jayalalitha heir
-
జయ.. అమృత.. ఓ మిస్టరీ!
చెన్నై: జయలలిత వారసులమంటూ చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇందులో అమృత అనే యువతి సుప్రీంకోర్టుకు వెల్లడించిన అంశాలు.. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకూ సిద్ధమని ప్రకటించటం ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే. అసలు జయకు కూతురుందా? ఉంటే ఆమెనెవరు పెంచారు? జయ సన్నిహితులేమంటున్నారు? ఈ అమృత ఎవరు? ఈ అంశాలపై స్పష్టత వస్తేనే కేసులో చిక్కుముడి వీడుతుంది. ఈ నేపథ్యంలో అమృత చెబుతున్న అంశాలను ఓసారి గమనిస్తే.. అమృత చెబుతున్నదేంటి? జయలలిత సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే 1980 ఆగస్టు 14న చెన్నై సమీపంలోని మైలాపూర్‌లో జయలలిత నివాసంలో తాను జన్మించినట్లు అమృత తెలిపారు. ‘సినిమా కెరీర్ పాడవకుండా బిడ్డపుట్టిన విషయాన్ని బయటకు రానీయకుండా జయ కుటుంబసభ్యులు జాగ్రత్తపడ్డారు. తనను శైలజ, సారథి దంపతులకు అప్పగించటంతో.. అప్పటినుంచి బెంగళూరులోని రామసంద్రలోనే పెరిగాను. రెండేళ్ల క్రితం శైలజ మృతి చెందగా ఈ ఏడాది మార్చిలో సారథి కన్నుమూశారు. చనిపోయే సమయంలో సారథి తనను పిలిచి నేనున వీరి సొంత కూతురిని కాదని.. జయలలిత ఏకైక కుమార్తెను అనే విషయాన్ని చెప్పారు’ అని అమృత పేర్కొన్నారు. సారథి చెప్పిన మిగిలిన వివరాలను జయ బంధువులనడిగి నిర్దారించుకున్నట్లు అమృత తెలిపారు. జయ సన్నిహితులు, బంధువులు, వరుసకు సోదరైన లలిత, మేన కోడలు రంజని కూడా ఈ విషయాన్ని నిర్ధారించారన్నారు. అమ్మ నన్ను ముద్దుపెట్టుకుంది 1996 జూన్ 6న జయలలిత దగ్గరికి తాను తొలిసారి వెళ్లానని, చూసిన వెంటనే ఆమె తనను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందని అమృత వెల్లడించారు. తర్వాత కూడా పలుమార్లు జయను కలిసినట్లు తెలిపారు. సచివాలయానికి వెళ్లిన ప్రతిసారీ.. ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని అమృత తెలిపారు. అమృత చెప్పే విషయాలను జయ చిన్ననాటి స్నేహితురాలు గీత సమర్థించారు. శోభన్‌బాబు–జయలలితకు ఓ కుమార్తె పుట్టిందని, ఆమే అమృత అని తెలిపారు. ఈ విషయం శశికళ సహా జయ సన్నిహితులందరికీ తెలుసన్నారు. జయకు కూతురు ఉన్న విషయం వాస్తవమేనని జయ మేనత్త కూతురు ఎల్ఎస్ లలిత కూడా వెల్లడించారు. అయితే.. ఆ కూతురు అమృతేనా కాదా? అనేది నిర్ధారించలేనన్నారు. ఆరుద్ర భార్య అదే చెప్పారు శోభన్‌బాబుతో సంబంధాన్ని జయలలిత 1979లోనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ సంబంధంపై వార్తలు రాసిన నాటి తమిళ వారపత్రిక ‘స్టార్ అండ్ స్టైల్’కు రాసిన లేఖలో ‘ఏడేళ్లుగా శోభన్ బాబుతో సహజీవనం చేస్తున్నా. ఈ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు’ అని జయలలిత చెప్పినట్లు సమాచారం. శోభన్ బాబు వివాహితుడు కావడం వల్లే ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయానని జయ ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి ధృవీకరించారు. శోభన్‌బాబు, జయలలిత మధ్య సంబంధముండేదని, అయితే.. శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చేయొద్దనుకోవడంతోనే వీరి ప్రేమ పెళ్లివరకు రాలేదన్నారు. అమృత వెనక శశికళ? సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అమృత వెనక శశికళ ప్రోద్బలం ఉన్నట్లు భావిస్తున్నారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించడానికి అమృత సమాయత్తం అవుతున్నారు. సుప్రీంలో అమృత పిటిషన్ దాఖలు చేసినప్పుడు మద్దతుగా ఆమె బంధువులు లలిత, రంజనీ సంతకాలు చేశారు. జైల్లో శశికళను రంజని కొన్ని నెలల కిత్రం కలుసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేయాలని రంజనీకి శశికళ సూచించినట్లు తెలుస్తోంది. జయకు స్వయానా కూతురని అమృత నిరూపించుకుంటే, ఆ తరువాత పార్టీ, ఆస్తులను చేజిక్కించుకోవచ్చని శశికళ పథకం పన్నినట్లుగా ఆమె అంతరంగికులే చెబుతున్నారు. జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజనీతో కూడా శశికళకు ముందుగానే పరిచయం ఉంది. 1980లో జయలలిత ప్రసవించినపుడు రంజనీ అక్కడే ఉన్నట్లు లలిత చెప్పిందని సమాచారం. జయలలిత తొలి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి అన్నాశాలై నుంచి అమ్మ సమాధి ఉన్న మెరీనా బీచ్ వరకు మౌనర్యాలీ నిర్వహించారు. జయ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం -
అచ్చం జయే.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే!
