japan prime minister
-
జపాన్‌లో హంగ్
టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా నేతృత్వంలోని అధికార కూటమి ఆదివారం జరిగిన కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయింది. 465 స్థానాలున్న దిగువ సభలో కూటమి బలం 279 స్థానాల నుంచి 215కు పడిపోయింది. మెజారిటీకి కనీసం 233 స్థానాలు అవసరం. కూటమి సారథి లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి 2009 తర్వాత అత్యంత దారుణమైన ఫలితాలివే. జపాన్ను దాదాపుగా 1955 నుంచీ ఎల్డీపీయే పాలిస్తూ వస్తోంది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అనిశ్చితి దెబ్బకు జపాన్ కరెన్సీ యెన్ మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చాయని ఇషిబా సోమవారం అంగీకరించారు. ‘‘ప్రజా తీర్పును అంగీకరిస్తున్నా. అయితే ప్రధానిగా నేనే కొనసాగుతాం’’ అని స్పష్టం చేశారు. ‘‘అధికార కూటమికి మా ఎల్డీపీయే సారథ్యం వహిస్తుంది. కీలక విధానాలతో ప్రణాళికాబద్ధమైన బడ్జెట్‌ను రూపొందిస్తాం. రాజకీయ సంస్కరణలు కొనసాగిస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే ప్రతిపక్షాలకు సహకరించడానికి మా పార్టీ సిద్ధం’’ అన్నారు. డిసెంబర్ నెలాఖరులో కీలకమైన బడ్జెట్ ప్రణాళికలను పాలకవర్గం ఆమోదించేదాకా ఇషిబా కొనసాగే అవకాశముంది. ఫ్యూమియో కిషిడా నుంచి ఇషిబా అక్టోబర్ 1న పదవీ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఆ వెంటనే సాధారణ ఎన్నికలకు వెళ్లారు.చిన్న పార్టీలే కీలకంసెంట్రిస్ట్ నేత యోషిహికో నోడా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం కాన్స్టిట్యూషనల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సీడీపీజే) 148 స్థానాలు గెలుచుకుంది. ఇది గతంలో కంటే 50 స్థానాలు అధికం. ‘‘అధికార కూటమికి మెజారిటీ రాకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించాం. ఇది గొప్ప విజయం’’ అని నోడా అన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి సంకీర్ణానికి నాయకత్వం వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు 30 రోజుల సమయముంది. ఎక్కవ సీట్లు సాధించిన చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. ఇషిబాతో చేయి కలిపేందుకు డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ది పీపుల్, కన్జర్వేటివ్ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ సిద్ధంగా ఉన్నాయి. పాక్షిక పొత్తుకు సిద్ధమని డీపీపీ అధినేత యుచిరో తమాకీ కూడా తెలిపారు. -
Fukushima nuclear disaster: పసిఫిక్‌లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
Bilateral Talks: జపాన్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల అగ్రనేతలు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదాలు సోమవారం ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 27 గంటల భారత పర్యటనలో భాగంగా కిషిదా ఢిల్లీకొచ్చిన విషయం తెల్సిందే. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. ‘ జీ20 సదస్సుకు భారత్, జీ7 కూటమికి జపాన్ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కృషికి చక్కని అవకాశం. జీ20 అధ్యక్షతన భారత ప్రాధాన్యాలను కిషిదాకు వివరించా. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రపంచ చట్టాలను గౌరవిస్తూ ఏర్పడిందే. ఇండో–పసిఫిక్ ప్రాంతానికి ఇదెంతో ముఖ్యం. రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు, సంక్షిష్ట సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై మేం సమీక్ష చేశాం’ అని తర్వాత పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘ భారత్‌తో ఆర్థిక తోడ్పాటు గణనీయంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్ వృద్ధికేకాదు జపాన్ ఆర్థిక అవకాశాలకు ఎంతగానో ఊతమిస్తుంది. స్వేచ్ఛాయుత ఇండో –పసిఫిక్ విధానాన్ని నేడు భారత గడ్డపై మోదీ సమక్షంలో ఆవిష్కరించా. మేలో జరిగే జీ7 సదస్సుకు మోదీని సాదరంగా ఆహ్వానించా’ అని ప్యుమియో కిషిదా చెప్పారు. పలు ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాలపై ఉక్రెయిన్ యుద్ధ విపరిణామాల ప్రభావం, ఇండో–పసిఫిక్ పరిస్థితి, సైనిక హార్డ్‌వేర్‌ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలకాంశాలూ చర్చకొచ్చాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి నాలుగో విడత 300 బిలియన్ యెన్ల(రూ.18,800 కోట్ల) రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. -
భారత్‌లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. కిషిడా నేతృత్వంలోని జపాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ, కిషిడా సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుదృఢం చేసుకునేందుకు గల అవకాశాలను చర్చించారు. సహజ ఇంధన వనరుల అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, జపాన్ల సంబంధాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషిడా ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడి తీవ్రమైన అంశమని, ఈ చర్యతో అంతర్జాతీయ ప్రాథమిక సంప్రదాయాలను సైతం రష్యా తుంగలోకి తొక్కిందన్నారు. యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష బలప్రయోగాన్ని ఏమాత్రం సహించబోమన్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని రెండు దేశాలు గుర్తించాయని మోదీ చెప్పారు. ఇరు దేశాల ప్రతినిధులు వివిధ రంగాల్లో సహకారానికి మరింత బలోపేతం చేసుకునేందుకు సంబంధించి ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారన్నారు. కిషిడా ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరి కాంబోడియాకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
జపాన్‌లో అస్థిరత
వెనకవుండి సలహాలు, సూచనలు అందిస్తూ అధినేత విజయపథంలో పయనించడానికి తోడ్పడటం వేరు...తానే నాయకుడై పాలించడం వేరు. నిరుడు సెప్టెంబర్ 16న జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యొషిహిడే సుగా తొందరలోనే ఈ తత్వాన్ని బోధపరుచుకుని ఆ పదవికి గుడ్ బై చెప్పారు. పర్యవసానంగా పట్టుమని ఏడాది కాకముందే ఆయన వారసుడి ఎంపిక కోసం అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) అన్వేషణ ప్రారంభించక తప్పలేదు. జపాన్‌కు రాజకీయ అస్థిరత కొత్తగాదు. 2006–12 మధ్య ఆ దేశం ఆరుగురు ప్రధానులను చూసింది. అందులో షింజో అబే కూడా ఒకరు. కానీ 2012లో రెండోసారి అధికారంలోకొచ్చాక అబే తీరు మారింది. అయిదేళ్లపాటు సుస్థిర పాలన అందించడమేకాక, 2017లో మరోసారి మంచి మెజారిటీతో అధికారంలోకొచ్చి మూడేళ్లు పాలించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో నిరుడు తప్పుకున్నారు. ఆయన వారసు డిగా వచ్చిన సుగాపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, తెరవెనకుండి షింజో అబేను విజయపథంలో నడిపించింది ఆయనే. అబే తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం వెనకా ఆయ నదే కీలకపాత్ర. కేబినెట్ రూపురేఖలు నిర్ణయించటంలో, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో, విదేశాంగ విధానం రూపకల్పనలో, పర్యాటక రంగాన్ని పరుగులెత్తించడంలో సుగా ప్రమేయ ముంది. అస్థిర ప్రభుత్వాలతో, ఆర్థిక ఒడిదుడుకులతో, వరస విపత్తులతో కుంగిపోయిన జపాన్‌కు ఈ నిర్ణయాలు జవసత్వాలిచ్చాయి. సమస్యలు ముంచుకొచ్చినప్పుడు ప్రజాదరణ దండిగా ఉన్న రాజకీయ నేత స్పందించే తీరుకూ, ఒక ఉన్నతాధికారి ఆలోచించే తీరుకూ వ్యత్యాసముంటుంది. అది తన సొంత ఆలోచనైనా, ఎవరి సలహాల పర్యవసానమైనా దాన్ని అందరితో ఒప్పించడంలో, ముందుకు నడిపించడంలో, ఆ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయడంలో, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో రాజకీయ నాయ కుడి శైలి భిన్నంగా ఉంటుంది. ఉన్నతాధికారిగా అబే తరఫున అన్నీ చక్కబెట్టి, ఆయనకు పేరుప్రఖ్యా తులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన సుగా నేరుగా పాలనా పగ్గాలు చేపట్టాక వైఫల్యాలను మూటగట్టుకోవడంలోని సూక్ష్మం ఇదే. వాస్తవానికి రెండు శిబిరాలుగా చీలిన పాలక పార్టీలో సుగా అందరివాడుగా నిరూపించుకోగలిగారు. పార్టీ ఎంపీలు 151 మందిలో అబే వర్గానికి చెందిన 96 మంది, ఆర్థికమంత్రి తారో అసో అనుకూలురైన 55 మంది ఆయనకు అండదండలందించారు. ఈ రెండు వర్గాలకూ సుగా తన కేబినెట్లో సమాన ప్రాతినిధ్యమిచ్చి, అన్నిటా వారి సలహాలు తీసుకు న్నారు. ఎవరినీ నొప్పించకుండా పనిచేశారు. ప్రధాని పదవికి తామే అర్హులమని భావించే నేతలు ఎల్డీపీలో అరడజనుమంది వరకూ ఉన్నారు. కానీ కరోనా విలయంతోపాటు, ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ముంచుకొస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీ యంగా దెబ్బతింటామేమోనన్న భయాందోళనలు వారందరిలోనూ ఉన్నాయి. అందుకే అబేను విజయపథంలో నిలిపిన సుగావైపే ఇరుపక్షాలూ అప్పట్లో మొగ్గుచూపాయి. ప్రధానిగా వచ్చిన సుగా తనకంటూ సొంత ఎజెండా ఉన్నదని నిరూపించుకోలేకపోయారు. అంతక్రితం అబే అమలు చేసిన విధానాలు తనవే కావొచ్చుగానీ, వాటి లోటుపాట్లను సరిదిద్దకుండా కొనసాగిస్తుండటం, కరోనా కట్టడిలో వైఫల్యాలు ఎదుర్కొనడం, వ్యాక్సిన్లు అందరికీ అందించలేక పోవడం సుగా ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. లాక్డౌన్ల కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినా, సాధారణ ప్రజానీకాన్ని ఆదుకొనడానికి పకడ్బందీ ప్రణాళికలు కొరవడ్డాయి. ఇప్పటికీ కొన్ని నగ రాలు కొవిడ్ ఎమర్జెన్సీలో కాలం గడుపుతున్నాయి. కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ ఆసు పత్రులు వెనక్కి పంపిన ఉదంతాలు జనంలో ఆగ్రహాన్ని రగిల్చాయి. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ నిర్వహించడమేమిటన్న ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ఏతావాతా అధికార పగ్గాలు చేపట్టేనాటికి 70 శాతం రేటింగ్ ఉన్న సుగా ప్రస్తుతం 26 శాతానికి దిగజారారు. ఒకప్పుడు తెరవెనక సలహాలిచ్చిన అనుభవమున్న నేత... ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న సందేహంలో పడ్డారు. తీసుకున్న నిర్ణయంలోని మంచిచెడ్డలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పి ఒప్పించే నేర్పు ఆయనకు లేదు. దాని కితోడు వచ్చే నెలతో ప్రస్తుత సభ కాలపరిమితి ముగుస్తోంది. నవంబర్‌లోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి.అటు ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించటం, ఇటు పాలనాపరంగా లోటుపాట్లు సరి దిద్దటం తనకు కత్తి మీద సాము అవుతుందని సుగా సరిగానే గ్రహించారు. దాదాపు 13 కోట్ల జనాభాగల జపాన్‌లో జనం నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఎల్డీపీ జాతీయవాద పార్టీయే అయినా వారిని సమ్మోహన పరిచి, ఒప్పించి మెప్పించగల మంత్రదండమేదీ దాని దగ్గర లేదు. విపక్షం బలహీనంగా ఉండటమే ప్రస్తుతానికి ఆ పార్టీకున్న ఏకైక బలం. ఈ నెలా ఖరులోగా కొత్త సారథిని ఎన్నుకోవటం, వారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లటం ఒకరకంగా ఎల్డీపీకి అగ్ని పరీక్ష. చైనా, దక్షిణ కొరియాలతో సంబంధాలు, రక్షణ రంగాన్ని పటిష్టం చేయడం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, నిరుద్యోగిత తగ్గించటం వంటి అంశాల్లో ఏమేం చేయదల్చుకున్నదీ కొత్త ప్రధాని ప్రజలకు వివరించాల్సి వుంటుంది. పరిణత ప్రజాస్వామ్యం ఉన్న జపాన్‌లో జాగ్రత్తగా అడుగులేయకపోతే ఎంతటి నేత అయినా, పార్టీ అయినా పల్టీలు కొట్టడం ఖాయమని సుగా ఉదంతం నిరూపించింది. కొత్తగా వచ్చే నేత ఎలాంటివారైనా దీన్ని విస్మరించటం అంత తేలిక కాదు. -
ఒలింపిక్స్ ముంగిట టోక్యోలో ఎమర్జెన్సీ..
