jagananna swachh sankalpam
-
జగనన్న స్వచ్ఛ సంకల్ప వాహనాలు ప్రారంభం
-
Live: జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం
-
ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఏపీకి మినహాయింపు
సాక్షి, విజయవాడ: ఎన్జీటీ పెనాల్టీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు లభించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుతో మినహాయింపు దక్కింది. 5 రాష్ట్రాలకు వేల కోట్ల పెనాల్టీ వేసిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఏపీలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ వల్ల పెనాల్టీ విధించలేదు. జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ఎన్జీటీ సంతృప్తి చెందింది. తెలంగాణకు 3,800 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కి 3 వేల కోట్లు, మహారాష్ట్రకు 12 వేల కోట్లు, రాజస్థాన్‌కి 3 వేల కోట్లు, కర్ణాటకకు 2, 900 కోట్లు ఎన్జీటీ పెనాల్టీ విధించింది. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
ఇటు పరిశుభ్రం.. అటు రాబడి
దాదాపు రెండు వేల జనాభా ఉండే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 15 రోజుల నుంచి వర్మీ కంపోస్టు తయారీ మొదలైంది. మే నుంచి ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను 45 రోజుల పాటు కుళ్లబెట్టి వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నారు. సేకరించిన చెత్తలో అట్టముక్కలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు వస్తువులు వంటి పొడి చెత్తను వేరు చేసి 217 కిలోలు విక్రయించారు. వీటిపై వచ్చిన రూ.2,800ను గ్రామ పంచాయతీకి జమ చేశారు. పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలు తయారు చేసే వర్మీని ‘పల్నాడు వర్మీ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేసేందుకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి కోరారు. పల్నాడు జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు ఉండగా 83 గ్రామాల్లో పూర్తి స్థాయిలో వర్మీ కంపోస్టు తయారీ ప్రారంభమైంది. అలాగే 186 గ్రామాల్లో తయారీ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభత్రతో కళకళలాడుతున్నాయి. మరోవైపు సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేయడం ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభించాక రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తతో దాదాపు 1,314 టన్నుల వర్మీ కంపోస్టును తయారుచేశాయి. అంతేకాకుండా ఇందులో 742 టన్నులను విక్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. 4,043 గ్రామాల్లో సేకరించిన చెత్తను.. అవే గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసి.. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్నారు. అలాగే పొడి చెత్తను నేరుగా విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో సేకరించిన చెత్తలో ఇప్పటిదాకా 1290.544 టన్నుల పొడి చెత్తను అమ్మారు. వర్మీ కంపోస్టు, పొడి చెత్త అమ్మకం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలకు రూ.1.41 కోట్ల ఆదాయం సమకూరిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెటింగ్ వ్యూహాలపై అధికారుల కసరత్తు.. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీకంపోస్టు తయారీ ప్రారంభమైతే ఒకట్రెండు సంవత్సరాల్లోనే 20–30 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్టును సకాలంలో అమ్మడానికి ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం అవసరమని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో తయారుచేస్తున్న వర్మీ కంపోస్టును పల్నాడు బ్రాండ్ పేరుతో విక్రయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలోనే స్థానిక రైతులు వర్మీ కంపోస్టును కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటల సాగులో వర్మీ కంపోస్టు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించనున్నారు. అలాగే భవిష్యత్‌లో ప్లాస్టిక్, గాజు వ్యర్థాలను రోడ్ల తయారీలో, సిమెంట్ పరిశ్రమలో వినియోగించేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రతివారం సమీక్ష ఒకప్పుడు అపరిశ్రుభ వాతావరణం కారణంగా గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్ వంటివి సంభవించేవి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో వీటికి అడ్డుకట్ట పడింది. వారంలో ఒక రోజు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. సేకరించిన చెత్తను తుది దశకు చేర్చడంపై దృష్టిసారిస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ.. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. ఆ చెత్తను ఆ గ్రామంలో నిర్మించిన షెడ్లకు తరలించి వర్మీ తయారు చేయడం.. వేరు చేసిన పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత వర్మీ కంపోస్టు కామన్ బ్రాండ్ నేమ్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. – కోన శశిధర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ -
బండెనక బండి కట్టి..
