Jagadiswar Reddy
-
నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు దశాబ్దం కిందట.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపిన ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుముల రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉండడంతో ఈ కేసు విచారణ వేరే ప్రాంతానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసే ఉంటుంది.బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు.చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు.సంబంధిత వార్త: అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి -
తాడిపత్రిలో ముదురుతున్న టీడీపీ గ్రూపు రాజకీయాలు
-
రౌడీ రాజ్యం
నంద్యాల్లో మాజీ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నం - నడిరోడ్డుపై వేట కొడవలితో అధికార పార్టీ నేత అభిరుచి మధు వీరంగం - రెండు రౌండ్లు కాల్పులు జరిపిన గన్‌మ్యాన్ - కనీసం అదుపులోకి తీసుకోని పోలీసులు నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ ప్రాంతం.. గురువారం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది.. దారికి అడ్డంగా ఓ వాహనం ఉండటంతో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వాహనం అక్కడికొచ్చి ఆగింది.. వాహనాన్ని పక్కకు తీయండని డ్రైవర్ చెబుతుండగానే ఎదుటి వైపు నుంచి రాళ్ల దాడి మొదలైంది.. టీడీపీ నేత మధు చేత్తో వేట కత్తి పట్టుకుని ఊగిపోతూ ఆవేశంతో రంకెలేస్తున్నాడు.. అంతలోనే ఆయన పక్కనున్న మరో వ్యక్తి చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.. చేయి పైకెత్తి టపా..టపా.. మని కాల్పులు జరిపాడు.. ఫ్యాక్షన్ సినిమాలోని సీన్‌ను తలదన్నేలా సాగిన ఈ సన్నివేశం సాక్షాత్తూ పోలీసుల కళ్లెదుటే జరిగింది.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయంతో అధికార పార్టీ అరాచకాలకు తెరలేపింది. పోలింగ్ రోజున పోలింగ్ శాతం పెరిగే కొద్దీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజే గురువారం మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు ఏకంగా వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మధు గన్‌మ్యాన్ శిల్పాను లక్ష్యంగా చేసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నంద్యాల నడిరోడ్డులో కార్లతో అటకాయించి మరీ.. చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయిం ది. ఈ తతంగమంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినప్పటికీ బాధితులు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులపైనే తొలు త కేసు నమోదు చేశారు. పోలీసుల కళ్లెదుటే టీడీపీ నేత మధు వేట కత్తి పట్టుకుని వీరంగం సృష్టిస్తుంటే కనీసం దానిని లాక్కొని అదుపు లోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. రౌడీషీటర్‌గా ఉన్న అధికార పార్టీకి చెందిన అభిరుచి మధును పోలీసులు కనీసం వారించే ప్రయత్నం జరగకపోవడం.. నిందితులను వెనకేసు కొస్తూ మంత్రి అఖిలప్రియ మాట్లాడటాన్ని గమనిస్తే అంతా స్కెచ్ ప్రకారమే వ్యవహారం నడిచిందన్న అనుమానాలు బలపడుతున్నా యి. మధుపై రౌడీషీట్ ఎత్తివేయడంతో పాటు ఉప ఎన్నికకు ముందు హడావుడిగా గన్‌మ్యాన్ ను కేటాయించడం చర్చనీయాంశమైంది. అంటే ఉప ఎన్నికకు ముందు అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు వ్యూహాత్మ కంగా రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. జరిగింది ఇదీ... నంద్యాలలోని సలీంనగర్లో నివాసం ఉంటు న్న వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు చింపిం గ్ బాషా బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డితో పాటు నలుగురు కౌన్సిలర్లు పరామర్శించి తిరిగి వస్తున్నారు. అధికార పార్టీకి కేంద్రంగా ఉన్న సూరజ్ హోటల్ సెంటర్లో టీడీపీ నేత అభిరుచి మధుతో పాటు మరికొందరు కార్యకర్తలు తమ కార్లను అడ్డంగా నిలిపి ఉంచి చక్రపాణి రెడ్డి కారును అటకాయించారు. దీంతో సైడ్ ఇవ్వమని చక్రపాణిరెడ్డి కారు డ్రైవర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ మాత్రం వారు స్పందించలేదు. అనంతరం