jeevan column
-
రామ... రామ
సాధారణంగా నేను వివాదాల జోలికి పోను. అది నా ప్రమే యమూ, స్వభావమూ కాదు. కానీ మొన్న పొరుగు దేశంలోని ఓ దౌర్భాగ్యుడు– తినడానికి తిండి కూడా సరిగా లేని దేశంలో బోర విరు చుకు తిరుగుతున్న ఓ దౌర్జన్యకారుడు మసూద్ అజర్– అంటాడు కదా: ఇండియాలో రామ మందిరం నిర్మిస్తే దేశం మంటల్లో భగ్గుమం టుందని. అనడానికి ఎవడు వీడు? ఏమిటి వీడి గుండె ధైర్యం? ఈ మాటలకి కడుపు మండి ఈ నాలుగు మాటలూ. ఈ దేశం ముస్లిం సోదరులను శతాబ్దాలుగా అక్కున చేర్చుకుంది. రాజకీయ రంగంలో, కళారంగంలో, ఆఖరికి ఆధ్యాత్మిక రంగంలోనూ వారు మనకు ఆప్తులు. ఇటు వేంకటేశ్వరునికీ, అటు భద్రాద్రి రామునికీ ముస్లిం భక్తుల కథలు మనకు తెలుసు. మనకు ముగ్గురు రాష్ట్రపతులు ముస్లింలు. ఉపరాష్ట్రపతులు ముస్లింలు. ఈ హెచ్చరికకు రెచ్చి, ఈ దేశంలో ముస్లింలంతా ఏకమయి– ‘మీరు పక్కకు తప్పుకోండి బాబూ. మేం రామమందిరాన్ని నిర్మిస్తాం’ అని ముందుకు రారేం? షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ రామ మందిర నిర్మాణానికి మాకు అభ్యంతరం లేదన్నారు. గవర్నమెంటు పూనుకోకపోతే నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణానికి పూనుకుంటా మన్నారు ఆరెస్సెస్ అధ్యక్షులు మోహన్ భగవత్‌గారు. పద్మభూషణ్ బాబా రామ్‌దేవ్– అయో ధ్యలో వివాదాస్పద స్థలానికి పక్కన ఉన్న చోట రామమందిరం నిర్మించడానికి ఏం పోయేకాలం? అని వాక్రుచ్చారు. అలనాడు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని ఆనుకుని మసీదు వెలిసినప్పుడు, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన గది గోడని ఆనుకుని మసీదు వెలసినప్పుడు హిందువులు గొంతులు ఎత్తలేదేం? సామరస్యం కారణమా? అలనాటి పాలకుల పట్ల భయమా? తాటస్థ్యమా? నిర్వేదమా? మరి ఇలాంటివేవీ గత 77 సంవత్సరాలుగా ముస్లిం సోదరులు చూపలేదేం? వారి ఓట్లకు రాజకీయ పార్టీల కక్కుర్తి కారణమా? విజయ్‌సింగ్ ఆలేఫ్ ఈ మధ్య రాసిన "Ayodhya: City of Faith, City of dis- cord'' అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ వచ్చిన వ్యాసంలో మొదటి వాక్యాలు ఉటంకిస్తాను: ‘రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని దుర్విని యోగం చేస్తే, ఏ దేశానికీ ఫలితాలు సామర స్యంగా ఉండవు. వ్యవస్థల మతపరమైన వివా దాలను న్యాయసమ్మతంగా, సామరస్యంతో, సత్వరంగా పరిష్కరించలేకపోవడానికీ ఇదే కారణం’. ఇంతకీ పాకిస్తాన్లో ‘వాగిన’ దౌర్జన్యకారుడికి– ఇద్దరు సీనియర్ ముస్లిం నాయకులు స్పందించి: ‘నువ్వు నోర్మూయవయ్యా. ఇది మా దేశం సమస్య. మేం చూసుకుంటాం’ అంటే ఎంత గంభీరంగా ఉంటుంది? అంత Objective nobility మన సోదర ముస్లిం నాయకులకి ఉందా? అవకాశవాదం అటకెక్కితే సంకల్ప బలానికి ‘చేవ’ కుదురుతుంది. ఇన్ని సంవత్సరాల అయోధ్య వివాదం హిందువుల నిస్సహాయతకు మాత్రమే నిదర్శనం కాదు. తమలో ఒకరుగా, తమలో వారుగా భావించే ముస్లిం సోదరుల ‘చిన్న’ మనసుకి కూడా నిదర్శనం. దేశంలో అక్కడక్కడా మత విధ్వంసాలు ఉంటాయి. ఇలాంటి ఉన్నత లక్ష్యాలకు అవి అడ్డు పడకూడదు. పక్కవాడు ‘ఉసి’కొల్పడం అందుకు మన మౌనం మన మానసిక ‘సంకుచితతత్వాని’కి నిదర్శనమనిపిస్తుంది. పెద్దల మనస్సుల్లోనూ ఇంకా ‘చీకటి’ గదులున్నాయనిపిస్తుంది. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి మతం పెట్టుబడి. అందుకని మిగతా పార్టీలు వారి ఆలోచనలకు కలసిరావు. సరే. మరి రాముడు ఈ దేశానికే ఆరాధ్య దైవం కదా? అయినా రాజకీయ రంగంలో ఆయన పరపతి చెల్లదా? దీనికి పరిష్కారం– దమ్మున్న వ్యవస్థ. గుండెబలం ఉన్న నాయకత్వం. నిజానికి ఆనాటి మెజారిటీ హిందువులను విస్మరించి – కాశీ, మధుర దేవాలయాల పొరుగున మసీదుల నిర్మాణమే ఇందుకు తార్కాణం. ఇప్పుడు కేంద్రం సుప్రీం కోర్టుని ఆశ్రయిం చింది. ‘అయ్యా– అయోధ్యలో ‘వివాదం’ లేని 67.39 ఎకరాల స్థలాన్ని మాకు అప్పగించండి’– అని. కాంగ్రెస్ భయం అప్పగిస్తుందని కాదు. తీరా అప్పగిస్తే తమ ‘పరపతి’ మాటేమిటని. ‘ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో మర్మమేమిట’ని కాంగ్రెస్ కత్తి దూసింది. కాంగ్రెస్ భయం తీరా సుప్రీంకోర్టు తలూపుతూ ఉందేమోనని! ఇక్కడ తగాదా ‘రాముడు’ కాదు– ఓట్లు. ఇదీ మన దరిద్రం. ఇందుకే ఈ సమస్య ఇన్నాళ్లు మురిగింది. ఇంకా మురుగుతుంది. గొల్లపూడి మారుతీరావు -