సాక్షి, అమరావతి: గ్రామాలు, పట్టణాల్లో మెరుగైన పారిశుధ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం నినాదంతో ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలు, ఇతర చెత్తను రోడ్లపై వేయక ముందే వాటిని గ్రామ పంచాయతీ, మున్సిపల్, నగరపాలక సిబ్బంది సేకరించేలా పారిశుధ్య కార్యక్రమాలకు ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో చెత్త సేకరణకు 4,097 వాహనాలను కొనుగోలు చేసింది. శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు ఆయన వేదిక వద్ద జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలు సమర్పించి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. అనంతరం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రూపొందించిన ప్రత్యేక సీడీని ఆవిష్కరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ వాహనాలు ఒక్కొక్కటిగా సీఎం ఉన్న వేదిక వద్ద నుంచి ముందుకు సాగాయి. చెత్త సేకరణ మహిళతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెత్త సేకరణ సిబ్బందితో సీఎం మాటా మంతి పంచాయతీ, మున్సిపల్, నగర పాలక సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రభుత్వం వర్మీ కంపోస్టు తయారీ, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనుంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణ వాహనాలు, డస్ట్బిన్లు, చెత్తను ప్రాసెసింగ్ చేసే యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో చెత్త సేకరణ విధుల్లో పాల్గొనే కొంత మంది సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమ నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగాలని వారి భుజం తట్టారు. కాగా, స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఆటో రిక్షాలు, దోమల నివారణకు ఫాగింగ్ మిషన్లు కూడా సరఫరా చేస్తారు. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Clean Andhra Pradesh: పరిశుభ్రం.. ఆరోగ్యం
సాక్షి, అమరావతి: స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ, ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి.. రోజు వారీ తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి.. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించే బృహత్తర కార్యక్రమం.. వైఎస్సార్ జగనన్న స్వచ్ఛ సంకల్పం –క్లీన్ ఆంధ్రప్రదేశ్‌కు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. చెత్త సేకరణకు 4,097 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ.. వంద రోజుల పాటు ప్రజల్లో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు. పేరుకుపోతున్న చెత్త నిల్వలు ► రాష్ట్రంలో 13,371 పంచాయతీల పరిధిలో 18 వేలకుపైగా గ్రామాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోజూ 13,500 టన్నుల తడి, పొడి చెత్త వస్తోంది. 17 నగర పాలక సంస్థలు (కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు (మున్సిపాల్టీలు), 30 నగర పంచాయతీల నుంచి రోజూ 6,500 టన్నుల తడి, పొడి చెత్త వస్తోంది. ► అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను సేకరించక పోవడం వల్ల గ్రామాల్లో భారీ ఎత్తున చెత్త పేరుకుపోయింది. దీంతో పారిశుద్ధ్య లోపం తలెత్తుతోంది. దోమలు బెడద పెరిగింది. దోమ కాటు వల్ల విష జ్వరాలు ప్రబలడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ► నగర, పట్టణ ప్రాంతాల్లో రోజు వారీ చెత్తను సేకరిస్తున్నా, దానిని నిర్మూలించక పోవడం వల్ల గుట్టలా చెత్త పేరుకుపోయింది. ► మాస్కులు, శానిటరీ ప్యాడ్లు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటి ప్రమాదకర వస్తువుల వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్య సమస్యకు పూర్తి పరిష్కారమిలా.. ► గ్రామీణ ప్రాంతాల్లో రోజూ వారి వచ్చే 13,500 టన్నుల చెత్తను 23 వేల మంది గ్రీన్ అంబాసిడర్ల ద్వారా సేకరించనున్నారు. ► చెత్త సేకరణకు గ్రామ పంచాయతీలకు 14,000 ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. చెత్తను నిర్మూలించడానికి 10,645 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను నిర్మూలించారు. ఈ షెడ్లలో చెత్తను వేరు చేసి.. తడి చెత్త నుంచి బయోగ్యాస్, వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేస్తారు. పొడి చెత్తలో మళ్లీ ఉపయోగపడతాయన్న వస్తువులను పునర్ వినియోగంలోకి తెస్తారు. వ్యర్థాలను విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలిస్తారు. తద్వారా చెత్త నుంచి సంపదను సృష్టిస్తారు. ► మాస్కులు, శానిటరీ ప్యాడ్లు వంటి వ్యర్థాల ద్వారా వ్యాధులు ప్రబలకుండా వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద మండించి భస్మం చేసి, పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలు పంపిణీ చేశారు. ► గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్లు పంపిణీ చేశారు. ► నగర, పట్టణాల్లో తడి, పొడి, ప్రమాదకరమైన వ్యర్థాల సేకరణ కోసం ప్రతి ఇంటికీ 3 చొప్పున 1.2 కోట్ల డస్ట్ బిన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. ఈ స్టేషన్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వురు వాహనాల ద్వారా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌ల వద్దకు చేరవేస్తారు. ► ఈ కార్యక్రమం శాశ్వతంగా, సుస్ధిరంగా, నిరంతరాయంగా కొనసాగించడానికి.. ప్రజల్లో జవాబుదారీతనం పెంచడానికి నిర్వహణ ఖర్చులకు మాత్రమే గ్రామాల్లో ఇంటికి రోజుకు కేవలం 50 పైసల నుండి రూ.1 వరకు.. పట్టణాల్లో ఇంటికి రోజుకు కేవలం రూ.1 నుండి రూ.4 వరకు యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. ► ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా.. ఆహ్లాదకరంగా తయారవుతాయి. పర్యావరణం మెరుగు పడుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దేశంలో చెత్త నిర్మూలనకు.. పారిశుద్ధ్య సమస్యకు సంపూర్ణ పరిష్కారం చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. -
‘క్లీన్ ఆంధ్రప్రదేశ్-జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ –జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. క్లాప్‌కార్యక్రమంలో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. 1.20 కోట్ల డస్ట్ బిన్ల పంపిణీ గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల చొప్పున క్లాప్ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. 124 మునిసిపాలిటీలలో 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్(జీటీఎస్)లు ఏర్పాటు చేయడంతో పాటు 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎస్‌డబ్ల్యూఎమ్) ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన 32 మునిసిపాలిటీలలోని డంప్ సైట్లలో వ్యర్థాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని మున్సిపాలిటీలను ఆదేశించారు. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణకు సిబ్బంది నియామకం.. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను నిర్మించనున్నారు. గ్రామాల్లో 14 వేల త్రిచక్ర వాహనాల పంపిణీ చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ–రవాణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూరుస్తారు. వ్యర్థాలను ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్ల పంపిణీ చేపడతారు. 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణ, 10,645 పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, నాన్ రీసైక్లింగ్ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడే జగనన్న స్వచ్ఛ సంకల్పం
-
Jagananna Swachh Sankalpam: స్వచ్ఛతకు నేడే క్లాప్
సాక్షి, అమరావతి: పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుడుతోంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 1.20 కోట్ల డస్ట్ బిన్ల పంపిణీ గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల చొప్పున క్లాప్ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. 124 మునిసిపాలిటీలలో 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్(జీటీఎస్)లు ఏర్పాటు చేయడంతో పాటు 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎస్‌డబ్ల్యూఎమ్) ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన 32 మునిసిపాలిటీలలోని డంప్ సైట్లలో వ్యర్థాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని మున్సిపాలిటీలను ఆదేశించారు. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణకు సిబ్బంది నియామకం.. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను నిర్మించనున్నారు. గ్రామాల్లో 14 వేల త్రిచక్ర వాహనాల పంపిణీ చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ–రవాణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూరుస్తారు. వ్యర్థాలను ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్ల పంపిణీ చేపడతారు. 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణ, 10,645 పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, నాన్ రీసైక్లింగ్ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటారు. -
జగనన్న స్వచ్ఛ సంకల్పం
-
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
-
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శనివారం నుంచి వంద రోజలు పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. స్వచ్ఛాంధ్రపదేశ్ నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయితీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం ప్రవేశ పెడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో 10 వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులు పాల్గొంటారని తెలిపారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నాం అని తెలిపారు. చదవండి: రాయలసీమ ద్రోహి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలంతా కలిసి రావాలి: బొత్స క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్‌ను సీఎం వైఎస్ జగన్ రేపు(శనివారం) ప్రారంభిస్తారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘‘ఉదయం పదిన్నరకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలంతా కలిసి రావాలి. పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయి. శానిటేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్బిన్లు ఇవ్వనున్నాం. పబ్లిసిటీపై కాదు.. పనులపైనే సీఎం జగన్ దృష్టి పెట్టారు. పూర్తిగా రాష్ట్ర నిధులతోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఏపీలో అమలు చేస్తోన్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. (చదవండి: సీఎం ఎక్కడినుంచైనా పాలన చేయొచ్చు: బొత్స) బొత్స మాట్లాడిన అంశాలు.. ►క్లీన్ ఆంద్రప్రదేశ్ కోసం చెత్త సేకరించే వాహనాలని సీఎం జగన్ ప్రారంభిస్తారు ►పట్టణాలలో 3097 హైడ్రాలిక్చగార్బేజ్ ఆటోలని... 1771 ఇ-ఆటోలని ప్రారంభిస్తున్నాం. ►38 వేల మంది శానిటరీ వర్కర్స్ ఇందులో పాల్గొంటున్నారు. ►తడి, పొడి చెత్త సేకరణకి ప్రత్యేకంగా వాహనంలో మూడు విడిభాగాలు ఉంటాయి. ►దేశ వ్యాప్తంగా ఎంపికైన 9 పట్టణాలకి మూడు పట్టణాలు ఎపిలో ఉన్నాయి. ►గ్రామస్ధాయిలో, పట్టణ స్ధాయిలో ఈ కార్యక్రమాన్ని. ►ప్రజల నుంచి యూజర్ ఛార్జీల క్రింద సేకరించిన డబ్బులతోనే ఈవాహనాల కొనుగోలుకి ఖర్చు చేశాం. ►కేంద్ర నిధులతో ఎక్కడా ఈ వాహనాలు ఖర్చు చేయలేదు. ►యూజర్ ఛార్జీల రూపేణా వసూలు చేసిన డబ్వులు సరిపోకపోతే ప్రభుత్వమే గ్రాంటుగా ఇవ్వాలని నిర్ణయించాం. ►కేంద్రం నుంచి వచ్చిన వెయ్యి కోట్ల రూపాయిలు ఈ కార్యక్రమం కోసం కాదు. ►అందుకే ప్రజలని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులని చేస్తున్నాం. ►వర్షాలు తగ్గిన తర్వాత రోడ్ల మరమ్మత్తులు, అభివృద్ది చేస్తాం. ►గత అయిదేళ్లలో నిర్మించిన రోడ్లు రెండేళ్లకే మరమ్మత్తులకి వచ్చాయి. ►రోడ్లు నిర్మిస్తే కనీసం అయిదు నుంచి ఏడేళ్ల వరకు మరమ్మత్తులకి రాకూడదు. ►గత ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణం ఎంత నాసిరకంగా సాగిందో ప్రస్తుత పరిస్ధితులే ఉదాహరణ.