టోక్యో: ఒలింపిక్స్ ప్రారంభానికి మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండగా.. జపాన్ ప్రధాని యొషిహిదె సుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని తెలిపారు. ఒలింపిక్స్ జరగనున్న టోక్యోలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, నగరంలో బుధవారం ఒక్కరోజే 920 కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు డెల్టా, లాంబ్డా దేశంలోని ప్రవేశించే ఆస్కారం ఉన్నందున ఒలింపిక్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్ ఆపేయాల్సి వస్తే జపాన్‌కు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్‌కు అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా రూ. లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా అత్యయిక స్థితిని విధించిన జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన విశ్వక్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మహమ్మారి మరోసారి విరుచుకుపడటంతో ఈ ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. భారత అథ్లెట్లు అయోమయం.. టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రయాణానికి సంబంధించిన తేదీల విషయాల్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నుంచి వేర్వేరు ప్రకటనలు రావడమే ఇందుకు కారణం. ఒలింపిక్స్‌కు సెలెక్ట్ అయిన అథ్లెట్లలో ఫస్ట్ బ్యాచ్ 17వ తేదీన టోక్యో బయలుదేరుతుందని ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించారు. కానీ, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ వస్తే 14వ తేదీనే ప్రయాణముంటుందని ఐఓఏ నుంచి అథ్లెట్లకు ఇటీవల మెసేజ్ వచ్చింది. -
జపాన్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఒలంపిక్స్ నిర్వాహకుల్లో ఆందోళన
టోక్యో: జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి మరింత వేగవంతంగా జరిగే ఆస్కారం ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అవసరమైతే ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని జపాన్ ప్రధాని యోషిహిదే సుగా వెల్లడించారు. కాగా, గత నెలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పదివేల మంది ప్రేక్షకులకు అనుమతిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే, నాటి నుంచి కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజుకి సగటున 500 వరకూ నమోదైన కేసులు.. గత రెండు రోజుల క్రితం నుంచి 1500 దాటుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 1821 కేసులు నమోదవగా.. ఇందులో టోక్యోలో నమోదైనవే 714 కేసులు కావడం ఆందోళన కలిగించే అంశం. దీంతో ఒలింపిక్స్ నిర్వహణ కత్తి మీద సాములా మారింది. మరోవైపు టోక్యోతో పాటు ఇతర ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం నివారణ చర్యల్లో నిమగ్నమైంది. -
జపాన్‌కు కొత్త ఏలిక
గత నెలలో అనారోగ్య కారణాలతో పదవినుంచి తప్పుకున్న జపాన్ ప్రధాని షింజో అబే స్థానంలో యొషిహిడే సుగా ఆదివారం ఎంపికయ్యారు. ఇంతవరకూ ప్రధాన కేబినెట్ కార్యదర్శిగా వున్న సుగాకు అధికార పక్షం లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో భారీగా ఓట్లు వచ్చాయి. జపాన్ పార్లమెంటు డైట్లో బుధవారం ఆయన ఎంపికపై ఓటింగ్ జరుగుతుంది. అబే పాలనలో సుగా పేరు ఎక్కడా వినపడలేదు. బయటి ప్రపంచానికి కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. ఆయన ఏ దేశానికీ వెళ్లింది లేదు. తన దౌత్య నైపుణ్యాన్ని చూపిన సందర్భం లేదు. కానీ అబే ప్రభుత్వం తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం రూపకల్పనలోనూ, దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలోనూ సుగాదే కీలక పాత్ర. కనుక మన దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడంతోసహా ఆ పాత విధానాలు యధాతథంగా కొనసాగుతాయనే చెప్పాలి. అయితే అధికారంలోకొచ్చాక సుగా పరిష్కరించాల్సిన సమస్యలు చాలావున్నాయి. అవన్నీ సంక్లిష్టమైనవి. 2012లో షింజో అబే అధికా రంలోకి వచ్చే సమయానికి జపాన్ అన్నివిధాలా నీరసించివుంది. దాన్ని చక్కదిద్దడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చేసి చూపించారు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడక పోతే ఆ జైత్రయాత్ర కొనసాగేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రపంచ దేశాలన్నిటిలాగే ఆర్థికంగా అది దెబ్బతింది. ఆర్నెల్లుగా తయారీ రంగం స్తంభించింది. ఇప్పుడిప్పుడే అది పట్టాలెక్కుతున్న సూచ నలు కనబడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి అంతక్రితంతో పోలిస్తే మెరుగైంది. అయితే గతంతో పోలిస్తే చైనాతో వివాదం ముదురుతోంది. దానితో జాగ్రత్తగా వ్యవహించడం సుగాకు సవాలే. ప్రధాని పదవి చేపట్టేనాటికి, ఇప్పుడు వైదొలగుతున్న సమయానికి మధ్య షింజో అబే వైఖరిలో వచ్చిన మార్పులు గమనించదగ్గవి. వాటినుంచి సుగా కొత్తగా నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఎందు కంటే ఆ మార్పుల వెనక ముఖ్యపాత్ర ఆయనదే. ప్రారంభంలో అబే జాతీయవాది. స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకి. విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ) తమకు అంగీకారం కానేకాదని 2012కు ముందు ఆయన గట్టిగా వాదించేవారు. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టీపీపీతో సహా అంతర్జాతీయ ఒప్పందాలు ఏవీ పనికిరావంటున్నారు గానీ... అందుకు చొరవ తీసుకున్నదీ, అందరినీ అందులో చేరేలా ఒప్పించిందీ అమెరికాయే. దానికి అబే తీవ్ర వ్యతిరేకి. పసి ఫిక్ మహాసముద్ర ప్రాంత దేశాలు సభ్య దేశాలుగా ఉండాలని ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో మన దేశాన్ని కూడా భాగస్వామిగా మార్చాలని అమెరికా అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించింది. అందుకు సంబంధించిన చర్చల్లో మన దేశం పలుమార్లు పాల్గొంది. చివరకు చేరబోనని మన దేశం చెప్పింది. రెండున్నరేళ్లక్రితం అమెరికాయే దాన్నుంచి తప్పుకుంది. కానీ 2018లో అబే మిగిలిన దేశాలను కలుపుకుని దానికి విశాల పసిఫిక్ భాగస్వామ్య దేశాల సమగ్ర, పురోగామి ఒప్పందం(సీపీటీపీపీ)గా పేరుమార్చారు. ఇదే కాదు... ఇలాంటి మరో డజను ఒప్పందాలు అమలు కావాలన్న కృతనిశ్చ యంతో అబే వున్నారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు అమెరికా, చైనాలు రెండూ ముప్పుగా పరి ణమిస్తున్నాయన్నదే ఆయన వాదన. అమెరికాతో సహా అన్ని దేశాలూ ఆత్మరక్షణ విధానాల్లో పడి, వలసలపై ఆంక్షలు విధిస్తే... అబే దానికి భిన్నంగా వలస నిబంధనలు సరళం చేశారు. కనుకనే జపాన్‌లో ప్రస్తుతం 17 లక్షలమంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. అబే అధికారంలోకి వచ్చే నాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. సారాంశంలో ఫక్తు జాతీయవాదిగా రంగం మీదికొచ్చిన అబే... ప్రపంచ మార్కెట్‌కు తిరుగులేని నాయకుడిగా రూపొందారు. అలాగని ఆయన దేశంలో అన్నిటినీ ప్రైవేటుపరం చేయాలనే స్వేచ్ఛా మార్కెట్ ఉదారవాది కాదు. ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభుత్వ నియంత్రణ వుండాలని కోరుకున్న నాయకుడే. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి జపాన్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఆశించిన ఫలితాల నివ్వలేదు. వేరే దేశాలతో పోలిస్తే అది మెరుగుపడింది. కానీ అనుకున్న స్థాయిలో లేదు. ఇందుకు కారణం మౌలిక సంస్కరణల అమలులో వెనుకంజేనని ఆర్థిక నిపుణులంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాల తర్వాతి స్థానం జపాన్‌దే. అమెరికాతో జపాన్‌కు గట్టి స్నేహసంబంధాలున్నాయి. అదే సమయంలో చైనాతోనూ దానికి సుహృద్భావ సంబంధాలే కొనసా గుతున్నాయి. అయితే చైనాకు చెందిన హువీ టెక్నాలజీ సంస్థ 4జీ పరికరాలను వినియోగించరాదన్న అమెరికా ఆంక్షలకు జపాన్ కూడా తలొగ్గింది. అందువల్ల అనేకానేక సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. హువీకి, ఇతర చైనా కంపెనీలకు అవసరమైన విడి భాగాలు తయారుచేసే పరిశ్రమలు జపాన్‌వే. చైనాకు జపాన్ వార్షిక ఎగుమతులు నిరుడు 14,000 కోట్ల డాలర్లు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ మరీ దిగజారకుండా జపాన్ను ఎంతో కొంత కాపాడినవి ఈఎగుమతులే. జపాన్ జాతీయ భద్రతతోపాటు, తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో వున్న విభేదాలు జపాన్ కంపెనీలకు ప్రాణాంతకంగా మారాయి. స్వీయప్రయోజనాలైతే తప్పదుగానీ అమెరికా కోసం, అది ఆదేశించేవిధంగా వ్యవహరిస్తే నష్టపోయేదే ఎక్కువుంటుందని జపాన్ పారిశ్రామికవేత్తలు అభి ప్రాయపడుతున్నారు. చైనాతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగితే తమ లాభాలకు ఢోకా వుండదని వారి అభిప్రాయం. ఏతావాతా అటు దేశ భద్రతనూ, ఇటు ఆర్థిక ప్రయోజనాలనూ దృష్టిలో వుంచుకుని సుగా జాగ్రత్తగా అడుగులేయాల్సివుంటుంది. రాజకీయాలంటే తెలియని అతి సాధారణ రైతు కుటుంబంనుంచి వచ్చిన సుగా ఎల్డీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. అబే పదవీకాలం ఇంకా ఏడాది మిగిలింది గనుక అంతవరకూ కొనసాగి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేక మరికొన్ని నెలల తర్వాత మధ్యంతర ఎన్నికలకు మొగ్గుచూపుతారా అన్నది మున్ముందు తెలుస్తుంది.షింజో అబే స్థానంలో యొషిహిడే సుగా ఆదివారం ఎంపికయ్యారు. ఇంతవరకూ ప్రధాన కేబినెట్ కార్యదర్శిగా వున్న సుగాకు అధికార పక్షం లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ సమావేశంలో భారీగా ఓట్లు వచ్చాయి. జపాన్ పార్లమెంటు డైట్లో బుధవారం ఆయన ఎంపికపై ఓటింగ్ జరుగుతుంది. అబే పాలనలో సుగా పేరు ఎక్కడా వినపడలేదు. బయటి ప్రపంచానికి కూడా ఆయన గురించి పెద్దగా తెలియదు. ఆయన ఏ దేశానికీ వెళ్లింది లేదు. తన దౌత్య నైపుణ్యాన్ని చూపిన సందర్భం లేదు. కానీ అబే ప్రభుత్వం తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం రూపకల్పనలోనూ, దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలోనూ సుగాదే కీలక పాత్ర. కనుక మన దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడంతోసహా ఆ పాత విధానాలు యధాతథంగా కొనసాగుతాయనే చెప్పాలి. అయితే అధికారంలోకొచ్చాక సుగా పరిష్కరించాల్సిన సమస్యలు చాలావున్నాయి. అవన్నీ సంక్లిష్టమైనవి. 2012లో షింజో అబే అధికా రంలోకి వచ్చే సమయానికి జపాన్ అన్నివిధాలా నీరసించివుంది. దాన్ని చక్కదిద్దడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చేసి చూపించారు. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడక పోతే ఆ జైత్రయాత్ర కొనసాగేది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ప్రపంచ దేశాలన్నిటిలాగే ఆర్థికంగా అది దెబ్బతింది. ఆర్నెల్లుగా తయారీ రంగం స్తంభించింది. ఇప్పుడిప్పుడే అది పట్టాలెక్కుతున్న సూచ నలు కనబడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి అంతక్రితంతో పోలిస్తే మెరుగైంది. అయితే గతంతో పోలిస్తే చైనాతో వివాదం ముదురుతోంది. దానితో జాగ్రత్తగా వ్యవహించడం సుగాకు సవాలే. ప్రధాని పదవి చేపట్టేనాటికి, ఇప్పుడు వైదొలగుతున్న సమయానికి మధ్య షింజో అబే వైఖరిలో వచ్చిన మార్పులు గమనించదగ్గవి. వాటినుంచి సుగా కొత్తగా నేర్చుకోవాల్సిందేమీ లేదు. ఎందు కంటే ఆ మార్పుల వెనక ముఖ్యపాత్ర ఆయనదే. ప్రారంభంలో అబే జాతీయవాది. స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకి. విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ) తమకు అంగీకారం కానేకాదని 2012కు ముందు ఆయన గట్టిగా వాదించేవారు. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టీపీపీతో సహా అంతర్జాతీయ ఒప్పందాలు ఏవీ పనికిరావంటున్నారు గానీ... అందుకు చొరవ తీసుకున్నదీ, అందరినీ అందులో చేరేలా ఒప్పించిందీ అమెరికాయే. దానికి అబే తీవ్ర వ్యతిరేకి. పసి ఫిక్ మహాసముద్ర ప్రాంత దేశాలు సభ్య దేశాలుగా ఉండాలని ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో మన దేశాన్ని కూడా భాగస్వామిగా మార్చాలని అమెరికా అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించింది. అందుకు సంబంధించిన చర్చల్లో మన దేశం పలుమార్లు పాల్గొంది. చివరకు చేరబోనని మన దేశం చెప్పింది. రెండున్నరేళ్లక్రితం అమెరికాయే దాన్నుంచి తప్పుకుంది. కానీ 2018లో అబే మిగిలిన దేశాలను కలుపుకుని దానికి విశాల పసిఫిక్ భాగస్వామ్య దేశాల సమగ్ర, పురోగామి ఒప్పందం(సీపీటీపీపీ)గా పేరుమార్చారు. ఇదే కాదు... ఇలాంటి మరో డజను ఒప్పందాలు అమలు కావాలన్న కృతనిశ్చ యంతో అబే వున్నారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకు అమెరికా, చైనాలు రెండూ ముప్పుగా పరి ణమిస్తున్నాయన్నదే ఆయన వాదన. అమెరికాతో సహా అన్ని దేశాలూ ఆత్మరక్షణ విధానాల్లో పడి, వలసలపై ఆంక్షలు విధిస్తే... అబే దానికి భిన్నంగా వలస నిబంధనలు సరళం చేశారు. కనుకనే జపాన్‌లో ప్రస్తుతం 17 లక్షలమంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. అబే అధికారంలోకి వచ్చే నాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. సారాంశంలో ఫక్తు జాతీయవాదిగా రంగం మీదికొచ్చిన అబే... ప్రపంచ మార్కెట్‌కు తిరుగులేని నాయకుడిగా రూపొందారు. అలాగని ఆయన దేశంలో అన్నిటినీ ప్రైవేటుపరం చేయాలనే స్వేచ్ఛా మార్కెట్ ఉదారవాది కాదు. ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభుత్వ నియంత్రణ వుండాలని కోరుకున్న నాయకుడే. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి జపాన్ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఆశించిన ఫలితాల నివ్వలేదు. వేరే దేశాలతో పోలిస్తే అది మెరుగుపడింది. కానీ అనుకున్న స్థాయిలో లేదు. ఇందుకు కారణం మౌలిక సంస్కరణల అమలులో వెనుకంజేనని ఆర్థిక నిపుణులంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనాల తర్వాతి స్థానం జపాన్‌దే. అమెరికాతో జపాన్‌కు గట్టి స్నేహసంబంధాలున్నాయి. అదే సమయంలో చైనాతోనూ దానికి సుహృద్భావ సంబంధాలే కొనసా గుతున్నాయి. అయితే చైనాకు చెందిన హువీ టెక్నాలజీ సంస్థ 4జీ పరికరాలను వినియోగించరాదన్న అమెరికా ఆంక్షలకు జపాన్ కూడా తలొగ్గింది. అందువల్ల అనేకానేక సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. హువీకి, ఇతర చైనా కంపెనీలకు అవసరమైన విడి భాగాలు తయారుచేసే పరిశ్రమలు జపాన్‌వే. చైనాకు జపాన్ వార్షిక ఎగుమతులు నిరుడు 14,000 కోట్ల డాలర్లు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ మరీ దిగజారకుండా జపాన్ను ఎంతో కొంత కాపాడినవి ఈఎగుమతులే. జపాన్ జాతీయ భద్రతతోపాటు, తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో చైనాతో వున్న విభేదాలు జపాన్ కంపెనీలకు ప్రాణాంతకంగా మారాయి. స్వీయప్రయోజనాలైతే తప్పదుగానీ అమెరికా కోసం, అది ఆదేశించేవిధంగా వ్యవహరిస్తే నష్టపోయేదే ఎక్కువుంటుందని జపాన్ పారిశ్రామికవేత్తలు అభి ప్రాయపడుతున్నారు. చైనాతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగితే తమ లాభాలకు ఢోకా వుండదని వారి అభిప్రాయం. ఏతావాతా అటు దేశ భద్రతనూ, ఇటు ఆర్థిక ప్రయోజనాలనూ దృష్టిలో వుంచుకుని సుగా జాగ్రత్తగా అడుగులేయాల్సివుంటుంది. రాజకీయాలంటే తెలియని అతి సాధారణ రైతు కుటుంబంనుంచి వచ్చిన సుగా ఎల్డీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. అబే పదవీకాలం ఇంకా ఏడాది మిగిలింది గనుక అంతవరకూ కొనసాగి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేక మరికొన్ని నెలల తర్వాత మధ్యంతర ఎన్నికలకు మొగ్గుచూపుతారా అన్నది మున్ముందు తెలుస్తుంది. -
జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా
టోక్యో: జపాన్ అధికార పార్టీకి నూతన సారథిగా యోషిహిడే సుగా ఎంపికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో ఇటీవలే రాజీనామా చేసిన షింజో అబే స్థానంలో ఈయన ఎంపికయ్యారు. సుగా ప్రస్తుతం చీఫ్ కేబినెట్ సెక్రటరీగా అబేకి కుడిభుజంగా ఉన్నారు. ఈయన పార్లమెంటుకి ఎంపిక కావడం లాంఛనమే. కరోనా కట్టడి, పతనమైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం తన తక్షణ ప్రాధమ్యాలని సుగా పేర్కొన్నారు. తాను సంస్కరణ వాదినన్నారు. మాజీ ప్రధాని అబే ప్రాధమ్యాలను ఈయనా కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రధాని వంటలోనూ సాయం చేస్తారు!!
గట్టిగా ఓ లక్ష రూపాయల జీతం వస్తోందంటే చాలు.. ఇంట్లో భార్యమీద గయ్యిమని లేచే వాతావరణం మనది. కానీ ఓ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంట్లో వంట చేయడం, అవసరమైతే చెత్త పారబోయడం.. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారంటే నమ్ముతారా? జపాన్ ప్రధానమంత్రి మాత్రం ఇవన్నీ చేస్తారట. షింజో అబె గురించి స్వయంగా ఆయన భార్యే ఈ విషయాలు చెప్పారు. కొన్ని సందర్భాలలో ఇంట్లో వంట చేయాల్సింది కూడా ఆయనేనని అకీ అబె తెలిపారు. జపాన్‌లో మహిళలు ముందడుగు వేయడానికి ఇలా పురుషులు కూడా సహకరించడమే కారణమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా మహిళలను ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రధాని షింజో అబె పదే పదే చెబుతున్నారు. బుధవారం నాడు ఆయన 18 మందిని కేబినెట్లోకి తీసుకుంటే.. వారిలో ఐదుగురు మహిళలే. మహిళలకు తన భర్త అనేక అవకాశాలు కల్పిస్తారని అకీ అబె చెప్పారు. ఇంట్లో సమయం దొరికినప్పుడల్లా చేతిసాయం చేస్తూనే ఉంటారన్నారు. కొన్నిసార్లు మాత్రం ఆయన రోజంతా బయటే ఉంటారని.. అలాంటప్పుడే తనకు ఇల్లు శుభ్రం చేయడానికి కూడా సమయం దొరకదని తెలిపారు. అయితే.. ఏనాడూ భర్తగా ఆధిపత్యం చలాయించాలని మాత్రం షింజో అబె చూడరట.