Jalayagnam project
-
ఆయకట్టు రైతులందరికీ ‘తోటపల్లి’ ఫలాలు
సాక్షి, అమరావతి: తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పూర్తయిన పనుల ద్వారా గతంలో ఎన్నడూలేని రీతిలో జూన్ 12నే ఖరీఫ్ పంటల సాగు నిమిత్తం 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసింది. కుడి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తిచేయడం.. రివిట్మెంట్ పూర్తిచేసి, 2,151 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేర 2.51 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా మిగిలిపోయిన 85,765 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టింది. కుడి ప్రధాన కాలువలో అంతర్భాగంగా చేపట్టిన గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద 1908లో బ్రిటిష్ సర్కార్ తోటపల్లి వద్ద నాగావళి నదిపై రెగ్యులేటర్ ద్వారా 64 వేల ఎకరాలకు నీళ్లందించేది. ఇది శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. రెగ్యులేటర్‌కు ఎగువన 2.51 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్‌ను నిరి్మంచి.. అదనంగా 1,06,765 ఎకరాలకు, తోటపల్లి కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యతగా తోటపల్లి.. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు పూర్తిచేసిన ముఖ్యమంత్రి.. తోటపల్లిలో మిగిలిన పనులను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కుడి ప్రధాన కాలువలో మిగిలిన పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఇక జూన్ 12న పూర్తయిన పనుల ద్వారా పాత, కొత్త కలిపి 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువలో ప్యాకేజ్–1లో 5.70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 37 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. ప్యాకేజ్–2లో 8.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 47 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో.. కోతలు పూర్తయ్యేదాకా అంటే డిసెంబర్ దాకా కాలువల పనులు చేయడానికి వీలుకాదు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట కోతలు పూర్తయ్యాక కుడి కాలువలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వుతున్న గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 2.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 27 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఈ పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ.. తోటపల్లి బ్యారేజ్ గరిష్ఠ నీటినిల్వ 2.51 టీఎంసీలు. బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే 20 గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకుగాను 3,478 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. కానీ, బ్యారేజ్ మట్టికట్టకు రివిట్మెంట్ పనులు పూర్తికాలేదు. దీంతో బ్యారేజ్‌లో రెండు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. ఈ పనులు పూర్తిచేసి.. మిగతా 2,151 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా వచ్చే ఏడాదికి బ్యారేజ్‌లో 2.51 టీఎంసీలను నిల్వచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం ద్వారా తోటపల్లి ఆయకట్టు రైతులందరికీ జలయజ్ఞం ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
జలయజ్ఞం.. సస్యశ్యామలం
సాక్షి, కర్నూలు: కరువుకు చిరునామా రాయలసీమ. ఏటా దుర్భిక్షం. 19వ శతాబ్దం వరకు సీమ రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేరు. ఇందుకు శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు వాడుకున్న నీటి గణాంకాలే సాక్ష్యం. 19వ శతాబ్దంలో కేవలం 119 టీఎంసీల నీరు మాత్రమే వాడుకున్నారు. ఇందులో కూడా సగం వరకు చెన్నైకి తరలించారు. 20 శతాబ్దంలోకి అడుగు పెట్టిన తరువాత మహానేత వైఎస్ఆర్ చేపట్టిన జలయజ్ఞం ఫలాలు వరుణుడు రాసిన కరువు శాసనాన్ని తుడిచి వేస్తున్నాయి. జిల్లాలో రెండు దశబ్దాల కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాలువల విస్తరణతో సుమారుగా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించిన నీటితో రెండు దశాబ్దాల్లో తెలుగుగంగా కింద 95 వేలు, ఎస్ఆర్బీసీ కింద 56 వేలు, హంద్రీనీవాతో 80 వేల ఎకరాలు, జీఆర్పీ కింద 45 వేల ఎకరాలు, లిఫ్ట్‌ల వల్ల 95 వేల ఎకరాలు, సిద్ధాపురం కింద 20 వేలు, పులికనుమ కింద 26 వేలు, పులకుర్తి కింద 9 వేల ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగినట్లు ఇంజినీర్లు అంచనాలు వేస్తున్నారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్ చొరవతోనే జలయజ్ఞం పనులు శరవేగంగా సాగాయి. పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ విస్తరణ, గాలేరు–నగరి, అవుకు రిజర్వాయర్, గోరుకల్లు రిజర్వాయర్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకంతో పాటు, హంద్రీనీవా సుజల స్రవంతి, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన లిఫ్ట్‌లు, పులికనుమ, పులకుర్తి స్కీమ్‌లు, తుంగభద్ర నది తీరంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు, ముచ్చుమర్రి ఎత్తిపోతలతో 20వ శతాబ్దంలో కరువును తరుముతున్నాయి. కొత్త ప్రాజెక్టులతో జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు ద్వారా విస్తరణ తరువాత నుంచి ఇప్పటి వరకు 1,245 టీఎంసీలు, హంద్రీనీవా నుంచి 170 టీఎంసీలు, ముచ్చుమర్రి నుంచి 10 టీఎంసీలు, లిఫ్ట్‌ల నుంచి 50 టీఎంసీల నీటిని అదనంగా వినియోగించుకోని జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చెందింది. అవుకు టన్నెల్ శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను వినియోగించుకునేందుకు 2006లో పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తర్ణను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీని ద్వారా 30 రోజుల్లో 102 టీఎంసీల నీరు తీసుకోవాలని లక్ష్యంగా పనులు మొద లు పెట్టారు. ఇందులో ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం కుడి ప్రధాన కాలువ విస్తరణ)ని బానకచర్ల కాంప్లెక్స్ వరకు విస్తరించడంతో సీమలోని ప్రాజెక్టులకు నీటి తరలింపునకు మార్గం సుగమమైంది. అవుకు రిజర్వాయర్ లో నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. కృష్ణానీటిని కేసీ కాలువకు ప్రత్యామ్నాయంగా అందించేందుకు 2008లో ముచ్చుమర్రి ఎత్తిపోతలకు శ్రీకారం చూట్టారు. గతేడాది నుంచి ఆయకట్టు రైతులకు అందుబాటులోకి వచ్చింది. హంద్రీ –నీవాతో పెరిగిన భూగర్భ జలాలు రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతిని 2005లో ప్రారంభించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగు, 40 లక్షల మందికి తాగు నీటి అవసరాలు తీర్చాలి. జిల్లాలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందిచాల్సి ఉంది. ఆ కాల్వతో జిల్లాలో చాలా చోట్ల భూగర్భ జలాలు పెరిగి ఎండిన బోర్లలోకి నీరొచ్చింది. పంట కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. 68 చెరువులకు నీరు ఇచ్చేందుకు చేపట్టిన పనులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక జిల్లాలో తుంగభద్ర జలాలను వినియోగించి పశ్చిమ పల్లెను సస్యశ్యామం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తుంగభద్రనదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువ, హగేరి నదిపై వేదావతి ప్రాజెక్ట్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఆయకట్టుకు జీవం తెలుగుగంగ ప్రాజెక్టులో అసంపూర్తిగా ఉన్న ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలను, లైనింగ్ పనులు చేసేందుకు 2006లో 4460.64 కోట్లు అంచనా వ్యయాన్ని 2007లో ఖరారు చేస్తూ వైఎస్ఆర్ అనుమతులు ఇచ్చారు. 2018 మార్చి నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేసేందుకు అంచనాలను 6671.62 కోట్లకు పెంచేసి 2018 మార్చి9న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కాల్వ కింద ఆయకట్టు స్థీరికరించడంతో జిల్లాలో లక్ష ఎకరాలు అదనంగా ఆయకట్టు పెరిగింది. ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం ఎత్తిపోతలకు 2006 ఏప్రిల్ 20న మహానేత శంకుస్థాపన చేయగా, గత ఏడాది పూర్తయింది. కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లోని 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు 2004లో వైఎస్ఆర్ గురురాఘవేంద్ర లిఫ్ట్‌తో పాటు, మరో ఆరు ఎత్తిపోతల పథకాలను, సుగూరు చెరువును పూర్తి చేశారు. 261.19 కోట్లతో పులికనుమ రిజర్వాయర్‌కు శ్రీకారం చూట్టారు. ఇది పూర్తయితే గూడూరు, కోడుమూరు, సి. బెళగల్, కల్లూరు, మండలాల్లో 9823 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. -
ఆయనది చెరగని సంతకం
సాక్షి, మైలవరం : ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్యసాయం పొందిన పేదవాడి కుటుంబంలో ఆనందం.. డెల్టా ఆధునికీకరణతో అన్నదాత కళ్లలో వెలుగు.. పావలావడ్డీ రుణాలు పొందిన మహిళ మోములో చిరునవ్వు.. రీయింబర్స్‌మెంట్‌లో ఉచితంగా ఉన్నత విద్యాఫలాలు అందుకున్న విద్యార్థుల్లో నమ్మకం.. ఇవీ రాజన్న రాజ్యంలో చెరగని సంతకాలు. జిల్లావాసులు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే అజెండాగా అభివృద్ధి ఫలాలను అందజేసిన మహానేతను మననం చేసుకుంటున్నారు. చెప్పినవీ.. చెప్పనివి కూడా చేసి చూపించిన ఆ విశ్వసనీయతను తలచుకుంటున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. సాగుకు భరోసా.. మైలవరం నియోజకవర్గంలోని రైతులకు సాగునీరందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పటికే కృష్ణాజలాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వరకు అందించేందుకు గత ప్రభుత్వం మొదటి దశ పనులను పూర్తి చేసింది. కానీ మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు కూడా తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 కోట్లు కేటాయించి రెండోదశ పనులను పూర్తి చేశారు. కృష్ణావాటర్పైపులైను రెండోదశ పనులతో పాటు తారకరామ ఎత్తిపోతల రెండోదశ పనుల పూర్తి చేసి 2006 మే 10న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ ప్రారంభించారు. పోలవరం కాలువ మళ్లింపు వెఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా పోలవరం కుడికాల్వ తవ్వకం చేస్తున్న సందర్భంలో కాలువకు చివరి భాగంలో ఉన్న వెలగలేరు గ్రామాన్ని అనుకొని తవ్వ వలసి ఉంది. అయితే కాలువను గ్రామానికి అనుకొని తవ్వడంతో గ్రామానికి ఒక వైపు బుడమేరు, రెండో వైపు పోలవరం కాల్వ ఉంటే వరదల వచ్చిన సమయంలో గ్రామం ముంపునకు గురవుతుందని అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. చనమోలు అడిగిందే తడువుగా కాలువ రూట్‌మ్యాప్‌ను మార్చి వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా కాలువను తవ్వించి బుడమేరులో కలిపారు. వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికీ మరవలేమని వెలగలేరు గ్రామ ప్రజలు అంటున్నారు. తారకరామతో రైతులకు సాగనీరు మైలవరం నియోజకవర్గానికి తలమానికమైన తారకరామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. తారకరామ ఎత్తపోతల పథకాన్ని నిర్మించడానికి అధికారులు మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇబ్రహీంపట్నం,జి కొండూరు, విజయవాడరూరల్ మండలాల పరిధిలోని 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యం. మొదటి దశ పనులు అప్పటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే,వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు ఆధ్వర్యంలో 2004 నాటికి పూర్తయ్యాయి. వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా దారిమళ్లించి తవ్వించిన పోలవరం కుడి కాల్వ రెండవ దశలో జి.కొండూరు మండలంలోని 8గ్రామాలకు చెందిన 4,242ఎకరాలకు నీరందించడం లక్ష్యం.దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో 10–05–2006న పనులు ప్రారంభించి 2009కల్లా పూర్తి చేసి రైతులకు సాగునీరందించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాజకీయాలలో సంచలన మార్పులు కారణంగా మూడో దశ పనులు నిలిచిపోయాయి. రైతు బాంధవుడు వైఎస్సార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే తారకరామా ఎత్తిపోతల పథకం రెండవదశ పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులకు సాగునీరు అందింది. ఆయన బతికి ఉంటే మూడో దశ పనుల కూడా పూరై్త నియోజకవర్గం సస్యశ్యామలమయ్యేది. కృష్ణా జలాలను మైలవరానికి అందించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. వైఎస్సార్ హయాంలో రైతులకు సాగునీరు పుష్కలంగా అందింది. నాలుగున్నరేళ్లుగా రైతులు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. జలవనరులశాఖా మంత్రిగా ఉండి కూడా దేవినేని ఉమా తన సొంత నియోజకవర్గంలో ఉన్న తారకరామను నిర్వీర్యం చేశారు. కృష్ణా జలాలను అందించడంలో దేవినేని విఫలమయ్యారు. -పామర్తి వెంకటనారాయణ, రైతు, కుంటముక్కల -
భగీరథ సారథి..వైఎస్
