Janata Party
-
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్‌లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్‌కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్‌బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్‌సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్‌బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్‌సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్‌సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక గ్రామం.. ముగ్గురు ఎమ్మెల్యేలు
బొబ్బిలి రూరల్: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామం రాజకీయంగా ప్రత్యేకతను సంపాదించుకుంది. ఈ గ్రామం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గ్రామానికి చెందిన కొల్లికూర్మినాయుడు 1952 నుంచి 1955వరకు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బొబ్బిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. తిరిగి ఆయనే 1978నుంచి 1983 వరకు జనతాపార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు కాంగ్రెస్‌పార్టీ తరఫున 1989 నుంచి 1994 వరకు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. డాక్టర్ జగన్మోహనరావు తండ్రి రామస్వామినాయుడు 1955నుంచి 1962 వరకు బలిజిపేట నియోజకవర్గానికి కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. -
కోటాపై మళ్లీ దుమారం
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మళ్లీ ‘కోటా’ తుట్టె కదిలించారు. రిజర్వేషన్లపై సమాజంలో సామరస్యపూర్వకమైన చర్చ జరగాలంటూ ప్రతిపాదించారు. దీని పై వెంటనే చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగడంతో ఆరెస్సెస్ వివరణ ఇచ్చింది. సంక్లిష్టమైన అంశాలను సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవాలన్నదే ఆయన ఉద్దేశమని చెప్పింది. వివిధ వర్గాలకు ఇప్పుడిస్తున్న రిజర్వేషన్లను తాము సంపూర్ణంగా సమర్థిస్తున్నామని ప్రకటించింది. నాలుగేళ్లక్రితం కూడా మోహన్ భాగవత్ ఇటువంటి వివాదాన్నే రేపారు. ఎవరికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో తేల్చడానికి ఒక ‘రాజకీయేతర సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పట్లో బీజేపీ నేతలు ఆయన అభిప్రాయాలతో తమకు ఏకీభావం లేదని ఆదరాబాదరాగా ప్రకటించగా, ఆయన చేసిన వ్యాఖ్యల ఉద్దేశం వేరని ఆరెస్సెస్ వివరించింది. ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రిజర్వేషన్ల విషయంలో దాని అనుకూలురు, వ్యతిరేకులమధ్య చర్చ జరుగుతున్నదని, అది సామరస్యపూర్వకంగా లేదని భాగవత్‌కు ఎందుకు అనిపించిందో తెలియదు. నిజానికి ఈ అంశంపై గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా చర్చలేదు. పోటాపోటీ ఉద్యమాలు, వాగ్యుద్ధాలు జరగటం లేదు. పైపెచ్చు ఒకప్పుడు రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలే ఇప్పుడు తమకూ ఆ మాదిరి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాయి. గుజరాత్లో ఒకప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన పటేళ్లు తమకు కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడ్డెక్కారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆధిపత్య కులాలవారు తమకు కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతుండటం వర్తమాన పరిస్థితి. అలాగే బీసీ కులాల జాబితాల్లో ఉన్న కొన్ని కులాలు తమను షెడ్యూల్ కులాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తుంటే, కొందరు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతున్నారు. రిజర్వేషన్లను వర్గీకరించాలని, ఆ ఫలాలు తమకు కూడా దక్కేందుకు చర్యలు తీసుకోవాలని అట్టడుగు కులాల్లో బాగా దిగువన ఉండిపోయిన కొన్ని కులాలు కోరుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు రిజర్వేషన్లు ఆశిస్తున్నవారే ఎక్కువ. అందుకోసం పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు సాగుతున్నాయి. ఇలా కొత్తగా వస్తున్న డిమాండ్లను గమనించి కొన్ని రాష్ట్రాలు కోటాకు సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని తొలగించాలని కేంద్రాన్ని గతంలో కోరాయి. ఈ ఏడాది మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. పర్యవసానంగా రిజర్వేషన్ల శాతం సుప్రీంకోర్టు విధించిన పరిమితిని దాటింది. ఈ విషయంలో దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొన్న జూన్‌లో బొంబాయి హైకోర్టు ఆమోదిస్తూనే స్వల్పంగా సవరించింది. పర్యవసానంగా అక్కడి కోటా 65శాతానికి చేరింది. మన దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వ్యవస్థ వల్ల కొన్ని కులాలవారు సామాజికంగా నిరాదరణకు లోనవుతున్నారని, అటువంటి వర్గాలను ఆదుకోవడానికి, ఉద్ధరించడానికి తగిన చర్యలు అవసరమని బ్రిటిష్ పాలన సమయంలోనే గుర్తించారు. అప్పట్లోనే కొన్ని అట్టడుగు కులాలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. శతాబ్దాల అసమానతలు సృష్టించిన అంతరాలను తగ్గించడానికి ఇది తప్పనిసరనుకున్నారు. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ విధంగానే భావించారు. కనుకనే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. నిజానికి అప్పట్లోనే సామాజికంగా వెనకబడి ఉన్న కులాలకు కూడా ఈ సదుపాయం కల్పించి ఉంటే వేరుగా ఉండేది. కానీ అది జరగడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. 1979లో జనతా పార్టీ ప్రభుత్వం కుల వివక్ష కారణంగా వెనకబాటుతనానికి గురవుతున్న కులాలను గుర్తించేందుకు మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అది చాలా చురుగ్గా పనిచేసి ఆ మరుసటి ఏడాదికల్లా సమగ్రమైన నివేదిక సమర్పించింది. దాదాపు మరో పదేళ్ళకు గానీ మండల్ కమిషన్ నివేదికకు మోక్షం కలగలేదు. 1989లో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఆ నివేదిక దుమ్ము దులిపి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తప్పుబడుతూ దేశవ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల హింస చెలరేగింది. అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని 2008లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చిత్రమేమంటే అప్పట్లో ఆందోళన చేసిన కులాలే దాదాపు అన్నిచోట్లా తమకూ కోటా కల్పించాలని కోరుతున్నాయి. ఏతావాతా రిజర్వేషన్ల విషయంలో వ్యక్తులుగా ఎవరికెలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చుగానీ... వాటిని రద్దు చేయాలని కోరే కులాలు, సంస్థలూ, పార్టీలూ ఇప్పుడు దాదాపు లేవు. కనుకనే మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సామరస్యపూర్వక చర్చ జరగాలనే ముందు సంస్థగా రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరేమిటో భాగవత్ చెప్పివుంటే సరిపోయేది. ఆయన అస్పష్టంగా ఏదో ఒకటి అనడం, అనంతరం దానిపై దుమారం రేగడం, ఆ తర్వాత సంస్థ తరఫున ఒక వివరణ రావడం సహజంగానే సంశయాలను రేకెత్తిస్తుంది. విపక్షాల సంగతలా ఉంచి, బీజేపీ మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే సైతం రిజర్వేషన్లపై చర్చ వృథా అంటున్నారు. రిజర్వేషన్లు అవసరమా, కాదా అనే అంశం చర్చనీయాంశమే కాదంటున్నారు. రిజర్వేషన్ల ఆలోచనకు మూలమైన కుల వివక్ష, అసమానతలు మన దేశంలో పూర్తిగా అంతరించాయా లేదా అన్న అంశంపై చర్చ జరగాలి. అప్పుడు ఈ రిజర్వేషన్లను కొనసాగించాలో లేదో నిర్ణయించుకోవడం పెద్ద కష్టం కాదు. -
సోనియా చెవిలో జోరీగనై తెలంగాణ తెచ్చా
అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి నా వల్లే తెలంగాణలో భద్రాది రాముడు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాగనూర్, న్యూస్‌లైన్: యూపీఏ చైర్పర్సన్, కాం గ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెవిలో తాను జోరిగలా మారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించానని మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాగనూరు మండలంలోని టైరోడ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని, మాట్లాడారు. తనకు మాగనూరు మండలం పై ప్రత్యేక అభిమానం ఉందని, అం దుకే ఎన్నికల ప్రచారాన్ని ఈ మండ లం నుంచి ప్రారంభిస్తున్నాని చెప్పా రు. తాను జనతా పార్టీలో ఉండి జోడెద్దుల గుర్తుపై పోటీ చేసి గెలుపొందానని, అప్పుడు ఓట్లు వేసి తనను గెలి పించిన వారు కూడా ప్రస్తుతం ఈ సభ లో ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. తాను 45ఏళ్లుగా రాజకీయం లో ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వరుస గా నాలుగు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గా, సుదీర్ఘ కాలం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి సేవ చేశానని చెప్పారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎ స్సార్ చెప్పినందుకే సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే ఈ రోజు భద్రాది రాముడు తెలంగాణ ఉన్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, పేదలకు అవసరమయ్యే జాతీయ ఉపాధి హా మీ పథకం, రూపాయికి కిలో బి య్యం, ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ, 108, 104 సేవలు, తదితర పథకాలను తెచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకు తనను పార్లమెంట్‌కు, మక్తల్ నుంచి అసెంబ్లీకి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పంపించాలన్నారు. తన రాజకీయ జీవితంలో చివరిసారిగా పోటీ చేస్తున్నానని, అందుకే మహబూబ్‌నగర్‌లో బరిలో దిగినట్లు చెప్పారు. తాను ఢిల్లీలో పోటీ చేసినా గెలుస్తానని, కానీ సొంత జిల్లా కావడంతో ఇ క్కడి నుంచే పోటీ చేయాలనుకున్నాని తెలిపారు. కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, చిట్టెం సుచరిత, రాజుల అశిరెడ్డి, బసిరెడ్డి, విరాఠ్రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజప్పగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో జనతా పార్టీ విలీనం
రాజ్‌నాథ్ సమక్షంలో స్వామి ప్రకటన న్యూఢిల్లీ: సుబ్రమణ్య స్వామి నేతృత్వంలోని జనతా పార్టీ ఆదివారం బీజేపీలో విలీనమైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వామి తన పార్టీని కాషాయ దళంలో కలిపేశారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ఆ పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీల సమక్షంలో ఆయన ఈమేరకు ఢిల్లీలో ప్రకటన చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, జాతి ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దేశానికి మంచి భవిష్యత్తు అందించేందుకు బీజేపీతో కలిసి పనిచేస్తానన్నారు. విలీనానికి ముందు రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో స్వామి బీజేపీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ.. జనతా పార్టీ విలీనంతో బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. హిందుత్వ సిద్ధాంతాలకు గట్టి మద్దతు పలికే స్వామి గతంలో జన సంఘ్‌లో పనిచేశారు. ఐదు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా విధులు నిర్వహించారు. 2జీ కుంభకోణాన్ని వెలికితీయడంలో కీలక పాత్ర పోషించారు. -
బీజేపీలో చేరిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి!
జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఆదివారం అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో జనతాపార్టీని విలీనం చేయనున్నారు. బీజేపీలో చేరాలని స్వామి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని రాజ్ నాథ్ సింగ్ విలీన ప్రకటన తర్వాత అన్నారు. బీజేపీలో చేరడంపై స్వామి సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ జనసంఘ్ నేతలతో కలిసి పనిచేస్తానని స్వామి తెలిపారు.