్య సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ► సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైశ్యతో పాటు రెడ్డి సామాజికవర్గపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ► ఆత్మకూరు ఎస్ మండలంలో రెడ్డి, బీసీ, ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు నిర్ణాయాత్మక శక్తిగా ఉంటారు. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు : ఇక్కడ ప్రధాన నది మూసీ. సూర్యాపేట, పెన్‌పహాడ్ మండలాల గుండా మూసీ నది ప్రవహిస్తోంది. ఇక ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గానికి సాగు నీరు అందుతుంది. పర్యాటకం : చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో జరిగే లింగమంతుల జాతర తెలంగాణలోనే రెండో అతిపెద్దది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి గుట్టపై నెలకొని ఉన్న లింగమంతుల స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఈ జాతర మూడు రోజల పాటు సాగుతుంది. ఇక ఆరువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఉండ్రుగొండ గుట్టలు కూడా సూర్యాపేటకు పదికిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆలయాలు : ఇక్కడ స్వయంభూ లక్ష్మీనారసింహస్వామి కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున భక్తులు వస్తారు. ఇక వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి దేవాలయంతో పాటు అంతే ప్రాచుర్యం పొందిన శివాలయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. -
రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక : మంత్రి జగదీష్ రెడ్డి
-
ఈ ‘పేట’కు నేనే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా విభజనలో భాగంగా నాలుగు నియోజకవర్గాలతో నూతన జిల్లాగా సూర్యాపేట ఆవిర్భవించింది. ఇందులో జిల్లా కేంద్రంగా ఉన్న సూర్యాపేట నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా ఎదురుచూస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వల్ప మెజారిటీతో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయింది కూడా ఆయనే. పట్టణానికి మూసీ మురుగు నీళ్లే తాగునీరు. ఇవెంత శుద్ధి చేసినా తాగలేని పరిస్థితి. మిషన్ భగీరథతో కృష్ణాజలాలను సూర్యాపేటకు రప్పించే పనులకు ట్రయిల్ రన్ పూర్తయింది. ఇవి ప్రభావం చూపనున్నాయి. పార్టీ, ప్రభుత్వపరంగా ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న జగదీశ్‌రెడ్డి.. ప్రస్తుత ఎన్నికల్లో తాను గెలవడంతో పాటు మిగతా స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. సిట్టింగ్ ప్రొఫైల్ 2001లో టీఆర్ఎస్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో సిద్దిపేట, 2003లో మెదక్, 2004లో మెదక్, సిద్దిపేట ఉప ఎన్నికల సమయంలో పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించారు. అలాగే 2006లో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక, 2008లో ముషీరాబాద్, ఆలేరు స్థానాల ఉప ఎన్నికలకు ఇన్చార్జిగా ఉన్నారు. 2009లో సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ పార్టీ తరఫున హుజూర్నగర్ స్థానం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో బాన్సువాడ, 2012లో కొల్లాపూర్ ఉప ఎన్నికలకు పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సూర్యాపేట నుంచి విజయం సాధించడంతో తెలంగాణ తొలి మంత్రివర్గంలో చోటు దక్కింది. విద్యాశాఖ మంత్రిగా తొలుత బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న ఆయన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పని చేశారు. మళ్లీ వారితోనే ‘ఢీ’.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా సంకినేని వెంకటేశ్వరరావు, టీడీపీ నుంచి పటేల్ రమేష్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి జగదీశ్‌రెడ్డి పోటీ చేశారు. జగదీశ్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో సంకినేనిపై విజయం సాధించారు. ఈసారి జగదీశ్‌రెడ్డి (టీఆర్ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), సంకినేని వెంకటేశ్వరరావు (బీజేపీ) మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరికి వారు తమదే విజయం అన్న ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో విజయం సాధిస్తే.. ఈ సారి అభివృద్ధి మంత్రంతో తనదే గెలుపన్న నమ్మకంతో జగదీశ్‌రెడ్డి ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేట పట్టణంలో పలు పార్టీల కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరడం, నాలుగు మండలాల్లో ఇతర పార్టీల కేడర్ గులాబీ బాట పట్టడం వంటివి తనకు కలిసొస్తాయని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి: కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడం, దళితులకు మూడెకరాల పంపిణీ సరిగా అమలు కాకపోవడం వంటి వాటిపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. సంకినేని