K.Janareddy
-
ఉపఎన్నికలు వచ్చే అవకాశాల్లేవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి సొంత నియోజకవర్గం లోనే ప్రజలు బీజేపీని ఓడించారన్న విషయా న్ని సీఎం కేసీఆర్ గ్రహించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారం చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తు తం అసెంబ్లీ నడిచే తీరును చూసి బాధపడుతున్నానన్నారు. గతంలో అసెంబ్లీ ఎంతో హుం దాగా నడిచేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తానేం చేయలేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తానేమీ చేయకపోతే ఆయన తన ఇంటికి ఎందుకొచ్చా రని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పా టు చేసి ఉండకపోతే కేసీఆర్ సీఎం హోదాలో మాట్లాడగలిగేవారా అని ప్రశ్నించారు. తిట్టడం మానుకుని ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలనూ కేసీఆరే తీసుకువచ్చారా అని ప్ర శ్నించారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశాలను కొట్టిపారేశారు. రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతా తాను కేసీఆర్ లాంటి వాడిని కాదని, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మాట్లాడుతానని అన్నారు. నాలుగేళ్లపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో వివేచన కనిపించ డం లేదని, అసెంబ్లీలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో కి రావడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం లో మీడియాపై ఆంక్షలు ఉండబోవన్నారు. -
నేరెళ్ల బాధితులకు వైద్యం అందించాలి
కాంగ్రెస్ నేత జానారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై కేసులు పెట్టి, చిత్రహింసలకు పాల్పడిన ప్రభుత్వం, ఇప్పుడు వారికి వైద్యం కూడా అందకుండా అడ్డుకుంటోందని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేరెళ్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులను పోలీసులు నిర్బంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విమర్శించారు. ప్రభుత్వం దళితుల పట్ల కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు. బాధిత దళితులకు వైద్యం అందించకుండా అడ్డుకుంటే పక్కరాష్ట్రాల్లో చేయిస్తామని చెప్పారు. పోలీసులు తీవ్రంగా హింసించడంతో వారు అనారోగ్యానికి గురయ్యారని వారిని నిమ్స్‌లో చేర్పిస్తే పాలకులు బెదిరించారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రి అధికారులకు అర్ధరాత్రి ఫోన్లు చేసి, దళితులను బయటకు గెంటేశారన్నారు. ఇంత నియంతృత్వ పాలనను ఎక్కడా చూడలేదన్నారు. బాధితులను కాపాడే ప్రయత్నాలు చేయకుంటే ఈ నెల 15న నేరెళ్లలో దీక్షలు చేస్తామని హెచ్చరించారు. -
'మా పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేయడం అమానుషం'
హైదరాబాద్: కరీంనగర్లో శుక్రవారం రైతాంగ సమస్యలపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని తెలంగాణ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ఎదుట మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతల ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడానికి జిల్లా కలెకర్ట్ ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. అధికార టీఆర్ఎస్ నేతలు రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే తెలంగాణ అసెంబ్లీని సమావేశపరచి.... కరువు, రైతాంగ సమస్యలపై చర్చించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు. -
సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి
ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం జానా తీరుపై డీఎస్ అసంతృప్తి హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ విప్‌గా వి.సంపత్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు. పీఏసీ రేసులో ఆ నలుగురు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
విభజన ప్రక్రియ ఆగదు: జానారెడ్డి
తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగనే ఆగదని రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి స్పష్టం చేశారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన టి.మంత్రులతో టి.జేఏసీ నేతల భేటీ ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జానారెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింప చేయాల్సిన బాధ్యత సీఎం కిరణ్, ఆ ప్రాంత మంత్రులదేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా టి.ఎన్జీవోలు గతంలో చేపట్టిన సమ్మెను విరమించుకోవాలని తాము కోరిన సంగతిని జానారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించకుండా సీమాంధ్ర ఉద్యోగులు, నేతలు రెచ్చిపోతే పరిస్థితులు మరింత జఠిలమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దాంతో తెలుగు ప్రజల మధ్య సామరస్యం దెబ్బ తినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవన్న భరోసా ఉంటేనే హైదరాబాద్‌లో సభలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సెప్టెంబర్ 7వ తేదీన తమ ఆధ్వర్యంలో నిర్వహించే శాంతి ర్యాలీకి అనుమతి ఇప్పించాలని టి.జేఏసీ నేతలు తమను కోరరాని కే.జానారెడ్డి విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.