Karnam Dharma Sri
-
తాగుడేందుకు.. వాగుడేందుకు.. బాత్రూంలో దాక్కున్న బండారు..
-
‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకు వస్తున్నాయని, కోట్ల రూపాయలు అక్రమాస్తులు గడించిన అయ్యన్న బండారం అందరికీ తెలుసని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని మండిపడ్డారు. చదవండి: తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదు: జోగి రమేష్ రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసని, కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటు దుయ్యబట్టారు. చోడవరం బ్రిడ్జి పూర్తి కాకపోతే ఆరు నెలల్లో గుండు గీయించుకుంటానని కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అయ్యన్న గుండు గీయించుకోలేక తప్పించుకున్నా సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశామని తెలిపారు. -
చంద్రబాబు రైతులను మోసం చేశాడు: కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు గతంలో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణ మాఫీ చేస్తానని రైతులను నిలువునా ముంచింది బాబు కాదా? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి బాబును మండిపడ్డారు. చంద్రబాబు హైటెక్ మోజులో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. రైతుల పట్ల టీడీపీకి ఏ విధానం కూడా లేదని మండిపడ్డారు. చరిత్రలో ఏనాడు కూడా చంద్రబాబు ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వలేదన్నారు. రైతులకు ఏలాంటి మేలు కూడా బాబు చేయలేదన్నారు. వైఎస్సార్ వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. -
చంద్రబాబు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు
-
‘రాజకీయ లబ్ధి కోసమే ప్రజా చైతన్య యాత్ర’
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చోడవరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంట అని మండిపడ్డారు. చద్రబాబు విశాఖకు కేవలం పెళ్లి పనులకోసమే వచ్చారని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణ అంశాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు చంద్రబాబు పథకం పన్నుతున్నారని ఆయన అన్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారని ధర్మశ్రీ సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగితే.. ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదని ధర్మశ్రీ ధ్వజమెత్తారు. (చంద్రబాబుది మామూలు ‘గుండె’ కాదు) సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రజా చైతన్య యాత్ర కేవలం రాజకీయ లబ్ది కోసమే అని మండిపడ్డారు. కేవలం వివాదం చేయడానికే విశాఖకు చంద్రబాబు వచ్చారని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రకు ఏం మేలు చేశారో చంద్రబాబు చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవమంతా తన స్వలాభం కోసమే వినియోగించారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన చంద్రబాబకు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. చంద్రబాబును వెనక్కి పంపించాల్సిందే అని అప్పల రాజు అన్నారు.(‘చంద్రబాబును అడుగుపెట్టనివ్వం’) పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతు.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆమె అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎందకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు. సీఎం జగన్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగితిస్తున్నామని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. (పెల్లుబికిన ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..) -
చంద్రబాబు తీరును ఖండిస్తున్నాం
-
దేవుడే అవినీతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ను పంపాడు
-
టీడీపీ విధానాలను ఎండగడతాం
రేపు చోడవరంలో విస్తృతస్థాయి సమావేశాలకు శ్రీకారం వైఎస్సార్సీపీ నేత కరణం ధర్మశ్రీ చోడవరం: రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడతామని వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో అనేక అమలుకాని వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాక అసలు అలాంటి హామీలే తాము ఇవ్వలేదని మంత్రులు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. రాజధాని పేరుతో మంత్రులు, అధికార పార్టీ నాయకులు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వివరాలు, వారు చేసిన భూదందా సర్వే నెంబర్లతో సహా పత్రికల్లో వస్తే రికార్డులు సైతం బ్లాక్ చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నార ని ఆరోపించారు. చోడవరం నియోజకవర్గంలో 1070మంది పింఛన్లకు అర్హులైనట్టు అధికారులు ధ్రువీకరించినప్పటికీ పార్టీల పేరుతో అర్హులకు సైతం పింఛన్లు రాకుండా జన్మభూమి కమిటీలు అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యే , టీడీపీ నాయకులు క్వారీలు, ఇసుక అక్రమణాతో సహజవనరులను సైతం దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే దగాబాబుపై దండోరా కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించామని గుర్తుచేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అధికార పార్టీ పాలకవర్గం ఇష్టానుసారంగా రైతుల సొమ్మును చందాల పేరుతో సొంత ప్రచారం కోసం ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రేపు వైఎస్సార్సీపీ సమావేశం వీటన్నింటిని ఎండగట్టేందుకే నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని తమ పార్టీ అధిష్టానం, కేంద్ర కమిటీ నిర్ణయించిదన్నారు. చోడవరం నుంచి ఈ సమావేశాలు జిల్లాలో ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు చోడవరం జవహార్క్లబ్ ఆవరణంలో నియోజకవర్గస్థాయి వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి తమ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ధర్మశ్రీ చెప్పారు. ఈ సమావేశానికి చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ అన్ని విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడువాక సత్యారావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వేచలపు ప్రకాష్, మండల శాఖ, పట్టణ శాఖల అధ్యక్షులు అప్పికొండ లింగబాబు, ఓరుగంటి నెహ్రూ, డీసీసీబీ డైరక్టర్ మూడెడ్ల మహాల క్ష్మి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.