jda
-
ఎందుకీ నిర్లక్ష్యం..?
ఫసల్‌బీమాపై వ్యవసాయశాఖ మౌనం రబీలో ఐదు పంటలకు వర్తింపజేసిన బీమా కంపెనీ అరకొర సాగు నేపథ్యంలో ఇబ్బంద్లుఓ రైతులు అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనా (పీఎం ఎఫ్బీవై) బీమా పథకంలో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? అన్నది ఇప్పుడు రైతులను వేధిస్తున్న ప్రశ్న. ఈ అంశంపై వ్యవసాయశాఖ మౌనం పాటిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అక్టోబర్ 28న వ్యవసాయ బీమా కంపెనీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అధికారులు మాత్రం పథకం అమలు గురించి ఏమీ చెప్పడం లేదు. రబీకి సంబంధించి జిల్లాలో వరి, జొన్న, పప్పుశెనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు ఫసల్ బీమా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫసల్‌బీమా కింద ఖరీఫ్‌లో అయితే రైతు వాటాగా 2 శాతం, రబీ పంటలకైతే 1.5 శాతం ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంది. ఇందులో వరి హెక్టారుకు రూ.33,750, జొన్నకు రూ.20 వేలు, పప్పుశెనగకు రూ.21,250, వేరుశనగకు రూ.45 వేలు, పొద్దుతిరుగుడుకు రూ.25 వేలు బీమా పరిహారం వర్తింపజేశారు. పప్పుశెనగ పంటకు డిసెంబర్ 15, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడుకు డిసెంబర్ 31, వరికి జనవరి 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని గడువు విధించారు. రైతుల మేలు పట్టదా..? ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అరకొరగా పప్పుశెనగ పంట సాగులోకి రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో అమలు చేసిన పంటల బీమా పథకాలలో పోల్చితే ఫసల్‌బీమాలో రైతులకు ఉపయోగపడేలా అనేక వెసులుబాట్లు కల్పించారని చెబుతున్నా... అవి ఏంటనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులతో పాటు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, తీవ్ర తుఫాను, టోర్నడోలు, వరదలు, నీట మునగడం, భూమి దిగిపోవడం, అనావృíష్టి, వాతావరణం బాగుండకపోవడం, పంటకు తెగుళ్లు, కీటకాలు ఆశించి నష్టం జరిగినా బీమా పరిధిలోకి తెచ్చినట్లు సమాచారం. అలాగే పంట కోతల తర్వాత పంట తడిచినా పరిహారం వర్తింపజేశారు. ఇవన్నీ కాకుండా పంటకు వేయడానికి భూములు దుక్కులు చేసుకుని, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న తర్వాత వర్షాలు లేక విత్తనం వేయలేని పరిస్థితి ఏర్పడినా 25 శాతం వరకు పరిహారం వర్తింపజేయాలనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బీమా చేసిన రైతు, ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిని కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. గత పథకాలతో పోల్చితే ఫసల్‌బీమాలో వెసులుబాట్లు ఉన్నా అవి రైతులకు ప్రయోజనం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఇపుడున్న పరిస్థితుల్లో పప్పుశెనగ రైతులకు కొంత లబ్ధికలిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి భూములు కలిగిన 25 మండలాల్లో 80 నుంచి 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుశెనగ వేయడానికి రైతులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఖర్చు పెట్టి భూములు దుక్కులు చేసుకున్నారు. విత్తన పప్పుశెనగ, ఎరువులు కొనుక్కున్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 10 వేల హెక్టార్లకు మించి పంట వేయలేకపోయారు. ఇలాంటి సమయంలో ఫసల్‌బీమా ఆదుకునే పరిస్థితి ఉంటే వ్యవసాయశాఖ తక్షణ చర్యలు తీసుకుంటే రైతులకు కొంత వరకు మేలు జరిగే పరిస్థితి ఉంది. హెక్టారుకు రూ.21,250 పరిహారం వర్తింపజేసినందున రైతుల నుంచి 1.5 శాతం ప్రీమియం కట్టిస్తే కనీసం 25 శాతం బీమా పరిహారమైన వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం - శ్రీరామమూర్తి, జేడీ, వ్యవసాయశాఖ ఫసల్ బీమా పై స్పష్టమైన నిబంధనలు, వెసులుబాట్ల గురించి రాష్ట్ర బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం. అననుకూల పరిస్థితుల నడమ పంట వేయకపోయినా పరిహారం వచ్చే నిబంధన ఉంటే తప్పనిసరిగా ప్రీమియం కట్టించేలా చర్యలు తీసుకుంటాం. -
ఎంపీ అవినాష్‌రెడ్డి చొరవ
తొండూరు: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవతో తొండూరు మండలానికి అదనంగా శనగలు మంజూరయ్యాయి. ఆదివారం తొండూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, తాలుకా ప్రధాన కార్యదర్శి దశరథరామిరెడ్డి, రైతులు ఎంపీ వైఎస్ వద్దకు వచ్చి మండలానికి తక్కువ శనగలు మంజూరయ్యాయని.. మిగతా మండలాలకు వస్తే 50శాతం మాత్రమే కేటాయించారని మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎంపీ వెంటనే జేడీఏ ఠాగూర్ నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. తొండూరు మండలానికి అదనంగా 1600క్వింటాళ్లను మంజూరు చేయాలని జేడీఏకి సూచించారు. జేడీఏ వెంటనే 500క్వింటాళ్లను తొండూరు ఆగ్రోస్ కేంద్రానికి కేటాయించారు. మరో 1100క్వింటాళ్లను త్వరలోనే అందజేస్తామని జేడీఏ ఎంపీకి వివరించారు. ఫలించిన వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రయత్నం : మండలానికి అదనంగా శనగ విత్తనాలు మంజూరు చేయించేందుకు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిని ప్రయత్నం ఫలించింది. నాలుగు రోజుల క్రితం మండలంలోని రైతులు శనగల పంపిణీలో అన్యాయం జరిగిందని పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిపై బైటాయించి వాహనాలను అడ్డుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్కెక్కారు. ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకొని మండలానికి శనగలు మంజూరు చేయించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఖమ్మం జేడీఏగా ఝాన్సీలక్ష్మీకుమారి
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం సంయుక్త వ్యవసాయ సంచాలకురాలి(జేడీఏ)గా అత్తోటి ఝాన్సీలక్ష్మీకుమారి రానున్నారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ ఉప సంచాలకురాలిగా పనిచేస్తున్నారు. 1991లో వ్యవసాయాధికారిగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మొదటి పోస్టింగ్ అందుకున్నారు. 2004లో వ్యవసాయ సహాయ సంచాలకురాలిగా ఉద్యోగోన్నతిపై హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో నియమితులయ్యారు. వ్యవసాయ ఉప సంచాలకురాలిగా 2010లో ఉద్యోగోన్నతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో చేరారు. మరోసారి ఉద్యోగోన్నతిపై జేడీఏగా ఖమ్మం రానున్నారు. ఏడు నెలల్లో నాలుగో జేడీఏ ఏడు నెలల కాలంలో ఖమ్మం జిల్లాలో నలుగురు జేడీఏలు పనిచేశారు. పిబి.భాస్కర్‌రావు ఉద్యోగ విరమణ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెల్లంకి ఆశాకుమారిని ఖమ్మం జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. భాస్కర్‌రావు పనిచేసని కాలంలో జిల్లా వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిధుల దుర్వినియోగంపై విచారణ నేపథ్యంలో ఆశాకుమారిని ఆత్మ డీపీడీగా వెనక్కు పంపించింది. ఆమె స్థానంలో, రైతు శిక్షణ కేంద్రంలో సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా పనిచేస్తున్న పి.మణిమాలను ఇ¯Œæచార్జ్ జేడీఏ నియమించింది. సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా ఉన్న ఎం.విజయనిర్మల.. ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. తాజాగా, ఉద్యోగోన్నతిపై ఇక్కడికి జేడీఏగా ఝాన్సీలక్షీ్మకుమారి రానున్నారు. -
రైతులూ.. అధైర్యపడొద్దు
– 65వేల హెక్టార్లలో ఎండిన మొక్కజొన్న పంట – క్షేత్రస్థాయి పరిశీలనలో జేడీఏ బాలునాయక్ ఆమనగల్లు : వర్షాభావంతో పంటలు ఎండిపోయాయని, రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని జేడీఏ బాలునాయక్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపల్లిలో ఎండిన మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో సరైన వర్షాలు కురియకపోవడంతో కొన్ని మండలాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. జిల్లావ్యాప్తంగా 65వేల హెక్టార్లలో మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు గుర్తించామన్నారు. ఎండిన పంటల వివరాలు సేకరిస్తున్నామని, బాధిత రైతులకు తప్పక పరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఏ రఘురాములు, ఏడీఏ శ్రీనివాసరాజు, ఏఓ అరుణకుమారి, ఏఈఓ శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
కరువుపై కసరత్తు
