అడ్మిషన్స, జాబ్స్ అలర్ట్స
జామ్ - 2015
ఐఐటీలు, ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్డీ తదితర ప్రోగ్రాముల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ-2015కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతి దరఖాస్తులను కోరుతోంది.
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ(జామ్)-2015
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఎంఎస్సీ(ఐఐఎస్సీ-బెంగళూరు), జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ, ఎంఎస్సీ- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ.
అర్హతలు: 55 శాతం మార్కులతో బయలాజికల్/ అగ్రికల్చరల్/ కెమికల్/ఫిజికల్/లైఫ్ సెన్సైస్/ ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 9
వెబ్సైట్: http://www.iitg.ernet.in/jam2015/
ఏఆర్ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెట్ - 2014
అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2014కు అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తులను కోరుతోంది. దీనిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏఆర్ఎస్ మెయిన్స్ ఎగ్జామినేషన్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు.
ఏఆర్ఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెట్ - 2014
అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 8
వెబ్సైట్ : www.asrb.org.in
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్
హైదరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్’ కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్)
అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2014 స్కోరు ఉండాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31
వెబ్సైట్: www.manage.gov.in
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) కాంట్రాక్టు పద్ధతిలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
కాంట్రాక్ట్ ఇంజనీర్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్
అర్హతలు: ప్రథమ శ్రేణిలో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉండాలి. సంబంధిత విభా గంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: ఆగస్టు 30
వెబ్సైట్: www.bel-india.com