Kasturba Gandhi
-
సీతారాంపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రిన్సిపల్ నిర్వాకం
-
నీరు లేదు.. వాన నీరే..
నార్నూర్(ఆదిలాబాద్): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయడానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎస్వో ప్రియాంక సర్పంచ్ మెస్రం జైవంత్‌రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు. -
పరీక్ష కేంద్రంలో పురిటినొప్పులు
డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి. గుంటగన్నెల పంచాయతీ జాముగుడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈమె ఆరోగ్యం బాగులేకపోవడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. టెన్త్ పరీక్షలు రాసేందుకు ఆమెను ఈనెల 27న మండల కేంద్రం డుంబ్రిగుడలోని పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో పరీక్ష కేంద్రం నుంచి హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈవో భారతరత్నం గురువారం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థిని గర్భం దాల్చి ప్రసవించడంపై ప్రత్యేకాధికారి జ్యోతి, వసతిగృహ నిర్వాహకురాలు (టీచర్) అప్పలమ్మకు అధికారులు చార్జి మెమో జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి వివరాలతో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణకు నివేదిక అందజేస్తామని ఎంఈవో భారతరత్నం తెలిపారు. (చదవండి: దారిలోనే పసివాడిన బతుకు) -
మహాత్ముడు మెచ్చిన జిల్లా.. ఏకంగా ఐదు సార్లు పర్యటన
నెల్లూరు సిటీ: భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీకి నెల్లూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ ఐదు సార్లు పర్యటించారు. 1915–1946 సంవత్సరాల మధ్యలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు గాంధీ. నెల్లూరు నుంచి వెంకటగిరి వరకు, సంగం నుంచి అనంతసాగరం వరకు, కావలి నుంచి సూళ్ళూరుపేట వరకు అనేక గ్రామాల్లో పర్యటించారు. 1915వ సంవత్సరం మే 14వ తేదీన తొలిసారిగా మహాత్మాగాంధీ భార్య కస్తూర్బాగాంధీతో నెల్లూరుకు వచ్చారు. అప్పట్లో మద్రాసు రాష్ట్ర రాజకీయ మహాసభ నెల్లూరులో జరగడంతో ఆయన పాల్గొన్నారు. 1921 ఏప్రియల్ 7వ తేదీన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో పెన్నానది తీరాన నిర్మించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదే పర్యటనలో నెల్లూరులో తిలక్ విద్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు టౌన్హాల్లో జరిగిన మహిళా సమావేశంలో, వీఆర్ కళాశాల ఆవరణంలో మతసామరస్య సరస్సులో పాల్గొన్నారు. తల్పగిరి రంగనాధున్ని దర్శించుకున్నారు. 1929వ సంవత్సరంలో గాంధీజీ ఐదురోజులు పాటు జిల్లాలో ఉన్నారు. మే 10వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొనడంతోపాటు యల్లాయపాళెం, రాజుపాళెం, గండవరం, పార్లపల్లి, విడవలూరు, మోపూరు, అల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో బుచ్చిరెడ్డిపాళెంలో ఖాదీ నిధికోసం రూ.7వేలు నగదు సేకరించారు. 11వ తేదీన కావలి, ఉలవపాడు, సిద్దనకొండూరు, చింతలపాళెం, పామూరు, కందుకూరు ప్రాంతాల్లో, 12వ తేదీన సంగం, మైపాడు, గంగపట్నం, ఇందుకూరుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో ప్రజలకు స్వాతంత్ర స్పూర్తిని నింపారు. ఈ పర్యటనలోనే కస్తూరిదేవీ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. నాలుగోసారి 1933 డిసెంబర్ 30వ తేదీన జిల్లాకు వచ్చిన జాతిపిత బిట్రగుంట, కావలి, అల్లూరు, గండవరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, వెంకటగిరి, నాయుడపేట గ్రామాల్లో పర్యటించారు. ఐదవసారి 1946 జనవరి 21వ తేదీన బిట్రగుంట నుంచి మద్రాసు వరకు పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. లక్షలాది మంది ఆయన వెంట నడిచారు. జిల్లాలో జాతిపిత పర్యటనకు గుర్తుగా పత్తి సుబ్బారావు అనే వ్యక్తి నెల్లూరు నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు గాంధీబొమ్మ సెంటర్‌గా పిలుస్తున్నారు. -
పరాయి పాలన నుంచి విముక్తికై..
భారతావని నేడు 74వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటోంది. ఎర్రకోటపై మువ్వన్నల జెండా రెపరెపలు చూసి భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. మరి ఈనాటి ఈ సంతోషం ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగఫలమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రిటీష్ అధికారుల తుపాకీ గుళ్లకు ప్రాణాలు ఎదురొడ్డి, వారు చేసిన అలుపెరుగని పోరాటం కారణంగానే నేడు మనమంతా స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నాం. ఇక సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది మహిళామణులు కూడా విశేష పాత్ర పోషించారు. ‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించడానికి తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది ధీరోధాత్తలను నేడు స్మరించుకుందాం. ఆ ఆదిశక్తి స్వరూపాలను తలచుకుంటూ జై భరతనారీ అని నినదిద్దాం. ఝాన్సీ లక్ష్మీబాయి(1828-58) భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత, ‘ఝాన్సీ’కి రాణి మణికర్ణిక తాంబే. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి.(చదవండి: స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. (ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన మోదీ) మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు.(దేశం కోసం ఆమె భర్తతోనే విభేదించింది) కస్తూర్బా గాంధీ(1869-1944) భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. సరోజిని నాయుడు(1879-1949) భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. -
రంగస్థల కస్తూర్బా
జీనత్ అమన్ వయసు 68 ఏళ్లు. పూర్వపు తరాల ఆరాధ్య నాయిక. మోకాళ్లపైకి స్కర్ట్ వేసుకుని, చేతివేళ్ల మధ్య వెలుగుతున్న సిగరెట్‌తో నాటì యౌవ్వనస్తులను ‘మీకు నిద్ర ఉండకుండును గాక’ అని శపించిన జీనత్ ఇప్పుడు కస్తూర్బాగా రంగస్థలం మీదనైనా నటించడం అపచారమేమీ కాబోదు. జాతిపితగా మాత్రమే మీరు గాంధీజీని ఎరిగి ఉన్నట్లయితే, ఆయన భార్య కస్తూర్బాగా జీనత్ అమన్ నటిస్తున్న రంగస్థల నాటకం ‘డియరెస్ట్ బాపు, లవ్ కస్తూర్బా’.. మీకు ఆయనలోని ఒక ఔన్నత్యం గల భర్తను చూపిస్తుంది. సైఫ్ హైదర్ హసన్ ఈ నాటకానికి రచయిత, దర్శకుడు. గాంధీజీగా ఆరిఫ్ జాకరియా నటిస్తున్న ‘డియరెస్ట్ బాపు..’ ను శుక్ర, శనివారాల్లో ముంబైలోని ‘నాటక్’ కళావేదికపై ప్రదర్శించారు. ‘ది గ్రేట్ ఇండియన్ థియేటర్ ఫెస్టివల్–2020’ పేరుతో బుక్ మై షో సమర్పిస్తున్న ఈ నాటకాన్ని దేశంలోని ఆరు నగరాలలో (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, వడోదర, చెన్నై, హైదరాబాద్) మార్చి 1 వరకు ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 4 గంటలకు మొదలయ్యే ‘డియరెస్ట్ బాపూ..’ రాత్రి గం. 80.20 వరకు కొనసాగుతుంది. ‘డియరెస్ట్ బాపు, లవ్ కస్తూర్బా’ నాటకం క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలౌతుంది. గాంధీజీ అరెస్ట్ అవుతారు. పుణెలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో ఆయన్ని నిర్బంధిస్తారు. దాంతో ఉద్యమాన్ని నడిపించే బాధ్యత కస్తూర్బా తీసుకుంటారు. ఆమెనూ అరెస్ట్ చేస్తారు. ముంౖ»ñ లోని ఆర్థర్ రోడ్ జైలుకు పంపుతారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. అమెను కూడా భర్త ఉన్న ఆగాఖాన్ ప్యాలెస్‌కే పంపుతారు. కొంతకాలానికి ఆమె మరణిస్తారు. ఇక అక్కడి నుంచి ఆమె ఆత్మ.. గాంధీజీకి లేఖలు రాస్తుంటుంది. ఆ లేఖల్లో వాళ్ల అరవై ఏళ్ల అనురాగ దాంపత్యం గురించి ఉంటుంది. పెళ్లయినరోజు నుంచి గాంధీజీ ఒడిలో ఆమె కన్నుమూసే వరకు వారిద్దరి మధ్య అనుబంధాల్ని ప్రభావితం చేసిన ప్రతి సందర్భమూ ఉంటుంది. ఆ లేఖలకు గాంధీజీ స్పందిస్తుంటారు. ‘‘కస్తూర్బా గురించి బయటికి తెలిసింది చాలా తక్కువ. భర్త చాటు భార్యగానే ఆమె జీవించారు’’ అని జీనత్ అమన్ అంటున్నారు. నాటకంలోని లేఖల ద్వారా, నాటకంలో గాంధీజీ భార్యగా నటించడం వల్ల బహుశా ఆమె అలా అనుకుని ఉండొచ్చు. అన్ని తరహాల పాత్రలకూ జీవం పోశారు జీనత్. నటిగా మాత్రమే ఆమెను చూడగలిగితే ఆమెను పూర్తిస్థాయి కస్తూర్బాను కూడా మనం చూడగలం. పదిహేనేళ్ల తర్వాత ఒక నాటకంలో జీనత్ నటించడం మళ్లీ ఇదే మొదటిసారి. తొలిసారి 2004లో ‘ది గ్రాడ్యుయేట్’ నాటకంలో మిసెస్ రాబిన్సన్గా నటించారు జీనత్. అప్పటికి పదేళ్లగా ఆమె సినిమాల్లో లేరు. ఆ నాటకం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ‘పానిపట్’ (2019) ఆమె ఇటీవలి సినిమా. అందులో ఆమె మొఘల్ రాణి సకీనా బేగంగా నటించారు. -
వారిద్దరి మధ్య విభేదాలకు రూ. 4 కారణమైన వేళ!!
నిజాన్ని నిర్భయంగా చెప్పడంలోనూ, తప్పు చేసిన వారిని విమర్శించడంలోనూ గాంధీజీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. పొరపాటు చేసినా సరే... నిర్మొహమాటంగా ఒప్పుకొనే తత్త్వం బాపూజీ సొంతం. ఈ విషయంలో భార్య కస్తూర్భాను కూడా ఆయన మినహాయించలేదు. కస్తూర్భా గొప్పదనాన్ని మాత్రమే కాదు ఆమె చేసిన పొరపాట్ల గురించి కూడా ఆయన నిజాయితీగా చెప్పేవారు. అయితే అందులో అంతర్లీనంగా ఓ సందేశం కూడా దాగి ఉండేది. అందుకు సంబంధించిన చిన్న ఉదాహరణ... 1929లో నవజీవన్ పత్రికలో గాంధీజీ రాసిన వ్యాసం సంక్షిప్తంగా... ‘రెండేళ్ల క్రితం.. కస్తూర్భా తన దగ్గర రెండు వందల రూపాయలు అట్టిపెట్టుకుంది. కానుకల ద్వారా తనకి ఆ డబ్బు వచ్చింది. అయితే ఇలా ఓ వ్యక్తి డబ్బును దాచుకోవడం అనేది ఆశ్రమ నియమాలకు విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తను అలా చేయడం నన్నెంతగానో బాధించింది. అయితే ఇంతకన్నా బాధించే విషయం ఏంటంటే తన వద్ద డబ్బు ఉన్న సంగతి నా దగ్గర దాచిపెట్టడం. ఈ విషయం బయటపడటం కూడా కొంత విచిత్రంగా జరిగింది. ఓరోజు ఆశ్రమంలో దొంగలు పడ్డారు. వారు సరాసరి కస్తూర్భా గదిలోకి వెళ్లారు. అక్కడ వాళ్లకేమీ దొరకలేదు. కానీ నాకు మాత్రం కస్తూర్భా చేసిన పొరపాటు తెలిసిపోయింది. దీంతో వెంటనే ఆమెను మందలించాను. తను కాస్త బాధ పడినా ఇంకెప్పుడూ ఇలా చేయనని నాతో చెప్పింది. కానీ ఆ పొరపాటును పునరావృతం చేసి నా నమ్మకం సన్నగిల్లేలా చేసింది. అప్పుడు రెండొందల రూపాయలు అయితే ఇప్పుడు కేవలం నాలుగు రూపాయలే. తనకు తెలిసిన వారెవరో బహుమతి రూపంలో నాలుగు రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులను ఆశ్రమ ఖర్చుల కోసం ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుంది. దీనిని నేను దొంగతనంగానే భావిస్తాను. అవును ‘బా’ పొరపాటు చేయడమే కాదు దొంగతనం చేసినట్లు కూడా. గట్టిగా నిలదీసిన తర్వాత ఈ విషయం గురించి నాకు చెప్పింది. తప్పని తెలిసినా కూడా తనకున్న ఈ అలవాటును మార్చులేకపోయాను అంది. అయితే ఈసారి తను బలంగా నిర్ణయించుకుంది. నాకు మాట కూడా ఇచ్చింది. ఇలాంటివి పునరావృతం అయితే ఆశ్రమం నుంచి, నా జీవితం నుంచి వెళ్లిపోతానని శపథం బూనింది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా తనెంతో జాగ్రత్తపడింది. పశ్చాత్తాపాన్ని మించిన గొప్ప గుణం ఉండదు కదా’ అంటూ గాంధీజీ తన భార్యలోని రెండు లక్షణాల గురించి ఒకే వ్యాసంలో రాసుకొచ్చారు. -
మహాత్ముడు మంచి తండ్రి కాలేకపోయారా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మాగాంధీ జాతిపిత అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన చేసిన గొప్ప పనులే జాతి పిత అని పేరొచ్చేలా చేశాయి. అయితే, ఇది గాంధీ చరిత్రకు ఒక వైపు మాత్రమేనని,మహాత్ముడి జీవితంలో తెలియని మరో అంశం కూడా ఉందని ప్రముఖ రచయిత్రి నీలిమా ద్మాలియా ఆధార్ అన్నారు. గాంధీ భార్య కస్తూర్బా గాంధీ రాసిన డెయిరీ ఆధారంగా ‘ది సీక్రెట్ డైరీ ఆఫ్ కస్తుర్బా’ అనే పేరిట ఆమె పుస్తకాన్ని వెలువరించింది. ఆ పుస్తకంలో మహాత్ముడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పేర్కొంది. గాంధీ మహాత్ముడి చరిత్రను మకిలబరచడం తన ఉద్దేశం కాదని, ఆయన చరిత్రను మాత్రమే పట్టించుకున్నవారు కస్తుర్బా చరిత్రను మాత్రం వదిలేశారని, ఆమెను గురించి, ఆమె భావాలను గురించి కూడా అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశం అన్నారు. జాతి పిత గాంధీ మంచి తండ్రి కాలేకపోయారని ఆమె పుస్తకంలో ఆరోపించారు. భార్యతో వ్యక్తిగత జీవితం నుంచి కూడా దూరంగా ఉన్నారని చెప్పారు. దేశం కోసం గొప్ప సేవలు అందించిన గాంధీ మహాత్ముడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారంటే ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపారు. కస్తుర్భా ఎప్పుడూ మౌనంగా ఉండే స్త్రీ మాత్రమే కాదని, చాలా ధైర్యవంతురాలని కూడా పేర్కొన్నారు. ఆమె ఎదుర్కొన్న సవాళ్లను చరిత్ర గురించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఆమె గురించి ఒక్క పదం కూడా పొందుపరిచి లేదని, ఇదంతా ఒక అసాధారణ మహిళను నిర్లక్ష్యం చేసి మర్చిపోవడమే అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కస్తుర్బా వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. -
కస్తూర్బా విద్యార్థినుల అస్వస్థత
సిద్దిపేటలో ఏడుగురికి చికిత్స సాయంత్రానికి కోలుకున్న విద్యార్థినులు నీరు, ఆహారం కలుషితమే కారణం నంగునూరు : నంగునూరు మండలం నర్మేటలోని కేజీబీవీలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఏడుగురిని సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థినుల కథనం ప్రకారం... నర్మేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని పరీక్షించిన పాఠశాల ఏఎన్ఎం వారికి మందులు అందజేశారు. విరేచనాలు తగ్గకపోవడంతో బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఎస్ఓ హమీదా తీవ్రంగా నీరసించిన మానస, అరుంధతి, అంజలి, రేణుక, జ్యోతి, స్వాతి, రమ్యలను 108 అంబులెన్స్‌లో సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫ్లూయిడ్ ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో ఎంసీహెచ్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. సాయంత్రం విద్యార్థులు కోలుకోవడంతో వారు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కస్తూర్బా విద్యాలయంలో మంచినీటి సమస్య ఉండడంతో పిల్లలు బోరు నీటిని తాగుతున్నారని చెప్పారు. అలాగే నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. మెనూ పాటించడం లేదని పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించినా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుతున్నారు. -
కస్తూర్బా విద్యార్థినికి తీవ్రగాయాలు
మెదక్: నారాయణ్‌ఖేడ్ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని గాయపడింది. మండలంలోని రాంచందర్ తండాకు చెందిన స్రవంతి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం ఆమె పాఠశాల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే నారాయణ్‌ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మహాత్మా గాంధీ భార్యను కొట్టారా?
