Justice Manjunath
-
‘కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం’
విజయవాడ: కాపు రిజర్వేషన్లపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించి 13 జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. నివేదిక తుది దశలో ఉందని, అయితే తాము సమర్పించే నివేదికపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదని, 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటించిందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవన విధానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు యత్నిస్తామని తెలిపారు. -
‘కులాల కుంపటిలో బాబు మాడి మసైపోతారు’
విజయవాడ: బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను శుక్రవారం కాపు, బీసీ సంఘాల నేతలు కలిశారు. కాపులను బీసీల్లో చేర్చాలని కాపు నేతలు, మరోవైపు కాపులను బీసీల్లో చేర్చొద్దని బీసీ నేతలు పోటాపోటీగా వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం కాపు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని కాపు సంఘాల నేతలు నరహరిశెట్టి నరసింహరావు, ఆకుల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు... కాపులను బీసీల్లో చేర్చవద్దని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్‌ను బీసీ సంఘాలు కోరాయి. వారిని బీసీల్లో చేర్చితే బీసీలు అన్ని విధాలుగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాపులు ఆర్థికంగా ఎంతో ఉన్నతిలో ఉన్నారంటూ బీసీల స్థితిగతులపై మంజునాథ కమిషన్‌కు బీసీ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు వై.కోటేశ్వరరావు, సాంబశివరావు మాట్లాడుతూ కాపు, బీసీల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్లు కోసమే కాపులను బీసీల్లో చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. కులాల కుంపటిలో చంద్రబాబు మాడి మసైపోతారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. -
జస్టిస్ మంజునాథ్‌కు సిట్టింగ్ జడ్జి హోదా తగదు
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: విశ్రాంత న్యాయమూర్తి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎల్.మంజునాథ్‌కు హైకోర్టు సిట్టింగ్ జడ్జి హోదా ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జస్టిస్ మంజునాథ్‌కు సిట్టింగ్ జడ్జి హోదానిస్తూ గత ఏడాది ఫిబ్రవరి 20న ప్రభుత్వం జారీ చేసిన జీవో 5ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ రాజమండ్రికి చెందిన పి.వెంకట సత్యనారాయణ ప్రసాద్ అలియాస్ ఆచార్యులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
'లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదు'
విజయవాడ : కాపులను బీసీల్లో కలప వద్దని ఆంధ్రప్రదేశ్ బీసీ కమీషన్ చైర్మన్ మంజునాథకు బీసీ చైతన్య వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో కమిషన్ చైర్మన్ మంజునాథతో బీసీ చైతన్య వేదిక సభ్యులు భేటీ అయ్యారు. అనంతరం బీసీ చైతన్య వేదిక సభ్యులు విలేకర్లతో మాట్లాడుతూ... ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు కాపులను బీసీలలో కలపాలని చూస్తున్నారని విమర్శించారు. కాపులను బీసీల్లో కలిపితే ఊరుకునేది ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. బీసీ మంత్రలు, ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటికి వచ్చి తాము చేస్తోన్న పోరాటానికి మద్ధతు తెలపాలని కోరారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న బాబు... తన నిర్ణయాన్ని 10 రోజుల్లో ఉపసంహరించుకోవాలని బీసీ చైతన్య వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదని వారు హెచ్చరించారు. -
అవసరమైతే గడువు కోరతాం..
సాక్షి, విజయవాడ బ్యూరో: కాపులను బీసీల్లో చేర్చే విషయంలో సిఫారసు నివేదికను గడువులోగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, ఒకవేళ గడువు చాలకపోతే అదనంగా గడువుకోరతామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ చెప్పారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు గురువారం వచ్చిన ఆయన గన్నవరం విమానాశ్రయంలో, సీఎంను కలిసిన అనంతరం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 13 జిల్లాల్లోను పర్యటించి వివరాలు సేకరిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. కమిషన్‌లో సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉందన్నారు. రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, 50 శాతం మించితే అదనంగా ఎలా రిజర్వేషన్లు కల్పించాలనే దానిపై కూడా పరిశీలన చేస్తామన్నారు. గడువులోగా ఇవ్వాలని సీఎం కోరారని చెప్పారు. ప్రభుత్వానికి తాము నివేదిక మాత్రమే ఇస్తామని, రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. రెండు గంటలపాటు సీఎంతో భేటీ ముఖ్యమంత్రి కార్యాలయంలో జస్టిస్ మంజునాథ సీఎంతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన వీరి సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భగా సీఎం మాట్లాడుతూ నిర్దేశించిన గడువు తొమ్మిది నెలల్లోగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల నుంచి కూడా వివరాలు సేకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలోని 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల సేవలను కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. రెండు, మూడు రోజుల్లో కమిషన్ సభ్యులను నియమిస్తామని, వారంలోగా విజయవాడలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీశ్‌చంద్ర, సీఎంవో సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రవీణ్‌లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీపై వ్యతిరేక ప్రచారం చేయండి: సీఎం తుని సభకు టీడీపీ వాళ్లు వెళ్లకపోవడం మంచిదైందని, వెళ్లుంటే వాళ్లు కూడా కేసుల్లో ఇరుక్కునేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 8 వేల మంది టీడీపీ నేతలతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేయడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ గురించి ప్రజల్లో వ్యతిరేక ప్రచారం చేయాలని టీడీపీ శ్రేణులకు ఉద్బోధించారు. వైఎస్సార్సీపీ విధ్వంస పూరితమైందని, ఆ పార్టీ నేతలు కులాల చిచ్చు రగిలిస్తున్నారని మండిపడ్డారు. -
'కాపు రిజర్వేషన్ అంశం జటిలమైంది'
విజయవాడ: కాపుల రిజర్వేషన్ అంశం జటిలమైందని కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జస్టిస్ మంజునాథ గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కమిషన్ విధివిధానాలు, కాలపరిమితి, సభ్యుల నియామకం పై చర్చించారు. ప్రస్తుతం కాపుల జనాభా గణాంకాలు అందుబాటులో లేవని జస్టిస్ మంజునాథ అన్నారు. 13 జిల్లాల్లో పర్యటించి గణాంకాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. కాపులతో పాటు అన్ని బీసీ వర్గాల అభిప్రాయాలను కూడా సేకరిస్తామన్నారు. బీసీ రిజర్వేన్కు వ్యతిరేకంగా ఉన్నవారి వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జస్టిస్ మంజునాథ పేర్కొన్నారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదన్న సుప్రీం మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపారు. అదనంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు. -
చంద్రబాబుతో భేటీ కానున్న జస్టిస్ మంజునాథ
హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల ప్రక్రియ కాలపరిమితిపై బుధవారం జరిగే కేబినెట్లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో కళా వెంకట్రావు మాట్లాడుతూ... ఈ నెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడితో కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ భేటీ అవుతారని తెలిపారు. కమిషన్ నివేదిక అందజేయాలని జస్టిస్ మంజునాథను కోరతామని తెలిపారు. మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటాతోపాటు ఎమ్మెల్యేలు బొండా, తోట త్రిమూర్తులు, ఎంపీ అవంతి శ్రీనివాస్‌తోపాటు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కాపు రిజర్వేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారని కళా వెంకట్రావు చెప్పారు.