వలసలు నివారిస్తాం..
టెక్స్టైల్ పార్కు పనులు జనవరి 31లోగా పూర్తి చేయాలి
నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాం
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
మడికొండ : టెక్స్టైల్ పార్కు పనులను వచ్చే జనవరి 31 లోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాకతీయ వీవర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సుచించారు. మడికొండ శివారులోని పారిశ్రామిక వాడలో 60 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ టెక్స్టైల్ కో ఆపరే టివ్ వీవర్స్ వెల్ఫేర్ సొసెటీ ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కు పనులను ఆదివారం ఆయన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాకతీయ టెక్స్టైల్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ పార్కులో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎం యూనిట్‌గా గుర్తించి, గతంలో రూ. 10 కోట్లు కేటాయించిందని చెప్పారు. 60 ఎకరాల్లో 360 మంది లబ్ధిదారులకు చిన్నచిన్న యూ నిట్లు ఏర్పాటు చేస్తామని, పవర్లూమ్ ద్వారా వస్త్రాల తయూరీ కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణం, సైడ్ డ్రెయిన్లు, రోడ్లు, ఆడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం, ప్రహరీ నిర్మాణ పనులను జనవరి 31లోపు పూర్తిచేసి లబ్ధిదారులకు కేటారుుంచాలని సూచించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను జాయింట్ కలెక్టర్‌కు అప్పగించారు. జిల్లా నుంచి సూరత్‌కు వలస వెళ్లిన వారి స్థితిగతులను, జీవన విధానాన్ని అక్కడికి వెళ్లి పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. వలస వెళ్లిన వారిని ఇక్కడికి తిరిగి తీసుకొచ్చేందుకే ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
టెక్స్టైల్ పార్కు నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించడం లేదని సంబంధిత అధికారులపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాజీ పడకుండా చుడాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ ఇండస్ట్రీకి, ఈ పార్కుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కాకతీయ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పడి నిర్మించుకుంటున్నదని తెలిపారు. అరుుతే సొసైటీ సభ్యులకు ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.
3 వేల ఎకరాల్లో టెక్స్టైల్ హబ్..
మూడు వేల ఎకరాల విస్థీర్ణంలో టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేయూలని ప్రభుత్వం సంకల్పించింద ని, ఇందుకోసం స్థల పరిశీలన చేస్తున్నామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్థల పరిశీలన బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించామన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే అన్ని యూనిట్లు ఒకేచోట ఉండేలా పనులు చేపడతామన్నారు.
డంపింగ్ యూర్డును తరలించాలి..
డంపింగ్ యార్డుతో మడికొండ పెద్ద చెరువు నీరు కలుషితం అవుతోందని, పక్కన ఉన్న వ్యవసాయ భూములు సైతం పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన డిప్యూటీ సీఎం.. డంపింగ్ యార్డును మరోచోటుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించారు. ఇందుకోసం హసన్‌పర్తి మండలంలో ఉన్న భూములను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ మేనేజర్ డి.రవి, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు దుర్గాస్వామి, ఆర్డీఓ వెంకటమాధవరావు, తహసీల్దార్ రాజ్‌కుమార్, వీఆర్ఓ జలపతిరెడ్డి, హన్మకొండ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీరామోజు అరుణ, ఊకంటి వనంరెడ్డి, మండల అధ్యక్షుడు మేరుగు రాజేందర్, మద్దెల నారాయణస్వామి, బైరి కొంరయ్య, బోగి దేవెందర్, పోలేపల్లి శంకర్‌రెడ్డి, ఎలకంటి భిక్షపతి, డాక్టర్ శంకర్‌బాబు, మాచర్ల శేకర్, పల్లపు నర్సింగరావు పాల్గొన్నారు.