కింగ్ మేకర్
తన వ్యక్తిత్వంతో– చిత్తశు ద్ధితో, నిరంతర కృషితో, నిజాయితీతో– ఎన్ని సోపా నాలను అధిగమించవ చ్చునో–తను జీవించి నిరూ పించిన యోధుడు చలన చిత్ర నిర్మాత కె. రాఘవ. ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు. ఎక్కడ పెరిగాడో అంతగా తెలీదు. తమిళుడు. చిన్నతనం నుంచీ సినీరంగంలోనే ఉంటూ బీఆర్ పంతులు, మీర్జాపురం రాజాగారి కంపెనీలలో ఆఫీసు బోయ్, ప్రొడక్షన్ మేనేజరు, అటెండర్, ఎక్స్ట్రా స్టంటు విభాగంలో పనులు చేసి– కాలు పెట్టిన ప్రతీచోటా తనదైన ప్రత్యేకతను నిలుపుకుని– నిర్మాత అయి– తెలుగు చలన చిత్ర రంగంలో ఎవరూ చెయ్యలేని, చెయ్యని సాహసాలను అధిగమించిన కార్యదక్షుడు రాఘవ. నాకు ఆయన 1968 నుంచీ తెలుసు. అప్పుడు విజయవాడ రేడియోలో పని చేస్తున్నాను. ‘జగత్ కిలాడీలు’ రిలీజుకి వచ్చి వెల్కం హోటల్లో ఉన్నారు ఆయన, ఆయన పార్టనర్ ఏకామ్రే శ్వరరావుగారు. జగత్ కిలాడీలు పెద్ద హిట్. అది ఇంగ్లిష్ నవల Crimson Circle స్ఫూర్తి. మధ్య మధ్య ఆయన్ని చూస్తున్నా– నా అవ తారాలు మారి సినిమా రచన చేయడం ఆయనకి తెలుసు. 1981లో నాకాలూ చెయ్యీ విరిగి రాయ పేట ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఓ సినిమా రచనకు ఏకామ్రేశ్వరరావుగారి ద్వారా కబురు పంపారు. పారి తోషికం ఎంత? 4 వేలు! ఆరునెలలు మంచానికి పరి మితమైన స్థితి. ఒప్పుకున్నాను. అప్పుడే కోడి రామ కృష్ణ పరిచయం. రాఘవ బొత్తిగా చదువుకోలేదు. కానీ ఏ చదువూ ఇవ్వని అరుదైన instinct ఆయన సొత్తు. ఒక ఇతివృత్తం మంచి చెడ్డలను బేరీజు వేసు కోవడం ఒక ఎత్తు అయితే ఒక కళాకారుడు, దర్శకుని ప్రతిభను– ఏ నేపథ్యం లేకుండా గుర్తుపట్టి– వారికి కూడా చాలని విశ్వాసాన్ని వారిపట్ల పెంచుకునే వేది కను కల్పించడం ఆయన చరిత్ర. బాగా చదువుకుని, మాధ్యమాన్ని ఆకళించుకున్న మాలాంటి వారినే నిర్ఘాంతపోయేటట్టు చెయ్యగల ఆత్మవిశ్వాసం ఆయన పెట్టుబడి. సినిమా షూటింగు మధ్యలో నేను జారిపోతున్నా– రాఘవ నవ్వి ‘మీరు సినిమా రంగంలో నలుగురిని కొట్టేస్తారు మారుతీరావు గారూ’ అనేవారు. నాకు సిగ్గుగా ఉండేది. లేకపోతే 42 సంవత్సరాల వయస్సున్న నన్ను, ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను, పొరపా టునయినా నటన గురించి ఆలోచించని నన్ను– ఓ సినిమా టైటిల్ పాత్రకి– 5 పాటలూ, దాదాపు 40 సీన్లూ ఉన్న పాత్రకి ఎంపిక చేసి, పట్టుబట్టి నాచేత వేయించడం రాఘవగారికే చెల్లును. అది ఆయన నిర్దుష్టమైన conviction, ఒక మూర్ఖపు పట్టుదలకీ నిదర్శనం. పైగా దర్శకుడు కోడికి అది మొదటి చిత్రం. అయితే అప్పటికే ‘తాత–మనుమడు’ అనే హిట్ ద్వారా దాసరిని పరిచయం చేసిన ఘనత ఆయనది. గేయ రచయిత రాజశ్రీని ఒక చిత్రం ద్వారా దర్శకుని చేసిన గుండె ధైర్యం ఆయనది. రావుగోపాలరావు, మాధవి వంటి నటీనటులను తెరకు పరిచయం చేసిన ‘దమ్ము’ ఆయనది. చాలా ఇబ్బందిగా, సగం మనస్సుతోనే పాలకొల్లు చేరాను. తన నిర్దుష్టమైన నిర్ణయంతో– నా రచనా వ్యాసం గాన్ని అటకెక్కించి, 38 సంవత్సరాల, 300 చిత్రాల నట జీవితానికి ఆరోజు నాందీ పలికారు. హ్యాట్సాఫ్. ఆయన తన నిర్ణయాలను ఏ మాత్రమూ సడ లించేవారు కాదు. ఓ గొప్ప ఉదాహరణ. నేను నటిం చిన ‘ఇంట్లో రామయ్య...’కి చాలా కట్స్ ఇచ్చారు సెన్సారువారు. కొన్ని మళ్లీ షూటింగు చేశాం. ఒక షాట్ పది పన్నెండుసార్లు రిహార్సల్స్ చేయిస్తున్నాడు కోడి. విసుక్కున్నాను. దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు: ‘మన దగ్గర 20 అడుగుల నెగిటివే ఉంది గురు వుగారూ’ అని. 500 రోజులు పోయిన ఆ చిత్రంలో ఇప్పటికీ ఒక షాట్ అలికినట్టు (ఫాగ్‌తో) ఉంటుంది. రెండో చిత్రం ‘తరంగిణి’ విజయవంతమై–ఒక సంవ త్సరం నడిచింది. జీవితంలో– ముఖ్యంగా సినీ రంగంలో విజ యాన్ని వెంటపడి పట్టుకోవాలనే చాలామంది యావ. కానీ ఓ కొత్త దర్శకునికిచ్చే అవకాశానికి– 42 ఏళ్ల నటుడిని జతచేసి– భారతదేశంలో అన్ని భాష లలో ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ చిత్రాన్ని ఆమోద యోగ్యం చేసిన ఘనుడు రాఘవ. ఆనాడు నా ‘సందేహాలను’ ఖాతరు చెయ్యక, విముఖత నుంచి నన్ను బయటికి లాగి మరో రంగానికి రాఘవ మళ్లించకపోతే– నా జీవితం వేరుగా ఉండేది. ఆ మాటకి వస్తే చాలామంది జీవితాలు మరోలా ఉండేవి. ఆనాడు రాఘవ లేకపోతే ఇప్పటి నా జీవితం ఇలా ఉండేది కాదు. మంచి నిర్మాత విజయవంతమైన సినిమా తీస్తాడు. అభిరుచిగల నిర్మాత పదికాలాలపాటు నిలిచే చిత్రాన్ని నిర్మిస్తాడు. దమ్ము ఉన్న నిర్మాత మాధ్యమానికి కొత్త పుంతల్ని వేసి– కొత్తదనానికి ఊపిరి పోస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎందరో నిర్మాతలను దాటి వచ్చింది. కానీ ఎందరి జీవితా లనో మలుపు తిప్పగల ‘కొత్త’దనాన్ని పరిశ్రమకు పంచిన అరుదైన నిర్మాత రాఘవ. గొల్లపూడి మారుతీరావు -
ఒక మహా యజ్ఞం
♦ జీవన కాలమ్ ఇదేమిటి! ఓ చిన్న ఆటకి ఇంత పెద్ద పేరు వాడుతున్నాడేమిటి ఈ పిచ్చి రచయిత అని చాలామంది ముక్కుమీద వేలు వేసుకోవచ్చు. చెప్పడానికి నాకు నిడివి చాలదు. కొన్నే సరదాగా చెప్తాను. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలోనూ ఫుట్‌బాల్ మీద రాయకూడదని నాకు నేనే శపథం చేసుకున్నాను. ఎందుకంటే అది మహా కావ్యం. ఎక్కడ మొదలెట్టాలో తెలీదు. ఎందుకో తెలీదు. ఎలాగో తెలీదు. ఒక పద్ధతీ, ఒక లాజిక్, ఒక ఎమోషన్‌కి లొంగే ఆటకాదు– ఈ దుర్మార్గమైన ఆకర్షణ. చాలా సంవత్సరాల కిందట నేనూ, మా రెండో అబ్బాయి, మా ఆవిడా ఇటలీ వెళ్లాం. నేపుల్స్ చూపే డ్రైవర్ని– ఉన్నట్టుండి– మా ఆవిడ అడిగింది. ‘‘నేపుల్స్ చూశాక చచ్చిపోయినా ఫరవాలేదు అంటారు కదా? ఎందుకని?’’ అని. డ్రైవర్ నవ్వాడు. కారు ఒకే ఒక్క తిప్పు తిప్పాడు– అంతే. మా గుండెలు ఆగిపోయాయి. ఆ సముద్ర సౌందర్యం, ఆ దృశ్యం వర్ణనాతీతం. కాదు. అక్కడ ఆగలేదు. వెనక్కి తిరిగి– ఎదురుగా ఉన్న ఓ బంగళాకి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే పెట్టినట్టు నమస్కారం చేశాడు. ఏమిటన్నాను? ఇటలీవారి గొంతులు పెద్దవి, శరీరం పెద్దది, గుండెకాయ పెద్దది. దైవభక్తి పెద్దది. అన్నిటికీ మించి సౌందర్యం ‘పెద్దది’. బంగళాని చూపుతూ ‘మారడోనా!’ అన్నాడు. అది మారడోనా నివాసమట. అంతే అర్థమయింది. వివరాలు చెప్పకుండా ఒక జోక్ చెప్తాను. మరికొన్ని సంవత్సరాలకి పోప్ కావలసిన ఒక మత గురువు జోర్గే మారియో బెర్గోగ్లి అన్నాడు : ‘‘మారడోనా, మెస్సీ, పోప్ ఒకే దేశంలో ఉండటం ఆ దేశానికి చాలా అన్యాయం’’ అని. అయితే పోప్ అదృష్టవంతుడు– అతన్ని ఆ ముగ్గులోకి లాగితే!– ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఆయనెక్కడ ఉంటాడో చెప్పడం కష్టం. గణపతి సచ్చిదానంద స్వామిని విరాట్ కోహ్లీ గురించి, ధోనీ మధ్యకి– అసలు ఈ మాట అనడానికి నోరొస్తుందా? వస్తే? స్వామి ఎక్కడ ఉంటారు? ఇది సరదా మాట. ఓ అభిమాని మైకం. అంతవరకే. నాకనిపిస్తుంది– ఇక్కడ చెప్పకపోతే నాకు చోటు లేదు. ‘సెర్బియా’ వంటి అతి చిన్న దేశం– కేవలం మన హైదరాబాదు జనాభా– నుంచి వచ్చి ప్రపంచాన్ని కొల్లగొట్టే 80 పౌన్ల శరీరంలో – డోకోవిచ్లో– ఎక్కడ ఆ ‘వేడి’ని భగవంతుడు అమర్చాడా అని చూస్తూ మూర్ఛపోతాను. ఈ బంతి ఆట కథలు అపూర్వం. అనితర సాధ్యం. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఈ ఆటలు జరిగే మాస్కోలో కనీస ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు. ప్రస్తుతం పది. చూస్తున్న ప్రేక్షకులలో, ఆడే ఆటగాళ్లలో వాళ్ల శరీరాలు కాగే పెనాలు. ఏమి ఈ క్రీడ. ప్రపంచాన్ని ఊపి ఉర్రూతలూగించే ఈ ఆటలో పాల్గొన్న దేశాలు– కొన్ని మన టి.నగర్, బీబీ నగర్, వెలంపేట దాటవు– అనూహ్యం. ఒక్కరూ మన సినీమా ఎక్స్‌ట్రాల కాలి గోటికి పోలరు. వారిలో చాలామంది నల్లవారు. కానీ బంతి ఆట అభిమానులకి వారు గంధర్వులు, దేవతలు, కొందరికి పోప్లు (క్షమించాలి– ఇది నామాట కాదు). ఇంకా పీలేని, జిదానే, రొనాల్డో, రొనాల్డినోని తలుచుకోలేదు. అదృష్టం. ఇక దురదృష్టం ఏదంటే– నిన్ననే పోటీలో అర్జెంటీనా ఓడిపోయిందని మన దేశంలో కొట్టాయం అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలని మనస్సు పీకుతోంది. 1994 సెప్టెంబరు 19న రాత్రి 12 గంటలకి– బంతి ఆటలో పాల్గొనడానికి వస్తున్న చిన్న విమానం సహారా ఎడారిలో కూలిపోయింది. అందులో పోటీలో పాల్గొనవలసిన నైజీరియా పోటీ ఆటగాళ్లున్నారు. విమానంలో ఉన్న 39 మందీ చచ్చిపోయారు. ఓ శరీరం గుర్తుపట్టలేనంత కాలిపోయింది. బంతి ఆటలో పాల్గొనవలసిన 13 మంది అంతా చచ్చిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. అప్పుడేమవుతుంది? మరో దేశంలో అయితే సంతాప సభలు జరుగుతాయి. ప్రధాని, అధ్యక్షుడు సంతాప ప్రకటనలిస్తారు. ఆ ఆటగాళ్ల మీద జాతీయ జెండాలని కప్పి అంత్యక్రియలు చేస్తారు. పత్రికలు వారి ఫొటోలు ప్రకటిస్తాయి. అందులో 32 మంది టీం సభ్యులు, ఏడుగురు ఆటగాళ్లున్నారు. అయ్యా, ఆట ఆగలేదు. మరో నైజీరియా టీం పాల్గొంది. దేశం ఆనాడు ‘ఆట’ని ఓడిపోయింది. కానీ ‘ఆత్మవిశ్వాసాన్ని’ ‘పట్టుదల’ని నష్టపోలేదు. ఇంతకన్న ఈ దేశాల ఆట అంతకంటే వారు చూపే అభిమానం, అంతకంటే వారు ఆ ఆటగాళ్లకిచ్చే గౌరవాన్ని గురించి వేరే చెప్పనక్కరలేదు. ఇది బంతి ఆట మైకానికి నివాళి. అంతవరకే. ఇది నా నమూనా పాఠకులకి చిన్న రసగుళిక. గొల్లపూడి మారుతీరావు -
మనవాళ్లు ‘లుంగీ దోశె’ వెయ్యగలరు
♦ జీవన కాలమ్ అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్, కిమ్ మధ్య సమావేశం అనుకు న్నంత గొప్పగా జరగక పోవడానికి కారణాలు నాకు తెలుసు. నిజానికి నాకే తెలుసు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే– దాదాపు అన్ని విదేశాలలో భారతీయ ఆహారం అంటే– ఉత్తర దేశపు ఆహారమనే అర్థం. నేనూ, మా పెద్ద బ్బాయి చాలా సంవత్సరాల కిందట నెదర్లాండ్స్‌లో గ్రహించాం. అక్కడ ‘ఇండియన్ రెస్టా రెంట్’ అన్న బోర్డు చూడగానే మా ఇద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. రెస్టారెంటు పేరు ‘మహారాజా’. తీరా వెళ్లి చూస్తే– తందూరీ రోటీ, తందూరీ కుఫ్టా, చోళా భటూరే, భైంగన్ భర్తా, కశ్మీరీ దమ్ ఆలూ, చికెన్ టిక్కా నెడ్ (ఈ ‘నెడ్’ ఏమిటని అడిగితే, తింటున్న ఓ విదేశీ మనిషి చెప్పాడు. అది నెదర్లాండ్స్ స్పెషల్ అట). ఏమైనా మా రోగం కుదిరింది. అన్నట్టు ‘రుమాలీ రోటీ’ మరిచిపోయాను. మనవాళ్లు తలచుకుంటే ‘గావంచా దోశె’, ‘లుంగీ దోశె’, ‘గోచీ దోశె’ కూడా వెయ్యగలరని వారికి తెలీదు. కొత్తవాళ్లకి కొత్త రుచులు నేర్పాలంటే మనకి బాగా నలిగిన వంటకాలను ఎంపిక చేయాలి. వీరిద్దరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినపని ఇద్దరు తమిళ మంత్రులకు అప్పగించారు. న్యాయంగా భోజ నంలో తమిళ రుచులు వీటు దోశె, పొగైల్, అవి యల్, వెర్త కుళంబు వంటివి సమృద్ధిగా ఉండాలి. అలాంటిది– పులావు, చేపల కూర, కోడి కూర, చికెన్ కుర్మా వంటివి ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎక్కడ దెబ్బ కొట్టిందో నాకు వెంటనే అర్థమైపోయింది. ఇలాంటి చోట ఒక తెలుగు వంటవాడిని కల పాలని నా ఉద్దేశం– పుల్లట్లు, మినపట్లు, పెసరట్లు, నాటుపెసర దోశె, బొబ్బట్టు, పొన్నగంటి పచ్చడి, బచ్చలి మజ్జిగ పులుసు, చిట్టి గారెలు, పెనం గారెలు, ఉల్లి గారెలు, పచ్చి పులుసు– ఇలాంటివి సమృద్ధిగా ఏర్పాటు చేసి ఉండాలి. కిమ్ దొర గారికి అమెరికా క్షిపణుల మీద చుర్రు మని కోపం వచ్చినప్పుడు– వారి చేతికి చిట్టి గారెలు అందించాలి. ట్రంప్ కిమ్‌ని కరుచుకు తినేసేటట్టు చూసేటప్పుడు– ఒక పుల్లట్టు రుచిని వారి ముందు ఉంచాలి. తెలుగు రుచులు తెలియని అరవ మంత్రులు కేవలం 15 దేశాల రుచులను వారి ముందుంచారు కానీ, తమ రాష్ట్రపు రుచులను కానీ, ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రపు రుచులను కానీ ఎంపిక చేయక పోవటం చాలా ఘోరం. వీరు పెట్టిన పదార్థాలన్నీ ఈ కార్యక్రమాన్ని తమ తమ పేపర్లలో రాయడానికి వచ్చిన 3 వేల మంది పాత్రికేయులకు పెట్టారు. వారంతా సుష్టుగా భోజనం చేశారు కానీ ఎవరూ బాలకృష్ణన్తోగానీ, షణ్ముగమ్తోగానీ వారు ‘మిస్’ అవుతున్న రుచుల గురించి వివరించకపోవడం అత్యంత శోచనీయం. ఎటువంటి సమస్యనయినా కమ్మని భోజనం పరిష్కరిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ‘ఒక గ్లాసు మజ్జిగ తాగండి’ అంటాం. అందులో ‘చలవ’ ఎక్కువ. అలాగే చర్చలకు ముందు– మన తెలుగు వంటవాడు ఉంటే– మడత కజ్జికాయలు, పాలకా యలు, బూందీ గారె, ఉల్లిపాయ పకోడీలు, శనగ పప్పు బఠాణీలు, వేపుడు వేరు శెనగపప్పు, చిన్న కారం అతికించి నానబెట్టిన అటుకుల తాళింపు, పెసర పుణుకులు– ఇలాంటివి చేసి పెట్టేవాడు. చర్చలు ప్రారంభానికి ముందే ఇద్దరు నాయకులూ– ఈ పదార్థాలు నంచుకుని– ‘చర్చలు రేపు చేద్దాం. ముందు వీటిని తిందాం’ అనుకునేవారని నా ఉద్దేశం. అయితే ఇందులో చిన్న పితలాటకం ఉంది. తమిళ వంటవారి సంగతి నాకు తెలీదు కానీ తెలుగు వంటవారు ముఖాలు చూస్తూ వారి వంటకాలు తినలేం, ఇలా అందరినీ అవమానించడం లేదని తమరు గుర్తించాలి. రత్నాలు రాళ్లలో ఉంటాయి. అవి తీసి మెరుగు పెడితేనే రత్నమని తెలుస్తుంది. నాకీ అనుభవం చాలా ఉంది. ‘దోశె చూస్తూ తింటారా? తిని చూస్తారా?’ అని ఒక మిత్రుడు పొద్దున్నే మా ఆవిడనీ, నన్నూ ఒక ఊళ్లో అడిగాడు. ఊరు పేరు చెప్పను. ఇదేం ప్రశ్న? అనుకున్నాను. ‘మంచి దోశె తింటాను’ అన్నాను. నన్ను కారులోనే కూర్చోపెట్టి వెళ్లి రెండు దోశెలు తెచ్చాడు. అపూర్వం. ఆనాడు ఇద్దరం తలో మూడు దోశెలు తిన్నాం. ఆ తర్వాత మా మిత్రుడు వద్దంటున్నా ఆ వంటవాడిని చూడా లన్నాను. నన్ను వారించడం చేతగాక పిలుచుకొచ్చాడు. ఆ కుర్రాడిని చూస్తూనే మూర్ఛబోయాను. అంత ‘అసందర్భం’గా, అసహ్యంగా ఉన్నాడు. అక్కడితో ఆగుతాను. ‘మా తెలుగు తల్లికి’ రాసి తెలుగు తల్లికి నీరాజనాలర్పించిన శంకరంబాడి.. డిలన్ థామస్ జ్ఞాపకం వచ్చారు. ప్రతిభకీ, జీవనానికీ సంబంధం లేదు. అంత గొప్ప పనివాడు. వంటని అలం కరించాడు కానీ తనని కాదు. ఏమైనా సింగపూర్‌లో పెద్ద చరిత్రను సృష్టించిన ఇద్దరు తమిళ మంత్రులు– మొన్న గొప్ప అవకాశాన్ని నష్టపోయారని మనవి చేస్తున్నాను. గొల్లపూడి మారుతీరావు -
అబద్ధం చెప్పడం
జీవన కాలమ్ అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. మనం చేసే పనుల్లోకెల్లా అబద్ధం చెప్పడం చాలా కష్టతరమైన పని. అబద్ధానికి ముందు కావలసినంత పరి శ్రమ కావాలి. ఫలానా అబద్ధం వల్ల కథ అడ్డం తిరిగితే తప్పిం చుకునే దారులో, సమర్థిం చుకునే మార్గాలో అప్పటికప్పుడు కరతలామలకంగా సిద్ధంగా ఉండాలి. అబద్ధం చెప్పడంలో సూపర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రముఖ నటుడు, నా అనుంగు మిత్రుడు, మహానటుడు కె. వేంకటేశ్వరరావుకి ఇస్తాను. ‘‘ఏరా! మొన్న నాకోసం లీలా మహల్ జంక్షన్ దగ్గర కలుస్తాను అన్నావు? రాలేదేం?’’ అన్నామనుకోండి. రాలేకపోవడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. కానీ చెప్పడు. ‘లీలా మహల్ జంక్షన్ దగ్గర ఏ వేపు నిలబడ్డావు?’ ‘సోడా కొట్టు దగ్గర’ అంటే ‘అదీ.. నేను లేడీస్ గేటు దగ్గర ఒక్క అరగంట పైగా నిలబడి వెళ్లిపోయా’ నంటాడు. వాడిని ఏడిపించాలని ‘అవునవును. ఈ చారల చొక్కాతో ఓ మనిషిని చూశాను. నువ్వనుకోలేదు’ అన్నామనుకోండి. తను అబద్ధం ఆడి దొరికిపోనందుకు సిగ్గుపడాలి కదా? పడడు. ‘మరి నన్ను పలుకరించలేదేం’ అని ఎదుటి ప్రశ్న వేస్తాడు. రెండు అబద్ధాల మధ్య నిజం ఎక్కడో చచ్చిపోయి, నిజాన్ని పెట్టుబడిగా పెట్టిన మన ఆవేశం నీరు కారిపోతుంది. అబద్ధానికి చాలా ఒరిజినాలిటీ కావాలి. గొప్ప సమయస్ఫూర్తి కావాలి. తను చెప్తున్నది అబద్ధమని ఎదుటివాడికి అర్థమవుతుందని తెలిసినా ‘సిగ్గులేని తనం’ కావాలి. ఒక్క ఉదాహరణ. ‘నిన్న పొద్దుట ఎక్కడరా? ఎంత వెతికినా దొరకలేదు?’ ‘ఎక్కడ బ్రదర్ ఏకామ్రేశ్వరరావుగారు చంపేశారు’ ‘ఎవరు? ఉపముఖ్యమంత్రిగారే! ఏమిటి విశేషాలు?’ ‘వచ్చే కేబినెట్లో విద్యామంత్రిని ఎవరిని పెట్టాలని నా సలహా కోసం కబురు పంపించాడు’.. ‘అదేమిట్రా? ఆయన మొన్న టంగుటూరు ఫ్లై ఓవర్ దగ్గర యాక్సిడెంట్లో పోయారు కదా? వెంటనే సమాధానం వస్తుంది. ‘అదే నీతో చిక్కు. నేను చెప్పేది 1997 మంత్రి గురించి...’ ‘ఆయనెప్పుడూ మంత్రి కాలేదు కదా?’ ‘అందుకే రాజకీయాలు తెలీని వారితో మాట్లాడటం కష్టం. ఆయనే విద్యామంత్రని కనీసం 20 రోజులు మా సర్కిల్సులో అనుకునేవాళ్లం. అతను మీ అందరికీ ఏకామ్రేశ్వరరావు. మాకు మాత్రం విద్యేశ్వరరావు’. అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా మూలుగుతూ, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. నిజం నీరసమయినది. అది వన్ వే ట్రాఫిక్. నిజాయితీపరుడిని నిద్రలో లేపినా ఒక్కటే చెప్పగలడు– దిక్కుమాలిన నిజం. అబద్ధం అక్షయపాత్ర. సత్య హరి శ్చంద్రుడిలాంటి వెర్రిబాగులవారు ఈ దేశంలో బొత్తిగా కనిపించరు. నా జీవితంలో అబద్ధం బాధపెట్టినట్టు, తలుచుకున్నప్పుడల్లా, డబ్బు కంటే సులువుగా మోసపోయినందుకూ ఇప్పటికీ విలవిలలాడతాను. రేడియోలో పనిచేస్తున్న రోజులు. సినీమా ధర్మమాంటూ కొన్ని వేలు అదనంగా దాచుకున్నాను. ఎందుకు? వెస్పా కొనుక్కోవాలని. మా ఆఫీసుకి ఓ తమిళ ఆఫీసరులాంటి వ్యక్తి వచ్చేవాడు. ఎప్పుడూ పెద్ద కబుర్లు చెప్పేవాడు. అతని వెస్పా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది. అది నా కల. తెలిసి ‘ఓస్! అదెంతపని ఆరు నెలలు తిరగకుండా– చవకలో కొనిపిస్తాను’ అన్నాడు. అతని మాటలు, చెప్పే ధోరణీ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నట్టుగా ఉండేవి. ఒకసారి కన్సైన్మెంట్ వచ్చింది. దాన్ని చూపించడానికీ నాకిష్టపడలేదు. ‘చూడగానే నవనవలాడే అమ్మాయిని మీకు అప్పజెప్తాను’ అన్నాడు. ఎట్టకేలకు మరో కన్సైన్మెంట్ వచ్చింది. తనే ఎగిరి గంతేశాడు. మా ఆవిడకీ నాకూ కరచరణాలు ఆడలేదు.. అన్నీ గోడౌన్‌లోకి వచ్చాక మిమ్మల్నిద్దరినీ తీసికెళ్తానన్నాడు. ఒక మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫోన్ చేశాడు. ‘ఈసారి రెండు రకాల ఆకుపచ్చలు కలిపాడు సార్! బాడీ చిలక పచ్చ. హాండిల్బార్లో చిన్న రంగు కలిపాడు’ అన్నాడు. ఫోన్లో వెనుక వెస్పాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘చూడ్డానికి వచ్చేదా?’ అన్నాను. నవ్వాడు. ‘వద్దు సార్ రాతకోతలన్నీ పూర్తి చేయించేశాను. రేప్పొద్దుట మీ ఇంటి ముందుం టుంది. సంతకాలు అక్కడే. నేను రాలేను. ఓ మనిషిని పంపుతున్నాను. నుదుటిమీద కాల్చిన మచ్చ. పేరు రామానుజం. అతనికి 4,220 ఇవ్వండి. రూపాయి ఎక్కువ వద్దు. వెంటనే పంపండి. ఎవరీ రామానుజం? ఆలోచన కూడా రాలేదు. అరగంటలో రామానుజం రావడం, డబ్బు ఇవ్వడం జరిగిపోయింది. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్దుర లేదు. ఆ ఉదయమే కాదు. ఆరు నెలలైనా వెస్పా ఛాయ లేదు కదా.. ఈ ఆర్ముగం అయిపు లేదు. అసలు ఎవరు ఈ రామానుజం? ఏం కంపెనీలో ఉద్యోగి? డబ్బు పుచ్చుకున్నది ఎవరు? రుజువేమిటి? ఆకర్షణని అద్భుతంగా మలచిన గొప్ప సంఘటన ఇది. తర్వాత 4,220 రూపాయలు చూడలేదు. ఆకుపచ్చ వెస్పా చూడలేదు. అబద్ధం అద్భుతమైన ఆభరణం. అది రాణించినట్టు నిజం రాణించదు. ప్రతీ రోజూ ఎన్ని అద్భుతాలు మన మధ్య రాణిస్తున్నాయో పేపరు తెరిస్తే చాలు. అబద్ధం నీడ. నిజం గొడుగు. అబద్ధం అలంకరణ. నిజం నిస్తేజమైన వాస్తవం. అబద్ధం కల. నిజం నిద్ర. - గొల్లపూడి మారుతీరావు -
కొత్త ఉపద్రవం
జీవన కాలమ్ బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్యమాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభుత్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. దావోస్‌లో జరుగుతున్న సర్వదేశ సమ్మేళనంలో సత్య నాదెళ్ల ప్రసంగిస్తూ కొద్దికాలంలో మానవుడు 140 సంవత్సరాలు జీవించబోతున్నాడని సోదాహరణంగా వక్కాణించారు. ఇది మానవాళి మీద పెద్ద గొడ్డలిపెట్టు. మా చిన్నతనంలో ఏదైనా అనర్థం జరిగినప్పుడు మా నాయనమ్మ అంటూండేది: ‘ఈ ఘోరాలు చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను. నన్ను త్వరగా తీసుకుపో దేవుడా!’ అని. ఇది తేలికగా 70 సంవత్సరాల కిందటిమాట. ఇప్పటి మనుషులు 140 ఏళ్లు బతకబోతున్నారు. రోజుకి లక్షల గాలన్ల చమురును తవ్వుకుంటున్న నేపథ్యంలో భూమిలో చమురు నిల్వలు మరో 22 సంవత్సరాలలో పూర్తిగా నిండుకుంటున్నాయి. మనం ఇప్పుడే తాగే మంచినీళ్లని కొనుక్కుంటున్నాం. అచిరకాలంలో పీల్చే గాలిని కొనుక్కోవలసిన రోజులు వస్తాయని ఒక శాస్త్ర జ్ఞుడు అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఇప్పటిలాగ విరివిగా వాడుకోడానికి నీరు దొరకదు. స్నానానికి బదులు రసాయనాలతో ఒళ్లు శుభ్రం చేసుకునే ప్రత్యా మ్నాయ ధోరణులు వస్తాయన్నారు. ధృవాలలో మంచు కరిగిపోతోంది. ఈ సీజనులోనే ఒక హరియాణా రాష్ట్ర మంత మంచు శకలం కరిగి సముద్రంలోకి దూసుకు వచ్చిందట. ఇది ఒక పార్శ్వం. ఈ మధ్య అమెరికాలో ఉద్యోగం చెయ్యని పిల్లలు లేని కుటుంబాలు లేవు. లక్షల ఆస్తి ఉన్న, పోస్టు మాస్ట ర్గా రిటైరయి పెన్షన్ తీసుకుంటున్న ఒకాయన తమ కూతురు అమెరికాలో 40 ఏళ్లుగా ఉంటూ చుట్టపు చూపుగా వచ్చిపోతూంటే– ఆయన వృద్ధాశ్రమంలో కాలం చేశారు. ఒక దశలో సంపాదనకి విలువ పోయి, జీవితం యాంత్రికమై, తమ పిల్లలు– బంధువులకీ, భాషకీ, భారతీయ జీవన విధానానికీ దూరమై బతుకు తూంటే– నిస్సహాయంగా ఆత్మవంచన చేసుకుంటు న్నారు. ఇది మరొక పార్శ్వం. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పులనే ఖాతరు చేయ కుండా–ఓ సినీమాలో లేని అభ్యంతరాలని, లేవని నిరూపించినా–మారణ హోమాన్ని సృష్టించే గూండాలు, వారి అకృత్యాలకు భయపడి.. సుప్రీంకోర్టు అదిలించినా చేష్టలుడిగిన రాష్ట్ర ప్రభుత్వాలు, పరీక్షలు వాయిదా కోసం హత్య అవసరమని భావించే హింసాత్మకమైన ‘ఆలోచన’లకి పసితనంలోనే పునాదులు పడుతున్న విష సంస్కృతి, చదువుకోలేదని గదమాయించిన టీచర్ని కాల్చి చంపిన విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతీ దశ లోనూ కోట్లు నొల్లుకునే ‘నీచపు’ ఆఫీసర్ల ఉద్యోగుల వీర విహారం– ఇది మరొక పార్శ్వం. సరే. 140 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ప్రతీ పౌరుడికీ కనీసం రెండు హత్యలు–సజావయిన కారణాలకు చేసుకునే రాయితీని ప్రభుత్వం కలిగిం చవచ్చు. లల్లూ వంటి మహా నాయకుల ఆరో తరం మునిమనుమడు–ప్రతీ మనిషీ తన జీవితంలో 570 టన్నుల గడ్డి తినే అనుమతిని కల్పించవచ్చు. ప్రతి పౌరుడూ విధిగా మోసుకుతిరిగే ఆక్సిజన్ సిలిండర్ల దొంగ తనం చేసి అమ్ముకునే వ్యాపారాలు దావూద్ ఇబ్రహీం ఏడో తరం వారసుడు ప్రారంభించవచ్చు. ఏ భక్తుడైనా తన జీవితకాలంలో తనకు నచ్చిన మూడు క్షేత్రాలలో క్షుద్ర పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు–సాలీనా కనీసం 120 కోట్లు భక్షించవచ్చునని అనుమతిని ఇవ్వవచ్చు. తన ఆరో తరం ముని మనుమడు చదువుతో హింసి స్తున్న బడిపంతుల్ని క్లాసులో బాంబు పెట్టాలనుకుంటు న్నట్టు 120 ఏళ్ల ముత్తాతకి తెలిస్తే–రెండు హత్యలకు రాయితీ ఉన్న ఈ మనుమడు–తాతని పొడిచి చంపవచ్చు. గూండాలు నాయకులవొచ్చు. హంతకులు ప్రవచనాలు చెప్పవచ్చు. సెక్స్ కథలు పాఠ్య పుస్తకాలలోనే చోటు చేసు కోవచ్చు. సాయంకాలం పార్కుల్లో కనిపించే ముసిలి గుంపుల లక్ష్యం ‘ఆరోగ్యం’ కాదు– ఇంట్లో వారి చాద స్తాన్ని భరించలేని పిల్లలు, కోడళ్లూ కనీసం ఆ రెండు గంటలు విశ్రాంతికి వాళ్లకి కార్లిచ్చి తగలెయ్యడం. మరి 80, 100, 120, 130 సంవత్సరాల ముసిలి వొగ్గుల మాటే మిటి? వృద్ధాశ్రమాలు మాత్రమే కాక, ముసిలివారి ‘చాదస్త’ విముక్తి ఆశ్రయాలు కల్పిస్తారేమో! ఇర్విన్ షా అనే ఆయన ‘బరీ ది డెడ్’ (Bury the Dead) అనే నాటిక రాశాడు. చచ్చిపోయినవాళ్లు చచ్చి నట్టు సమాధుల్లో ఉండక లేచి నిలబడ్డారు. ఎంత పెద్ద విపత్తు? ఎవరి బంధువులు వారి దగ్గరికి వచ్చి ‘చచ్చి నవారు చచ్చినట్టు’ ఉండటం ఎంత అవసరమో నచ్చ చెప్తారు. ఈ ఇబ్బంది ఇప్పుడు బతికున్నవారికి రాబో తోంది. బతికున్నవారు బుద్ధిగా, బాధ్యతగా ‘చావడం’ ఎంత ముఖ్యమో, ఎంత తప్పనిసరో ప్రచారం చేసే ఉద్య మాలు రావచ్చు. స్వచ్ఛందంగా చచ్చిపోయేవారికి ప్రభు త్వాలు తాయిలాలు ప్రకటించవచ్చు. ఇందులో మళ్లీ దొంగదారిన అనుమతులు తెచ్చుకుని బతికేస్తున్నవారూ, లంచాలిచ్చి బతికేసేవారు... ‘అయ్యో దేవుడా! నన్ను ఎప్పుడు తీసుకు పోతావు!’ అని మా నాయనమ్మలాగా ప్రాధేయపడే రోజులు ముందున్నాయి. - గొల్లపూడి మారుతీరావు -
ఉ.అ.న. మూర్తి జ్ఞాపకాలు
‘‘ఉపాధ్యాయుల వారు బొత్తిగా పెద్దమనిషి. ఆయన ధారణ నా లాంటి అల్పప్రాణులను భయపెట్టేంత గొప్పది. నాకు ఆయన ప్రతిభని చూస్తే ఆనందం. ఆయన విద్వత్తుని చూస్తే ఆశ్చర్యం. ఆయన కృషిని చూస్తే భయం. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే ఈర్ష్య. సర్వతోముఖమైన పాండిత్యం ఎలా ఒంగి ఉంటుందో ఉపాధ్యాయుల వారిని చూస్తే అర్థమవుతుంది. పండితులలో, పరిశోధకులలో అనిత రసాధ్యమైన కృషి చేసినవారు ఉపాధ్యా యుల అప్పల నరసింహమూర్తిగారు. ఆయన ‘కన్యాశుల్కం’ పరిశోధక వ్యాసం తన సునిశిత పరిశీలనకి గొప్ప ఉదాహరణ. డిసెంబర్ 9న ఆయన మిత్రులూ, అభిమానులూ, ఆత్మీ యులూ ఆయనకి సప్తతి ఉత్స వాన్ని జరపాలని నిర్ణయించారు. ఒక ప్రత్యేక సంచికని ప్రచురించాలని ఏర్పా ట్లు చేశారు. కాని ఆ పని జరగలేదు. కారణం-ఊపిరితిత్తులలో నీరు చేరి డిసెంబర్ 2న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన కన్నుమూయడానికి ఆరురోజుల ముందు- నా ఫోన్ మోగిం ది. ‘‘మీ అపార్టుమెంటు దగ్గరే ఉన్నా ను. రమ్మంటే మీ దర్శనం చేసుకుం టాను’’ -ఇవీ ఆయన మాటలు. మాట లో ‘దర్శనం’ ఆయనెంత నిరాడంబరు లో చెప్తుంది. నేనప్పుడు హైదరాబా దులో షూటింగులో ఉన్నాను. మరో ఆరు రోజులకి దుర్వార్త. శ్రీరంగం నారాయణబాబు మీద ఆయన రాసిన పరిశోధక గ్రంథాన్ని విజ యనగరంలో నేను ఆవిష్కరించాను. ఆయన అమెరికా వెళ్లినప్పుడు ఆయన రాసిన వ్యాససంపుటి ‘రంగుటద్దాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించాను- సమగ్ర ప్రసంగం చేస్తూ. అందులో నా ‘లిజీలు మీద చక్కని వ్యాసం రాశారని అప్పటికి కాని నాకు తెలియలేదు. ఆయన ఆ మధ్య అమెరికా మొదటిసారిగా వెళ్లిన ప్పుడు అక్కడి తెలుగు మిత్రులకు ఆయన సమాచారాన్ని ఇచ్చి- హ్యూ స్టన్, డల్లాస్, కాలిఫోర్నియా వంటి చోట్ల సభలు పెట్టించాను. వారి ఉప న్యాసాలు విని తెలుగు మిత్రులు చాలా ఆనందించారు. సప్తతి సంచికకి నేను రాసిన నాలు గు మాటలూ ఇప్పుడు తలుచుకోవడం సమంజసం. ‘‘ఉపాధ్యాయుల వారు బొత్తిగా పెద్దమనిషి. ఆయన ధారణ నాలాంటి అల్పప్రాణులను భయపెట్టేంత గొప్ప ది. ఆయన విమర్శ-ఎంత చిన్నవాడి నైనా చెయ్యి పట్టుకు నడిపించేంత ఉదా త్తమైనది. ఆయన చేసే కృషి అనూ హ్యం. ఆరోగ్యపరంగా, దృష్టిపరంగా ఆయనకున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఆయన సాహితీరంగానికి చేస్తున్న సేవ అనితర సాధ్యమయితే- ఆ సేవలో అర్ధాంగిగా సగభాగాన్ని నిర్దుష్టంగా పంచుకుంటున్న ఆయన శ్రీమతి సేవా అంతే అనితరసాధ్యం. నాకు తెలిసి ఉపాధ్యాయులవారు అజాతశత్రువు. నేను మనస్సుతో మను షుల్ని దగ్గర చేసుకుని నోటితో వారిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఆయన చూపు ఆరోగ్యకరమైనదీ, ప్రతి అంశంలోనూ ఉదాత్తమైన కోణాన్ని పరిశీలించేదీను. చాలామందికి ఆయన సాధించినన్ని డిగ్రీలు సాధించడం సులువు. కాని వాటితో ఆయన సాధిం చినన్ని ప్రయోజనాలను సాధించడం అసాధ్యం. నా జీవితంలో చాలా ఆలస్యంగా పరిచయమైన వ్యక్తి ఉపాధ్యాయుల వారు. ఆయన స్థానంలో నేనుంటే అలా పరిచయం చేసుకోవడానికి నా దిక్కు మాలిన ఇగో అడ్డువచ్చేది. ముందు రోజు అజోవిభో పండిత పురస్కారాన్ని అందుకుని, మర్నాడు అజోవిభో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోబో తున్న నా గదికి వచ్చి ఆర్ద్రంగా పలక రించారు. ఆనాడు సహృదయతతో మెడలో దండ వేశారు. మంచిని గౌర వించడానికి ఆయన తన చుట్టూ తెరలు దించుకోరు. నాకు ఆయన ప్రతిభని చూస్తే ఆనందం. ఆయన విద్వత్తుని చూస్తే ఆశ్చర్యం. ఆయన కృషిని చూస్తే భయం. ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే ఈర్ష్య. సర్వతోముఖమైన పాండిత్యం ఎలా ఒంగి ఉంటుందో ఉపాధ్యాయు లవారిని చూస్తే అర్థమవుతుంది. ఈ డెబ్బయ్యోపడి ఆయనకి మరింత నిండుదనాన్ని, గాంభీర్యాన్ని సంతరిస్తుంది. ఆ దంపతులు ఇలాగే ఆనందంగా పదికాలాలపాటు జీవనం సాగించాలని మనసారా కోరుకుం టున్నాను’’. ఈ ఆఖరివాక్యం ఎంత దురాశో విధి వెక్కిరించి నిర్దేశించినట్టనిపిం చింది. కొన్ని వైభవాలు జీవితంలో కలసి రావు. నా జాతకాన్ని రాసిన ప్రముఖ జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మ గారు ఓ ఉదాహరణ చెప్పేవారు. తండ్రి రైతు. పొలం దున్నుకుని సాదాసీదా జీవితాన్ని గడిపే మనిషి. అతని కొడుకు అమెరికాలో పెద్ద చదువులు చదివి కోట్లు గడిస్తున్నాడు, తండ్రిని వచ్చి తనతో ఉండమని బలవంతం చేస్తు న్నాడు. తండ్రికి దేశం వదిలి వెళ్లాలని లేదు. అయినా తప్పులేదు. కాని తండ్రి జాతకంలో గొప్ప వైభవాన్ని అను భవించే యోగ్యత లేదు. కాని జాతకం లో కలసిరాని వైభవం నెత్తిన పడబో తోంది. అప్పుడేమవుతుంది? మారకం వస్తుందట. తండ్రి అక్కడికి వెళ్లడు. వెళ్లడానికి వేళ మించిపోతుంది. అంతే. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తిగారికి సప్తతి ఉత్సవం జరిగే అవ కాశం లేదు. ఏతావాతా ఉత్సవం జర గలేదు. సంచిక ముద్రణ కాలేదు. ఓ సత్కార్యం కలసిరాకపోవడం ఆయన ఆత్మీయుల దురదృష్టం. ఆయన నిష్ర్క మణ సాహిత్య పరిశోధనలో ఓ సంత కానికి క్రూరమైన ముగింపు. -గొల్లపూడి మారుతీరావు