jhansi rani
-
మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు
కాకినాడ సిటీ: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. కుటుంబ పోషణ నిమిత్తం ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించగా.. 3 గంటల్లోనే ఆమె చేతికి ఉద్యోగ నియామక పత్రం అందించారు. వివరాలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తొత్తరమూడికి చెందిన గన్నవరపు ఝూన్సీరాణి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కూలి పనితో వచ్చే అంతంత మాత్రం ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. ఈ నేపథ్యంలో బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాకకు వచ్చిన సీఎం జగన్‌ను ఝూన్సీరాణి కలిసింది. తన బాధను ముఖ్యమంత్రికి తెలియజేసింది. ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న సీఎం జగన్.. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే ఝాన్సీకి విద్యార్హతల ఆధారంగా ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం జగన్ కార్యక్రమం ముగిసిన వెంటనే కలెక్టర్ కృతికా శుక్లా తన క్యాంపు కార్యాలయానికి ఝూన్సీరాణిని తీసుకెళ్లారు. డిగ్రీ, డీఈడీతో పాటు పీజీ డిప్లామో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్(పీజీడీసీఏ) చదివినట్లు తెలుసుకున్న కలెక్టర్.. వికాస సంస్థ సమన్వయంతో రూ.14 వేల ప్రారంభ వేతనంతో ఇంటి నుంచే పని చేసేలా కోజెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం కల్పించారు. వెంటనే నియామక పత్రాన్ని అందించారు. అలాగే ఆమెకు ఉచిత వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తను ఆదేశించారు. ఝాన్సీరాణి కుటుంబసభ్యులు స్పందిస్తూ.. అడిగిన వెంటనే స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
అమాయక పాత్రలు ఇక వద్దు
అమాయక పాత్రలు ఇక వద్దు అంటోంది నటి సురభి. కలలు కనడం సాధారణమే వాటిని సాధించుకోవడం మాత్రం అంత సులభం కాదు. వర్ధమాన తార సురభి నటిగా చాలానే ఆశపడుతోంది. ఈ భామ ఏకంగా వీరనారి ఝాన్సీరాణిగా నటించాలని కోరుకుంటోంది. ఇంతకు ముందు లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందిన విజయశాంతి నుంచి చాలా మంది నటీమణులు ఝాన్సీరాణిగా తెరపై కనిపించాలని ఆశించారు. అయితే వారెవరి కోరిక నెరవేరలేదు. ఇప్పుడు నటి సురభి అలాంటి అసాధారణ కోరికనే వ్యక్తం చేస్తోంది. ఇవన్ వేరమాదిరి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన సురభి ఆ తరువాద వేలై ఇల్లా పట్టాదారి చిత్రాల్లో నటించినా అంతగా పేరు తెచ్చుకోలేక పోయింది. దీంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ అవకాశాలు బాగానే ఉన్నాయట. దీని గురించి సురభి మాట్లాడుతూ ఇవన్‌వేరమాదిరి చిత్రంలో పక్కింటి అమ్మాయిలా చాలా ఇన్నోసెంట్ పాత్రను పోషించానని, అదే విధంగా పుగళ్ చిత్రంలో ఆత్మ విశ్వాసం కలిగిన ధైర్యవంతురాలి పాత్రలో నటించినట్లు చెప్పింది. అయితే ఇక నటనకు అవకాశం ఉన్న పాత్రలోనే నటించాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. ఇవన్‌వేరమాదిరి చిత్రంలో మాదిరిగా ఇన్నోసెంట్ పాత్రలు వద్దని అంది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు లేకపోయినా తెలుగులో చేతినిండా చిత్రాలు ఉన్నాయని తెలిపింది. అక్కడి వారు చాలా ప్రేమగా మసలుకుంటున్నారని చెప్పింది. అయితే చెన్నైను చాలా మిస్ అవుతున్నానని, నటనకు అవకాశం ఉన్న మంచి పాత్ర లభిస్తే తమిళంలో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. హిందీ చిత్రం బాజీరావు మస్తానీ లాంటి చారిత్రక కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానంది. ముఖ్యంగా ఝాన్సీరాణి పాత్రను పోషించాలని ఆశిస్తున్నట్లు సురభి తన కోరికను వ్యక్తం చేసింది.