Jail Bharo Program
-
రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాలి
అగనంపూడి (గాజువాక): కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన జైల్ భరో కార్యక్రమం కూర్మన్నపాలెం కూడలి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ .. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది నుంచి ఉద్యమాలు చేపడుతున్నా కేంద్రం స్పందించకపోవడం తగదన్నారు. ఇప్పటికే విద్య, వైద్య, రక్షణ, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరించిన కేంద్రం కొరియన్ సంస్థ పోస్కోకు విశాఖ స్టీల్‌ను అమ్మేస్తే భవిష్యత్‌లో తెలుగు ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మృగ్యం అవుతాయన్నారు. విశాఖ జోలికి రావద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోస్కో యాజమాన్య ప్రతినిధులకు చెప్పారని, అవసరమైతే కడప స్టీల్‌ప్లాంట్ అప్పగిస్తామని చెప్పినా అవసరం లేదని వారు తేల్చి చెప్పేశారన్నారు. కేవలం విశాఖ ఉక్కు భూములు, ఇక్కడ సహజ నౌకాశ్రయం ద్వారా దేశ సంపదను తరలించిపోడానికి పన్నిన పన్నాగమన్నారు. దీనిని ప్రజలు గ్రహించి మేల్కొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు సీహెచ్.నరసింగరావు, ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, వై.మస్తానప్ప, డి.ఆదినారాయణ పాల్గొన్నారు. 239 మంది కార్మికుల అరెస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో గాజువాకలో 239 మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతలు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద, తగరపువలసలో కూడా జైల్‌భరో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పలువురు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. -
మోదీ ప్రభుత్వం విఫలం
ఖమ్మంమయూరిసెంటర్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కార్మికులకు, కర్షకులకు కనీసవేతనం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు ఆరోపించారు. గురువారం ఖమ్మంలో సీఐటియూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జైల్‌భరో జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా ధర్నాచౌక్‌కు బయల్దేరగా, మయూరిసెంటర్‌లో పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు, బి.మధు మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలన లో ప్రధాని మోదీ హామీలు ఒక్కటీ అమలు కాలేదన్నారు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి భారతి, టీమాస్ జిల్లా కన్వీనర్ యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు. కొత్తగూడెంలో ఉద్రిక్తం చుంచుపల్లి: కొత్తగూడెంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌కు చేరుకున్న ప్రదర్శన కలెక్టరేట్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కొం త సేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసుల అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కున్సోతు ధర్మా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో రైతులు, కార్మికుల బతుకులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని, కార్పొరేట్ సంస్థల ఆస్తులేమో పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కూడా కార్మికులను పట్టించుకోవడంలేద న్నారు. 17 రోజులు గా సమ్మె చేస్తున్నా పంచాయతీ కార్మికుల సమస్య లు పట్టడంలేదన్నారు. ఈ ప్రభుత్వాలకు కార్మికులు,కర్షకులు సరైన సమయంలో బుద్ధిచెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ ధర్మా, వెంకన్న, కోబాల్, లక్ష్మి, జ్యోతి, జాటోత్ కృష్ణ, వినోద, కొక్కెరపాటి పుల్లయ్య, భూక్యా రమేష్, కొండపల్లి శ్రీధర్, నబీ, బాలరాజు, పిట్టల రవి, అర్జున్, వీర్ల రమేష్ పాల్గొన్నారు. -
రైతుల నోట్లో మట్టి
సీపీఐ నేతల ధ్వజం జైల్ భరో కార్యక్రమంలో 270మంది సీపీఐ కార్యకర్తల అరెస్ట్ విజయనగరం క్రైం: గతంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంతోని ప్రభుత్వం బ్రిటిష్ కాలంనాటి 1894 భూ సేకరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని రైతుల నోటిలో మట్టికొడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జల్లి విల్సన్ మండిపడ్డారు. ప్రజావసరాల పేరిట లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట యమకింకరుడిలా మారిందని ఆరోపించారు. గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన జైల్ భరో కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జైల్ భరో కార్యక్రమానికి సీపీఐ కార్యకర్తలు ఉదయం తొమ్మిది గంటలకే కలెక్టరేట్లోని రెండు ప్రధాన గేట్లను మూసి అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మోడీ అధికారం చేపట్టిన వెంటనే భూసేకరణ 2013 చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టంలో 3 పంటలు పండే భూమిని తీసుకోరాదని, ప్రభుత్వం సేకరించే భూమికి ప్రభావిత ప్రాంతంలో 70శాతం, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకైతే 80శాతం ప్రజలు అంగీకరించాలని, గిరిజన ప్రాంతంలో గ్రామ సభలు అంగీకరించాలన్న నిబంధనలున్నాయన్నారు. కాని నేడు ఎన్డీఏ ప్రభుత్వం భూ సేకరణ 2015 పేరిట తెచ్చిన ఆర్డినెన్స్..నిబంధనలు అన్నింటినీ కాలరాసి రైతులను భూ సేకరణ సవరణ 2015 అనే బలిపీఠంపై నిలబెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ భూసేకరణ ఆక్రమణ అర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తమ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరించా రు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి పి,కామేశ్వరరావు మాట్లాడు తూ 1992నుంచి నేటివరకు దేశంలో 70లక్షల ఎకరాల పంట భూములు పరిశ్రమలకు, కార్పొరేట్ కంపెనీలకు, ప్రభుత్వ అవసరాలకు ధారాదాత్తం చేశారన్నారు. భూ ఆర్డినెన్స్ ఆమోదించినట్లయితే రైతుల చేతుల్లో భూములు ఉండవని, ప్రజలకు ఆహార భద్రత ఉండదని, రైతు అనే పదాన్ని సమాజం నుంచి తొలగించే దుర్మార్గమైన ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. అనంత రం కలెక్టరేట్ రెండవ గేటు వద్ద ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులను అరెస్ట్‌చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వా త ప్రధాన గేటు వద్ద ధర్నా చేస్తున్న 225 మంది అరెస్ట్‌చేసి వన్‌టౌన్ పోలీసు స్టేష న్కు తరలించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు బయలుదేరిన 45 మంది ని బొబ్బిలిలో అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శు లు బుగత అశోక్, ఒమ్మిరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు వి.కృష్ణంరాజు, ఆల్తి అప్పలనాయుడు, బుగత సూరిబాబు, బాయి రమణమ్మ మండంగి నర్సిం హు లు,అలమండ అనందరావు పాల్గొన్నారు.