న్యూఢిల్లీ: అహింసావాది, జాతిపిత మహాత్మా గాంధీ తన భార్య కస్తూర్బా గాంధీని ఎప్పుడైనా కోపాన్ని తట్టుకోలేక చెంప మీద కొట్టారా ? కొట్టారని చెబుతున్నారు రచయిత ప్రమోద్ కపూర్ తాను రాసిన తాజా పుస్తకం ‘గాంధీ ఎన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ’లో. అంతేకాకుండా గాంధీ తన కుటుంబ సభ్యుల పట్ల ఓ ‘సర్కస్ రింగ్ మాస్టర్’లా వ్యవహరించారని, ఇదే విషయాన్ని ఆయన కుమారుడు హరిలాల్ గాంధీ తన తండ్రికి రాసిన 14 పేజీల లేఖలో తెలిపారని ప్రమోద్ కపూర్ పేర్కొన్నారు. తన సన్నిహితులు, దగ్గరి శిష్యులతో డిక్టేటర్‌గా వ్యవహరించేవారని కూడా తెలిపారు. దేశంలో ఖాదీ ఉద్యమం ఊపందుకున్న రోజుల్లో విదేశీ వస్త్రాలను విసర్జించి ఖాదీ చీరలనే కట్టుకోవాలని దేశ ప్రజలతోపాటు కస్తూర్భా గాంధీని కూడా మహాత్మా గాంధీ ఆదేశించారట. బరువైన ఖాదీ చీరను కట్టుకొని తాను ఇంట్లో పనులు చేసుకోనని, ముఖ్యంగా వంట చేయలేనని కస్తూర్భా మొరపెట్టుకున్నారట. ఆ మాటలకు కోపం వచ్చిన గాంధీ భార్యపై చేయి చేసుకున్నారట. అయితే వంట చేయకని, విదేశీ వస్త్రం ధరించి వంట చేస్తే తాను తినని కూడా గాంధీ భీష్మించుకు కూర్చున్నారట. అప్పుడు భార్య కళ్ల నుంచి మౌనంగా కారిన కన్నీళ్లను చూసిన గాంధీకి అహింస గొప్పదనం గురించి తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసిందట. ఖాదీ ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకోని వారిపట్ల మహాత్మాగాంధీ కోపంగా ప్రవర్తించే వారట. తనకు చరఖాపై నూలు నేయడం రాదన్న కారణంగా గాంధీజీ ఆయన ఫొటోను తీయడానికి ఒప్పుకోలేదని లైఫ్ మేగజైన్ ఫొటోగ్రాఫర్ మార్గరెట్ బౌర్కే వైట్ ఓ సందర్భంలో వెల్లడించారు. మహాత్మా గాంధీ జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు ఎన్నో అంశాలు ఉంటాయి. అందుకనే ఆయన జీవిత చరిత్రపై ఇప్పటికే వందలాది పుస్తకాలు వెలువడ్డాయి. గాంధీ మాత్రం 98 సంకలనాల్లోగానీ, ‘మై ఎక్స్పరమెంట్స్ విత్ ట్రుత్’ పుస్తకంలోగానీ భార్యను చెంపదెబ్బ కొట్టిన అంశం లేదు. -
మహాత్ముడికే స్ఫూర్తి
కస్తూరిబా వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె ఆలోచనలు ఎంతో దృఢమైనవి. ఆ దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది. - కస్తూరిబా గురించి గాంధీ ‘నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నా మీద నాకే జాలి కలుగుతూ వుంటుంది’ అని తన ఆత్మకథలో రాసుకున్నారు మహాత్మాగాంధీ. పదమూడేళ్ల వయసుకే పెళ్లయిన తన చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అలా రాసుకున్నారు. అయితే... తన సంసారం గురించి, కుస్తూరిబా గురించి గాంధీజీ చెబుతున్నప్పుడల్లా...‘కస్తూరి బా సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నామీద నాకే గర్వం కలుగుతుంది’ అంటూ ఆయన మనసులోని మార్మిక మాటను అందరికీ వినిపిస్తూనే ఉన్నారు. ఒక బాల్యస్నేహితురాలిగా తన జీవితంలోకి వచ్చిన కస్తూరిబా గురించి గొప్ప కలలు కన్నారు గాంధీజీ. ఆయన ఇలా అనుకున్నారు...‘నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని, నేను నేర్చుకున్నదాన్ని ఆమె నేర్చుకోవాలని, నేను చదివినదాన్ని ఆమె చదవాలని, ఇద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన లేదు’. గాంధీజీ కన్న ఈ కల వృథా పోలేదు. నూటికి నూరుపాళ్లు నిజం అయ్యింది. సంసార విజయానికి పట్టు విడుపులు ఉండాలి. ఒక అభిప్రాయాన్ని తన కోణం నుంచి మాత్రమే చూడడం కాకుండా అవతలి వ్యక్తి కోణం నుంచి కూడా చూసే సహనశీలత, ఉదార లక్షణం ఉండాలి. మొదట్లో గాంధీజీ అభిప్రాయం, నిర్ణయాల పట్ల అసహనం, కోపం ప్రదర్శించినా... ఆ తరువాత మాత్రం వాస్తవంలోకి వచ్చారు కస్తూరిబా. భర్త నిర్ణయాలలోని మంచిని గ్రహించారు. దాన్ని అక్షరాలా ఆచరించారు. దీనికొక ఉదాహరణ... కస్తూరిబా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప్పు, పప్పు మానేయమని సలహా ఇచ్చారు గాంధీజీ. ‘‘ఉప్పు పప్పు మానేయమని మీకు ఎవరైనా చెబితే మీరు మానేస్తారా?’’ అని అడిగారు కస్తూరిబా. వెంటనే గాంధీజీ... ‘‘ఈ క్షణం నుండి ఒక సంవత్సర కాలం ఉప్పు పప్పు వదిలేస్తున్నాను’’ అన్నారు. ‘‘క్షమించండి. మీ మాట ప్రకారం ఉప్పు, పప్పు మానేస్తాను. మీరు మాత్రం మానకండి. నాకు శిక్ష పడుతుంది’’ తల్లడిల్లిపోతూ సమాధానం ఇచ్చారు కస్తూరిబా.కస్తూరిబా దృఢచిత్తం గురించి గాంధీజీ ఎన్నోసార్లు చెప్పారు. తన ఆత్మకథలో ‘నా భార్య యొక్క దృఢచిత్తత’ అని రాసిన ఒక అధ్యాయంలో ఇలా రాశారు- ‘కస్తూరిబా శరీరం బాగా క్షీణించింది. మత్తు మందు ఇవ్వకుండానే డాక్టర్ ఆపరేషన్ చేశాడు. కత్తులు పని చేస్తున్నప్పుడు అపరిమితంగా బాధ కలిగింది. కానీ ఎంతో సహనం, ధైర్యంతో ఆమె ఆ బాధను సహించింది. అది చూసి నేను నివ్వెర పోయాను. భయంకరమైన స్థితిలో ఉన్న భార్యకు ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు కలగలేదు. ‘ఏం ఫరవాలేదు. భయపడకండి’ అని ఆమే నాకు ధైర్యం చెప్పింది.’’ కస్తూరిబా ధైర్యం గురించి ప్రశంసించడమే కాదు...‘ఆమె దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది’ అని చెప్పారు గాంధీజీ.గాంధీజీ డర్బన్‌లో వకీలుగా పని చేస్తున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే గుమస్తాలు ఆయనతో పాటే ఉండేవారు. ఆ గుమస్తాలకు కేటాయించిన గదులలో ప్రతి గదిలో మూత్ర విసర్జనకు ప్రత్యేక పాత్రలు ఉండేవి. కొత్తగా చేరిన ఒక గుమాస్తా తన గదిలో ఉన్న పాత్రను తెలిసో తెలియకో శుభ్రపరిచేవాడు కాదు. దీంతో శుభ్రపరిచే పని కస్తూరిబా తీసుకునేవారు. ఈ విషయం ఆవిడకు తలనొప్పిగా మారింది. ఇది భార్యాభర్తల మధ్య తగాదాకు కూడా కారణమైంది. దీని గురించి గాంధీజీ ఇలా చెప్పారు... ‘‘ఆమె కోపంతో మూత్ర పాత్రను తీసుకువెళ్లడానికి నేను ఇష్టపడలేదు. నవ్వుతూ తీసుకువెళ్లాలి అని చెప్పాను. కంఠం పెద్దది చేసి ‘ఈ కలహం నా ఇంట్లో నడవదు’ అని అరిచాను. ‘అయితే నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్లిపోతున్నాను’ అన్నది. అప్పుడు దయ అనేది నా హృదయంలో కొంచెం కూడా మిగలలేదు. నిస్సహాయురాలైన ఆ అబలను ద్వారం దాక లాక్కెళ్లాను. ‘నేను ఎక్కడికి వెళ్లను? ఇక్కడ మా అమ్మానాన్నలు లేరు. ఆడదాన్ని... అందువల్ల నీ దౌర్జన్యం సహించక తప్పదు’ అని కళ్ల నిండా కన్నీళ్లతో అంది కస్తూరిబా. పైకి ధుమధుమలాడుతూ ఉన్నాను. కానీ లోలోన సిగ్గుపడిపోయాను. భార్య నన్ను వదలలేనప్పుడు నేను ఆమెను వదిలి ఎక్కడికి వెళ్లగలను? అలా తను అద్భుత సహనశక్తితో విజయం సాధించిందన్నమాట’’ మహాత్ముని జీవితాన్ని తరచిచూసినప్పుడు... గుణాత్మకంగా తనను తాను సవరించుకోవడానికి ఒక అద్దంలా, అధైర్యం నుంచి ధైర్యమనే శక్తిని ఆవాహన చేసుకునే శక్తిస్వరూపిణిగా, ఉద్యమ ప్రస్థానానికి చోదకశక్తిగా కస్తూరిబా మహాత్ముడి జీవితంలో భాగమైపోయారు. భౌతిక ఆడంబరాల నుంచి వచ్చే ఆనందం ఆనందం కాదని మానసిక తృప్తి నుంచి వచ్చే ఆనందమే అసలు సిసలు ఆనందమని అక్షరాలా నమ్మారు. - యాకూబ్ పాషా -
ఒకే చోట.. చక్కటి విద్య !
* ఒకే యాజమాన్యం కిందకు గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా విద్యాలయాలు * భవిష్యత్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దే అవకాశం * కేంద్రం మోడల్ స్కూళ్లను రద్దు చేయడంతో విద్యాశాఖ యోచన * మోడల్ స్కూళ్లనే ‘కేజీ టు పీజీ’గా మార్చితే మంచిదంటున్న విద్యావేత్తలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న గురుకులాలు, కొత్తగా ప్రారంభించిన మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు వంటివాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2016-17 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన ‘కేజీ టు పీజీ’ విద్యాసంస్థలుగా వాటిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ పాఠశాలలన్నింటికీ పెద్ద భవనాలు, హాస్టళ్లు ఉండడం, ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతుండడం వంటివన్నీ ‘కేజీ టు పీజీ’కి సరిగ్గా సరిపోతాయని.. ఒకే యాజమాన్యం పరిధిలోకి తేస్తే మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని సర్కారు అభిప్రాయ పడుతోంది. - సాక్షి, హైదరాబాద్ అన్ని హంగులతో.. మండలానికి ఒకటి కేజీ టు పీజీకి కాన్సెప్ట్ పేపర్ రూపకల్పన కోసం విద్యాశాఖ రెండు దఫాలుగా విద్యావేత్తలు, అధికారులతో సమావేశాలు నిర్వహించింది. నివాస వసతితో కూడిన విద్యా సంస్థలను, కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్ స్కూళ్లను, గురుకులాలను, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను తీసుకువస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సమావేశాల్లో విద్యావేత్తలు వ్యక్తం చేశారు. తద్వారా మండలానికి ఒకటి చొప్పున కేజీ టు పీజీ కేంద్రాలను ఏర్పాటు చేయడం సులభమవడంతోపాటు వాటి నిర్వహణ పక్కాగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దానికితోడు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లుగా ఇంగ్లిష్ మీడియంతో కూడిన నాణ్యమైన విద్యను అందించవచ్చని చెప్పారు. విద్యాశాఖ గతంలో ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను ప్రారంభించినా... వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్యను అందించలేని స్కూళ్లుగా అవి తయారయ్యాయి. ఈ నేపథ్యంలో మోడల్, గురుకుల, కస్తూర్బా విద్యాసంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కేజీ టు పీజీ కేంద్రాలుగా తీర్చిదిద్దితే బాగుంటుందన్న ఆలోచనలు అధికారుల్లో వచ్చాయి. రకరకాల పేర్లతో.. రాష్ట్రంలో ప్రస్తుతం 400 వరకు గురుకుల విద్యాలయాలున్నాయి. అందులో 47 గురుకులాలు, 4 కాలేజీలు విద్యాశాఖకు చెందిన రాష్ట్ర గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో కొనసాగుతున్నాయి. మిగతా స్కూళ్లు సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో ఉన్నాయి. మరోవైపు బాలికలకు నివాస వసతితో కూడిన విద్యను అందించే కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) కూడా 95 ఉన్నాయి. ఇవి గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో కొనసాగుతుండగా.. కొన్ని సర్వశిక్షా అభియాన్ పరిధిలో, ఇంకొన్ని సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. ఇక మరోవైపు 192 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా కేజీ టు పీజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే పక్కాగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కేజీ నుంచి 3వ తరగతి వరకు డే స్కూల్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నివాస వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించే విద్యాలయాలుగా మార్చవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అనువుగా ‘మోడల్’ భవనాలు ప్రస్తుతం రాష్ట్రంలో 177 మోడల్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. మరో 15 స్కూళ్ల భవనాలు సిద్ధమయ్యాయి. వచ్చే జూన్‌లో వాటిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటికి తోడు కేంద్రం రెండో దశలో మరో 125 మోడల్ స్కూళ్లను ఇచ్చింది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ. 4.85 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. రూ. 100 కోట్ల నిధులూ ఇచ్చింది. కానీ తాజా బడ్జెట్లో కేంద్రం ఈ పథకాన్ని పక్కనపెట్టింది. అయితే గతంలోనే 125 స్కూళ్లను మంజూరు చేసి, కొంతమేర నిధులిచ్చినందున మిగతా నిధులిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మరో రూ. 650 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఎలాగూ కేజీ టు పీజీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో స్థలాలు సిద్ధంగా ఉన్న మోడల్ స్కూళ్లనే కేజీ టు పీజీ కేంద్రాలుగా నిర్మిస్తే బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టల్‌కు కేంద్రమే నిధులిచ్చినందున.. బాలుర హాస్టళ్లకు నిధులను వెచ్చిస్తే చాలు. రకరకాల మేనేజ్మెంట్లు అవసరం లేదు ‘‘స్కూళ్లకు రకరకాల మేనేజ్మెంట్లు అవసరం లేదు. పేరు ఏదైనా నిధులను ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నిర్వహించాల్సింది విద్యాశాఖే. అందుకే కేజీ టు పీజీలో ఇలాంటి స్కూళ్లు అన్నీ ఒకే మేనేజ్మెంట్ పరిధిలో ఉండాలి. కేజీ టు పీజీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. అన్నింటి పరిధిలో నివాస వసతి ఏర్పాటు చేస్తే సరిపోతుంది.’’ - చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త ఒకే రకంగా సర్వీసు రూల్స్ ‘‘ప్రస్తుతం గురుకులాలకు మోడల్ స్కూల్ టీచర్లకు ఒకే రకమైన సర్వీసు రూల్స్ ఉన్నాయి. పైగా మోడల్ స్కూళ్లలో బాలికలకు హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంది. అదనంగా బాలురకు హాస్టల్ వసతి కల్పించి కేజీ టు పీజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాలు అన్ని ఒకే పరిధిలోకి తేవాలి.’’ - ప్రొఫెసర్ ఉపేందర్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ కరిక్యులమ్ మాజీ విభాగాధిపతి -
ఓ బాలిక వ్యథ
కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్నవాళ్లే.. ఆడపిల్లన్న కారణంగా గాలికి వదిలేసి వెళితే... ఆ వేదన వర్ణించడానికి మాటలు చాలవు. అలా నిర్లక్ష్యానికి గురైన ఓ బాలిక కథే ఇది.. - సరస్వతి రమ నీలిమకు ఇప్పుడు పన్నెండేళ్లు. ఏడో తరగతి చదువుతోంది. కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంటోంది. ఆ అమ్మాయి ఈ ఆశ్రమానికి ఎప్పుడు, ఎలా వచ్చిందంటే.. నాలుగేళ్ల కిందట.. చలికాలంలో ఓ రోజు సాయంత్రం.. దవడలు కదిలే చలిలో నల్గొండ బస్టాండ్‌లోని బెంచి మీద ఏడేళ్ల పాప కూర్చునుంది.. అమాయకంగా దిక్కులు చూస్తూ! కిందటి రోజు రాత్రి నుంచి అక్కడే అలాగే కూర్చునుంది. కడుపులో తిండిలేదు.. కంటి మీద కునుకు లేదు. కనీసం మంచి నీళ్లు కూడా లేవు. నెమ్మది నెమ్మదిగా నీరసించి పోతోంది. అలాగే నిస్సత్తువతో నిద్రలోకి జారుకుంది. మరో 24 గంటలు గడిచాయి. సొమ్మసిల్లి పోయింది. బస్టాండ్‌లో ఈ పాపను గమనించిన ఎవరో పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి పాపను తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లోనే అన్నం తినిపించారు. తనవాళ్ల వివరాలు అడిగితే చెప్పిందిలా.. ‘నాకు ఓ తమ్ముడు. నాన్న లేడు. తమ్ముడిని తీసుకొని అమ్మ ఇంకో నాన్నతో వెళ్లిపోయింది... నన్ను బస్టాండ్‌లో వదిలేసి!’ ఏ భావమూ లేకుండా చేతి వేళ్ల గోర్లు చూసుకుంటూ.‘ఎప్పుడు?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘ఊ.. మొన్న’ తలెత్తి అతని కళ్లలోకి చూస్తూ సమాధానమిచ్చింది అదే అమాయకత్వంతో. కస్తూర్బా గాంధీ ఆశ్రమం నిర్వాహకురాలికి ఆ రాత్రే ఫోన్ చేశారు పోలీసులు. ‘ఓ అమ్మాయి ఉంది. మీ ఆశ్రమానికి తీసుకెళ్తారా?’ అని. అప్పటికి సమయం రాత్రి ఎనిమిదిన్నర. ‘ఈ రాత్రి.. ఇంత చలిలో అంతదూరం రాలేం. మీరు అక్కడి నుంచి ఫలానా చోటికి వస్తే మేమూ అక్కడికి వచ్చి పాపను తీసుకెళ్తాం’ అని చెప్పి.. అప్పటికప్పుడు టాక్సీ మాట్లాడుకొని అసిస్టెంట్‌ను తీసుకొని బయలుదేరారు. నీలిమను ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ పాపను తోటివాళ్లతో కలిసేలా చేయడానికి చాలానే శ్రమ పడాల్సి వచ్చింది వీళ్లకు. ఆ వయసులో ఉండాల్సిన ఉత్సాహం, చురుకుదనం లేకుండా దిగాలుపడి ఉండేది. ఇప్పుడు.. రివ్వున వీచే గాలి తెమ్మెరలా ఉంటుంది. మాటల ప్రవాహం.. కలివిడితనమంటే నీలిమేమో అన్నట్టు ఉంటుంది. చదువులోనూ ఫస్టే! పెద్దయ్యాక డాక్టర్నవుతా అంటుంది. ఆ మాటల్లో తన శక్తి ఏంటో తెలుసుకున్న ఆత్మవిశ్వాసం వినిపిస్తుంది. నీలిమ మన బిడ్డ. కాపాడుకుందాం.. డాక్టర్ కావాలనుకునే ఆ పిల్ల ఆశ నెరవేరేలా సహకరిద్దాం.. ఇంకే అడ్డంకులు కల్పించకుండా!. (పేరు మార్చాం) -
కష్టాల..కస్తూరిబా
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామీణ ప్రాంతాలలోని వెనుకబడిన వర్గాల పిల్లల్లో ప్రాథమికోన్నత విద్యాస్థాయిలో మగపిల్లల కంటే బాలికల నమోదు చాలా తక్కువగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో హాస్టల్ వసతి కల్పిస్తూ కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఏర్పాటు చేశారు. లక్ష్యం బాగానే ఉన్నా.. నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాలయాలు కష్టాలకు నిలయాలుగా మారాయి. మంచినీరు లేక ఫ్లోరైడ్ నీటిని తాగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వసతుల మధ్య సాగుతున్న ఈ విద్యాలయాల్లో విద్యార్థినుల సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోంది. విద్యార్థినుల సంఖ్యను పెంచడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉండాలి. కానీ ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదు. జిల్లాలో 46 కస్తూరిబా బాలికల విద్యాలయాలు ఉండగా కేవలం 7964 మంది విద్యార్థినులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. మౌలిక వసతుల లేమికి తోడు సరిపడా సీఆర్టీలు కూడా లేరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటివరకు నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు. ఇష్టానుసారంగా మెనూ పాటిస్తున్నారు. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేదు. నూతన భవనాల్లో సైతం సరైన వసతులు లేక విద్యార్థినులు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా అద్దె భవనాల్లో నిర్వహించే పాఠశాలల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. మంచినీటి కోసం విద్యాలయంలోని బోరు ద్వారా వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగాల్సి వస్తోంది. ఒక్కొక్క విద్యాలయంలో ఒక స్పెషల్ ఆఫీసర్, ఏడుగురు సీఆర్టీలు, ఒక పీఈటీ ఉండాల్సి ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా 27 సీఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టించుకోవడం లేదు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆత్మకూర్(ఎం), తుర్కపల్లి మండలాల్లోని కస్త్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి వస తి, విద్యుత్ వసతులు లేక విద్యార్థినులు రెండు మూడు రోజు లకోసారి స్నానాలు చేస్తున్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి సమయాల్లో చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థినులకు కాస్మోటిక్ బిల్లులు రాలేదు. ువనగిరి నియోజకవర్గంలోని భువనగిరిలో మైనార్టీ, వలిగొండ మండలం లోతుకుంట, భూదాన్‌పోచంపల్లిలో ఉన్న కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంచినీరు, విద్యుత్, ఉపాధ్యాయుల, ఫర్నిచర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. భువనగిరి, వలిగొండల్లో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. మున్సిపల్ ట్యాంకర్ రెండురోజులకోసారి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫామ్స్, ట్రంక్‌పెట్టెలు, తెలుగు పాఠ్యపుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదు. ేవరకొండ కస్తూరిబా పాఠశాలలో విద్యుత్, నీటి సమస్యలు నెలకొనగా పీఏపల్లి పాఠశాలలోవిద్యార్థినులు బోరింగు నీటిపైనే ఆధారపడ్డారు. విద్యార్థినులకు ప్రభుత్వం సరఫరా చేసే దొడ్డు బియ్యంతోనే వండిపెడుతుండటంతో అన్నం తినలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి కస్తూరిబా పాఠశాలలో మ్యాథ్స్ పోస్టు, డిండి పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పోస్టు, పీఏపల్లి మండలంలో ఇంగ్లీష్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, డిండి కస్తూరిబా పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో భద్రత కొరవడింది. హుజూర్నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో నిరుపయోగంగా ఉన్న వ్యవసాయసబ్ మార్కెట్ యార్డులో పాఠశాలను ఏర్పాటు చేశారు. మేళ్లచెరువులోని పాత ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనంలో కేవలం ఆరు గదులు మాత్రమే ఉండటంతో ఇరుకు గదుల్లో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు విద్యార్థినులకు సరిపడా లేకపోవడంతో ఆరుబయటకు వెళుతున్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో నూతన భవనం నిర్మించినప్పటికీ సరైన వసతులు ఏర్పాటు చేయలేదు. పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతోపాటు లోవోల్టేజీ విద్యుత్ సమస్య నెలకొనడం వల్ల తరచు విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల అద్దె భవనంలో ఉంది. మౌలిక సదుపాయాలు లేవు. నిడమనూరు, పెద్దవూర మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో తాగునీటి సమస్య నెలకొన్నది. ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్‌ను కొనుగోలు చేసి తాగుతున్నారు. పెద్దవూరలోని విద్యాలయానికి వ్యవసాయ విద్యుత్ లైన్నుంచి కనెక్షన్ తీసుకోవడంతో పాఠశాలలో రోజుకు 4 గంటలకు మించి కరెంట్ ఉండటం లేదు. రాత్రి సమయంలో విద్యార్థినులు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో పాఠశాల చుట్టూప్రహరీలేకోవడంతో విద్యార్థినులకు రక్షణ కరువైంది. కోదాడ నియోజకవర్గంలో నడిగూడెం, మునగాల, మోతె మండల కేంద్రాల్లో కస్తూరిబా పాఠశాలలున్నాయి. మోతెలోని పాఠశాలకు నీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పనిచేయడంలేదు. పీఈటీ పోస్టు ఖాళీగా ఉంది. నడిగూడెం పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు నాలుగే మరుగుదొడ్లు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకుండా బయటనుంచి వచ్చిపోతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల మండలాలలో మూడు కస్తూరిబా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రధానంగా నీటికొరత తీవ్రంగా ఉంది. మిర్యాలగూడ పాఠశాలలో188 మంది, దామరచర్లలో 200, వేములపల్లిలో 180 మంది విద్యార్థినులు ఉన్నారు. దామరచర్లలో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ బోధించే ఉపాధ్యాయులు లేరు. వేములపల్లి పాఠశాలలో బోరులో సరిపడ నీరులేక విద్యార్థినులు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. కిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో 200 మందికి గాను 193 మంది ఉన్నారు. ఇక్కడ మౌలిక వసతులలేక తీవ్ర ఇబ్బందులు విద్యార్థినులు ఎదుర్కొంటున్నారు. ఇంగ్లీష్, జీవవాస్త్రం,భౌతికశాస్త్రం, తెలుగు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అద విధంగా కట్టంగూర్‌లోని విద్యాలయంలో లోఓల్టేజీ సమస్య ఉంది. అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. సూర్యాపేట పట్టణంలోని కస్తూరిబా పాఠశాల అద్దె భవనంలో నడుస్తోంది. చివ్వెంల మండల కేంద్రంలోని పాఠశాలకు రెగ్యులర్ ఎస్ఓ లేడు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు నోట్‌పుస్తకాలు, కాస్మోటిక్ బిల్లులు రాలేదు, పాఠశాలలో వేసిన స్కీంబోరు నుంచి వచ్చే ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాలలో అద్దె భవనంలో తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, మూత్రశాలలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నా వినియోగం లేవు. ుంగతుర్తి నియోజకవర్గంలో 6 కేజీబీవీలు ఉన్నాయి. తిరుమలగిరి, శాలిగౌరారం, నూతనకల్ పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈమూడు పాఠశాలలకు ప్రహరీలు లేక రక్షణ కరువైంది. నూతనకల్, అర్వపల్లిలలో సోషల్ సీఆర్టీలు, తిరుమలగిరిలో బయాలాజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా యూనిఫామ్స్ రావడం లేదు. సీఆర్టీలకు సరిగా వేతనాలు కూడా లేవు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల వసతి గృహంలో కృష్ణా మంచినీరు లేకపోవడం వల్ల ప్యూరిఫైడ్ నీటికి రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. మునుగోడులోని విద్యాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో రాత్రి సమయంలో విద్యార్థినులు భయం భయంతో ఉంటున్నారు. పాఠశాలల్లో సాంఘికశాస్త్రం, కంప్యూటర్ శిక్షకులు, క్రాఫ్ట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో ఇంగ్లీష్, కంప్యూటర్, పీఈటీ ఉపాధ్యాయుల లేరు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి.