టిడిపి అభ్యర్థిపై చీటింగ్ కేసు నమోదు
కర్నూలు: ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జయనాగేశ్వర రెడ్డి ఒకరి వద్ద రెండు కోట్ల 50 లక్షల రూపాయలు అప్పుతీసుకుని చెల్లించలేదు. అంతే కాకుండా చెల్లని చెక్కులు ఇచ్చారు.
అప్పు ఇచ్చిన శ్రీరామ్ అనే వ్యక్తి చెల్లని చెక్ ఇచ్చారని జయనాగేశ్వర్ రెడ్డిపై గత జనవరిలో ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఈ కేసును ప్రస్తావించలేదు.