
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. అందుకే రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు చెప్పిందన్నారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే బిల్లును కేంద్రానికి పంపారన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. అందుకే మొక్కుబడిగా బిల్లును పంపించారని ఆరోపించారు.
కేసులకు భయపడే చంద్రబాబు18 కేసుల్లో విచారణ ఎదుర్కోలేక స్టేలు తెచ్చుకున్నారన్నారు. ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మీడియాకు లీకులు ఇవ్వకుండా రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగిందో చంద్రబాబు నోరు విప్పి చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment