Kidney rocket
-
కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ మూలాలను రాచకొండ పోలీసులు ఛేదించారు. సరూర్‌నగర్‌లోని అలకనంద, మాదన్నపేటలోని జనని, అరుణ ఆసుపత్రులలో అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఒక్కో కిడ్నీ మార్పి డికి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేస్తున్న ఈ గ్యాంగ్.. గత రెండేళ్లలో నగరంలో 50కి పైగా కిడ్నీ మార్పిడులు చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠాలోని 9 మందిని అరెస్టు చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సు«దీర్ బాబు శనివారం మీడియాకు వెల్లడించారు. ఆర్థిక కష్టాలతో పక్కదారి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సిద్ధంశెట్టి అవినాశ్ 2022లో సైదాబాద్‌లోని మాదన్నపేట రోడ్లో ఉన్న జనని, అరుణ ఆసుపత్రులను కొనుగోలు చేసి కొంతకాలం నడిపించాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా విక్రయించాలని భావించాడు. ఆ సమయంలో విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అవినాశ్‌ను సంప్రదించి, ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించాడు. ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రతిపాదనకు అంగీకరించిన అవినాశ్ జనని, అరుణ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 2023 నుంచి 2024 జూన్ వరకు అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ దందాలో వైజాగ్‌కు చెందిన పవన్ అలియాస్ లియోన్, పూర్ణ అలియాస్ అభిషేక్‌లు కీలక పాత్ర పోషించారు. వీరు తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్, జమ్మూకశ్మీర్‌కు చెందిన డాక్టర్ సోహిబ్తోపాటు నల్లగొండకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీశ్, పొదిల సాయి, తమిళనాడుకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు శంకర్, ప్రదీప్, కర్ణాటకకు చెందిన సూరజ్‌లను కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారు. ఒక్కో కిడ్నీ రూ.60 లక్షలు.. ఈ ముఠా ఒక్కో కిడ్నీకి రూ.60 లక్షల చొప్పున గ్రహీత నుంచి వసూలు చేసేది. ఇందులో కిడ్నీ దాతకు రూ.5 లక్షలు, అవినాశ్‌కు రూ.2.5 లక్షలు, ప్రధాన సర్జన్‌కు రూ.10 లక్షలు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లకు రూ.30 వేల చొప్పున ముట్టజెప్పేవారు. మిగిలిన రూ.42 లక్షలను లక్ష్మణ్, పవన్, పూర్ణ, అభిషేక్‌లు పంచుకునేవారు. శస్త్ర చికిత్స చేసే సర్జన్‌ను తమిళనాడు, జమ్మూకశ్మీర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచి్చ, స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసేవారు. అలకానందకు ఆపరేషన్ల మార్పు జనని, అరుణ ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి దందా కు బ్రేక్ ఇద్దామని భావించిన డాక్టర్ అవినాశ్.. గతే డాది జూలైలో సరూర్‌నగర్‌లోని అలకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్ గుంటుపల్లి సుమంత్‌ను సంప్ర దించి, దందా గురించి తెలిపాడు. అతడు అంగీకరించటంతో అలకానందలో గతేడాది డిసెంబర్ నుంచి దాదాపు 20 అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికి త్సలు నిర్వహించారు. ప్రతీ సర్జరీకి సుమంత్‌కు రూ.1.5 లక్షలు కమీషన్‌గా అందేవి. విశ్వసనీయ స మాచారం అందడంతో ఈ నెల 21న రంగారెడ్డి జి ల్లా వైద్యాధికారులతో కలిసి పోలీసులు అలకానంద ఆసుపత్రిపై దాడిచేసి దందా గుట్టను రట్టు చేశా రు. తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నస్రీన్ బా ను అలియాస్, ఫిర్దోష్, కర్ణాటకకు చెందిన గ్రహీ త లు బీఎస్ రాజశేఖర్, భట్ ప్రభలను అదుపులోకి తీ సుకున్నారు. ఈ నెల 23న డాక్టర్ సుమంత్, రిసెప్షనిస్ట్ నర్సగాని గోపిలను అరెస్టు చేశారు. తాజాగా డాక్టర్ అవినాశ్, ప్రదీప్, రవి, రవీందర్, హరీశ్, సా యి, సూరజ్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నా రు. సర్జన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సోహిబ్, దళారులు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లు పరారీలో ఉన్నారు. జీవన్‌దాన్ దాతల జాబితా లీక్ అవయవదానానికి సంబంధించిన సేవలు నిర్వహిస్తున్న జీవన్‌దాన్ సంస్థ డేటా లీక్ కావటమే కిడ్నీ దందాకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పవన్, లక్ష్మణ్‌లు దాతలు, గ్రహీతల వివరాలను అక్రమ మార్గంలో సేకరించి ఈ దందా నిర్వహించినట్లు గుర్తించారు. వారు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నా యి. గతంలో ఈ ముఠా శ్రీలంకలో కూడా కిడ్నీ మార్పిడి దందా చేసిందని అనుమానిస్తున్నారు. -
అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ దందా
-
బెజవాడలో కిడ్నీ రాకెట్ కలకలం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): గుంటూరులో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ మూలాలు బెజవాడలోనే ఉన్నట్టు తేలడం కలవరం సృష్టిస్తోంది. ఆరి్థక ఇబ్బందుల్లో ఉన్న వారికి డబ్బు ఆశ చూపి కిడ్నీ రాకెట్ నడుపుతున్నారు. అందుకోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నారు. నగరంలో జరిగిన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయంటున్నారు. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన 31 ఏళ్ల గార్లపాటి మధుబాబుకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బాషా అనే వ్యక్తి కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికాడు. వెంకట్ అనే మరో మధ్యవర్తిని పరిచయం చేసి మధుబాబును విజయవాడ రప్పించారు. జూన్ 10న అతడిని బెజవాడలోని ఓ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి.. 15వ తేదీన శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ కాజేశారు. రూ.30 లక్షలు ఇస్తామని.. కేవలం రూ.1,09,500 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని బాధితుడు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన విదితమే. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఇదే తరహాలో మరో ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్టు బాధితుడు ఆరోపించారు. గతంలోనూ ఇదే తీరు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం దొంగ పత్రాలు సృష్టించేందుకు విజయవాడలోని భవానీపురం తహసీల్దారుకు ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. తహసీల్దారు తిరస్కరించారు. అవి తప్పుడు ధ్రువీకరణ పత్రాలుగా నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం ఏలూరుకు చెందిన బాధితుడు తన కిడ్నీ తీసుకుని.. డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారంటూ ఏడాది కిందట అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బీఆర్టీఎస్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో తనకు డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్నానని, ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదని మరో బాధితుడు ఏడాదిన్నర క్రితం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. వైద్యులు అతనికి డబ్బులిచ్చి అల్లరి కాకుండా కప్పిపుచ్చారు.విచారిస్తే అనేకం వెలుగులోకి నగరంలో జరుగుతున్న కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలపై విచారణ జరిపితే మరిన్ని కేసులు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ రాకెట్ వెనుక కొందరు ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యశాఖ ఉన్నతాధికారులు దృష్టి పెడితే అనేక అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. రోగి ఎవరు, కిడ్నీ దాత ఎవరూ అనేది క్షేత్రస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు: డీఎస్పీగుంటూరు ఈస్ట్: కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబును నగరంపాలెం పోలీసుస్టేషన్లో వెస్ట్ డీఎస్పీ మహేశ్ మంగళవారం విచారించారు. అనంతరం మధుబాబు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు. డీఎస్పీ మహేశ్ మాట్లాడుతూ కిడ్నీ రాకెట్ కేసు త్వరితగతిన ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని మధుబాబు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరించామని, దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో కేసును ట్రాన్స్ఫర్ చేయాలా, లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులను సంప్రదించి, తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
మళ్లీ వెలుగులోకి వస్తోన్న కిడ్నీ రాకెట్ వ్యవహారాలు
-
విశాఖలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
-
టీడీపీ నేత విజయకుమార్ అరెస్టు
సాక్షి, నరసరావుపేట టౌన్: సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్ కేసులో నరసరావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత కపలవాయి విజయకుమార్‌ను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు చంద్రమౌళీనగర్‌కు చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017లో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. కిడ్నీ మార్పిడికి దాతను చూసుకోవాలని వైద్యులు సూచించడంతో దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన ముఢావత్ వెంకటేశ్వర్లు నాయక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నరసరావుపేటకి చెందిన రావూరి రవి అనే వ్యక్తి ఆధార్‌కార్డుపై వెంకటేశ్వర్లు నాయక్ ఫొటోను మార్ఫింగ్ చేసి గతేడాది అక్టోబరు నెలలో నరసరావుపేట రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు పొందారు. పోలీసుల అనుమతి కోసం వెళ్లగా బార్‌కోడింగ్ ఆధారంగా నకిలీ ఆధార్‌కార్డుగా గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అప్పటి తహసీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి 2017 నవంబరు 20వ తేదీన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం కిడ్నీ మార్పిడి అనుమతులకు కపలవాయి విజయకుమార్ సిఫారసు చేశాడని తహసీల్దార్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటంతో విజయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు విచారణలో ముడావత్ వెంకటేశ్వర్లునాయక్ తనను బెదిరించి కిడ్నీ మార్పిడికి ఒప్పించారని తెలపడంతో కేసును అట్రాసిటీ కేసుగా మార్పు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తొమ్మిదో నిందితుడయిన విజయకుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో సబ్‌జైలుకు తరలించారు. ఆరోగ్యపరిస్థితి బాగోలేదని జైలు అధికారులకు తెలపడంతో వైద్య పరీక్షలకోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. బంగారం, వెండి వర్తకసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కపలవాయి విజయకుమార్ నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతగా చలామణి అవుతున్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ పట్టణంలోని బంగారం వ్యాపారులంతా దుకాణాలను మూసివేసి సంఘీభావం తెలిపారు. -
మధ్యవర్తుల మీదకు కథ మళ్లింది..!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నరసరావుపేట కేంద్రంగా నిర్వహించిన ఈ అక్రమ దందాలో పాలుపంచుకున్న రెవెన్యూ అ«ధికారులను కేసు నుంచి బయటవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి, అనేక కీలక అంశాలను రాబట్టినట్లు తెలియవచ్చింది. తహసీల్దార్ కార్యాలయ అధికారి, సిబ్బంది సహాయంతోనే ఈ కిడ్నీ రాకెట్‌కు బీజం వేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపమో లేక రాజకీయ ఒత్తిడో తెలియదుకాని అసలు మూలకారకులైన రెవెన్యూ యంత్రాంగం జోలికి వెళ్లకుండా మధ్యవర్తులను మాత్రమే నిందితులుగా చూపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నరసరావుపేటటౌన్ :కిడ్నీ రాకెట్ కేసులో అక్రమ పద్ధతిలో సర్టిఫికెట్లు మంజూరే చేసి అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ అధికారులపై అటు ఆ శాఖ ఉన్నతా«ధికారులు, ఇటు పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేని బంధుత్వాన్ని ఉన్నట్లుగా చూపి అక్రమ పద్ధతిలో కిడ్నీ మార్పిడికి అనుమతులు పొందడం...దీనికి నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వెన్నుదన్నుగా నిలవడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం శాఖాపరమైన విచారణ చేపట్టకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. దుర్గికి చెందిన ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్ నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన రవికుమార్‌గా ఆధార్‌కార్డు పేరు మార్చి కిడ్నీ మార్పిడికి రెవెన్యూ శాఖ ద్వారా అనుమతులు పొందాడు. పోలీస్ విచారణలో నకిలీ ఆధార్‌కార్డు బాగోతం బయటపడటంతో ఈ వ్యవహారం ఎక్కడ తమమెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఒక వెంకటేశ్వర్లు నాయక్ సర్టిఫికెట్తో రెవెన్యూ అక్రమ సర్టిఫికెట్ల మంజూరు ఆగలేదు. విచారణలో మరో మూడు కిడ్నీ మార్పిడి సర్టిఫికెట్లు అక్రమ పద్ధతిలో జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో దళారులతో రెవెన్యూ అధికారులు చేతులు కలిపి అక్రమ సర్టిఫికెట్ల మంజూరుకు తెరలేపిన విషయం బహిరంగ రహస్యమే. దళారి చేతికి సర్టిఫికెట్స్‌తో బహిర్గతమైన అవినీతి.. కిడ్నీ మార్పిడికి సంబంధించి గతేడాది 9వ నెల నుంచి 11వ నెల వ్యవధిలో తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఐదు సర్టిఫికెట్లు మంజూరు చేశారు. వాటిలో కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పారిశ్రామిక వేత్త కారు డ్రైవర్ నాగమల్లేశ్వరరావు స్వయంగా సంతకం చేసి మూడు సర్టిఫికెట్లను కార్యాలయంలో పొందాడు. వెంకటేశ్వర్లు నాయక్ ఆధార్‌కార్డు మార్చిన విధంగానే మిగిలిన రెండు కిడ్నీ మార్పిడి వ్యవహారాల్లో రోగికి, దాతకు మధ్య లేని బంధుత్వాన్ని చిత్రీకరించేందుకు ఆధార్, రెసిడెన్స్ సృష్టించి అనుమతి çపత్రాలు పొందాడు. ప్రతి పనికి ఒక రేటుతో చక్కబెడుతున్న రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంలో కూడా భారీస్థాయిలో ముడుపులు తీసుకొని అక్రమ సర్టిఫికెట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న నాగమల్లేశ్వరరావు ఎవరెవరికి ఎంత ముట్టజెప్పింది విచారణలో కక్కాడు. దీంతో కంగుతిన్న అవినీతి అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తమపై చర్యలు లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దుకొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కిడ్నీ దందాలో రెవెన్యూ పాత్ర కీలకం కిడ్నీ మార్పిడి వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి అడ్డదిడ్డంగా సర్టిఫికెట్లు మంజూరు చేయడంతో కిడ్నీ రాకెట్ పురుడుపోసుకుంటుంది. సర్టిఫికెట్ల ప్రారంభ దశలో అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తే ఈ అక్రమానికి ఆస్కారం ఉండదనేది వాస్తవం. అయితే ఒక్క నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ సర్టిఫికెట్ల మంజూరు పత్రాలు పొందడం ఇక్కడి అధికారులకు, దళారులకు మధ్య ఉన్న సత్సంబంధాలను చాటుతుంది. చిన్నచిన్న తప్పిదాలపై ఉక్కుపాదం మోపే ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అవినీతి రెవెన్యూ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అంతుచిక్కడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొన్ని గంటల్లో కోర్టుకు హాజరు కిడ్నీ రాకెట్ కేసులో వెంకటేశ్వర్లు నాయక్, నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో పాటు తెనాలిలో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. మొత్తం ఏడు కిడ్నీ మార్పిడిలకు అనుమతులు తీసుకోవడంతో పాటు దాతలకు ఇప్పించినట్లు సమాచారాన్ని సేకరించారు. అయితే కిడ్నీ మార్పిడిలో డబ్బులు చేతులు మారినందుకు దాత, తీసుకున్న వ్యక్తులను కూడా ముద్దాయిలుగా చేర్చాలా, వద్దా అన్న సందిగ్ధంలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారులను విచారించక పోవడం వెనుక రాజకీయ ఒత్తిడి దాగుందన్న అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల వ్యవధిలో నిందితులను కోర్టుకు హాజరుపరుస్తుండటంతో ఇప్పటిదాకా అనేక మలుపులు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది. -
కిడ్నీ రాకెట్‌పై ఎమ్మార్వో వివరణ
-
నకిలీ సర్టిఫికెట్లపై ఎమ్మార్వో వివరణ
గుంటూరు జిల్లా : కిడ్నీ మార్పిడి కోసం వెంకటేశ్వర నాయక్‌ను వేదాంత ఆసుపత్రి యాజమాన్యం రిఫర్ చేసిందని నరసరావుపేట ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి తెలిపారు. గుంటూరు, నరసరావుపేటల్లో కిడ్నీ రాకెట్ వెలుగులోకి రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నేత కపిలవాయి విజయకుమార్ తనకు ఫోన్ చేశారని, వెంటేశ్వర నాయక్ తమ వాడే త్వరగా సర్టిఫికెట్ ఇవ్వమని తనతో చెప్పినట్లు వెల్లడించారు. వెంకటశ్వరనాయక్ సర్టిఫికేట్లు పోలీసు వెరిఫికేషన్‌లో నకిలీవని తేలిందని, వెంకటేశ్వర నాయక్‌ని పిలిచి విచారించామని చెప్పారు. కిడ్నీ ఇస్తే తనకున్న అప్పులు తీర్చేస్తామని చెప్పినందుకే తాను కిడ్నీ ఇస్తున్నానని వెంకటేశ్వర నాయక్ చెప్పారని వివరించారు. తన పైన కేసు పెడతామని చెప్పటంతో నాయక్ పారిపోయాడని చెప్పారు. -
గుంటూరులో కిడ్నీ రాకెట్ కలకలం
-
గుంటూరులో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
గుంటూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు అయింది. ఆధార్ కార్డులో ఫోటో మార్చి రోగి బంధువుగా చూపించి కిడ్నీల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఓ డాక్టరే ఈ రాకెట్ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా ఈ దందా నడుస్తోన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే మూడు కిడ్నీలు కొనుగోలు చేసినట్లు బయటపడింది. నాలుగో కిడ్నీ కొనుగోలు విషయంలో తేడా రావటంతో విషయం బయటికి పొక్కింది. ఈ విషయం గురించి గతంలోనే నరసరావుపేట తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేదాంత ఆసుపత్రి ఎండీ వివరణ కిడ్నీ మార్పిడి తమ ఆసుపత్రిలో జరగలేదని వేదాంత ఆసుపత్రి ఎండీ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ అవసరమని ప్రభుత్వానికి తామే రిఫర్ చేశామని, కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చిన వెంకటేశ్వర్ నాయక్‌ను శివ నాగేశ్వరరావు బంధువులే తీసుకువచ్చారని రాధాకృష్ణ చెప్పారు. ఐదు రోజుల క్రితం విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందని వెల్లడించారు. ఈ కిడ్నీరాకెట్‌కు తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. -
నా కిడ్నీ అమ్మాలి.. ఎలా?
ఆర్థికపరమైన కష్టనష్టాల వల్లో, కుటుంబ సమస్యల కారణంగానో.. మరేదైనా ఇబ్బంది ఉందో గానీ కిడ్నీలు అమ్ముకోడానికి మన దేశంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే అది ఎలాగో వారికి అర్థం కావడం లేదు. అందుకే, దాదాపు రెండు దశాబ్దాలుగా అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ మోహన్ ఫౌండేషన్‌ను ఈ ప్రశ్నతో ముంచెత్తుతున్నారు. తమ ఫేస్బుక్ పేజిలోను, ఈమెయిల్‌కు, టోల్‌ఫ్రీ నంబర్లకు పదే పదే చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారని ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ సునీల్ ష్రాఫ్ చెప్పారు. తమ సోషల్ సైట్లలో వచ్చే ఈ ప్రశ్నలను తొలగించడానికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏవైనా ఖరీదైన వస్తువులు కొనుక్కోడానికి డబ్బు కోసం అమ్మడానికి సిద్ధంగా ఉన్న వస్తువుల్లో కిడ్నీ ఒకటన్నది వాళ్ల భావన అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. అలా అమ్మడం చట్టవిరుద్ధమన్న సంగతి వాళ్లకు తెలియకపోవచ్చని తెలిపారు. మానవ శరీర అవయవాలను ఎవరైనా అమ్మినా.. కొన్నా కోటి రూపాయల వరకు జరిమానా, పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ఓ వ్యక్తి ఒక వెబ్సైట్లో ''నా పేరు గణేశ్. నాకు పాస్‌పోర్టు కూడా ఉంది. నా ఏబీ పాజిటివ్ కిడ్నీ అమ్ముతాను. నేను సిగరెట్లు కాల్చను, మద్యం తాగను. ఆసక్తిగల వారు ఫోన్ చేయండి'' అని పోస్ట్ చేశాడు. విచిత్రం ఏమిటంటే, దానికి ముగ్గురు వ్యక్తులు స్పందించారు కూడా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమ కిడ్నీని రూ. 9 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ధరకు అమ్ముతున్నారట. విపరీతమైన పేదరికం కూడా ఇందుకు కారణం అవుతోంది. ముంబైలోని ఎల్‌హెచ్ హీరానందాని ఆస్పత్రిలో జూలై 14 నుంచి ఇప్పటివరకు ఐదుగురు డాక్టర్లు, తొమ్మిది మంది ఇతరులు అరెస్టయ్యారు. వీళ్లంతా కిడ్నీ రాకెట్లో సభ్యులే. భారతదేశంలో తొలిసారిగా డాక్టర్లు, మధ్యవర్తులతో పాటు దాత, గ్రహీత కూడా అరెస్టయ్యారని డాక్టర్ ష్రాఫ్ చెప్పారు. అవయవ దానానికి సంబంధించిన నిబంధనల గురించి చాలామంది డాక్టర్లకు కూడా సరిగా తెలియదట. దీంతో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. -
కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
నిడదవోలు (పశ్చిమ గోదావరి): అమెరికాలో ఉన్నత వర్గాల వారి ఇళ్లల్లో పని చేసేందుకు మహిళలు కావాలంటూ నమ్మబలికారు. వారి ఉచ్చులో పడిన సరూర్‌నగర్ మండలం జల్లెడగూడ గ్రామానికి చెందిన రజితను అమెరికాకు బదులుగా మస్కట్ పంపించారు. ఆమెను అక్కడి ఆసుపత్రిలో చేర్చి కిడ్నీలు తొలగించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆ మహిళ అక్కడి వైద్యుల నుంచి తప్పించుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కొందరి సాయంతో సురక్షితంగా హైదరాబాద్ చేరింది. అనంతరం రంగారెడ్డి జిల్లా నూర్పేట పోలీసుల్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించే పనిలో పడ్డారు. రజిత అనే మహిళను మస్కట్ పంపించడానికి మధ్యవర్తిత్వం నెరిపిన వ్యక్తి సాయంతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మోదేకుర్రు గ్రామానికి చెందిన బుట్టా శ్రీనివాస్ అనే ఏజెంట్‌కు వలవేశారు. విమాన చార్జీల నిమిత్తం బాధితురాలు చెల్లించాల్సిన సొమ్ము తీసుకునేందుకు రావాల్సిందిగా ఏజెంట్‌కు ఫోన్లో సమాచారం ఇప్పించారు. ఆ సొమ్మును శనివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు తీసుకొచ్చి ఇవ్వాలని కోరిన ఏజెంట్ శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన తన స్నేహితుడు యడ్ల సత్యతో కలసి మోటార్ సైకిల్‌పై నిడదవోలు చేరుకున్నాడు. అప్పటికే మధ్యవర్తిని వెంటబెట్టుకుని నిడదవోలులో మాటువేసిన నూర్పేట క్రైం బ్రాంచ్ ఎస్సై ఎస్.రామకృష్ణ, సిబ్బంది కలసి ఏజెంట్ బుట్టా శ్రీనివాస్, అతని స్నేహితుడు సత్యను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. -
కిడ్నీ రాకెట్లో మరొకరి అరెస్ట్
-
'కిడ్నీ రాకెట్' పై త్వరలోనే నివేదిక: దుగ్గల్
నల్లగొండ: సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేస్తామని జిల్లా ఎస్పీ దుగ్గల్ తెలిపారు. నల్లగొండలో ఆయన శుక్రవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో నిందితుడుగా ఉన్న సురేష్ ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు డబ్బుల కోసం శ్రీలంకలో కిడ్నీలు అమ్ముకుంటున్న ఘటన ఇటీవలే వెలుగుచూసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నీ రాకెట్ ఉదంతంలో శ్రీలంకలో నాలుగు ఆస్పత్రులు, ఆరుగురు డాక్టర్లకు కిడ్నీ అక్రమ ట్రాన్స్ ప్లాంటేషన్ల పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. మధ్యప్రదేశ్ లో మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ దుగ్గల్ సాక్షి మీడియాకు తెలిపారు. శ్రీలకం ప్రభుత్వం కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్లను నిలిపివేయడాన్ని అభినందించారు. ప్రభుత్వం అనుమతిస్తే శ్రీలంకలో కూడా విచారణ జరపడానికి సిద్ధమని ఎస్పీ వివరించారు. -
కిడ్నీ రాకెట్లో మరో ఇద్దరి అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌కు సంబంధించి మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కిడ్నీ రాకెట్లో 16 మంది నిందితుల్లో నలుగురిని మొన్ననే పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎద్దుల మైలారం గ్రామానికి చెందిన నక్కా శివరాజ్‌గౌడ్, హైదరాబాద్ చాంద్రాయణ గుట్టకు చెందిన ముహమ్మద్ వసియుద్ధీన్ను నల్గొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. -
కిడ్నీ రాకెట్లో దిమ్మతిరిగే వాస్తవాలు
-కొలంబోలోని మూడు ఆస్పత్రుల్లో నెట్వర్క్ -ఒక్కో కిడ్నీకి రూ.25 లక్షలు - ఖర్చు పోనూ దాతకు ఇచ్చేది రూ. 5లక్షలు - రాకెట్ ఏజెంట్‌తో సహా ముగ్గురు బాధితుల అరెస్టు - కారు, ఏటీఎం కార్డు, పాస్‌పోర్టుల స్వాధీనం - సాక్షి కథనాలతో వెలుగులోకి.. నల్లగొండ: నల్లగొండ జిల్లా కిడ్నీ రాకెట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటర్ నెట్ ద్వారా అమాయకులకు ఎరవేసి జాతీయస్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న విషయాన్ని సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి వచ్చింది. ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో సురేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, బెంగాల్లో నలుగురు, హైదరాబాద్‌లో నలుగురు, తమిళనాడులో ఇద్దరు, ముంబైలో ఒక్కరు, న్యూఢిల్లీలో ఒక్కరు చొప్పున కిడ్నీలను అమ్మించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపారు. నల్లగొండలోని ఏజెంటు కస్పరాజు సురేష్ (22) తన కిడ్నీని అమ్ముకుని ఏజెంటుగా మారి 15 మంది కిడ్నీలను వివిధ ప్రాంతాల్లో అమ్మేసినట్లు తెలిపారు. అయితే అవసరమున్న వారు ఒక్కో కిడ్నీకి రూ. 25 లక్షలు చెల్లిస్తారని తెలిపారు. దాంట్లో కిడ్నీ దాతకు అన్ని ఖర్చులు పోను రూ. 5లక్షలు చెల్లిస్తారని వివరించారు. ఈ రాకెట్‌కు మహారాష్ట్ర, కర్నాటక, న్యూఢిల్లీ, బెంగాల్, ముంబై, కొలంబో ప్రాంతాలకు సంబంధాలున్నాయని వివరించారు. అమయాకులను ఎరవేసి విజిటింగ్ విసా పేరిట కిడ్నీలను కొలంబోలోని నవలోక, వెస్ట్రన్, లంకన్ ఆస్పత్రుల్లో ఇస్తున్నట్లు తెలిపారు. గుజరాత్లో మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తూ అందుకు అవసరమయ్యే ఆపరేషన్, రవాణా ఖర్చులను ఓ ఏజెంటు ద్వారా నడిపిస్తున్నట్లు వివరించారు. కిడ్నీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఏజెంటు సురేష్‌తో పాటు జిల్లా కేంద్రానికికే చెందిన మరో ముగ్గురు ఎం.డీ. అబ్దుల్ హఫీజ్ అలీయాస్ ఖాజీం, పాలెం మహేష్, నరేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి వద్ద 3 పాస్‌పోర్టులు, మోటారు బైకు, టాటా ఇండిగో కారు, డెబిట్ కార్డు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
-
విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు మూత్రపిండాలు ఇప్పిస్తామన్న పేరుతో.. కిడ్నీల రాకెట్ నడిపిస్తున్న ఐదుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఉమాదేవి, నాగసాయి అనే ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఈ నిందితులను విజయవాడ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మొత్తం రాకెట్‌కు సాయి అనే వ్యక్తి సూత్రధారి అని, అతడే ప్లాన్ తయారుచేస్తాడని తెలిపారు. అతడే కిడ్నీలు ఎరేంజ్ చేస్తాడని, అతడి ద్వారానే మొత్తం వ్యవహారం నడుస్తుందని అన్నారు. చక్రవర్తి శ్రీనివాస్, బాలాజీ సింగ్ అనే మరో ఇద్దరు కూడా ఈ రాకెట్లో ఉన్నారు. బాలాజీ సింగ్ గతంలో కూడా ఇలాంటి వ్యవహారం నడిపించాడు కాబట్టి అతడికి అనుభవం ఉందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి తన కిడ్నీని రెండు లక్షలకు అమ్మడానికి ముందుకు రాగా, అతడి భార్యగా నాగసాయి అనే మహిళను ప్రవేశపెట్టారు. బాలాజీ సింగ్ మధ్యవర్తిగా ఉండి వీళ్లను తీసుకురావడానికి అతడికి 15 వేల రూపాయలు ఇచ్చేవారు. దీనంతటికీ సాయి సూత్రధారి. కిడ్నీలు దానం చేసే విషయంలో తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల నుంచి కూడా ధ్రువీకరణ అవసరం కాబట్టి, ఎమ్మార్వో, ఆర్డీవోల సంతకాలను వేరువేరు వ్యక్తులు ఫోర్జరీ చేశారని, అయితే.. ఎమ్మార్వో సంతకాన్ని వాళ్లు గతంలో చూడకపోవడం వల్ల ఏదో చేతికి వచ్చినట్లు గీసేశారని చెప్పారు. ఆస్పత్రి వర్గాలు ఎందుకో అనుమానం రావడంతో ఈ పత్రాలను అటు ఎమ్మార్వోకు, ఇటు పోలీసులకు కూడా పంపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంతకం తనది కాదని ఎమ్మార్వో చెప్పడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రోగులకు ఈ వ్యవహారం అంతా తెలియదని, ఎంతో కొంత డబ్బు పెడితే కిడ్నీ దొరుకుతుందన్న విషయం తప్ప.. ఇందులో వీళ్లు ఇంత మోసాలకు పాల్పడే విషయం వారికి తెలియదని చెప్పారు. విజయవాడ కేంద్రంగా ఇంతకుముందు కూడా కిడ్నీల వ్యాపారం నడిచేది. అప్పట్లో ఒకసారి ఇది వెలుగులోకి రావడంతో కొన్నాళ్లు ఆగి, మళ్లీ మొదలైంది. -
కిడ్నీ రాకెట్లో ముగ్గురి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. కిడ్నీ విక్రయించేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడ్డ దినేష్ కేసు దర్యాప్తులో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగు చూసిందన్నారు. అదనపు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, డీసీపీ పాలరాజుతో కలిసి మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన దినేష్, పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన కిరణ్, కాశ్మీర్‌కు చెందిన అరాంజర్గర్లు కిడ్నీ అమ్మేందుకు ఫేస్బుక్, వెబ్సైట్ ద్వారా ప్రశాంత్సేఠ్ను సంప్రదించారు. తరువాత వీరు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన వెంకటేశం(ఇతను కూడా కిడ్నీ ఇచ్చాడు), వనస్థలిపురానికి చెందిన ఎంబీఏ విద్యార్థి పవన్ శ్రీనివాస్ సహాయంతో గత నెల 23న కొలంబో వెళ్లారు. కిరణ్, అరాంజర్గర్కు కిడ్నీ తీసేందుకు డాక్టర్లు మార్చి 29వ తేదీని, దినేష్‌కు ఏప్రిల్ 1వ తేదీని ఖరారు చేశారు. అపరేషన్ తరువాత జల్సా చేయలేమనే ఉద్దేశంతో ఈ ముగ్గురు మార్చి 28న అక్కడి బీచ్‌లో మద్యం తాగగా దినేష్ వాంతులు చేసుకుని మృతి చెందాడు. కొలంబోలో కిడ్నీకి రూ.50 లక్షలు కిడ్నీ రాకెట్ సూత్రధారి ముంబ యికి చెందిన ప్రశాంత్‌సేఠ్ కొలంబోలో ఒక్కో కిడ్నీని రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తాడు. ఇక్కడి ఏజెంట్ల ద్వారా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమైన యువకులకు ఒక్కోక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇస్తాడు. యువలను తీసుకువచ్చిన ఏజెంట్లకు మాత్రం రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు చెల్లిస్తాడు. మిగిలిన సొమ్మును ప్రశాంత్‌సేఠ్, కొలంబోలోని డాక్టర్ మౌనిక్ పంచుకుంటారు. ఎంపికచేసిన యువకులకు ప్రశాంత్‌సేఠ్ ఇక్కడే రక్తపరీక్షలు చేసి ఆ నివేదికను కొలంబోలోని డాక్టర్ మౌనిక్‌కు చేరవేస్తే మౌనిక్ అవసరమైన రోగితో బేరం కుదుర్చుకుంటాడు. ఆ తరువాతే ఇక్కడి నుంచి కిడ్నీ ఇచ్చేవారిని కొలంబోకు తీసుకెళ్తారు. వెంకటేశం ఆరుగురిని, శ్రీనివాస్ 15 మందిని ఇలా పంపించినట్లు తేలింది. ఇంకా ముంబ యి, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, హర్యానా కేంద్రాలుగా కిడ్నీ రాకెట్ నడుస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక కిడ్నీ అమ్మేందుకు వెళ్లే వారిని విజయవాడకు చెందిన సూర్యనారాయణ (ఇతను కూడా కిడ్నీ ఇచ్చినవాడే) బ్లాక్మెయిల్ చేసి అందినకాడికి దండుకునేవాడు. టూరిస్టు విసాపై వెళ్లిన యువకుల నుంచి కిడ్నీ తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు త్వరలో ఒక పోలీసు బృందం శ్రీలంకకు పంపుతున్నట్టు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. -
హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్
దినేష్ ఘటనతో వెలుగు చూసిన వైనం నిందితుల కోసం ముమ్మర గాలింపు రంగంలోకి ప్రత్యేక బృందాలు దినేష్‌ది సాధారణ మరణమని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్రాజు తెలిపారు. కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణ ం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్రాజు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగానే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌తోనే దినేష్ సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని గట్టెక్కించేందుకు కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్న దినేష్.. రెండు నెలల నుంచి వేర్వేరుగా నాలుగు కిడ్నీ రాకెట్ ముఠాలతో సంప్రదింపులు జరిపాడు. ఇందులో ఒక ముఠా బ్రోకర్ ప్రశాంత్ సేట్ తో సంప్రదించినట్లు అతని ఈ-మెయిల్ ద్వారా వెల్లడైంది. కానీ అది సంప్రదింపులకే పరిమితమైంది. దినేష్ కొలంబో వెళ్లడానికి కారణం.. మరో మూడు ముఠాలలో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న రాకెట్. ఈ ముఠా ఆదేశాల మేరకే దినేష్ కొత్తగూడెం నుంచి గత నెల 22న బయలుదేరి అదే రోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ కిడ్నీ రాకెట్ ముఠాతో సంప్రదింపులు జరిపిన తరువాత అతను మరుసటిరోజు గుంటూరు వెళ్లాడు. అక్కడి నుంచి వెంకటేశ్వర్లు, కిషోర్లతో కలిసి చెన్నై వెళ్లి అక్కడి నుంచి కొలంబో వె ళ్లి మరణించాడు. అయితే హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ నిర్వాహకులు ఎవరు, వీరి మకాం ఎక్కడ అనే విషయాలపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అత్యంత విలువైన క్లూ లభించిందని, నిందితులను త్వరలో అరెస్టు చేసి మీడియా ముందు చూపిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన నిందితుడు..? దినేష్ మృతి, కిడ్నీ రాకెట్ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వ చ్చిన కథనాలపై గుంటూరుకు చెందిన కిషోర్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. దినేష్‌తో పాటు గో ట్రావెల్ బస్సులో కిషోర్ కూడా వెళ్లాడు. దినేష్ సెల్‌ఫోన్ కాల్‌లిస్టులో తన నెంబర్లు కూడా ఉంటాయని గ్రహించిన కిషోర్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని లొంగిపోయినట్లు తెలిసింది. ఇతనిచ్చిన సమాచారం మేర కే పోలీసులు సూత్రధారి కోసం వేట మొదలు పెట్టినట్లు తెలిసింది. సంతకం పెట్టిన ఉన్నతాధికారి ఎవరు..? దినేష్‌కు పాస్‌పోర్టు కేవలం 15 రోజుల్లోనే సమకూర్చారు. ఇదందా కిడ్నీ రాకెట్ బ్రోకరే చేయించాడు. ఇంత త్వరగా పాస్‌పోర్టు వచ్చే విధంగా చేశాడంటే అది కేవలం తత్కాల్ కింద దరఖాస్తు చేస్తేనే సాధ్యం. కాగా ఇలాంటి దరఖాస్తుపై దినేష్‌కు ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారి సర్టిఫై చేసి ఉండాలి. ఆ అధికారికి... కిడ్నీ వ్యాపారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ అధికారి దినేష్లాంటి వారికి ఎంతమందికి సంతకాలు పెట్టి ఉంటారోనన్న దిశగానూ విచారణ సాగుతోంది. ఈ రాకెట్లో పాస్‌పోర్టు అధికారుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.