వెంకటేశ్వరరావు: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చలవతోనే రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి పనులు జరిగాయని, వాటిని టీఆర్ఎస్ తనవిగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. అభివృద్ధి హంగులు మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు మూసీ, పాలేరు వాగులపై చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.120 కోట్లు రూ.378 కోట్లతో మిషన్ భగీరథ పనులు జిల్లా కేంద్రంలో రూ.42 కోట్లతో నూతన భవన నిర్మాణాలు మురుగు నీటి ప్లాంట్‌కు రూ.81 కోట్లు మూసీ ప్రాజెక్టు ఆ«ధునీకరణకు రూ.79 కోట్లు డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.109 కోట్లు రూ.20 కోట్లతో ఆధునిక కూరగాయల మార్కెట్ నిర్మాణం ప్రధాన సమస్యలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది ఆటోనగర్, పారిశ్రామికవాడ నిర్మాణం కోసం ఎదురుచూపు నిరుద్యోగ సమస్య.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే యువతకు ఉపాధి సూర్యాపేటలో కలగా డిగ్రీ కళాశాల -ఇన్పుట్స్: బొల్లం శ్రీను -
అందుకే శాసనసభ సభ్యత్వం రద్దు: కోమటిరెడ్డి
సాక్షి, సూర్యాపేట : మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సూర్యపేటలో పర్యటించిన ఆయన.. ప్రజల సొమ్ము దోచుకోవడంలో మంత్రి జగదీష్ రెడ్డి స్టూవర్టుపురం దొంగలను మించి పోయారని విమర్శించారు. నూతన కలెక్టరేట్ స్థలం ఎంపికలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సుమారు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కలెక్టరేట్ విషయంలో దళితులను దారుణంగా మోసం చేశారని తక్కువ ధరకే బినామీలతో భూములు కొనిపించారని అన్నారు. ఏతప్పు చేయని రాజయ్యను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి జగదీష్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు స్పందించడంలేదంటూ ప్రశ్నించారు. కలెక్టరేట్ కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని కోమటిరెడ్డి అన్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన జగదీష్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదంటూ జోష్యం చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ప్రజలందరికీ అందుబాటులోనే కలెక్టరేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో స్థలాలు కొనొద్దంటూ సూచించారు. ప్రజలను పట్టించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫమైందని.. వారి అక్రమాలు, వైఫల్యాలను బయటపెడతామనే భయంతోనే తన శాసనసభ సభ్యత్వం రద్దు చేశారని కోమటి రెడ్డి ఆరోపించారు. -
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంపై ప్రత్యేక కమిటీ
డిసెంబర్ 3 నుంచి చైనాలో పర్యటించనున్న బృంద సభ్యులు సాక్షి, హైదరాబాద్: 125 అడుగుల ఎత్తున్న అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికిగాను ప్రత్యేకంగా అధ్యయన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, పార్లమెంటు సభ్యులు పసునూరి దయాకర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్‌లతో పాటు ఆర్అండ్బీ సీఈ గణపతిరెడ్డి, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి గుట్ట ఆర్డ్ డెరైక్టర్లు ఆనందసాయి, లక్ష్మి నారాయణలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ చైనాలో పర్యటించేందుకు సిద్ధమవుతోంది. అతిపెద్ద బుద్ధుని విగ్రహంతోపాటు పలు విగ్రహాలను చైనాలో విజయవంతంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆయా విగ్రహాల నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై కమిటీ సభ్యులు అవగాహన పెంచుకోనున్నారు. ఖర్చును సైతం అంచనా వేయడంతో పాటు నిర్మాణానికి కావాల్సిన ముడిసరుకు.. సర్దుబాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. డిసెంబర్ 3 నుంచి 11 వరకు పర్యటన సాగనుంది. అంబేడ్కర్ విగ్రహాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలో యాదగిరిగుట్టలో 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యాదగిరిగుట్ట ఆర్ట్ డెరైక్టర్లను కమిటీలో సభ్యులుగా చేర్చింది. పర్యటన అనంతరం వారిచ్చే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ప్రైవేటు విద్యుత్‌ను వదులుకోలేం
‘సాక్షి’ కథనంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందన ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండటం వల్ల గత రెండేళ్లుగా జెన్కో ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) భారీగా పడిపోయిందంటూ ‘సాక్షి’ మంగళవారం ‘ప్రైవేటు విద్యుత్‌పై అంత ప్రేమ ఎందుకో...అయ్యో పాపం జెన్కో’ పేరిట ప్రచురించిన కథనంపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించారు. అవసరంలేదని ప్రైవేటు విద్యుత్‌ను వదులుకుంటే అవసరమైనప్పుడు దొరకదని స్పష్టం చేశారు. ఓసారి ఒప్పందం చేసుకున్నాక ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఆ మేరకు చెల్లించక తప్పదన్నారు. ‘‘పీక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని జెన్కో ఉత్పత్తి పోగా మిగిలిన విద్యుత్‌ను ప్రైవేటు నుంచి కొనుగోలు చేస్తున్నాం. 15 శాతానికి మించి ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించుకోలేం. మిగతాది జెన్‌కోయే తగ్గించుకోవాల్సి ఉంటుంది’’ అని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు చట్టం, ఒప్పందాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాయన్నారు. విద్యుత్ సంస్థలు ప్రజలకు నష్టం కలిగించే చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో పీక్ విద్యుత్ డిమాండ్ 7,200 మెగావాట్లు ఉండగా వర్షాలు లేదా వాతావరణం చల్లబడటం వల్ల ఒక్కోసారి వెయ్యి నుంచి 2 వేల మెగావాట్ల డిమాండ్ పడిపోతోందన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒప్పందం మేరకు 15 శాతం ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించుకుంటున్నామన్నారు. మిగతాది జెన్‌కోయే విద్యుత్‌ను తగ్గించుకోవాల్సిందేనని...దీనివల్ల కనీసం జెన్కో ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చన్నారు. జెన్కో పీఎల్ఎఫ్ చాలా తక్కువగా ఉందని..ప్రైవేటు విద్యుత్ కొనడం వల్ల ఏదో నష్టం జరుగుతోందని..ప్రజలపై భారం పడుతోందన్న సమాచారం సరికాదన్నారు. ప్రతిక్షణం ప్రతి రూపాయిని ఎలా మిగ ల్చాలి... ప్రజలకు ఎలా లాభం చేయాలి... విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఎలా చూసుకోవాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. శ్వేతపత్రం అవసరం లేదు... టీజేఏసీ డిమాండ్ చేస్తున్నట్లు విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్లపై కొత్తగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం లేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే శ్వేతపత్రంలాగా పారదర్శకంగా ఉందన్నారు. నిర్వహణ లోపాలతో విద్యుత్‌కు అంతరాయం కలిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. హైదరాబాద్‌లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నాయన్న ఫిర్యాదులుతోనే సమీక్ష నిర్వహించానన్నారు. ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పీక్ డిమాండ్ 7,200 మెగావాట్లుగా ఉందని...వర్షాకాలానికి వ్యవసాయ పనులు మొదలైతే అది 9,000 మెగావాట్లకు చేరుతుందన్నారు. కాగా, విద్యుత్ సౌధలో విలేకరుల ప్రవేశంపై ఆంక్షలు లేవని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంటలిజెన్స్ హెచ్చరికల మేరకు ఎవరు వచ్చినా విచారించి లోపలకు అనుమతిస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి కూడా పాల్గొన్నారు. -
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డి
రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలి మంత్రి జగదీష్‌రెడ్డికి కాంగ్రెస్ నేత పొన్నం సవాల్ సూర్యాపేట: ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డికి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి ఒక్కరూ జిల్లా, రాష్ట్ర కీర్తిని నిలబెట్టారు కానీ.. దురదృష్టం కొద్ది మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం అవినీతి ఆరోపణలతో ఆ కీర్తికి మచ్చ తెచ్చారని విమర్శించారు. ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా తాను ఆరోపణలు చేశానని.. అయితే, ప్రభుత్వం వేయని పరువు నష్టం కేసు.. మంత్రి ఎందుకు వేశారో చెప్పాలన్నారు. పరువునష్టం కేసు జూన్ 3కు వాయిదా కాగా పరువు నష్టం దావా కేసులో పొన్నం ప్రభాకర్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి జడ్జి డి.కిరణ్‌కుమార్ జూన్ 3కు కేసును వాయిదా వేశారు. సరే.. కాంగ్రెస్ సిద్ధమా.. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి సవాల్ సూర్యాపేట: తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు సిద్ధమా అని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ కోర్టులో ఆధారాలు ఎందుకు చూపలేదని, కోర్టు సమన్లు పంపినా ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆరోపణలు చేసినందుకు కోర్టును ఆశ్రయించానని మంత్రి తెలిపారు. తనపై అక్కసుతో చేసిన ఆరోపణలను కోర్టులో రుజువు చేయాలని పేర్కొన్నారు. తన 14ఏళ్ల ఉద్యమ చరిత్రలో తెల్లకాగితంలా ఉన్నానని, నిబద్ధతతో ఉద్యమాలు చేశానని చెప్పారు. పొన్నం తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో కోర్టును ఆశ్రయించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ ఎక్కడ అడ్రస్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపైకి ఒక శిఖండిని వదిలారని విమర్శించారు. నేరస్తుడిగా కోర్టుకు వచ్చిన పొన్నంకు జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలకడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. -
జగదీష్‌రెడ్డి ఇంటికి వెళ్లనున్న సీఎం కేసీఆర్