kapu reservations
-
వీధి రౌడీ అంటూ ముద్రగడ ఫైర్
-
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ
సాక్షి, కాకినాడ: మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. కాగా తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం విదితమే. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను.’ అని ఆ లేఖలో తెలిపారు. (చదవండి: కాపు ఉద్యమానికి ఇక సెలవ్) -
అగ్ర కులాల్లో సగానికిపైగా కాపులు
సాక్షి, అమరావతి : అగ్రకులాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే ఎక్కువని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందుకే కేంద్రం ప్రకటించిన ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లలో వారికి ఐదు శాతం ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ, వైసీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాము కాపులకు మేలు చేస్తే వక్రీకరిస్తున్నారన్నారు. కులాల్లో చిచ్చుపెట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. అవినీతిని 85 శాతం నియంత్రించామని మోదీ అనడం హాస్యాస్పదమని, ఆయన పాలనలో సంస్కరణలు పడకేశాయని విమర్శించారు. ఉద్యోగాల సృష్టి సక్రమంగా లేదని, ఆర్బీఐకి గతంలో ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు లేదన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, దాన్ని పక్కదారి పట్టించాలని బీజేపీ చూస్తోందని చెప్పారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ కావాలనేది అందరి డిమాండ్ అని.. లేకపోతే వీవీ ప్యాట్ రశీదులు 100 శాతం నియోజకవర్గాలకు ఇవ్వాలన్నారు. దావోస్‌లో లోకేశ్ బృందం సత్ఫలితాలు సాధిస్తోందని చంద్ర బాబు కితాబిచ్చారు. -
టీడీపీపై కాపుల అగ్రహం
-
కాపు జాతికి మేలు చేసేది వైఎస్ జగనే
-
వైఎస్ జగన్‌ను సన్మానించిన కాపు నేతలు
-
'రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు జిమ్మిక్కులు'
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. అందుకే రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు చెప్పిందన్నారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే బిల్లును కేంద్రానికి పంపారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. అందుకే మొక్కుబడిగా బిల్లును పంపించారని ఆరోపించారు. కేసులకు భయపడే చంద్రబాబు18 కేసుల్లో విచారణ ఎదుర్కోలేక స్టేలు తెచ్చుకున్నారన్నారు. ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మీడియాకు లీకులు ఇవ్వకుండా రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగిందో చంద్రబాబు నోరు విప్పి చెప్పాలన్నారు. -
‘మాకూ.. చంద్రన్న బీసీ రిజర్వేషన్ తీసుకురా’
సాక్షి, కిర్లంపూడి : ఎన్నో వర్గాలకు సంక్రాంతి కానుకగా తన పేరుతో దాన ధర్మాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... కాపుల కోసం చంద్రన్న బీసీ రిజర్వేషన్ తీసుకు రావాలని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కోరారు. శనివారం ఆయన సీఎంకు సెటైరిక్‌గా ఓ బహిరంగ లేఖను రాశారు. ‘మాకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్ అమలు దిశగా అడుగు వేశారని విని సంతోష పడ్డాం. మీరిచ్చిన ఈ హామీ అధికారంలోకి వచ్చాక ఆలస్యం చేసినందువల్ల మేం విద్యా, ఉద్యోగ అవకాశాల్లో చాలా నష్టపోయాం. మళ్లీ ఇలా జరగకుండా బిల్లులో పొందుపరిచిన సదుపాయాలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆలస్యం చేసినా చిత్తశుద్ధితో రిజర్వేషన్ బిల్లు పెట్టారని భావించా. కానీ, మా పెద్దలు, మేధావులు, బిల్లును రాష్ట్రపతికి పంపించనవసరం లేదని మీరు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. బిల్లును కోల్ట్ స్టోరేజ్ లో పెట్టడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అపార అనుభవం ఉన్న మీరు ఇలా చేయరని నేను వారిని సముదాయిస్తున్నాను. మనల్ని కోల్డు స్టోరేజీలో పెడితే అదే కోల్డు స్టోరేజిలోకి వారు రావడం జరుగుతుందని చెప్పానని’ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. సలహాలు ఇచ్చే వేధావిని కాదు.. ముఖ్యమంత్రి అయిన మీకు సలహాలిచ్చేంత మేధావిని కాదన్న ముద్రగడ.. రిజర్వేషన్ ఫలాలు రాష్ట్రంలో అమలైన వెంటనే కేంద్రంలోని బీసీ కమిషన్‌కు పంపి, కేంద్ర సర్వీసుల్లో కూడా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదంతో 9వ షెడ్యూల్లో చేర్చాలని మేధావులు సలహాలిస్తున్నారని, ఈ దిశగా అడుగులు వేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సంక్రాంతి నాటికి సీఎం ఆదేశాలొస్తాయని ఎదురు చూస్తున్నామని ముద్రగడ తెలిపారు. తమకు నష్టం చేస్తే.. మీకు నష్టం చేయడానికి వెనుకాడమన్న సత్యాన్ని గ్రహించాలని లేఖ ద్వారా ముద్రగడ మరోసారి హెచ్చరించారు. -
భోజనం పెడతామని టిఫెన్ పెట్టారు...
కిర్లంపూడి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం పెడతామని టిఫెన్ పెట్టారు. అయిదు శాతం కాదు...మాకు 10 శాతం రిజర్వేషన్ కావాలి’ అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘పల్స్ సర్వేలో కాపు జనాభా లెక్కను తక్కువ చేసి చూపుతున్నారు. ఏపీలో కోటికి పైగా కాపులు ఉన్నారు. ఇది ఉత్సవాలు చేసుకునే సమయం కాదు. 9వ షెడ్యూల్లో పెట్టినప్పుడే కాపులకు నిజమైన దీపావళి. ఇచ్చిన హామీల గురించి అడిగితే చంద్రబాబు లాఠీలతో కొట్టించారు. మాటి మాటికి నా వెనుక వైఎస్ జగన్ ఉన్నారని మీ అనుచరులతో చెప్పించడం సబబు కాదు. ఇచ్చిన హామీ అడిగితే వారిని అవమానించే పని చేయవద్దు. నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే యత్నం చేయకండి. నేనెప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు. మా జాతి కోసమే నేను రోడ్డుపైకి వచ్చాను. నేను ఎప్పుడైనా మీ సహాయం కోరానా. ఒక్క రూపాయి అడిగానా?. ఇతరులకు రిజర్వేషన్లు ఎలా వర్తిస్తున్నాయో... మాకు కూడా వర్తించాలి. 2018 మార్చి 31 వరకూ ఉద్యమానికి తాత్కాలిక విరామం. ఆ గడువులోగా కాపు రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి. ఉద్యమం కోసం పోరాటం చేసినవారికి కాపు రుణాలు అందలేదు. బ్యాలెన్స్‌లో ఉన్న రుణాల నిధులను మంజూరు చేయండి. ఇచ్చిన హామీ అమలు కానప్పుడు దాన్ని సాధించుకోవడం కోసం మా ప్లాన్లు మాకున్నాయి.’ అని అన్నారు. -
ప్రతి కదలిక బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరణ
కాకినాడ: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద పోలీసులు గృహనిర్భంధం నాలుగోరోజు శుక్రవారం కూడా కొనసాగుతోంది. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాకుండా ముద్రగడ నివాసం వద్ద ప్రతి కదలికను పోలీసులు బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పోలీసుల నుంచి తనకు స్వేచ్ఛ కలిగినప్పుడే జేఏసీతో చర్చించి సత్యాగ్రహ యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతానని అన్నారు, పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసురెడ్డి ఏసుదాసు ,కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కాగా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమయిన ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే.