Kerala State
-
మృత్యు ఘోష!
సాక్షి, అమరావతి: హెచ్ఐవీ బాధితుల మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో మన రాష్ట్రంలో 37,199 మంది మృతి చెందారు. అంటే సగటున రోజుకు 34 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలో లేదు. ఇదేదో సర్వే చేసి ఇచ్చిన నివేదిక కూడా కాదు. లోక్‌సభలో ఓ సభ్యుడి ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానమిది. గత ఐదేళ్లలో ఏపీశాక్స్ (ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి) జబ్బు నియంత్రణకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రణాళికా బద్ధంగా వ్యవహరించలేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏపీశాక్స్ నిర్వహణ దారుణంగా ఉంది. దీని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి లేకపోవడం, మందుల సరఫరా సరిగా లేకపోవడం తదితర కారణాల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ మంది బాధితులు మృతి చెందుతున్నారు. కౌన్సెలింగ్, స్క్రీనింగ్, టెస్టింగ్ పద్ధతులు పూర్తిగా గాలికొదిలేశారు. కొన్నిసార్లు ఏఆర్టీ (యాంటీ రిట్రో వైరల్) సెంటర్లలో బాధితులకు మందులు ఇవ్వడానికి కూడా అందుబాటులో లేని దారుణ పరిస్థితి ఉంటోందని బాధితులు వాపోతున్నారు. నియంత్రణలో దక్షిణాదిలో కేరళ భేష్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ఎయిడ్స్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలింది. హెచ్ఐవీ వ్యాధిపై అద్భుతంగా అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడంలో సఫలీకృతమయ్యారు. అందుకే కేరళలో తక్కువ మృతులు చోటు చేసుకున్నాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల మంది పైనే హెచ్ఐవీ బాధితులున్నట్టు అంచనా. అయితే రికార్డుల్లో 3.50 లక్షల మందే ఉన్నారు. వీరిలో ఏఆర్టీ సెంటర్లలో కేవలం 1.70 లక్షల మంది మాత్రమే మందులు తీసుకుంటున్నారు. చాలా మంది తమపై వివక్ష చూపుతున్నారన్న కారణంగా మందులకు రాలేకపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలికి ఉద్యోగులే బలం. ఈ శాఖలో 1200 మందిపైనే పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు వీరే చూస్తారు. అయితే గడిచిన ఐదేళ్లలో తమను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని, 15 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా పరిగణించడం లేదని వాపోతున్నారు. ఇలా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం పథకం అమలుపై ప్రభావం పడుతున్నట్లు ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
చేయి చేయి కలుపుదాం
కోసిగి (కర్నూలు): చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులను ఆదుకుందామని బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు రాముడు, నయకులు హొలగుంద కోసిగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోసిగిలో వరద బాధితుల సహాయార్థం వ్యాపార దుకాణాలు, ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేరళలో వరద ముంచుకొచ్చి ప్రజలు సర్వ కోల్పోయి నిరాశ్రులయ్యారు. విరాళాలు సేకరించిన వారిలో పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి లోకారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: కేరళలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరుపున విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు విశ్వనాథ్, నవీన్ నేతృత్వంలో మండల కేంద్రంలో పర్యటించి రూ.39వేలు సేకరించారు. ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో రఘు, జయలక్ష్మి, ఎల్లప్ప, అంజి, ప్రభుత్వ, రాఘవేంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కౌతాళం: మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి లింగన్న తెలిపారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వరదలతో నష్టపోయిన బాధితులకు విరాళాలు సేకరించామన్నారు. అలాగే కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ దూద్‌బాషా కుటుంబం కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రూ.12వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు దూద్ బాషా తెలిపారు. -
ముల్లైపెరియార్ 152 అడుగులు
సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కుల్ని తమిళనాడు కల్గి ఉన్న విష యం తెలిసిందే. ఈ హక్కుల్ని కాలరాయడం లక్ష్యంగా కేరళ తరచూ ఏదో ఒక కుట్ర చేస్తూ వస్తున్నది. ఈ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం వాస్తవానికి 152 అడుగులు. 36 ఏళ్ల క్రితం ఈ డ్యాం నీటి మట్టం 142 అడుగులకు తదుపరి, కేరళ కుట్ర పుణ్యమా నీటి మట్టం 136 అడుగులకు తగ్గింది. ఏళ్ల తరబడి రాష్ట్రంలో ని పాలకులు నీటి మట్టం పెంపు లక్ష్యం గా న్యాయ స్థానంలో పోరాడుతూనే వ చ్చారు. ఎట్టకేలకు 2014లో సుప్రీం కో ర్టు తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ను వెలువరించింది. ఆ డ్యాం నీటి మ ట్టం 142 అడుగులకు పెంచుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ కేరళ కుట్రలకు హద్దే లేదు. 