key bills
-
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సోమవారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. బిల్లులను పరిశీలిస్తే.. - తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు - తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు - తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు - తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు - తెలంగాణ వస్తు, సేవల పన్ను సవరణ బిల్లు - తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధృవీకరణ విధానం బిల్లు - తెలంగాణ న్యాయస్థానాల రుసుము, దావాల మదింపు సవరణ బిల్లు - తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి. -
ప్రతి అడుగు విప్లవాత్మకమే..
-
సువర్ణ చరిత్రకు మరో అడుగు
ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కీలక బిల్లులను ఆమోదించి రాష్ట్ర శాసనసభ సువర్ణాక్షరాలతో కొత్త చరిత్రను లిఖించింది.. ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ బడుగు, బలహీన వర్గాలు, ఇతరత్రా పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు శ్రీకారం చుట్టింది.. మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపింది.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. తదితర కీలక నిర్ణయాలకు నాంది పలికింది.. ఐదున్నర కోట్ల రాష్ట్ర ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా గత శాసనసభ సమావేశాల్లో 19 బిల్లుల ఆమోదంతో తొలి అడుగు వేసిన వైఎస్ జగన్ సర్కారు.. తాజాగా యావత్ ప్రపంచంలోని తెలుగు వారు ప్రశంసించేలా సోమవారం 16 బిల్లులకు ‘ఎస్’ అంటూ మలి అడుగు వేసింది. ప్రతి అడుగు విప్లవాత్మకమే.. ►ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఇవాళ మేము మరో విప్లవాత్మక బిల్లును తెస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రెండు కమిషన్లు తీసుకొస్తున్నాం. వారి అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, వారి సమస్యల మీద లోతుగా అధ్యయనం చేయాలని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనాలనే తపన, తాపత్రయంతో ఈ పని చేస్తున్నాం. ►ఇక ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రతి ఉద్యోగీ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ చరిత్రాత్మక నిర్ణయం వల్ల, ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుకుంటున్న, ఏ ప్రభుత్వం కూడా చేయడానికి ముందుకు రాని ఈ పని.. మా హయాంలో, మా ప్రభుత్వంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ►వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత వరుస సంవత్సరాలలో 7, 8, 9, 10 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నాం. నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌లో రాసేలా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు. ఆమోదం పొందిన ముఖ్యమైన బిల్లుల్లో కొన్ని ►పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన.. ధనిక, పేద అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి. ►ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. వారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. ►ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ల ఏర్పాటు ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించేందుకు రెండు కమిషన్ల ఏర్పాటు. ►మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.2 లక్షల జరిమానా.. రెండోసారి అయితే రూ.5 లక్షల జరిమానా. మద్యం ముట్టుకోవాలంటే షాక్ కొట్టాల్సిందే మేము అధికారంలోకి రాక ముందు 43 వేల బెల్టు షాపులుండేవి. వాటిలో ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశాం. పర్మిట్ రూమ్‌లను ఎత్తివేశాం. మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాం. అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు సైతం పెంచాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాల బోధన, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడం,మద్యం అక్రమ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు వంటి 16 చరిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ సమావేశాల్లోనే 19 విప్లవాత్మక బిల్లులను శాసనసభ ఆమోదించడం ద్వారా రికార్డు సృష్టించింది. సోమవారం శాసనసభ ఆమోదించిన ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 సవరణ బిల్లు ద్వారా వచ్చే విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఆరో తరగతి వరకు లక్షలాది మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడానికి బాటలు వేసింది. ఆ తర్వాత వరుస సంవత్సరాల్లో పదో తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియంలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు ఈ బిల్లు చుక్కానిలా నిలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునే బిల్లును ఆమోదించడం ద్వారా 51,488 మంది కార్మికుల స్వప్నం సాకారం చేసింది. ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం కోసం ఎస్సీ కమిషన్, ఎస్టీ వర్గాల ప్రజల హక్కులను పరిరక్షించడంతోపాటు ఆ వర్గాల ప్రజలకు మరింతగా ప్రయోజనం చేకూర్చడం కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు వీలుగా శాసనసభ బిల్లులను ఆమోదించింది. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగకుండా నియంత్రించడం.. ప్రజలందరికీ వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం కోసం చిరుధాన్యాలు, పప్పుధాన్యాల బోర్డుల ఏర్పాటుకు వీలుగా వేర్వేరు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర శాసనసభలో ఒక్క రోజే 16 కీలక బిల్లులు.. మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం పొందిన బిల్లులు.. వాటి ఉద్దేశాలు ►బిల్లు : ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 సవరణ ఉద్దేశం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం. ►బిల్లు: ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఉద్దేశం: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం. ►బిల్లు : ఎస్సీ కమిషన్ ఉద్దేశం: ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. ►బిల్లు : ఎస్టీ కమిషన్ ఉద్దేశం: ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం. ►బిల్లు : చిరుధాన్యాల(మిల్లెట్స్) బోర్డు ఏర్పాటు ఉద్దేశం: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. ►బిల్లు: పప్పుధాన్యాల(పల్సస్) బోర్డు ఏర్పాటు ఉద్దేశం: పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ మద్యనిషేధ చట్టం–1995కు సవరణ ఉద్దేశం: అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ ఉద్దేశం: బార్లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్ ఫీజుకు రెండు రెట్లు జరిమానా.. రెండోసారి పాల్పడితే బార్ లైసెన్స్ రద్దు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు. ►బిల్లు: కర్నూలులో క్లస్టర్ యునివర్సిటీ ఏర్పాటు ఉద్దేశం: కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా నాణ్యమైన విద్యను అందించడం. ►బిల్లు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ ఉద్దేశం: వైఎస్సార్ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు ఉద్దేశం: విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్/ప్రతినిధి ఎక్స్–అఫీషియో సభ్యునిగా నియామకం. ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు ఉద్దేశం: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు ►బిల్లు: ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు ఉద్దేశం: సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం. ఇతర బిల్లులు ►ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019 ►ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019 ►ఏపీ మున్సిపల్ చట్టం సవరణ బిల్లు–2019 చదవండి: మరో అల్లూరి.. సీఎం జగన్ చదవండి: ఎస్సీ, ఎస్టీలకుద్రోహం చేయలేదా? -
మరో ముందడుగు
-
నేడు అసెంబ్లీలో 11 కీలక బిల్లులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రత్యేకంగా వేర్వేరు బోర్డుల ఏర్పాటు, మద్యం అక్రమాలపై కఠిన చర్యలతో పాటు పలు రంగాలకు చెందిన 11 కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులపై సోమవారం సభలో చర్చించి ఆమోదించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కోసం కొత్త చట్టం ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ‘అబ్జార‡్ష్పన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీసు యాక్ట్–2019’ బిల్లును రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి, ఆర్టీసీ ఉద్యోగులందరినీఈ శాఖ కిందకు తీసుకొస్తారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. మద్దతు ధర కోసం చిరు, పప్పు ధాన్యాల బోర్డులు రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు మెరుగైన ధరలు కల్పించడమే లక్ష్యంగా కాఫీ, టీ బోర్డుల తరహాలోనే చిరు, పప్పు ధాన్యాల బోర్డులను (వేర్వేరుగా) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బిల్లుప్రవేశపెట్టనుంది. ప్రధానంగా చిరు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, ఆ పంటలకు మద్దతు ధర కల్పించడం ఈ బోర్డుల ఏర్పాటు లక్ష్యం. ఈ బోర్డుల్లో చైర్మన్‌తో పాటు సీఈవో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. పరిశోధన విస్తరణ విభాగం, మార్కెట్ ఇంటలిజెన్స్, ట్రేడ్ ప్రమోషన్, గోదాములు, శీతల గిడ్డంగులు, యాంత్రికీకరణ విభాగం, మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ విభాగాలకు చెందిన నిపుణులను డైరెక్టర్లుగా నియమిస్తారు. ఈ బోర్డులు స్వయం ప్రతిపత్తితో పని చేస్తాయి. చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహకం, నాణ్యమైన దిగుబడులు సాధించడం, ఆ ఉత్పత్తుల విలువ పెంచేలా (విలువ జోడించడం) ప్రాసెసింగ్ చేయడం, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడమే ఈ బోర్డుల ఉద్దేశం. వివిధ మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోనున్నారు. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, అగ్రివాచ్‌తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్ ఇంటలిజెన్సీ కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్ ధరలు, బిజినెస్ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఏజెన్సీ చూస్తుంది. ఏ ఏ పంటలు వేయాలనే ప్రణాళికను ఈ బోర్డులు రూపొందిస్తాయి. ఇన్సూరెన్స్, వ్యవసాయ యాంత్రికీకరణ, మార్కెటింగ్, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ప్రణాళికా విభాగాలు ఈ బోర్డుల్లో పనిచేస్తాయి. అవసరమైన సమయంలో మార్కెట్లో రైతులకు మెరుగైన ధరలు లభించని పక్షంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని వినియోగిస్తారు. పంటల ప్రణాళిక నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు ఈ బోర్డులు స్వతంత్రంగా పనిచేయనున్నాయి. అవసరమైన మౌలిక వసతుల కల్పన, పరిశోధన, స్టోరేజీ, ప్రాసెసింగ్, మార్కెట్ ఇంటలిజెన్స్‌కు అవసరమైన ప్రణాళికలను రూపొందించనున్నాయి. అక్రమ మద్యం విక్రయం, రవాణపై ఇక ఉక్కుపాదమే దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్యం దుకాణాలను, బార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. కనీసం 6 నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, మొదటిసారి పట్టుబడితే రూ.2 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే రూ.5 లక్షల జరిమానా విధిస్తారు. బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేసేలా ఎక్సైజ్ చట్టంలో సవరణలకు బిల్లును నేడు ప్రవేశపెడతారు. ఈ అంశాలపై కూడా బిల్లులు.. ►మద్యం ముట్టుకుంటే షాక్ తగిలేలా అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎక్సైజ్ చట్టంలో సవరణలు. ► వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటుకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చట్టంలో సవరణ. ► కర్నూలులో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీల చట్టంలో సవరణ. ►ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తిని అన్ని యూనివర్సిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టంలో సవరణ. ►ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టంలో సవరణ. ► ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ చట్టంలో సవరణ. ►ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21–ఎ (1) (ఇ) సవరణ. -
ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులు
సాక్షి, అమరావతి: 12వ రోజు సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లోకాయుక్త సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సవరణ బిల్లును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రవేశపెట్టారు. మార్కెట్ కమిటీ సవరణ బిల్లును మంత్రి మోపిదేవి వెంకటరమణ సభ ముందుకు తీసుకొచ్చారు. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక నిర్వహక అథారిటీ (ఏపీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ) బిల్లు 2019ను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, నిర్వహణ కమిషన్ బిల్లు, ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, నిర్వహణ బిల్లును విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై చర్చ అనంతరం ఏపీ శాసనసభ వీటిని ఆమోదించనుంది. అవినీతిరహితంగా టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టేందుకు, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జ్ అద్వర్యంలో టెండర్ల పరిశీలన చేపట్టనున్నారు. రూ. 100 కోట్ల పైబడిన ప్రాజెక్టులు ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. -
టీడీపీ రాద్ధాంతంపై సీఎం ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చరిత్రాత్మకమైన బిల్లులను ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పిస్తూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ. ఇక, నామినేషన్ పనుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తీసుకువచ్చిన కీలక బిల్లులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సభ ముందు ఉంచింది. పరిశ్రమల్లోని 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ.. ప్రతిపాదించిన బిల్లును మంత్రి గుమ్మనూరు జయరామ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయించాలని ప్రతిపాదించిన బిల్లును మంత్రి మంత్రి శంకర్ నారాయణ సభ ముందు ఉంచారు. దీంతోపాటు నామినేషన్ పనుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ.. ప్రతిపాదించిన బిల్లులను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూలేనివిధంగా అవకాశాలను కల్పించే దిశగా, మహిళలకు సమాన అవకాశాలు కల్పించేవిధంగా ఈ చరిత్రాత్మక బిల్లులను వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు మేలు చేకూర్చే బిల్లులను అడ్డుకోవాలని ప్రతిపక్షం చూస్తోందని, సభలో చరిత్రాత్మక బిల్లులను టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా? అని ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని నిలదీశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలే శిక్షిస్తారని తేల్చి చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సమాన అవకాశం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు చరిత్రలో ఎప్పుడూ కల్పించలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక, స్టేట్మెంట్ ఎక్కడైనా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, దానికి క్లారిఫికేషన్ మాత్రమే ప్రతిపక్ష అడుగుతుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రాత్మకం.. విప్లవాత్మకం! ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో వారికి 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వారికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గత శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ చరిత్రాత్మక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘దేశ, రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం’ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. దేశ,రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 -
తెలంగాణ అసెంబ్లీలో కీలకబిల్లులు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చట్టసవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ చట్ట సవరణ బిల్లు, యూనివర్సిటీల కులపతులు, ఉపకులపతుల నియామకాన్ని ప్రభుత్వమే చేపట్టేలా చట్టసవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. -
తెలంగాణ అసెంబ్లీలో రేపు కీలక బిల్లులు..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రేపు (సోమవారం) కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆ రోజు ఉదయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అమెన్మెంట్ బిల్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ అమెన్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ అమెన్మెంట్ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల అమెన్మెంట్ బిల్లు, తెలంగాణ వ్యాట్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడైంది. -
నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు