జీవితఖైదీ ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ జిల్లా: కడప కేంద్ర కారాగారంలో కృష్ణమూర్తి అనే జీవితఖైదీ ఆదివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణమూర్తిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఈయన భార్యను చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. గత నెల మార్చి 14న జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పిచ్చారు. తీవ్ర మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు జైలు అధికారులు చెబుతున్నారు.