-
అచ్చం జయే.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే!
చెన్నై: మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన వందలాది మంది అభిమానులకు బుధవారం సాయంత్రం ఒకింత ఉద్వేగపూరితమైన అనుభవం ఎదురైంది. జయలలితకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ఆమె మేనకోడలు దీపను చూసి.. 'అమ్మ' అభిమానులు చూపు తిప్పుకోలేకపోయారు. దీప అచ్చం జయలలిత పోలికలతో ఉండటంతో ఆమెను చూసి కొందరు ఉద్వేగానికి లోనయ్యారు. దీప, తన కుటుంబసభ్యులు కొందరితో కలిసి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించింది. ఆమె జయలలిత స్మారక ప్రదేశంలో ప్రదక్షణ చేస్తున్నప్పుడు.. దీపను చూసేందుకు అక్కడున్న వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. కొంతమంది అమ్మను చూసినట్టు భావించి భావోద్వేగానికి గురయ్యారు. కొందరు మహిళలు దీప వద్దకు వెళ్లి 'నిన్ను చూస్తే అచ్చం అమ్మను చూసినట్టే ఉంది. ఆమె పోలికలు నీ ముఖంలో కనిపిస్తున్నాయి' అని పేర్కొన్నారు. కొద్ది క్షణాల్లోనే చాలామంది పోటెత్తారు. కొంతమంది ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఎటూ కదలకుండా ఆమె చుట్టూ జనాలు మూగడంతో అతికష్టం మీద భద్రతవలయంలో ఆమెను స్థానికంగా ఉన్న స్క్వేర్ పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత పంపించారు. జయలలిత అంత్యక్రియలను శశికళ చేయడం తనకు బాధ కలిగించిందని అంతకుముందు దీప పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమె బుధవారం ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. నిజానికి జయలలితకు నివాళులర్పించేందుకు కూడా దీపకు శశికళ వర్గీయులు సరిగ్గా అనుమతించలేదు. మెరీనా బీచ్ వద్ద జయలలిత భౌతికకాయాన్ని తరలించిన తర్వాత కేవలం ఒకసారి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించేందుకు శశికళ బంధువులు దీపను అనుమతించారు. ఆ వెంటనే వారు జయలలిత పార్థీవదేహాన్ని చుట్టుముట్టి.. అక్కడినుంచి దీపను పంపించివేశారు. అంతకుముందు గత ఆదివారం కూడా దీప అపోలో ఆస్పత్రి వద్ద కనిపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అత్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంది. కానీ ఆమె ప్రయత్నం సఫలం కాలేదు. గతంలో అపోలో ఆస్పత్రి వద్ద జయలలిత వారసురాలిని తానేనంటూ దీప హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. జయకుమార్ దంపతులు కొన్నాళ్లు జయలలితతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. -
శశికళ చేయడం బాధ కలిగించింది
-
శశికళ చేయడం బాధ కలిగించింది
- అంత్యక్రియలపై ‘సాక్షి’తో జయలలిత అన్న కూతురు దీప - జయ మృతి వెనక ఆంతరంగిక విషయాలున్నాయి - త్వరలోనే వాటిని బయటపెడతాను చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలను శశికళ చేయడం తనకు బాధ కలిగించిందని జయలలిత అన్న కూతురు దీప పేర్కొన్నారు. ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తాను ఇంతవరకు చూడలేదన్నారు. ఆమె బుధవారం ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ.. తన మేనత్త జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. గతంలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో అపోలో ఆస్పత్రి వద్ద దీప హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. జయలలితకు స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. జయకుమార్ దంపతులు కొన్నాళ్లు జయలలితతో పాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీప ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో జయకుమార్ పోయెస్‌గార్డెన్ వదిలి చెన్నై టీనగర్లో కాపురం పెట్టారు. 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. 2013లో వదిన చనిపోరుునప్పుడు మాత్రం జయలలిత వెళ్లలేదు. ఇటీవల జరిగిన మేనకోడలు దీప వివాహానికి కూడా ఆమె హాజరుకాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకొనివచ్చారు. ఈ సందర్భంగా వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. కాగా, మరోవైపు దీప వైవాహిక జీవితం కొన్నాళ్లు సజావుగా సాగినా ఆ తర్వాత భర్తతో విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జయ ఇంటి వద్ద ఆమె గంటసేపు నిరీక్షించినా అనుమతి రాలేదు. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ(జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరెవరు?’అంటూ దీప ఆ సందర్భంలో సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడింది. మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం పోయెస్‌గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేదంటూ శశికళపై పరోక్ష ఆరోపణలు కూడా చేసింది. జయలలితే తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని గతంలో దీప ప్రయత్నాలు చేసింది. కానీ అవి సఫలం కాలేదు. జయలలిత మృతి నేపథ్యంలో రాజకీయ వారసురాలిగా మళ్లీ తెరపైకి వచ్చేందుకు దీప ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.