152 అడుగులు : సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో, కేరళ కుట్రల్ని భగ్నం చేస్తూ నెలల తరబడి ఈ డ్యాం నీటి మట్టం పెంపు ప్రక్రియ సాగుతూ వచ్చింది. ఎట్టకేలకు 2014 నవంబర్ 14న డ్యాం నీటి మట్టం 142 అడుగులకు చేరడంతో ఆ డ్యాం నీటి ఆధారిత అన్నదాతల్లో ఆనందం తాండవం చేసింది. తమిళుల కల సాకారం కావడంతో, ఎక్కడ 152 అడుగులకు నీటి మట్టం పెంచాలన్న డిమాండ్ తెర మీదకు తెస్తారోనన్న బెంగతో మళ్లీ కుట్రల బాటలో కేరళ ప్రభుత్వం పయనించింది. అదే సమయంలో నీటి మట్టం 152 అడుగులకు చేరాల్సిందేనని ఆ డ్యాం నీటి ఆధారిత తేని, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, మదురై జిల్లాల్లోని అన్నదాతలు నినాదాన్ని అందుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయింది. డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయిలోకి చేర్చే దిశగా 152 అడుగుల నినాదంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చారు. అలాగే, కోర్టు ద్వారా ఓ వైపు నీటి మట్టం పెంపు ప్రయత్నాలు చేపడుతూనే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఇందుకు కేంద్ర నీటి పారుదల శాఖ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆ మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కూడిన ఐదుగురి బృందం మంగళవారం ముల్లై పెరియార్ డ్యాం పరిసరాల్లో పరిశీలన చేపట్టింది. ప్రధాన డ్యాం గేట్లను, బేబి డ్యాం, ప్రధాన డ్యాంలోకి నీళ్లు వచ్చే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా డ్యాం సామర్థ్యం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ బృందం కేంద్ర నీటి పారుదల శాఖ కు నివేదికను సమర్పించనుంది. తదుపరి చర్యల మేరకు నీటి మట్టం పెంపునకు కసరత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, నీటి మట్టం పెంపు లక్ష్యంగా వచ్చిన ప్రతిపాదనలో భాగంగా తమ పరిశీలన సాగిందని, ఇది తొలి విడత పర్యటన అని, మరో మారు ఇక్కడ పరిశీలనకు అవకాశాలు ఉన్నట్టు ఆ బృందం వర్గాలు పేర్కొన్నాయి. -
కల సాకారం
సాక్షి, చెన్నై: కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లైపెరియార్ డ్యామ్‌పై సర్వ హక్కుల్ని తమిళనాడు ప్రభుత్వం కలిగి ఉంది. ఈ నీటి మీద రాష్ట్రంలోని తేని, శివగంగై, రామనాథపురం, మదురై, విరుదునగర్ జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. ఆ హక్కుల్ని కాలరాయడమే లక్ష్యంగా కేరళ సర్కారు కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. ఈ క్రమంలో తరచూ రెండు రాష్ట్రాల సరిహద్దులో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన డ్యామ్ బలహీనంగా ఉందన్న కుంటి సాకుతో నీటి మట్టాన్ని క్రమంగా తగ్గించే పనిలో కేరళ సర్కారు పడింది. ఆ డ్యామ్ నీటి సామర్థ్యం తొలినాళ్లలో 152 అడుగులు. కేరళ కుట్రలతో 1979లో నీటి మట్టం 136 అడుగులకు తగ్గించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో పోరాటం చేస్తూనే ఉంది. ఎన్నో ఆందోళనలు, ఎన్నో పోరాటాలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ డ్యామ్ నీటి మట్టాన్ని 142 అడుగులకు పెంచుకునేలా ఆదేశించడం శుభ పరిణామం.రంగంలోకి కమిటీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ ఎల్ఏవీ నాథన్, తమిళనాడు ప్రభుత్వ ప్రజా పనుల శాఖ కార్యదర్శి సాయికుమార్, కేరళ నీటి పారుదల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కురియన్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం రంగంలోకి దించింది. ఈ కమిటీ నీటి మట్టం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. డ్యామ్ సామర్థ్యం, పటిష్టతను పూర్తిగా పరిశీలించిన ముల్లైపెరియార్ డ్యామ్ పర్యవేక్షణ కమిటీ కేరళ వేదికగా రెండుసార్లు సమావేశమైంది. చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ డ్యామ్‌ను పరిశీలించేందుకు కమిటీ చైర్మన్ ఎల్ఏవీ నాథన్ నిర్ణయించారు. ఆ మేరకు గురువారం ఉదయం ఇడిక్కి నుంచి బోటులో ముల్లై పెరియార్ డ్యామ్‌ను పూర్తిగా పరిశీలించారు. నీటి నిల్వ, గేట్ల పటిష్టత, డ్యామ్ పరిసరాల్లో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఇక మీదట చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. ఆ డ్యామ్ గేట్లను కిందకు పైకు దించుతూ, నీటి ఉద్ధృతిని పరిశీలించారు. చివరకు గేట్లను 136 అడుగుల నుంచి 146 అడుగులకు పెంచడం తమిళుల్లో ఆనందాన్ని రెకెత్తించింది. 36 ఏళ్లుగా సాగిన పోరాటానికి ఫలితం దక్కనుందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ గేట్లను 146 అడుగులకు చేర్చిన దృష్ట్యా నీటి నిల్వ ఆ మట్టానికి చేర్చే ఉత్తర్వులు ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. డ్యామ్‌ను పరిశీలించిన అనంతరం కుములి వేదికగా ఈ కమిటీ రాత్రి సమావేశం కాబోతోంది. ఈ సమావేశానంతరం నీటి పెంపుపై ఉత్తర్వులు వెలువడొచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అలాగే డ్యామ్ నీటి మట్టం పెంపు ఉత్తర్వులు వెలువడగానే అందుకు తగ్గ పనుల్ని రాష్ర్ట ప్రజా పనుల శాఖ సిద్ధం చేయడం విశేషం.