హిమపాతంతో జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేత
శ్రీనగర్: అధిక హిమపాతంతో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. హిమపాతానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో హైవేపై రాకపోకలు నిలిపివేసినట్టు వెల్లడించారు. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.