jallikattu game
-
జల్లికట్టు నేపథ్యంలో వెబ్‌సిరీస్.. త్వరలో ఆహాలో
తమిళసినిమా: జల్లికట్టు నేపథ్యంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ పేటైకాళి. దర్శకుడు వెట్రివరన్ సమర్పణలో ఆహా ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న ఒరిజినల్ వెబ్‌సిరీస్ ఇది. మేర్కు తొడచ్చి మలైత్రం ఫేమ్ ఆంథోని కథానాయకుడిగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నటుడు కలైయరసన్, కిషోర్, వేలన్ రామమూర్తి, నటి షీలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎల్.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక అడయారులోని ఎంజీఆర్ జానకి కళాశాలలో నిర్వహించారు. 2 వేల మంది విద్యార్థులు, ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. అనంతరం ఆహా ఓటీటీ సంస్థ సీఈఓ మాట్లాడుతూ జనరంజకమైన కార్యక్రమాలను అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయల కథలు అందించే విషయంలో పేటై కాళి వెబ్ సిరీస్‌ను తొలి ఉదాహరణగా భావిస్తున్నామన్నారు. ఈ వెబ్‌సిరీస్‌ను త్వరలో ఆహా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దర్శకుడు రాజ్కువర్ మాట్లాడుతూ ఆదిలో మానవులంతా అడవుల్లో తిరిగే వారన్నారు. ఆ తరువాత పశువులు (ఎద్దులు) వారి జీవితంలోకి రావడంతో వ్యవసాయం చేయడం, పశువుల పెంపకం వంటివి నేర్చుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో పశువులు వచ్చిన తరువాతే మనుషుల జీవితంలో సంస్కృతి, సంప్రదాయం పెంపొందాయన్నారు. అప్పట్లో మనుషులు ఎద్దులను లొంగ తీసుకోవడమే క్రమేణా జల్లికట్టుగా మారిందని చెప్పారు. ఇదే మన రాష్ట్రంలో జరుగుతున్న సంప్రదాయ క్రీడ అని పేర్కొన్నారు. ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను ఈ పేటైకాళి వెబ్‌సిరీస్ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు. -
ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
పెరంబూర్: జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రయివేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. జల్లికట్టు క్రీడ కోసం యువత చాలా ప్రశాంతంగా, కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్నారన్నారు. తాము వారికి మద్దతు పలికామన్నారు. అలాంటి జల్లికట్టు పోరాటంలో పోలీసుల హింసాత్మక చర్యలు అనవసరంగా పేర్కొన్నారు. జయలలిత మరణానంతం అందరికీ మాట్లాదే ధైర్యం వచ్చిందని ప్రకాశ్ రాజ్ అన్నారు. జయలలిత మరణం తరువాత బాధ్యతాయుతమైన నాయకుడు లేడని, తమిళ ప్రభుత్వం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వ పాలనే ప్రశ్నార్థకంగా ఉందని వ్యాఖ్యానించారు. అనూహ్యంగా నాయకుడిని ఎంచుకోరాదన్నారు. వారి కోసం ప్రజలు ఓట్లు వేయలేదని, శాసనసభ్యుల మద్దతు ఉన్నా వారిని ఆ నాయకురాలి కోసమే ప్రజలు ఎన్నుకున్నారన్నది మరచిపోరాదన్నారు. అయినా రాజ్యాంగ చట్టప్రకారం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ఐదేళ్లు పారిపాలించాల్సిందేనన్నారు. ఏ ప్రభుత్వం అయినా నిర్మాతల మండలి కోసం వారిని తాము కలిసి మాట్లాడతామని నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఈయన నటుడు విశాల్‌తో కలిసి తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నారన్నది గమనార్హం. అదే విధంగా రెండు రోజుల క్రితం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పోరాటం చేస్తున్న తమిళ రైతులను కలిసి వారికి మద్దతు తెలిపిన ఈ జట్టు బృందం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని, కేంద్ర మంత్రులను కలిసి రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వారి దీన స్థితిని వివరిస్తూ వారి డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో వివాదాస్పద జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. జల్లికట్టు నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఎడ్లను రెచ్చగొడుతూ, వాటిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించే ఈ క్రీడకు పలు ఆంక్షలతో అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా పొంగల్ (తెలుగువారికి సంక్రాంతి) పండుగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. అయితే జల్లికట్టుపై నిషేధాన్ని ఎన్డీయే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించే ఎడ్ల బండ్ల పందాలకూ షరతులతో అనుమతినిచ్చింది. కేంద్రం నిర్ణయంపై పలువురు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
జల్లికట్టుపై నిషేధం తొలగింపు
పలు షరతులతో అనుమతించిన కేంద్రం ♦ హర్షం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం ♦ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న పెటా న్యూఢిల్లీ: వివాదాస్పద జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఎడ్లను రెచ్చగొడుతూ, వాటిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించే ఈ క్రీడకు పలు ఆంక్షలతో అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై తమిళనాడులో హర్షం వ్యక్తమవుతుండగా... జంతు ప్రేమికులు, హక్కుల సంస్థలు కేంద్రంపై మండిపడుతున్నాయి. ఏటా పొంగల్ (తెలుగువారికి సంక్రాంతి) పండుగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సాంప్రదాయక క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధాన్ని తాజాగా ఎన్డీయే ప్రభుత్వం తొలగించడం గమనార్హం. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించే ఎడ్ల బండ్ల పందాలకూ షరతులతో అనుమతినిచ్చింది. జల్లికట్టు, ఎడ్ల పందేలకు అనుమతినిచ్చినా... వాటిని ప్రదర్శన కోసంగానీ, వివిధ పనులు చేసేలా శిక్షణ ఇవ్వడంగానీ చేయరాదని స్పష్టం చేసింది. జల్లికట్టు నిర్వహించే ప్రదేశం కనీసం 15 మీటర్ల దూరంలో చుట్టూ కంచె ఉండేంత విశాలంగా ఉండాలంది. పాల్గొనే ఎద్దు పూర్తి ఆరోగ్యంతో ఉందని పశు వైద్యాధికారితో ధ్రువీకరణ పొందాలని, వాటికి సామర్థ్యాన్ని పెంచే ఎటువంటి డ్రగ్స్ వాడొద్దని తెలిపింది. ఇక ఎడ్ల బండ్ల పందాలకు ప్రత్యేకమైన మార్గం (ట్రాక్) వినియోగించాలని, అది రెండు కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరం ఉండకూదని పేర్కొంది. జయలలిత హర్షం.. మరికొద్ది రోజుల్లో పొంగల్ పండుగ ప్రారంభంకానుండగా.. జల్లికట్టుపై నిషేధం తొలగించడాన్ని ఆ రాష్ట్ర సీఎం జయలలిత స్వాగతించారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. డీఎంకే అధినేత కరుణానిధి, ఇతర పార్టీల నేతలు, రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమర్థించుకున్నారు. సాంస్కృతిక, చారిత్రక క్రీడ అయినందునే జల్లికట్టును అనుమతించి ఎన్నో షరతులు విధించామన్నారు. సుప్రీంకు వెళతాం: పెటా కేంద్రం నిర్ణయాన్ని జంతువుల హక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఓ వైపు ఆవులు వంటి వాటిని సంరక్షించాలంటూనే మరోవైపు జల్లికట్టు వంటి క్రీడను అనుమతివ్వడం ఏమిటని పెటా సంస్థ మండిపడింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పెటా ఇండియా సీఈవో పూర్వా జోషిపుర చెప్పారు. జల్లికట్టులో ఎడ్లను రెచ్చగొట్టేందుకు మద్యం తాగించడం, వాటి తోకలను మెలిపెట్టడం, కొరకడం, కత్తులు, పదునైన వస్తువులతో గుచ్చడం వంటివి చేస్తూ హింసిస్తారని.. దీనికి అనుమతివ్వడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధం జల్లికట్టుపై నిషేధం ఎత్తేయటాన్ని కేంద్ర మంత్రి మేనక గాంధీ నేతృత్వంలో నడిచే పీపుల్ ఫర్ ఎనిమల్ (పీఎఫ్ఏ) సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు, భారతీయ సంస్కృతికి విరుద్ధమని విమర్శించింది. కాగా, జలికట్టుకు అనుమతినివ్వటంపై కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మంత్రి మేనక గాంధీ లేఖ రాశారు. -
కోర్టు ఆదేశాలు పట్టని ’తమ్ముళ్లు’
కొట్టాలంలో టీడీపీ ఆధ్వర్యంలో జల్లికట్టు ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు పది మందికి గాయాలు యాదమరి: సుప్రీం కోర్టు నిషేధం విధించినప్పటికీ మండల సరిహద్దు ప్రాంతమైన కొట్టాలం హరిజనవాడలో బుధవారం జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ఖాతరు చేయకుండా టీడీపీ నాయకులు మారెమ్మ జాతర పేరుతో జల్లికట్టు ప్రారంభించారు. మండలం నుంచేగాక తమిళనాడు నుంచి సైతం యువకులు పాల్గొన్నారు. మూడు గంటలు సాగిన జల్లికట్టులో దాదాపు పది మంది యువకులు గాయపడ్డారు. అడ్డుకోవాల్సిన సర్పంచ్ జగదీష్, టీడీపీ మండల కన్వీనర్ వినాయకగౌండర్, మాజీ ఎంపీపీ రాజమాణిక్యం, సహకార సంఘం ఉపాధ్యక్షుడు పూర్ణ ఈ క్రీడను తిలకించడమేగాక విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు జల్లికట్టుపై మండల పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో సరిహద్దు ప్రాంతాల నుంచే పశువులను తిప్పి పంపేందుకు ప్రయత్నించారు. తవణంపల్లి, గుడిపాల, యాదమరి ఎస్ఐలు, 50మంది కానిస్టేబుళ్లు హాజరయ్యారు. జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా గ్రామస్తులు, టీడీపీ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీ సులు ప్రేక్షకపాత్ర పోషించారు. -
జల్లికట్టు.. ఆటకట్టు
-
జల్లికట్టు.. ఆటకట్టు
నిషేధం విధించిన సుప్రీం గౌరవ మర్యాదలతో జీవించే హక్కు జంతువులకుందని వ్యాఖ్య న్యూఢిల్లీ: తమిళనాడులో శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న ఎద్దుల వికృత క్రీడ ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు బుధవారం నిషేధం విధించింది. జంతువులు సహా జీవులన్నిటికీ సహజసిద్ధమైన గౌరవ మర్యాదలుంటాయని, ప్రశాంతంగా జీవించే హక్కు, తమవారిని రక్షించుకునే హక్కు వాటికుంటాయని పేర్కొంది. వాటిని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జంతువులను అవాంఛితంగా బాధపెట్టకుండా, హింసించకుండా ప్రభుత్వం, భారతీయ జంతు సంక్షేమ బోర్డు(ఏడబ్ల్యూబీఐ) చర్యలు తీసుకోవాలని సూచించింది. జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మనుషుల నుంచి జరిగే దాడులను ఎదుర్కొంటూ మనగలిగే పరిస్థితి జంతువులకు లేదని, ఆ దృష్ట్యా ‘పేరెన్స్ పేట్రియా’ సిద్ధాంతం కింద వాటి హక్కులను కూడా రక్షించాల్సిన బాధ్యత కోర్టులకుందని అభిప్రాయపడింది. జల్లికట్టును అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏడబ్ల్యూబీఐ చేసిన అప్పీలును విచారించిన అనంతరం సుప్రీం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎద్దుల బండి పోటీలపైనా నిషేధం.. తమిళనాడు, మహారాష్ట్ర సహా దేశంలోని ఏ రాష్ట్రం లోనూ ఎద్దులను ప్రదర్శనకు ఉపయోగించే జంతువులుగా చూడరాదని సుప్రీం పేర్కొంది. ఎద్దులను జల్లికట్టు క్రీడలోగాని, ఎద్దుల బండి పోటీలోగాని ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ పోటీల్లో ఎద్దులను హింసించే తీరు ఊహకు మించినదని తెలిపిం ది. చాలా దేశాల్లో చేసినట్లే.. జంతువుల హక్కులను కూడా రాజ్యాంగ హక్కుల్లో చేర్చాలనిపార్లమెంటుకు సూచించింది. తమిళనాడులో జల్లికట్టుకు అవకాశం కల్పించే ‘రెగ్యులేషన్ ఆఫ్ జల్లికట్టు-2009’.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(1)ను ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది. జల్లికట్టు నిర్వాహకుల్లో పైశాచికత్వానికి, వికృతత్వానికి ఈ క్రీడ పరాకాష్ట అని దుయ్యబట్టింది. తీర్పుపై జంతు హక్కుల సంస్థ ‘పెటా’ సంతోషం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ సమాజం ఉరేసుకోవాలి మానవ జాతికి ఆనాదిగా సేవ చేస్తున్న జంతువుల హక్కులను గుర్తించన ందుకు అంతర్జాతీయ సమాజం ఉరేసుకోవాలని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జంతువుల సంరక్షణ, సంక్షేమానికి హామీనిచ్చే అంతర్జాతీయ ఒప్పందం లేకపోవడం దురదృష్టకరమంది.