సాక్షి, అమరావతి : ఒకనాడు అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల దుర్భిక్షం బారిన పడటాన్ని చూసి చలించిపోయిన మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి... కరువనేది ఎరుగుని నేలగా మార్చడానికి జలయజ్ఞం చేపట్టారు. సముద్రం వైపు ఉరకలెత్తుతున్న గోదావరిని... పరుగులిడుతున్న కృష్ణవేణిని... కదలిపోతున్న వంశధారను తెలుగు నేలలకు మళ్లించి... సస్యశ్యామలం చేయడానికి అహోరాత్రులు శ్రమించారు. ఐదేళ్లలోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 17 ప్రాజెక్టులు సంపూర్తిగా, మరో 24 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలతో అధికారం చేపట్టి... ఐదేళ్లలో రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్కదానినీ గట్టెక్కించలేకపోయారు చంద్రబాబు. వైఎస్ హయాంలోనే పూర్తయినవాటికి గేట్లు ఎత్తుతూ, అదంతా తన ఘనతేనంటూ పూటకో నాటకం, రోజుకో రియాలిటీ షోతో రక్తికట్టించారు. ఉమ్మడి ఏపీ 1994 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల కరవు కాటకాలతో అలమటించింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత.. సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్‌ను కదలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆ సందర్భంగా బాస చేశారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే... అనేక ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ, రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చేశారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. గేట్లెత్తి... గొప్పలు వైఎస్ హయాంలో పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి జాతికి అంకితం చేసి వాటిని తానే చేసినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో ప్రాజెక్టుల పేరుతో టీడీపీ ప్రభుత్వంలోని వారు దొరికినంత దోచుకున్నారు. ఇందులో సీఎం బినామీలు, కోటరీ కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ప్రయోజనం చేకూరలేదని మాజీ సీఎస్‌లు ఐవైఆర్, అజేయ కల్లం పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సైతం ప్రాజెక్టుల టెండర్లలో చంద్రబాబు సర్కారు అక్రమాలను ఎత్తిచూపి, అందుకు తాను బాధ్యత వహించలేనని హై పవర్ కమిటీ నుంచి తప్పుకోవడం గమనార్హం. బాబు కుయుక్తులను తట్టుకుని మహా నేత చేపట్టిన జలయజ్ఞంపై అప్పట్లో చంద్రబాబు కుయుక్తులకు దిగారు. సరిహద్దు రాష్ట్రాలను ఉసిగొల్పుతూ ప్రాజెక్టులను అడ్డుకునేలా న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు సొంత నియోజకవర్గం కుప్పంలో పాలార్ నదిపై ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన జలాశయం పనులకు అడ్డుతగిలి, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసులు వేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారని నాడు టీడీపీ సీనియర్ నేతలే విమర్శించారు. చంద్రబాబు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుతగిలినా వైఎస్ వెనుకడుగు వేయలేదు. అప్పుడు... ఇప్పుడు... వైఎస్ మరణం జలయజ్ఞానికి శాపంగా మారింది. 2009 నుంచి 2014 మధ్య రూ.44,851.71 కోట్లు ఖర్చు చేసి... మిగిలిన కొన్ని పనులే పూర్తి చేయగలిగారు. విభజన నేపథ్యంలో రూ.17,368 కోట్లతో అంతా అయిపోతుందని అధికారం చేపట్టిన తొలినాళ్లలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ, ఇప్పటికి రూ.65,435.45 కోట్లు ఖర్చు చేసినా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ లేదు. పారదర్శకంగా టెండర్లు... ప్రాజెక్టుల పనులకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి వైఎస్ పారదర్శకత పాటించారు. దీంతో దేశ, విదేశాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చారు. వారి మధ్య టెండర్లలో పోటీతో సగటున 15 శాతం తక్కువకే బిడ్లు దాఖలై ఖజానాకు రూ.పదివేల కోట్లపైగా ఆదా అయ్యాయని సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు సీతాపతిరావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి సీవీఎస్కే శర్మ పలు వేదికలపై పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు శరవేగంగా పూర్తిచేసేలా వైఎస్ పరుగులు పెట్టించారు. బడ్జెట్ కేటాయింపుల కన్నా అధికంగా ఖర్చు చేశారు. వంశధార రెండో దశ ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తే, వెంటనే రీ డిజైన్ చేసి, ట్రిబ్యునల్‌ను ఒప్పించి మెప్పించారు. వైఎస్ చలవతోనే రైతులకు మేలు నాకు హంద్రీ–నీవా కాలువ కింద ఎకరం పొలం ఉంది. ఇందులో వేరుశనగ పంట వేశా. నీటికి కొరత లేకపోవడంతో పంట బాగా వచ్చింది. మళ్లీ ఇప్పుడు రెండో పంటగా జొన్న వేశా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా రెండు పంటలకు నీటికి ఎలాంటి ఢోకా లేదు. ఇదంతా వైఎస్సార్ పుణ్యమే. ఆయన చలువతో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతోంది. – చిన్నగొల్ల చిట్టిబాబు, పందికోన -
మీ పాలనకై వేచి చూస్తున్నం..
సాక్షి, గుంటూరు : గుప్పెడు మెతుకుల కోసం ఏ రోజుకారోజు కండలు కరిగించే పేదోడి గుండెకు జబ్బు చేస్తే నువ్వెందుకయ్యా విలవిలలాడిపోయావు. బక్కచిక్కినోళ్ల ఇళ్లలో భవిష్యత్ వెలుగు దీపమై ప్రకాశించాల్సిన బిడ్డల చదువులు మధ్యలో ఆగిపోతుంటే నువ్వెందుకయ్యా దిగులు పడ్డావుఅవ్వాతాతల ఆవేదనలు ఓ మూలన దీనంగా వినిపిస్తుంటే .. నీ గుండెపై ఎందుకయ్యా కన్నీటి తడి తెచ్చుకున్నావు. పాదయాత్ర ఆసాంతం.. ప్రతి అడుగులో బడుగుల ఆరని కన్నీళ్లు నిన్ను కదిలించాయా.. అప్పటి చంద్రబాబు పాలనలో దుర్భిక్ష పరిస్థితులు నిన్ను చలింపచేశాయా.. అందుకేనా.. ఆరోగ్యశ్రీ పథకంలో మనసున్న వైద్యుడిగా మారావు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బిడ్డల జీవితాలకు ఉజ్వల దారులు పరిచావు. పింఛన్లతో అవ్వాతాతల బోసినవ్వులను దోసిటపట్టావు. సంక్షేమాన్ని పేదోళ్ల గుమ్మానికి తోరణంగా కట్టావు.. ఇన్ని చేసిన నిన్ను ఎవరూ మరిచిపోలేదయ్యా. ప్రజల నుంచి దూరమై ఏళ్లు గడుస్తున్నా ప్రతి గుండెచప్పుడులోనూ నిత్యం వినిపిస్తూనే ఉన్నావు. పేదోళ్ల ప్రతి మాటలోననూ కనిపిస్తూనే ఉన్నావు. నిర్మలమైన నీ రూపంతో ప్రతి గుండె గుడిలో దేవుడిలా కొలువై నిలిచిపోయావు. అందుకే గుంటూరు గుండె చప్పుడు ఎదురు చూస్తోంది మళ్లీ సంక్షేమ సారథివై వస్తావని.. జిల్లావాసుల సుదీర్ఘ స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ హయాంలో ప్రారంభమైంది. 2004లో జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలోని బెల్లంకొండ మండలం పులిచింతల గ్రామం, నల్గొండ జిల్లాలోని మేళ్ళచెరువు గ్రామాల మధ్య పులిచింతల నిర్మాణ పనులు చేపట్టారు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఉద్దేశంతో రూ.682 కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది. ప్రాజెక్టు నిర్మాణం రూ.483.33 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో హెక్టారుకు 3.4 టన్నుల ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.808 కోట్ల నికర ఆదాయం పొందవచ్చని అంచనా. నాగార్జునసాగర్ కుడి కాల్వ పరిధిలో రూ.7.46 కోట్లతో కాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలకు దివంగత వైఎస్ఆర్ హయాంలో మహర్దశ పట్టింది. రెండు డెల్టాలకు రూ.4,444.41 కోట్లతో 604 కిలోమీటర్ల పొడవునా కాల్వల ఆధునీకరణ, 848 కొత్త బ్రిడ్జిల మంజూరయ్యాయి. జిల్లాలో 1,59,489 ఎకరాల ఆయకట్టుకు నీరందించటానికి 234 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 483.27 కోట్లతో మంజూరైనా .. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో వాటిని పట్టించుకునే నాథుడు లేక నిలిచిపోయాయి. అడిగిన వెంటనే ఎత్తిపోతల వరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినుకొండ ప్రాంతం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వినుకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలసి తమ గ్రామం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నప్పటికీ సాగు నీరు అందడం లేదని తెలిపారు. వైఎస్ వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.4.80 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సభాస్థలిలోనే ప్రకటించారు. దీంతో చకచకా పథకం నిర్మాణం పూర్తయింది. 1050 ఎకరాలు మెట్ట భూములకు సాగు నీరు వచ్చింది. గతంలో రూ.50 వేలు ధర కూడాలేని భూములు ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. గొంతు తడిపిన మహనీయుడు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, – గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్ల పట్టణానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశారు. గురజాలకు సైతం బుగ్గవాగు నుంచి రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని అందించారు.సత్తెనపల్లి పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగు చేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి రెండు పూటలా మంచినీరు అందించారు. -