నానాబూతులు తిడుతూ చక్రపాణి రెడ్డి కారువైపు అభిరుచి మధుతో పాటు మరికొందరు రాళ్లు రువ్వుతూ వేట కొడవళ్లతో దూసుకొచ్చారు. దీంతో చక్రపాణిరెడ్డి వెంట ఉన్న వారు ప్రతిఘటించేందుకు యత్నించా రు. ఈ సందర్భంగా మధు గన్‌మ్యాన్ సోమ భూపాల్ (నం.1681) రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తతంగం జరుగుతుండగా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయితే వారు మధు చేతిలోని వేట కొడవలిని లాక్కునేందుకు కానీ, అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ చేయలేదు. కొంత సేపటి తర్వాత చక్రపాణిని ఇంటికి పంపించా రు. అభిరుచి మధును బుజ్జగిస్తూ అతన్ని కూడా కారు ఎక్కించి మరీ సాగనం పారు. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. బాధితులపైనే కేసులు ఏదైనా సంఘటన జరిగితే మొదటగా ఎవరైతే బాధితులో వారి పక్షాన పోలీసులు నిలవాలి. అయితే ఇక్కడ మాత్రం పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగానే వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. నడిరోడ్డుపై వేట కొడవలి పట్టుకుని వీరంగం సృష్టించడంతో పాటు గీత గీసి మరీ సవాల్ విసిరిన మధును కనీసం ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఒకడుగు ముం దుకు వేసి మధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చక్రపాణి రెడ్డితో పాటు ఇతర నేతలపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేత జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుతో పాటు మున్నా అలియాస్ ఖాదర్, షేక్ చిన్ను, వేణు, గన్‌మ్యాన్ సోమభూపాల్‌పై కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. రౌడీషీట్ ఎత్తేసి ప్రోత్సహించారు.. వాస్తవానికి టీడీపీ నేత అభిరుచి మధు వ్యవహారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా అనేక మందిపై నడిరోడ్డుపై దాడి చేయడంతో పాటు పలు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై 2009లో నంద్యాల టూటౌన్ పోలీసు స్టేషన్లో రౌడీ షీటు నమోదైంది. వరుస దాడులతో జిల్లా ఉపాధ్యక్షుడి పదవి కూడా పోయింది. అయితే తిరిగి బాబు, లోకేశ్‌లను కలసి పదవి సంపా దించుకున్నారు. 2014లో చంద్రబాబు వచ్చాక రౌడీషీటర్‌ను కూడా ఎత్తివేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసేందుకు వీలుగా ఏకంగా గన్మ్యాన్లను ప్రభు త్వం కేటాయించింది. జరిగిన సంఘట నలను విశ్లేషిస్తే పక్కా స్కెచ్ ప్రకారమే వ్యవ హారం నడిచిందని అర్థమవుతోంది. రౌడీషీట ర్గా రికార్డు ఉన్న మధుకు గన్మ్యాన్లను (1+1)ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నే భద్రత కల్పించారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మారణాయుధాలతో నడిరోడ్డుపై ఎలా తిరిగారన్న ప్రశ్న ఎదురవుతోంది. -
ఇన్‌చార్జిలే దిక్కు
పదవీ విరమణ కారణంగా కొన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయి. బదిలీల వల్ల మరికొన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఆయా స్థానాల్లో మాత్రం కొత్త అధికారులు రావడం లేదు. జిల్లాలో ఉన్న అధికారులకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. దీంతో ఏళ్లుగా రెగ్యులర్ అధికారులు లేక ఆయా శాఖల్లో పాలన కుంటుపడుతోంది. ఇందూరు : సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే సమర్థులైన అధికారులుండాలి. కింది స్థాయి ఉద్యోగులతో పని చేయించాలన్నా, వారిని క్రమశిక్షణలో ఉంచాలన్నా ఆయా శాఖలకు రెగ్యులర్ అధికారులు ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయి. అయితే ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఖాళీల భర్తీపై దృష్టి సారించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఇందూరు జిల్లాలో పలు జిల్లా స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంక్షేమ శాఖలు, కార్పొరేషన్లలో జిల్లాస్థాయి అధికారులు కరువయ్యారు. దీంతో చాలా శాఖల్లో ఇన్‌చార్జిలే కని పిస్తున్నారు. ఒక అధికారి బదిలీపై వెళ్లడం వల్లో, ఉద్యోగ విరమణ పొందడం వల్లో ఖాళీ అయిన స్థానాన్ని వెంటనే భర్తీ చేయకపోవడం వల్ల ఈ పరి స్థితి వచ్చింది. అయిష్టంగానే అయినా.. ఇష్టం లేకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాల మేర కు పలువురు అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొందరు అధికారులకు రెండు మూడు శాఖల బాధ్యతలు కూడా అప్పగించారు. రెండు బాధ్యతలు నిర్వర్తించడం తమకు తలకు మించిన భారంగా మారిం దని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. తమ సొంత శాఖను చూసుకోవడంతో పాటు అదనంగా మరో శాఖ బాధ్యతలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ఒక పూట ఇక్కడ.. మరో పూట అక్కడ విధులు నిర్వర్తించడం సాధ్యం కావడంలేదంటున్నారు. పని భారం తట్టుకోలేక ‘‘నాకు ఇన్చార్జి బాధ్యతలు వద్దు’’ అని పలువురు అధికారులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్న దాఖలాలున్నాయి. ‘‘రెగ్యులర్ అధికారి వచ్చే వరకు ఎలాగోలా నెట్టుకురండి’’ అంటూ వారిని సముదాయించినట్లు సమాచారం. గాడి తప్పిన పాలన రెగ్యులర్ జిల్లా స్థాయి అధికారి లేకపోవడంతో ఆయా శాఖల పాలన గాడితప్పింది. సిబ్బంది, ఉద్యోగులు క్రమ శిక్షణ తప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేసే పథకాలు సక్రమంగా ప్రజలను చేరడం లేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తారని, ఆయా శాఖలకు రెగ్యులర్ అధికారులను నియమిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. జిల్లాలో ప్రధాన శాఖల్లో ఖాళీగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పోస్టుల్లో రెగ్యులర్ అధికారులను నియమిస్తే బాగుంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి * జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా ఉన్న రాములు గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆ స్థానంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన సహాయ అధికారి(ఏఎస్‌డబ్ల్యూవో) జగదీశ్వర్‌రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. * గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ అధికారి(ఏటీడబ్ల్యూవో) పదవీ విరమణ పొందటంతో శంకర్ అనే వార్డెన్ ఇన్చార్జ్ గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ అధికారిగా కొనసాగుతున్నారు. * జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్ పోస్టు ఏడాదికిపైగా ఖాళీగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్ ఆ బాధ్యతలు కూడా చూస్తున్నారు. * జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాజేశ్వర్ 16 నెలల క్రితం వేరే జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇంత వరకు ఆయన స్థానంలో రెగ్యులర్ అధికారి నియామకం కాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ఖాలేబ్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. * రెండేళ్లుగా జిల్లా సాంఘిక సంక్షేమాధికారి(డీఎస్‌డబ్ల్యూవో) లేరు. ప్రస్తుతం అల్ఫోన్స్ అనే అధికారి ఇన్చార్జిగా ఉన్నారు. * జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసిన రాజయ్య ఏడాది క్రితం పదవీ విరమణ పొందారు. ఇప్పటివరకు రెగ్యులర్ అధికారిని నియమించలేదు. ఏడాదిగా బోధన్ ఏబీసీడబ్ల్యూవో విమలాదేవి ఇన్చార్జి బీసీడబ్ల్యూవోగా కొనసాగుతున్నారు. * బీసీ కార్పొరేషన్ ఈడీగా పని చేసిన రాజశేఖర్ రెండేళ్ల క్రితం వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. అర్బన్ ఐకేపీ పీడీ సత్యనారాయణ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. * డీఆర్డీఏ ఏపీడీ(అడిషనల్ ప్రాజెక్టు డెరైక్టర్) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించలేదు. * జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్(ఏజేసీ) శేషాద్రి ఆనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజారాం ఇన్చార్జి ఏజేసీగా కొనసాగుతున్నారు. * సైనిక సంక్షేమ శాఖకు ఏడాదిగా రెగ్యులర్ అధికారి లేరు. ఐకేపీ పీడీ వెంకటేశం ఇన్చార్జి అధికారిగా వ్యవహరిస్తున్నారు. * జిల్లా పరిషత్‌లో తొమ్మిది నెలలుగా డిప్యూటీ సీఈఓ లేరు. ఏఓ పోస్టు కూడా ఖాళీగా ఉంది.