jayanth yadav
-
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్‌ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్‌జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్‌కు 6.05 పరుగుల రన్‌రేట్‌తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్‌లోనే భారీ సిక్స్‌తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్‌జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్‌జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్‌లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి -
జయంత్ యాదవ్ అవుట్!
ముంబై: వచ్చే నెల్లో ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ నుంచి భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా అమోఘంగా రాణించిన జయంత్ యాదవ్.. మోకాలి గాయం కారణంగా చెన్నై టెస్టుకు దూరమయ్యాడు. అతను ఇంకా మోకాలి గాయం నుంచి తిరిగి కోలుకోలేకపోవడంతో వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు చెన్నైలో జరిగిన ఆఖరి టెస్టులో ఆడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ వేలికి గాయం అయ్యింది. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ లో డాసన్ క్యాచ్‌ను పట్టే క్రమంలో అక్షర్ కు గాయమైంది. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు అక్షర్ ఎంపికను దాదాపు పక్కకు పెట్టారు. ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు గాయాలు బారిన పడిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, మొహ్మద్ షమీలు గాయాలు బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య క్రమేపీ పెరుతోంది. గాయపడిన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడానికి ప్రస్తుతం టీమిండియా సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. జనవరి 15 నుంచి భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. అనంతరం జనవరి 26వ తేదీన మూడు ట్వంటీ 20 సిరీస్ జరుగుతుంది. అయితే దీనికి ముందు బోర్డు ఎలెవన్ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఇంగ్లండ్ తో ఆడుతుంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోని పాల్గొననున్నాడు. -
జయంత్ యాదవ్ రికార్డు
ముంబై: ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టులో భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా తొలి టెస్టు సెంచరీ సాధించిన జయంత్ యాదవ్.. తొమ్మిదో వికెట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.భారత క్రికెట్ చరిత్రలో తొమ్మిది వికెట్‌గా వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇది జయంత్ యాదవ్ కు మూడో టెస్టు మ్యాచ్. విశాఖలో జరిగిన రెండో టెస్టుతో తన టెస్టు కెరీర్‌ను ఆరంభించిన జయంత్.. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేసి నాటౌట్ గా క్రీజ్‌లో నిలిచాడు. ఆ తరువాత మొహాలీలో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జయంత్(55) హాఫ్ సెంచరీ నమోదు చేయగా,రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దాంతో ఒక సిరీస్‌లో రెండొందలకు పైగా పరుగులను జయంత్ యాదవ్ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా, ఇప్పటివరకూ ఎనిమిది వికెట్లను జయంత్ సాధించాడు. విరాట్ డబుల్, జయంత్ యాదవ్ శతకాలతో భారత్ ఆరు వందలకు పైగా స్కోరు సాధించింది. జయంత్(104) ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. -
విరాట్ కోహ్లి సూపర్ షో !
-
విరాట్ సూపర్ షో!
ముంబై: భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఇంగ్లండ్‌తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 302 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ మార్కును చేరాడు. ఇది అతని టెస్టు కెరీర్లో మూడో డబుల్ సెంచరీ కాగా, ఈ ఏడాదే వాటిని సాధించడం మరో విశేషం. ఇదిలా ఉండగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. 451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్‌లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ దాదాపు 190కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో భారత్‌కు తిరుగేలేకుండా పోయింది. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా, మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు విరాట్ డబుల్ పూర్తి చేసే సమయానికి జయంత్ 84 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.