ఖరీఫ్ కొత్త ఆయకట్టు 8.89 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్ నాటి(ఖరీఫ్)కి 8.89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా నీటిపారుదల శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. మరుసటి ఏడాదికి మరో 6.55 లక్షల ఎకరాల ఆయకట్టును విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాల్లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1.60 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే నాటికి మొత్తం 52.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. 2004 నుంచి 2018 ఫిబ్రవరి వరకు మొత్తం 16.65 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మొత్తం 68.86 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో 2014 నుంచి ఇప్పటివరకు కొత్త రాష్ట్రంలో 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపింది. 2017–18లో గణనీయంగా కొత్త ఆయకట్టు 2004లో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా 2014 వరకు మరో 5.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తూ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మార్చి నాటికే 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. 2016–17లో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి కేవలం 4.75 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వగా, 2017–18లో ఏకంగా 7.66 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చారు. ఇందులో మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కిందే 5.50 లక్షల ఎకరాలున్నాయి. ఈ ఖరీఫ్‌లో భారీ ప్రాజెక్టుల కింద 7.57 లక్షలు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద 1.32 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఇందులో ఎస్సారెస్పీ–2, దేవాదుల, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వల కింద 5 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకుంది. 2019 జూన్ నాటికి మరో 6.55 లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామన్న నీటి పారుదల శాఖ మొత్తం 15.44 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆయనది యజ్ఞం ... వీరిది విఘ్నం
అదొక అద్భుత సంకల్పం. దివి నుంచి గంగను తెలుగునేలకు రప్పించే భగీరథ యత్నం. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం. కోటి ఎకరాలకు సాగునీటిని అందించి, రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి మహానేత తీసుకున్న దృఢ నిర్ణయం. అదే.. జలయజ్ఞం! రూ.1.31 లక్షల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 86 సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమం. మహానేత హయాంలో పరుగులు తీసిన ఈ బృహత్తర యజ్ఞం అనంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. బి. నారాయణరెడ్డి: వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో వరుసగా కరువు కాటకాలు. పంటలు పండక రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రకృతి ప్రకోపానికి పాలకుల నిర్లక్ష్యం తోడు కావడంతో పెద్దఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాంతో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. అందుకు వీలుగా భారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. తన హయాంలోనే పలు ప్రాజెక్టులను పూర్తి చేసి, పొలాలకు సాగునీటిని అందించారు. అనేక ప్రాజెక్టుల పనులు చివరి దశకు చేరుకున్నాయి. వైఎస్ అనంతరం పరిస్థితి మారింది. ప్రాజెక్టులను పట్టించుకున్న నాథుడు లేడు. చివరి దశలోని ప్రాజెక్టుల నిర్మాణాలు సైతం సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. ఒక్క ఎకరానికి అదనంగా చుక్క నీటిని అందించలేదు. వైఎస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులు వైఎస్ హయాంలో పాక్షికంగా పూర్తయి నీటిని విడుదల చేసిన ప్రాజెక్టులు ఆయకట్టు ఎకరాలలో.. పోలవరం: రాజశేఖరరెడ్డి హయాంలోనే వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు...తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్‌ను మార్చడం వల్ల మళ్లీ టెండర్లను ఖరారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ టెండర్లను ఖరారు చేయడానికే ప్రభుత్వం మూడేళ్ల సమయాన్ని తీసుకుంది. అది కూడా వివాదాస్పదం కావడంతో ప్రాజెక్టు పనులపై తీవ్ర ప్రభావం పడింది. వైఎస్ మొద లు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే.. ఈ సమయానికి పూర్తయి.. పశ్చిమగోదావరి జిల్లాలో 7.2 లక్షల అయకట్టుకు నీటి వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలి ంచడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది. ప్రాణహిత - చేవెళ్ల తెలంగాణలోని ఏడు జిల్లాలకు సాగునీటిని అందించడంతో పాటు, హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా వైఎస్ తరువాతి ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. ఈ ఐదేళ్లు ప్రాజెక్టు పనులు జరిగి ఉంటే.. ఈ సమయానికి గోదావరి నీరు తెలంగాణ జిల్లాలకు పారేది. దుమ్ముగూడెం గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి ఉద్దేశించిన దుమ్ము గూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. దీనిని అనధికారికంగా పక్కన పెట్టారు. వైఎస్ తర్వాత ఒక్క పైసా కూడా ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. గోదావరి నది నుంచి సుమారు 165 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్‌లోకి తరలించడానికి అవకాశం ఉంది. ఫలితంగా కృష్ణా బేసిన్‌పై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులకు నీటి లభ్యత ఏర్పడేది. బాబు పాలనలో.. - కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. - కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టు లను అప్పట్లోనే నిర్మించి ఉంటే ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది. - పలు ప్రాజెక్టులకు శంకు స్థాపన మాత్రం చేశారు. - బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. - ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు. వైఎస్ హయాంలో.. - జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. - ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. - చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి. - పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. రోశయ్య, కిరణ్‌ల పాలనలో.. - జలయజ్ఞం పనులను పట్టించుకోలేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చూపారు. - కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం చేశారు. - కొద్దిగా నిధులను కేటాయించి, సరిగ్గా పర్యవేక్షిస్తే... నెలల్లోనే పూర్తయ్యే ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. - రోశయ్య హయాంలో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో విభజించారు. ఈ జాబితాలో లేని ప్రాజెక్టులను గాలికొదిలేశారు. ప్రాధాన్యత ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపారు. - ఆ తరువాత సీఎం కిరణ్‌దీ అదే తీరు. - ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో ప్రాజెక్టులు పడకేశాయి. -
గవర్నర్‌ను కలుస్తా: రాజనర్సింహ
హైదరాబాద్: జలయజ్ఞం ప్రాజెక్టుల అంచనాల పెంపును అంగీకరించేది లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రాజెక్టుల అంచనాల పెంపు ఎవరి ప్రయోజనాల కోసమంటూ ఆయన ప్రశ్నించారు. అంచనాల పెంపు వల్ల తెలంగాణ ప్రజలపై పరోక్ష భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేబినెట్లో చర్చించకుండా పెంపుపై నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి లేఖ రాశానని, మళ్లీ రాస్తానని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇదే విషయంపై త్వరలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుస్తానని చెప్పారు. -
7న పులిచింతల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఒకటైన పులిచింతల ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 7న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టు డ్యామ్‌ను ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లితండాలోని పులిచింతల డ్యామ్ వద్ద ఉదయం 11:50 గంటలకు ప్రారంభ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజీ కెపాసిటీ 36.23 టీఎంసీలు. డ్యామ్ వద్ద 3.61 టీఎంసీల నీటి నిల్వ సామర ్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. 2014 జూన్‌లో మొదటి విడతగా ఖరీఫ్ పంటకు నీరందించేందుకు వీలుగా 15 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు.