'మజ్లిస్ కు తలొగ్గడం వల్లే..'
కరీంనగర్: మజ్లిస్‌కు తలొగ్గి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కరీంనగర్లో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మాదిరిగానే కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు. తిరంగ్ యాత్రతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేలా కృషి చేస్తామన్నారు.