మహబూబ్‌నగర్ వ్యవసాయం : జిల్లాలో నెల రోజులుగా వర్షాలు మోహం చాటేశాయి.దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.. దీంతో కరువు తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని జేడీఏ బాలునాయక్ ఇప్పటికే ఏఓలను ఆదేశించారు.. అందుకనుగుణంగా వారు ఆయా మండలాల్లో తిరుగుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జిల్లా ఖరీఫ్ సగటు వర్షపాతం 604.6మి.మీ కాగా ఇప్పటివరకు 268.6మి.మీ. మాత్రమే నమోదైంది. జూన్‌లో 71.2మి.మీ. కురవాల్సి ఉండగా 136.6మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా 91.2శాతం అదనంగా కురిసింది. జూౖలñ లో 146.6మి.మీ కురవాల్సి ఉండగా 104.1మి.మీ. మాత్రమే కురిసి, 29శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 121మి.మీ కురవాల్సి ఉండగా కేవలం 27.9మి.మీ. కురిసి 76.9శాతం లోటుకు చేరుకుంది. ఇక వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం కురిసింది. మరో 21 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ మండలాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఏడీఏ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించేందుకు అధికారులు ముందుకు కదిలారు. 10మండలాల్లో పరిశీలన ప్రస్తుతం కల్వకుర్తి, వంగూరు, ఉప్పునుంతల, మాడ్గుల, తలకొండపల్లి, వెల్దండ, ఆమన్‌గల్, మిడ్జిల్, భూత్పూర్, బిజినేపల్లి మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలాల్లో ఇప్పటికే మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలు ఎండుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిసినా పంటలకు ఎలాంటి ఉపయోగంలేదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. సాధారణంగా ఒక మండలంలో 2.5మిల్లీమీటర్ల కన్నా తక్కువగా వరుసగా 21రోజులు వర్షం కురియకుంటే దానిని డ్రై స్పెల్‌గా నిర్ణయిస్తారు. చాలా మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణం కన్నా చాలా తక్కువ స్థాయిలో దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు గుర్తించారు. ఎండుతున్న పంటలు ఖరీఫ్ సీజన్ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.67లక్షల హెక్టార్లు కాగా గతేడాది 5.31లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. కాగా ఈసారి రైతులు 6.6లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో 1.93లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 1.72లక్షల హెక్టార్లలో కంది, 1.23లక్షల హెక్టార్లలో పత్తి, 0.4లక్షల హెక్టార్లలో ఆముదం, 0.28లక్షల హెక్టార్లలో జొన్న సాగు చేస్తున్నారు. కాగా వర్షాలు రోజురోజుకూ మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. లోటు వర్షపాతం నమోదైన 23 మండలాల్లో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో గతేడాదిలాగే కరువు పరిస్థితులు ఏర్పడితే తమ బతుకులు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నివేదికలు ఇవ్వాలి జిల్లాలో తక్కువ వర్షపాతం కురిసి, రైతులు సాగున పంటలు ఎండుముఖం పట్టిన పది మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఏఓలకు సూచించాం. వారు ఈ నివేదికలను తయారుచేసిన తర్వాత కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాం. – బాలునాయక్, జేడీఏ, మహబూబ్‌నగర్ -
షార్ట్‌కట్ ప్రమోషన్
డిప్యూటీ డైరెక్టర్లున్నా.. ఏడీకి జేడీఏ పదవి.. వ్యవసాయ శాఖ పోస్టింగ్‌లో చోద్యం గాడితప్పుతున్న పథకాలు, పాలన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వ్యవసాయ శాఖలో పాలన రోజురోజుకు అస్తవ్యస్తంగా తయారవుతోంది. పైస్థాయి అధికారులను కాదని, కింది స్థాయి అధికారులకు కీలక పదవులను కట్టబెట్టడం ఈ శాఖలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో వ్యవసాయ శాఖలో ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వీరిని కాదని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారిని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగించడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జేడీఏ అధికారి పోస్టు ఖాళీగా ఉంటే, ఆ స్థాయి అధికారిని నియమించాలి. లేనిపక్షంలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ శాఖలో పోస్టింగ్‌ల వ్యవహారం కొనసాగుతుండడం విమర్శలకు దారితీస్తోంది. పోస్టింగ్‌ల పందేరం.. జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజ్‌లీల గత ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇక్కడ పోస్టింగ్‌ల పందేరం కొనసాగుతోంది. ఇన్చార్జిగా ఉట్నూర్‌లో భూసార సంరక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి జేడీఏగా కొనసాగుతున్నారు. కానీ జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఆదిలాబాద్‌లోని రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా దాదారావు నియమితులయ్యారు. ఖానాపూర్ ఏడీఏగా పనిచేస్తున్న దాదారావుకు పదోన్నతి కల్పిస్తూ ఈ పోస్టింగ్ ఇచ్చింది. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఏడీఏగా పనిచేసిన గంగారాంకు కూడా డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ భూసార సంరక్షణ కేంద్రం అధికారిగా నియమించింది. ఇలా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు జిల్లాలో ఉన్నప్పటికీ, గత కొంత కాలంగా అసిస్టెంట్ డైరెక్టర్‌నే జేడీఏగా కొనసాగించడంపై ఆ శాఖలో సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో మరో అసిస్టెంట్ డైరెక్టర్ జేడీఏ ఇన్చార్జిగా కొనసాగారు. ఆయన్ను పక్కకు నెట్టి మరో ఏడీని జేడీఏగా నియమించారు. ఈ మార్పుల వెనుక ఆంతర్యమేంటనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వామ్మో ఆదిలాబాద్... వ్యవసాయ శాఖలో ఇటీవల రాష్ట్ర స్థాయిలో పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్లను జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని నియమిస్తే.. ఆమె ఇక్కడికి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లాలో వ్యవసాయ శాఖలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను దష్టిలో ఉంచుకుని ఆమె జేడీఏ పోస్టును కూడా వద్దనుకున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివద్ధి పథకాల అమలు తీరు, కార్యాలయంలో గందరగోళ పరిస్థితులను దష్టిలో పెట్టుకుని సదరు అధికారి ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపనట్లు సమచారం. -
ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జేడీఏ సుచరిత కరీంనగర్‌అగ్రికల్చర్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీఏ సుచరిత తెలిపారు. పంట రుణం తీసుకున్న, తీసుకోని రైతులు ఈ నెల 31 వరకు బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించేందుకు గడువుందని తెలిపారు. జిల్లాలో బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు పంటల బీమా చేస్తున్నారని పేర్కొన్నారు. పంట కోతల అనంతరం తుపాను, తుపానుతో కూడిన వర్షాలు, అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టానికి ఈ పథకంలో బీమా కల్పించినట్లు తెలిపారు. మూడవ విడత రుణమాఫీలో సగం నిధులను అన్ని బ్యాంకులకు విడుదల చేయడం జరిగిందని, రైతులు పంట రుణాలను రెన్యువల్ చేసుకోని ఫసల్‌బీమాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి ఎకరానికి రూ.560, మొక్కజొన్నకు రూ.400, కందులకు రూ.260, పెసరకు రూ.200, వేరుశనగకు రూ.320, మిర్చికి రూ.1250, పసుపుకు రూ.990 ప్రీమియం చెల్లించాలని తెలిపారు. -
తేలని కచ్చితమైన లెక్క
నల్లగొండ అగ్రికల్చర్ : రైతుల రుణమాఫీపై ఇంకా కచ్చితమైన లెక్క తేలలేదు. రూ.లక్షలోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. రూ.లక్షలోపు రుణం తీసుకుని రుణమాఫీ అర్హత పొందిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి ఆదివారం వరకు కలెక్టర్, జేడీఏకు అందజేయాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కానీ బ్యాంకర్లు మండలాలు, గ్రామాల వారీగా రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హత పొందిన రైతుల జాబితాలను తయారు చేసేటప్పుడు కొన్ని తప్పిదాల వల్ల చాలామంది రైతుల పేర్లు జాబితాలో లేకుండాపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కలిపి రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హత పొందిన వారు సుమారు 5లక్షల మంది రైతులున్నట్టు తెలుస్తోంది. వీరికి సంబంధించి రూ.2756 కోట్ల మేరకు పంటరుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మండల, గ్రామాల వారీగా రుణమాఫీకి అర్హత పొందిన రైతుల జాబితాలను రెండు మూడు రోజుల నుంచి ఆయా గ్రామ పంచాయతీల వద్ద అతికిస్తున్నారు. తమ పేర్లు జాబితాలో లేవని చాలా గ్రామాలలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు తెలియజేస్తే వాటిని స్వీకరించి అర్హత ఉంటే తప్పక జాబితాలో చేర్చుతామని అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ జాబితాను సిద్ధం చేయనున్నారు. ఏదేమైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రుణాలను పొందిన రైతుల వివరాలను సేకరిస్తే పక్కా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు.. ముగ్గురు రుణాలను పొందడం, ఒక వ్యక్తి రెండు మూడు బ్యాంకులలో రుణాలను తీసుకున్న సంఘటనలు ఉన్న నేపథ్యంలో తుది జాబితా తయారు కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఎన్ని బ్యాంకులలో రుణాలను తీసుకున్నా, ఇద్దరు ముగ్గురు రుణాలను తీసుకున్నా ఒక్కో కుటుంబంలో రూ.లక్షలోపు వరకే రుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
చినుకు పడేనా.. చింత తీరేనా?
ఇప్పటికీ విత్తని విత్తు - అదనుదాటుతున్నా.. కరుణచూపని వరుణుడు - ఆందోళనలో అన్నదాతలు - ప్రత్యామ్నాయ ప్రణాళికపై వ్యవసాయశాఖ దృష్టి! సంగారెడ్డి డివిజన్: అదను దాటుతున్నా వరుణుడి జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై సుమారు 25 రోజులవుతున్నా వర్షాలు కురవకపోవటంతో రైతులు ఇప్పటికీ విత్తనాలను విత్తుకోలేదు. గత ఏడాది ఈపాటికే.. జిల్లాలో 45 వేల హెక్టార్ల వరకు పంటలను సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 4.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయాల్సి ఉండగా వర్షాభావం కారణంగా ఇప్పటికీ సాగు మొదలుపెట్టలేదు. మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మాసానికి అతితక్కువ వర్షపాతం నమోదైన జిల్లాగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికితోడు ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో పెసర, మినుము, జొన్న పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే నెలలో వర్షాలు కురిసి పంటల సాగుకు రైతులు సిద్ధమైనా పంటల దిగబడిపై ప్రభావం ఉంటుందని వ్యవసాయశాఖ రంగ నిపుణులు చెబుతున్నారు. వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికపై వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం వరకు జిల్లాలో 79.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 33.8 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.గత ఏడాది జూలై 19వ తేదీ నాటికి 95.5 మిలీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే 20.1 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వరుణుడి జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడకపోతే పెసర, జొన్నపై ప్రభావం వర్షాభావం కారణంగా రైతులు పంటల సాగు ఇంకా ప్రారంభంలేదు. జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం బోరుబావుల కింద 270 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు వేశారు. అలాగే 3,134 హెక్టార్లలో వరి నారుమళ్లు వేసుకున్నారు. వర్షాలు కురవకపోవటంతో పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటల విత్తనాలను ఇంకా విత్తుకోలేదు. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో పెసర, మినుము, జొన్న పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తప్పనిసరిగా నెలాఖరులోగా పెసర, మినుము, జొన్న విత్తనాలు విత్తుకోవాలి. లేనిపక్షంలో అదను దాటే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే నెలలో విత్తనాలు విత్తుకున్నా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 15 వేల హెక్టార్లలో జొన్న, 38 వేల హెక్టార్లలో పెసర, 18 వేల హెక్టార్లలో మినుము పంటలు సాగు కావాల్సి ఉంది. వర్షాభావం వల్ల ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పత్తి, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు వచ్చే నెల 15వ తేదీలోగా విత్తుకునేందుకు అవకాశం ఉంది. అప్పటికీ వర్షాలు కురవనిపక్షంలో ఆయా పంటలసాగుపైనా ప్రభావం పడనుంది. ఆందోళన చెందవద్దు: జేడీఏ జిల్లాలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నా రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి భుక్యా తెలిపారు. నెలాఖరులోగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఖరీఫ్లోరైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వచ్చేనెల కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును సూచిస్తామని తెలిపారు.