Jake Ball
-
గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ బ్యాటర్ తన వ్యక్తిగత మైలురాయి కోసం స్ట్రయిక్‌లో ఉన్న మరో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి పరువు పోగొట్టుకున్నాడు. నాటింగ్హమ్షైర్తో నిన్న (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో వార్విక్షైర్ బ్యాటర్ సామ్ హెయిన్.. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్ జేక్ లింటాట్ను ఇబ్బంది పెట్టాడు. ఇంత చేసి అతనేమైనా సెంచరీ సాధించాడా అంటే.. అదీ లేదు. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్షైర్.. జో క్లార్క్ (53 బంతుల్లో 89; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కొలిన్ మున్రో (43 బంతుల్లో 87; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో సామ్ హెయిన్ (52 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, తన జట్టును (వార్విక్షైర్) గెలిపించలేకపోయాడు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. pic.twitter.com/A171O5RKOC— Spider Rashid (@RashidSpider) June 4, 2023 సెంచరీ కోసం కింద పడిపోయిన సహచరుడిని లేపి పరిగెట్టించాడు.. అయినా..! ఆఖరి ఓవర్ చివరి 3 బంతుల్లో 19 పరుగులు చేయల్సిన పరిస్థితి ఉండింది. జేక్ బాల్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని లింటాట్ సిక్సర్‌గా మలచడంతో ఈక్వేషన్ 2 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అప్పటికి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హెయిన్ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, వార్విక్షైర్ గెలిచే పరిస్థితి కూడా లేదు. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న లింటాట్ భారీ షాట్ ఆడబోయి క్రీజ్‌లోనే కింద పడిపోయాడు. అవతలి ఎండ్‌లో సెంచరీ కోసం పరితపిస్తున్న హెయిన్.. సహచరుడు కిందపడి పరుగు తీయలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా, సగం క్రీజ్ వరకు వచ్చి అతన్ని పరుగు తీయాల్సిందిగా కోరాడు. దీంతో లింటాట్ హెయిన్ సెంచరీ కోసం పడుతూ లేస్తూ పరుగు పూర్తి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే ఈ లోపే ఫీల్డర్ నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు బంతి విసరడం, బౌలర్ ఆ బంతితో లింటాట్ను రనౌట్ చేయడం జరిగిపోయాయి. ఇంత జరిగికా కూడా సెంచరీ కోసం ఆఖరి బంతిని ఎదుర్కొన్న హెయిన్ అది సాధించాడా అంటే.. అది లేదు. 96 పరుగుల వద్ద ఉండిన హెయిన్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఉంటే, తన జట్టు గెలవకపోయినా అతను సెంచరీ అయినా చేసే వాడు. అయితే అతను సింగిల్ మాత్రమే తీయడంతో 97 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం తంతు చూసి నెటిజన్లు హెయిన్ను తిట్టిపోస్తున్నారు. స్వార్ధపరుడని, గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం సహచరుడిని ఇబ్బందిపెట్టి పరువు పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. -
'ఆ బౌలర్‌ను తీసేయండి'
అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన తమ జట్టు తదుపరి మ్యాచ్ లో గాడిలో పడాలంటే కొన్ని మార్పులు అవసరమని ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. ప్రధానంగా ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లో మార్పులను పీటర్సన్ సూచించాడు. తొలి టెస్టులో ఏ మాత్రం ఆకట్టుకోలేని ఫాస్ట్ బౌలర్ జాక్ బాల్‌ను తీసేయడమే ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు. 'అడిలైడ్ ఓవల్‌లో జరిగే రెండో యాషెస్ టెస్టులో జాక్ బాల్ అవసరం లేదు. కీలకమైన రెండో టెస్టులో బాల్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జాక్ బాల్ ఆశించిన స్థాయిలో రాణించాడని అనుకుంటున్నారా..నేను చూసినంత వరకూ అయితే అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతనికి ఛాన్స్ ఇవ్వడం అనవసరం. తదుపరి మ్యాచ్‌కు నేనైతే బాల్‌కు అవకాశం ఇవ్వను'అని పీటర్సన్ పేర్కొన్నాడు. తొలి టెస్టులో జాక్ బాల్ కేవలం వికెట్ మాత్రమే తీయడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ బౌలర్‌ను రెండో టెస్టుకు తప్పించాలంటూ ఇంగ్లండ్ యాజమాన్యానికి పీటర్సన్ తెలియజేయడంతో ఇప్పుడు ఆ జట్టును మరింత ఇరకాటంలో నెట్టింది. మరొకవైపు తొలి టెస్టులో ఆల్ రౌండర్ మొయిన్ అలీ గాయపడి రెండో టెస్టుకు దూరం కావడం కూడా ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. శనివారం నుంచి అడిలైడ్ ఓవల్‌లో రెండో టెస్టు ఆరంభం కానుంది. -
కోహ్లీని టార్గెట్ చేసిన ఇంగ్లండ్ బౌలర్
టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ లోనే శతకంతో చెలరేగాడు. తొలివన్డేలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హీరో కేదార్ జాదవ్ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్బుత శతకాలతో భారత్ అసాధారణ రీతిలో ఇంగ్లండ్ పై విజయాన్ని సాధించింది. అయితే రెండో వన్డేలో భారత బ్యాట్స్మన్లకు అలాంటి అవకాశం ఇవ్వనని ఇంగ్లండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. గురువారం కటక్‌లో ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకుంటే తమ విజయం నల్లేరుపై నడకేనని చెప్పాడు. సాధ్యమైనంత వరకు కోహ్లీని క్రీజులో కుదురుకోనీయకుండా అతడికి ముకుతాడు వేస్తామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గం ఎంచుకుంటామని పేసర్ జేక్ బాల్ తెలిపాడు. కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద మరిన్ని ఎత్తులతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. పుణే వన్డేలో 3/67తో రాణించిన ఈ పేసర్.. కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడిని త్వరగా పెవిలియన్ బాట పట్టించాలని, లేకపోతే తమ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ ఆటను చూశాను.. ఇప్పుడు వన్డేల్లోనూ కోహ్లీ కుమ్మేస్తున్నాడని ప్రశంసించాడు.